Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 39

    చిట్టబ్బాయ్ జేబులోంచి పర్సు తిసి మేకాల్ల మధ్యగా పెట్టి కిందికి వంగి అందులో డబ్బులు ఎన్ని ఉన్నాయో చూస్కున్నాడు.


    బేరార్ ఒకసారి ఇద్దరి వంకా చికాకుగా చూసి అక్కడి నుండి  వెళ్ళిపోయాడు.


    జాన్ డేవిడ్లు తాగడం పూర్తి చేసేసరికి రాత్రి తొమ్మిది గంటల్తెంది.


    డేవిడ్ జేబులోంచి పర్సు తీసాడు. అలా పర్సు థిఒస్థున్నప్పదు డేవిడ్ జేబులోంచి తాళాల గుత్తి ఒకటి నెల మీద పడింది. ఆ తాళాల గుత్తి  కిందపడడం డేవిడ్ గమనించలేదు. జాన్ కూడా గమనించలేదు.


    దాన్ని కేవలం కన్నారావు ఒక్కడే  గమనించాడు. ఆ తాళలా గుత్తి చిట్టబ్బాయ్ కుర్చికి దగ్గరగా ఉంది.


    బేరార్ దేవుడ్ ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్లు బేరర్ తెచ్చే చిల్లరకోసం ఎదురు చూడసాగారు.


    కన్నారావు చిట్టబ్బాయ్ చేతిమీద మెల్లగా గోకాడు.


    చిట్టబ్బాయ్ కన్నారావు వంక ప్రశ్నార్ధకంగా చూసాడు.


    కన్నారావు స్తేగచేసి కింద ఉన్న తాళాల వంక కళ్ళప్పజెప్పి  చూశాడు. ఆ తాళాల గుత్తిని తియ్యాలంటే భయం వేసింది అతనికి.


    "అయినా ఇప్పుడు మనకి ఆ తాళాల గుత్తితో అవసరం ఏమిటి?" మెల్లగా గొణిగాడు.


    "అవసరం ఉంది... నువ్వు అనవసరంగా నాన్చాకుండా త్వరగా ఆ తాళాల గుత్తి అందుకో..." పళ్ళు బిగబట్టి మెల్లగా కసుర్తు అన్నాడు కన్నారావు.


    "ఒకవేళ నేను తాళాల  గుత్తిని తీయడం వాళ్ళు చూస్తేనో?" సందేహంగా అడిగాడు చిట్టబ్బాయి.


    "వాళ్ళు గమనించే స్ధితిలో లేరు... పుల్ డోసులో ఉన్నారు... ఒక వేళ చూసినా ప్రమాదం ఏమి లేదు.  మీ తాళాలగుత్తి పడేస్కున్నారు అని వాళ్ళ తాళాలు వాళ్ళకి  ఇచ్చెయ్యవచ్చు.. త్వరగా తియ్.. మళ్ళి బేరర్ వస్తాడు..." కంగారుగా పెట్టాడు కన్నారావు.


       చిట్టబ్బాయి బార్ మొత్తం ఒకసారి కలియజూశాడు. అందరూ మందు కొట్టడంలో నిమగ్నమ్తే ఉన్నారు. వాళ్ళని ఎవరూ చూడడంలేదు.


    ఒకసారి జాన్, డేవిడ్ ల వంక కూడా చూశాడు. వాళ్లు మత్తుగా జోగుతూ ముద్దముద్దగా ఏమిటో మాట్లాడుతున్నారు.


    అదను చూస్కుని చిట్టబ్బాయి కుర్చిలోంచి లేచి చటుక్కున నెల మీద వంక చూస్తున్నాడు.


    సరిగ్గా అదే సమయంలో డేవిడ్ తన కాలిని చిట్టబ్బాయ్ చేతిమీద పెట్టాడు.


    ఆ దెబ్బకి భయంతో చిట్టబ్బాయ్ గుండె జారిపోయింది.


    "మీ తాళాల గుత్తి పడిపోతే  తీస్తున్నా"  అని చెప్దామని డేవిడ్ వంక చూశాడు. కాని డేవిడ్ తన వంక చూడనే చూడడంలేదు.


    అంటే అతనికి తెలీకుండానే కాలుని తన చేతిమీద వేశాడన్నమాట.


    ఇప్పడేలా? అతని కాలుకింద నుండి చేతిని లాగితే చూస్తాడేమో!!


    కింద కూర్చున్న చిట్టబ్బాయి ఎంతకి  లెవకపొఇథె కన్నారావుకి కంగారు పుట్టింది. తను కూర్చున్న  కుర్చిలోంచి కాస్త ప్తెకి లేచి మెడనిటరుగా పెట్టి కిందికి చూశాడు.


    చిట్టబ్బాయ్ దినంగా మొహం పెట్టి ప్తెకి లేమ్మన్నట్టుగా చిట్టబ్బాయ్ కి స్తేగా చేశాడు.


    చిట్టబ్బాయ్ డేవిడ్ కాలుని చూపించి రెండో చేత్తో నొసలు మీద కొట్టుకున్నాడు.


    కన్నారావు నెత్తిన చేతులు పెట్టుకుని కుర్చీలో కూలబడిపోయాడు.


    "ఇప్పడేలా?.. డేవిడ్ గమనించకుండా చిట్టబ్బాయ్ తన చేతిని వాడి కాలుకింది  నుండి తిస్కోవాలి?...


    ఎలా? ఎలా?ఎలా?...


    కన్నారావు చురుకుగా ఆలోచించసాగాడు. కాని కంగారు పడ్తుండడం చేత బుర్రకి ఏ ఆలోచనలూ తట్టడం లేదు.


    కాని వాళ్ళ అదృష్టం బాగుంది.


    డేవిడ్ తన కాలికింద మెత్తగా ఎదో తగలడాన్ని గమనించాడు.  కాని టేబులు కిందికి వంగి చూడడానికి బద్దకించాడు.


    "నా కాలికింద ఎదో మెత్తగా తగుల్తుంది..." ముద్దముద్దగా మాట్లడ్తూ  జాన్ తో అన్నాడు డేవిడ్.



    ఏ పిల్లో టేబులు కిందికి దూరి ఉంటుంది" జాన్ కూడా ముద్దా ముద్దగా అన్నాడు.


    "పిల్లా?... చిచి..." డేవిడ్ కాలు విసిరాడు.


    అతని కాలు చిట్టబ్బాయ్ డొక్కలో తగిలింది. ఆ దెబ్బకి చిట్టబ్బాయి కళ్ళు బ్తేర్లుకమ్మయ్.


    "ఊ..."బాధగా మూలిగాడు చిట్టబ్బాయ్.


    అంతలోనే వాళ్లు తనని పిల్లి అనుకుంటున్నారని గుర్తుకొచ్చింది చిట్టబ్బయికి. అందుచేత ల్పిల్లిలా అరిచాడు.


    "మ్యావ్...మ్యావ్..."


    "నే చెప్పలే!... మన టేబులు కింద ఉన్నది పిల్లే..." అన్నాడు జాన్.


    చిట్టబ్బాయి పిల్లిలా అరవడం మాని తల ప్తెకేత్తి చూశాడు. డేవిడ్ మత్తుగా ఏటో చూస్తున్నాడు.


    సక్సెస్!... తాళాలు కొట్టేశా!"


    చేతిలోని తాళం చెవులగుత్తిని  కన్నరావుకి చూపించాడు.


    "ష్... జేబులో దాచేస్కో... వాళ్ళు చూడగల్రు..." జాన్, దేవిడ్ల వంక కంగారుగా చూస్తూ అన్నాడు కన్నారావు.


    చిట్టబ్బాయి తాళం చేతుల్ని జేబులో వేస్కున్నాడు.


     సరిగ్గా అప్పడే బేరార్ బిల్లు తిస్కోచ్చి వీళ్ళ ముందు  పెట్టాడు. చిట్టబ్బాయి డబ్బులు తిఒసి ఇచ్చాడు.


    "పద...మనం త్వరగా బయటపడాలి!!..."  అన్నాడు కన్నారావు.


    ఇద్దరూ బార్ బయటికి గబగబా వచ్చేశారు.


    కన్నారావు ఓసారి అటూ ఇటూ పరిశీలనగా చూసి "పద...కారు దగ్గరికి వెళ్దాం..." అన్నాడు.


    ఇద్దరూ కారు దగ్గరికి గబగబా వెళ్లారు.  కన్నారావు కారు దిక్కి ఎత్తి చూశాడు.


    అతని కళ్ళు మేరిశాయ్. అతనికి కావాల్సిన వస్తువు కనిపించింది.


    "దాన్ని తియ్..."దిక్కి ఎత్తిపట్టి ఉంచుతూ అన్నాడు కన్నారావు.


    చిట్టబాయి డిక్కీలో ఉన్న ఇనుప కడ్డిని బయటికి తీశాడు.


    "ఎందుకిది?" ఆశ్చర్యంగా అడిగాడు చిట్టబ్బాయ్.


    దిక్కిని మూసేస్తూ చెప్పాడు కన్నారావు ఆ ఇనుపకద్ది ఎందుకో.


    చిట్టబ్బాయి హుషారుగా  విజిలేశాడు.


    కన్నారావు చిట్టబ్బాయ్ దగ్గర నుండి తాళల గుత్తిని తీస్కుని అందులో కారు డోర్ సంబందించిన తాళం చెవితో కారు డోర్ తెరిచాడు. తరువాత ఇగ్నిషన్ కి ని  కారుకి ఉంచి ఇద్దరూ కారు వెనక సైట్లో కిందికి వామగి నక్కి కూర్చున్నారు. మధ్య మధ్య తల ఎత్తి బార్ వ్తెపు చూడసాగారు.


    ఒక అయిదు నిముషాలు గడిచాయి.


    బార్ గేట్లోంచి జాన్, డేవిడ్ బయటికి  వచ్చారు.


    "వాళ్లు వస్తున్నారు!.. కంగారుగా అన్నాడు చిట్టబ్బాయి "బాగా కిందికి వంగు... మనం వాళ్ళకి కనబకూడదు!!..." హెచ్చరించాడు కన్నారావు.


    ఇద్దరూ బాగా కిందికి వంగి కూర్చున్నారు. కాస్త దూరంలో బూట్ల శబ్దం వినిపించింది. ఆ శబ్దం  మెల్ల మెల్లగా కారుని సమిపించాసాగింది.


    చిట్టబ్బాయి, కన్నారావులు ఊపిరి కూడా శబ్దం చేయకుండా తీస్తున్నారు.


    బూట్ల శబ్దాలు కారు దగ్గరికి వచ్చి ఆగిపోయాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS