Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 39

    "అమ్మో!.... హాతాట్టుగా నేను మంచిదాన్ని ఎప్పుడై పోయానో?!" గుండెల మీద చేయ్యేసుకుంది ఆమె. "అయితే మీరు ఆవిడని చూడ్డానికి అసలు వెళ్ళనే వెళ్ళరా?"

    "ఊహూ! నిన్న ఆఫీసుకు ఫోను చేసింది కూడా."

    "ఏమని?"

    "మిమ్మల్ని ఓసారి చూడాలని వుంది రండీ అని... నేనేమో చెడామడా తిట్టేసి ఫోను పెట్టేశా!"

    "మరి ఇంటికి రావడం అమ్తాలస్యం అయ్యిందేం?" అడిగింది వైష్ణవి.

    "ఓ ప్రేండింటికి వెళ్ళాలే..."

    "ఇందాక ఆఫీసులో పని ఉంది అందుకని ఆలస్యం  అయ్యిందని అన్నారు?"

    'అనవసరమైన వివరాలన్నీ చెప్పాడం ఎందుకులే అని అలా చెప్పాను!"

    "పోనీలేగానీ ఎప్పుడైనా ఆమెని చూడాలని అనిపిస్తే మాత్రం వెళ్ళిరండి.... నాకేం అబ్యంతరం లేదు."

    రాంపండు పెట్లో చెయ్యి కడిగేసుకున్నాడు.

    "అదేంటండి.... ఇంకాస్త అన్నం పెట్టుకుంటారనుకున్నానే... అప్పుడే చెయ్యి కడిగేసుకున్నారేం? విసిగించానా?" భాదపడుతూ అడిగింది ఆమె.

    "ఛఛ.... అదేంకాదు. కడుపు నిండిపోయింది" అంటూ టేబుల్ ముందునుండి లేచాడతను.

    అతను ద్రేసేస్ అయి ఆఫీసుకి వెళ్ళే ముందు వైష్ణవి అతన్ని అడిగింది_

    "సాయంత్రం త్వరగా వచ్చీస్తారా?"

    అలాగే అన్నట్టు తల వూపాడతాను.

    "ఇప్పుడు అలాగే అని తర్వాత ఏ ట్యాంక్ బండో, లేకపోతే పబ్లిక్ గార్డెన్ తిరిగొస్తారా?" నవ్వుతూ అడిగింది.

    "లేదు...త్వరగా వచ్చేస్తా!"

    "త్వరగా అంటే మాములుగా ఆఫీసు అయ్యే టైంకి కాదు... ఒక గంట పర్మిషన్ పెట్టి కాస్త ముందుగా రండి!"

    "ఎందుకూ?" "సినిమాకివేల్దాం!"

    "రాంపండుకి వెళ్దాం!"

    రాంపండు ఆమె వంక యిబ్బందిగా చోశాడు.

    "ఏం? నన్ను సినిమాకి తీసుకేల్లారా? ఇరవైనాల్గంటలూ ఇంట్లో వుంది నాకు బోర్ కొట్టడా? ప్లీజ్!" రాంపండు జబ్బ పట్టుకుని అతని ముఖంలోకి ప్రాధేయపూర్వకంగా చూస్తూ అడిగింది.

    రాంపండు ఒళ్ళు ఝల్లుమంది. అతనికి తెల్లవారుజామున తనకి వచ్చిన కల, అందులో వైష్ణవిని తను ముద్దుపెట్టుకోవడం గుర్తుకు వచ్చింది.

    అతని గుండె బరువెక్కింది.

    తెల్లవారుజామున వచ్చేకలలు నిజమవుతాయని అంటారు. అదీ నిజమవుతుందా?
 
    అలా ఆలోచించేసరికి అతని గుండె మరోసారి ఝల్లుమంది.
   
   
                                              *    *    *    *
   

    "సార్!" మెల్లిగా పిలిచాడు రాంపండు.

    సర్వోత్తమరావు ఫైలులోంచి తల పైకెత్తి రాంపండు వంక చూశాడు.

    "ఏంటి వ్యవహారం?" అని అడిగాడు.

    "అంటే... మరేమో... మొత్తం మీరిచ్చిన ఫిలుస్ అన్నీ పూర్తీ చేసేశాను సార్!"

    "వెరీగుడ్... వ్యవహారం అంటే అలావుమ్డాలి! అయితే మరి కొన్ని అర్జంట్ ఫైల్సు వున్నాయి. అని నీ సీటు దగ్గరకి మరో అయిదు నిమిషాలల్లో పంపిస్తాను... నువేళ్ళు" అంటూ రాంపండు ఏమంటాడో చూడకుండా తన ముందున్న ఫైల్సు లో తల దూర్చేశాడు సర్వోత్తమరావు.

    "అది కాదు సార్!" శనిగాడు రాంపండు.

    సర్వోత్తమరావు తల పైకెత్తి అతని వంక విస్సుగ్గా చూశాడు.

    "ఎంతో త్వరగా చెప్పు? ఫైలు వ్యవహారం చూసి యింటికెళ్ళాలి. నాకిలా నాన్పుడు వ్యవహారలంటే గిట్టవు"

    "నాకు ఒంట్లో బాగోలేదు సార్! ఒక గంట పర్మిషన్ కావాలి సార్!" మెల్లిగా అడిగాడు అతను.

    "ఏం? నేను యింటికి త్వరగా వెళుతున్నానని అన్నానని నీక్కూడా పర్మిషన్ కావాలని అడుగుతున్నావా? రోజూ టైమైపోయినా కూడా నేను ఆఫీసు వ్యవహారాలూ చూస్తూ ఇక్కడ ఎంతసేపటిదాకా వుంటానో నీకు తెలుసా? సార్! ఈ రాజు ఓ గంట ఎక్కువ సేపు పని చేస్తానని ఏనాడైనా అన్నావా? అబ్బే... అలంటి వ్యవహారం ఎందుకుంటుందీ? పైగా నాతో పోటీనా?"

    "అది కాదు సార్! మీతో పోటీ నేనెందుకు వస్తాను సార్? నాకు నిజంగానే ఒంట్లో బాగోలేదు సార్!" చేతులు నలుపు కుంటూ అన్నాడు రాంపండు.

    "ఏం బాగోలేదు?" కళ్ళేగరేస్తూ అడిగాడు సర్వోత్తమరావు.

    కడుపు నొప్పిగా వుంది సార్!" అంటూ గుండెల మీద చేయ్యేసుకున్నాడు రాంపండు.

    "ఏందయ్యా... కడుపు నొప్పిని చాతీమీద చేయ్యేసుకున్నావే! నీ పొట్ట ఛాతీలో వుందా ఏంటి? అయితే గుండెకాయ కడుపులో వుందా ఏం? నీదంతా తలక్రిందుల వ్యవహారంలా వుందే! నువ్వు చెప్పేదంతా నమ్మడానికి నేనేమైనా వెర్రిబాగుల వ్యవహారం అనుకున్నావా?"

    "అది కాద్సార్! మీరలా చూస్తుంటే కంప్యూజ్ అయిపోయి పొట్టమీద చెయ్యేయ్యటానికి బదులు చాతీ మీద వేసుకున్నాను సార్! నిజంగా నాకు కడుపునొప్పిగా వుంది సార్!" అంటూ ఈసారి పొట్టమీద చెయ్యేసుకుని బాధగా మోహం పెట్టాడు అతను.

    అతన్ని ఓసారి పరిశీలనగా చూసి "సరే ఫో..." అన్నాడు సర్వోత్తమరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS