Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 39


    ఒక రచనను ఏదయినా పత్రికకు పంపితే అది ఆ కార్యాలయములో ఏ విధంగా పరిశీలించబడుతుందో తెలుసుకోవాలని చాలామంది వర్ధమాన రచయితలూ, పాఠకులకూ కూడా కుతూహలం ఉండవచ్చు.
    వారి సౌకర్యార్ధం, ప్రముఖ పత్రికలు అంధ్రభూమి మాసపత్రిక, దినపత్రిక, ఆదివారం అనుబంధం కోసం పంపిన రచనలను పరిశీలింపబడి ప్రచురించబడే విధంగా ఇక్కడ వివరిస్తున్నాం.
    వచ్చిన పోస్తునంతా మొదట జగన్ మోహన్ రిసీవ్ చేసుకుంటారు. స్క్రిప్టులకి తగిన రిటర్న్ పోస్టేజీతో ఉన్న కవరు జత చేసి వున్నాయో లేదో చూసి ఆ పోస్టేజీ స్టాంపుల విలువ ఎంతో నోట్ చేసుకుని ఆ తరవాత స్క్రిప్టులని ఎడిటరుకి పంపుతారు.
    ఎడిటర్ స్క్రిప్టులని పరిశీలించి కొన్నిటిని ఓకె చెయ్యడం కొన్నిటిని రిజెక్ట్ చెయ్యడం జరుగుతుంది. ప్రిలిమినరీ సెలక్షన్ లో ఆయనకి ఆర్. దమయంతి తోడ్పడతారు.
    రిజెక్ట్ అయిన స్క్రిప్టులని వాటికీ తగిన రిటర్న్ పోస్టేజి జతపరిచి జాగ్రత్తగా త్రిప్పి పంపడం జరుగుతుంది.
    అంగీకరించబడిన స్క్రిప్టులు వీక్లికి సంబంధించినవి అయితే సబ్ ఎడిటర్ వేణు దగ్గరికీ వెళతాయి.
    అంధ్రభూమి ఆదివారం అనుబంధం స్క్రిప్టులు సబ్ ఎడిటర్ వెంకట్రావు దగ్గరకు వెళతాయి. సినిమా వార్తలు అవీ కూడా ఈయనే చూస్తారు.
    వారు ఆ స్క్రిప్టులు సరిదిద్ది అవసరమయితే అక్కడక్కడ స్వల్పమయిన మార్పులు చేసి అనవసరమైనవనుకున్న భాగాలు ఎడిట్ చేసి వాటిని ఏ సైజు అక్షరాలలో ప్రింట్ చేస్తే బాగుంటుందో మార్జిన్ లో సూచించి కంపోజింగ్ పంపుతారు.
    కంపోజింగ్ కంప్యుటర్ మీద జరుగుతుంది.
    కంపోజింగ్ పూర్తీ అయ్యాక ఆ "బ్రోమైడ్' తిరిగి సబ్ ఎడిటర్ దగ్గరికి వస్తుంది. వారు దాన్ని పరిశీలించి అర్తిస్తులలో ఒకరికి ఇస్తారు. వారు దానికి బొమ్మ వేస్తారు. తర్వాత లే అవుట్ ఆర్టిస్టు పేజీసైజు వైట్ షీట్ తీసుకుని బ్రోమైడ్ ని కాలమ్స్ గా కట్ చేసి ఆ షీటు మీద అతికిస్తారు. కాలమ్స్ మధ్య ఎడిటర్ సూచనల ప్రకారం అంతకు ముందే రెడీగా ఉన్న ఇల్లస్ట్రెషన్స్, కార్టునులూ, ప్రకటనలూ అతికిస్తారు.
    ఈ పక్రియని పేజ్ మేకప్ అంటారు.
    పేజ్ మేకప్ అయిన లేఅవుట్ నెగటివ్ తీస్తారు. ఆ నెగటివ్ ప్లేట్ మేకింగ్ సెక్షన్ కి వెళుతుంది.
    అలా తయారయిన ప్లేట్లు ప్రెస్ కి పంపబడతాయి. ప్రెస్ లో ప్రింట్ అయిన ఫారాలను ఎప్పటికప్పుడు ఎడిటర్ అప్రూవర్ కోసం పంపడం జరుగుతుంది. ఎడిటర్ అప్రూవ్ చేశాక ప్రింటింగ్ మెదలవుతుంది. పేజీలు  అన్నీ కలిపి బైండ్ అయిన పుస్తకాలు మార్కెట్ లోకి వస్తాయి.

                                   15

    "కూర్చో" అన్నాడు ఎడిటరు హరిణితో అదరంగా.
    చాలా సంతోషంగా వుంది హరిణికి. ఆమె అనందం అంతా ఆమె ఆధారాల మీద కనబదిపోతోంది.
    "ఉత్తరాల పరంపర మొదలయిందా!" అన్నాడు ఎడిటర్ నవ్వుతూ. ఆ వారం నుంచే ఆమెతో పాఠకుల ముఖాముఖి అనౌన్స్ చేసి ఆమె అడ్రసు ఇచ్చాడు మేగజైనులో.
    "బాబోయ్ ఎన్ని ఉత్తరాలో!" అంది హరిణి ఒక చెయ్యి గుండెలమీద వేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ. "ఇదివరకు ఎప్పుడన్నా నెలకోసారి ఎవరన్నా ప్రెండ్ దగ్గర్నించొ, కజిన్స్ దగ్గరినించో ఒక లెటర్ వస్తే గొప్ప! మన మేగాజైనులో అడ్రసు పడింది. ఇక చూసుకోండి. ఉత్తరాల వరదే! రోజుకు యాభై అరవై.......చదవడానికి టైం వుండడం లేదు." అంది ఉత్సాహంగా.
    ఏం రాస్తున్నారు? పోగుడుతున్నారా? తిడుతున్నారా?"
    "పొగడ్తలే ఎక్కువ! కొన్ని తమాషా ఉత్తరాలు కూడా వస్తున్నాయిలెండి!"
    "ఏమని?"
    "చెల్లి తల్లీ అని మొదలుపెట్టి చివరికి నీ కళ్ళు నా ప్రేయసి కళ్ళని గుర్తుతెస్తున్నాయ్. ఈ విరహానికి మందేమిటి? అని ప్రశ్నిస్తూ" అని ఆపి నవ్వేసింది ఆమె.
    ఎడిటరు కూడా నవ్వాడు. "అది మాములే! ఇవన్నీ చూసి నువ్వు బెదిరిపోవడం లేదుకదా?"
    "బెదిరిపోవడమా! లేదు లేదు. రైటర్ గా కొత్త పొజిషన్ ని ధరోగా ఎన్ జాయ్ చేస్తున్నాను.'
    "దట్స్ గుడ్! ఇంకా అప్పుడే ఏమయింది? మూడో వారం ఇష్యూ మార్కెట్ లోకి రానియ్. నీపేరు మారుమోగిపోతుంది. మూడో వారం నుంచి టేర్రిఫిక్ రెస్పాన్స్ రావాలి సీరియల్ కి. పెద్ద మలుపు తిరుగుతుంది కధ."
    "ఆ మలుపు మీరు సజెస్ట్ చేసిందే కదా! ఆరోజు డిస్కషన్ లోనే రాత్రి ఎనిమిదయిపోయింది" అంది హరిణి.
    ఆ సన్నివేశం గుర్తువచ్చింది ఎడిటర్ కి. ఆరోజు తనకి అత్యవసరమైన పర్సనల్ వర్క్ ఉంది. అయినా సీరియల్ డిస్కషన్ కోసం ఆగిపోయాడు. దానివల్ల తనకు పర్సనల్ గా కొద్ది నష్టం జరిగింది. అయినా ఆ డిస్కషన్ సీరియల్ కి అద్భుతమైన మలుపు తట్టింది.
    "అలాంటి మలుపు నాకయితే తట్టి ఉండేది కాదు" అంది హరిణి మనస్పూర్తిగా.
    "మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజెయ్యాలో అర్ధం కావడం లేదు సర్!'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS