"కాశ్మీరా" పిలిచాడు.
"ఏమిటి?"
"నీ భర్త నిన్ను ఎలా చూస్తున్నాడు?"
అతని ప్రశ్నకి ఆమె మాట్లాడలేదు.
ఎటో చూస్తూ వుండిపోయింది.
"నీ భర్తనీ నువ్వు ప్రేమిస్తున్నావా?" మరో ప్రశ్న వేశాడు.
అతని ప్రశ్నలు ఆమెకి కొరడా దేబ్బాల్లా తగులుతున్నాయి.
"శశిభూషణ్ నీకు కావాలా?"
చిత్రమ్తెన అతని ప్రశ్నలకి కాశ్మీర అనుమానంగా తెలేత్తి చూసింది.
"నువ్విలాంటి ప్రశ్నలువేసి నన్ను చంపకు రాబర్టు" అంది కాశ్మీర.
రాబర్టు సిగరెట్ వెలిగించి విలాసంగా నవ్వుతూ అన్నాడు.
"నీకీరోజుతో అన్ని కష్టాలు తిరిపోతున్నాయి. నీ భర్త ఈ రాత్రికి చచ్చిపోతాడు"
అతని మాటలకి కాశ్మీర ఉలిక్కిపడింది.
"ప్లీజ్ రాబర్టు నాకోసం నువ్వు ఆయన్ని ఏమీ చేయకు" అంది భయంగా.
"నిన్ను చూసి ఆ ఆలోచన ఎప్పుడో మానేశాను. కానీ ఈ రాత్రి నీ భర్తని చావు తప్పదు"
కాశ్మీర కళ్ళలో నీరు నిలిచింది. ఆమె గుండెల్లో భయం తోడు చేసుకొంది. శరీరంలో కంపన మొదలైంది. రోమాలు విక్క రోడుచుకున్నాయి. భర్తకి ఏమ్తెందో తేలిక ఆందోళన చెందింది. కలవరపడింది.
"నువ్వేం చేపుతున్నావో అర్ధం కావడంలేదు. దయచేసి వివరంగా చెప్పు" ప్రాదేయపడుతూ అడిగింది రాబర్టునీ కాశ్మీర.
"శశిభాషణ్ మోహినీ చంపబోతోంది" అన్నాడు.
"మోహినీ ఎవరు? ఆమె నా భర్తని చంపడం ఏమిటి?" అర్ధం కానట్టు ప్రశ్నంచింది.
"అదంతే!" అన్నాడు రాబర్టు తేలిగ్గా.
"ప్లీజ్ రాబర్ట్ నన్ను అర్ధంకాని మాటలతో చంపకు చెప్పు నీకు దండం పెడతాను" అంది.
రాబర్టు నవ్వేడు విరగబడి నవ్వేడు. ఆనందంగా నవ్వేడు.
కాశ్మీర వెక్కి వెక్కి ఏడుస్తోంది.
రాబర్టు వివరంగా అంతా చెప్పాడు కాశ్మిరకి అంతా నిని కాశ్మీర నిలువెల్లా వణికిపోయింది.
రాబర్టు అన్నాడు.
"అతన్ని హింసలపాలు చెయ్యాలనుకొన్నాను. కానీ నీ మూలంగా చేతులు కట్టేసుకోవలసి వచ్చింది కాశ్మీరా. కానీ దేవుడే అతనికిప్పుడు సర్తేన శిక్ష విధించాడు. రియల్లీ, అయం వేరీ హాపీ" అన్నాడు రాబర్టు.
రాబర్టు విలాసంగా, ఉల్లాసంగా సిగరెట్ కాలుస్తున్నాడు.
"నువ్వు ఆయన్ని కాపాడలేవా?" అడిగింది.
"నేనెందుకు కాపాడాలి?"
"నాకోసం నువ్విపని చెయ్యాలి."
"నీకోసమా?"
"అవును"
"ఏమిస్తావ్?" అడిగాడు.
"నువ్వు ఏది కోరినా ఇస్తాను."
"అంటే డబ్బుకోసం నేనేమ్తెనా చేస్తాననేగా నీ అభిప్రాయం?" అన్నాడు.
"రాబర్ట్?"
"నాకేమి అవసరంలేదు. నేను అతన్ని కాపాడను" అన్నాడు.
"నా కోసం చేయ్యలేవా ?" దినంగా అడిగింది.
"నిన్ను మానసికంగా క్షోభపెట్టె ఆ పశువుని నేనెందుకు కాపాడాలి?"
"అతను నా భర్త" అంది.
ఆమె మాటలకతను గమత్తుగా నవ్వేడు.
"పెళ్ళాంవున్న ప్రతి మగాడూ ఓ మొగుడేనా? భార్యనేలా చూసుకోవాలో తెలీని ఆ పశువూ ఓ మొగుడేనా? అతను చస్తే నీకు శంత్తెన దోరుకుతుంది" ఆవేశంగా అన్నాడు రాబర్టు.
"రాబర్టు" ఆరిచింది కాశ్మీర. ఆమె కళ్ళేర్రబడ్డాయి. ఇప్పుడు శోకదేవతలా వుంది కాశ్మీర.
కట్టుకున్న భర్తని ఎవరో చంపేస్తున్నారని విన్నపుడు ఆడదాని మనసు ఎంత అల్లాడిపోతుందో రాబర్టుకి అతేలివి విషయం కాదు.
రాబర్టు లేచి నించున్నాడు. హాలులో పచార్లుచేస్తూ కాశ్మీర కేసి తిరిగి__
"మగవాడు బయట ఎన్ని కష్టాలుపడిన ఇంటికోచ్చేసరికి చిరు నవ్వుతో ఎదురొచ్చే ఇల్లాల్ని చూసి తను పడిన కష్టాల్ని మరచిపోతాడు. కానీ నీ భర్త కేవలం నిన్ను విసిగించడానికి పనికట్టుకుఅని వస్తాడు. భార్యని గౌరవించలేని మనిషి సంఘజివి కాలేడు కాశ్మీరా. అతను చనిపోతే నీకు కలిగే నష్టం నాకేం కనబడ్డంలేదు" అన్నాడు రాబర్టు .
కాశ్మీర అతని మాటలువిని బోరున ఏడుస్తూ అతని కాళ్ళప్తెన పడిపోయింది.
"రాబర్టు ఆయన నా విషయంలో ప్రేమాభిమానాలు లేకుండా ప్రవర్తించవచ్చు. కానీ అతను నా భర్త కష్టమైన సుఖమ్తెన ఆ మనిషి నీడలోనే నాకు జీవితం మిగిలేది" అంటూ ఆమె రెండు చేతులు జోడించిందతనికి.
రాబర్టు ఆమె మాటలకి పూర్తిగా చాలించాడు. అతని కళ్ళలో నీరు సుడులు తిరిగింది.
