Previous Page Next Page 
యువత నవత పేజి 40

    "వంటలు చేయొద్దని, పిల్లల్ని  కనొద్దని నేనెవరికి చెప్పాను?" సుధ తెల్లబోయింది.

    "మహిళామండలి ఓపెనింగ్ రోజు ఇట్టాంటి మాటలే చెప్పినా వంటగా?"

    "మీ ఆడవాళ్లకి అంతవరకే అర్దమైనట్టుంది. కాని నేను చెప్పింది యధాతథంగా అదికాదు!  అయినా ఈ విషయంలో మీకు నేను సంజాయిషీ యివ్వడం యేమిటి? ఈ వూరి ఆడవాళ్లంతా మీ కుటుంబ సభ్యులుకాదు. వాళ్లకి నేను చెప్పే మాటలు బాగాలేదనిపిస్తే వాళ్లనే వద్దని చెప్పనీయండి. మీరెవరు నాకు వద్దని చెప్పడానికి?" విసురుగా కదిలింది సుధ.

        *    *    *    *    *
   
    శాలిని ఊరినుండి వచ్చేసరికి సుధ పడుకొని వుంది ఇంట్లో.

    "ఈవేళప్పుడు పడుకొన్నావేమిటి?" అడిగింది శాలిని.

    "తల బద్దలవుతున్నట్లుగా వుంది శాలినీ! ఆస్ప్రో , వేడి వేడిగా టీ కావాలి నాకు!"

    పావుగంట తరువాత ఆస్ప్రో వేసుకొని, శాలిని చేసిచ్చిన టీ త్రాగుతూ చెప్పింది సుధ. "ఈ రోజు పౌష్టికాహారం పంచడానికి గణపురం వెళ్లాను. ఇలా పిల్లలకు పౌష్టికాహారం పంచుతున్నామని,  అందరూ పంచాయితీ ఆఫీసు దగ్గరికి రావాలని దండోరా వేయించాడు సర్పంచ్. కానీ ఒక్కరూ రాలేదు. ఇదేమిటని కనుక్కుంటే....."

    "అది తింటే పిల్లలు చచ్చిపోతారంటగా? అసలు పిల్లలు చచ్చిపోవాలనే ఇట్లా ఈ పేరుతో గవర్నమెంటు పంపిస్తదంటగా? భూమ్మీద పిల్లల్ని లేకుండా చేసేటందుకు ఫామిలీ ప్లానింగ్  చాల్లేదా?" వద్దు తల్లీ! మా పిల్లల్ని కలో గంజో పోసి సాక్కుంటంగాని అదీ యిదీ పెట్టి చంపుకోం" అంది ఓ యిల్లాలు.

    "గవర్నమెంటు ఇస్తదికాని, ఏది సక్రమంగా ఇస్తది? ఉప్మాకని రవ్వ పంపుతది దాన్నిండా లుకలుక పురుగులు. పిల్లలు అదితీస్కపోయి బర్రెలకీ, కుక్కలకీ పెడతరు! మురుకులు ముక్కకంపు! బియ్యం పురుగుల తెట్టె. అవి బర్రెల దాణాకితప్ప మనుషులు తినేటందుకు రావు. ఇంక ఇదేంపుడ్డో!పిల్లల్ని చంపేటందుకు! ఇంటికి ఇద్దరు, ముగ్గురు వుంటే కూడా గవర్నమెంటుకు ఓర్పు లేనట్టుంది. అందర్నీ చంపి ఆహారం సమృద్దిచేస్తరు కాబోలు" అంది ఒక గృహిణి.

    "వాళ్ళు అనే మాటల్లో కొంత నిజముంది, కొంత అపార్దముంది. ఉప్మా, మురుకులు ఎవరూ తీసుకోకుండా మిగిలిపోతుంటే ఒక గ్రామం హెడ్మాష్టరు నాలుగు గేదెలుకొని పాడి పరిశ్రమ పెట్టాడట. రవ్వ, మురుకులు తిని ఆ గేదెలు బకెట్లకొ్దదీ పాలిచ్చేవట. ప్రభుత్వం సంకల్పించిన సంక్షేమ పథకాలు యిలా ప్రజలదగ్గరికి సక్రమంగా వెళ్లకుండా అపహాస్యం పాలవుతున్నాయే అని నా  బాధ!" అని చెప్పింది సుధ.

    "ఇంతకీ నీ పౌష్టికాహారం ఏమైంది?"

    "ఇంటింటికీ  వెళ్ళి, వాళ్లకి నచ్చచెప్పి పంచేసరికి నాకు తలప్రాణం తోకకి వచ్చినట్టుగా అయింది. అదే ఈ తలనొప్పి"

    "సుజాత కేసు ఏమైంది?"

    "కోర్టులో కేసు విచారణ డేట్ ఫిక్స్ అయింది. ఇరవైకి విచారణ"

        *    *    *    *    *
   
    సుధవాళ్ల పెరట్లో మెట్లమీద నిలబడితే ప్రక్కింటి పెరడంతా స్పష్టంగా కనిపిస్తుంది కొబ్బరిచెట్టు ఆకులు అడ్డుకావడంవల్ల సుధ అవతలివాళ్లకు కనిపించదు.

     చంద్రకాంత్ భార్యను వీలింగ్ ఛెయిర్ లో త్రిప్పడం, ఆవిడకి జుట్టు దువ్వి జడవేయడం,పుస్తకాలు చదివి వినిపించడం అంతా కనిపిస్తూంటుంది.

    నడుముల్లేని ఒక పసిపాపను ఎలా లాలించాలో, ఎలా ప్రేమించాలో అలా చేస్తుంటాడు చంద్రకాంత్. కొద్దిరోజులవరకు ఆమె సంసారానికికూడా పనికిరాదని చెప్పారట డాక్టరు. అలాంటి పనికిమాలిన మనిషిని మెడకు కట్టుకు ఎందుకు వేగుతున్నాడా అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు.

     వంటకీ, పంటకీ పనికిరాని స్త్రీని వదిలిపెడితే మగవాడిని యెవరూ తప్పుపట్టరుకూడా.

     అదేమాట అతడితో ఎవరయినా అంటే........

    "నేనే సంసారానికీ, సంపాదనకీ పనికిరాకుండా పోతే సుగుణకి ఈ సలహా ఇవ్వగలిగేవాళ్లా? ఇలా ఆశ్చర్యం వ్యక్తంచేసేవాళ్లా? స్త్రీ విషయంలో ఒకవిధంగా పురుషుడి  విషయంలో ఒకవిధంగా ఎందుకు ఆలోచిస్తారు మీరు?" అని వాడిగా జవాబు చెబుతాడట.

    అతడి గురించి ఒక్కోమాట వింటూన్న కొద్దీ, అతడు మహోన్నతంగా ఎదిగిపోయిన మనిషిలా కనిపిస్తాడు సుధకు.    

WRITERS
PUBLICATIONS