Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 40

 

    
    మొత్తం సిరీస్ వరుసగా నంబర్లు వుండేలా పది చొప్పున తీసుకుంటే కొన్ని ప్రయిజులు గ్యారంటీ! వెయ్యి టికెట్స్ తీసుకుంటే నూరు రూపాయల ప్రయిజులే కాక పది ఇరవై యాభై రూపాయల ప్రయిజులు గ్యారెంటీ! అదృష్టం బాగుంటే వెయ్యికి వెయ్యి రావచ్చు.
    కొంతయినా వచ్చి తీరుతుంది! మినీమమ్ గ్యారెంటీ ఉంటుంది కదా!
    ఇక్కడేముంది? ప్రాణాలకు తెగించటం, రాత్రంతా చాకిరీ చెయ్యటమే, చేతులు దులుపుకుంటూ తిరిగి ప[పోవటం.
    పెందలాడే ఇంటికి వెళ్లి పడుకోవటం చాల ఉత్తమం హోం డిపార్టుమెంట్ కి గుడ్ విల్ అయినా పెరుగుతుంది."
    "దట్సాల్! అదే మంచిది. పోయిన డబ్బు ఎలాగూ పోయింది. ఎంట్రీ ఫీజు తిరిగి యివ్వరు కదా! పదండి పోదాం " అంటూ తీర్మానానికి తన మద్దతు ప్రకటించాడు మరో పెద్దమనిషి.
    వారు లేచి వెళ్ళిపోతూ ఉంటే మరికొందరు అనుసరించారు. కొద్ది మంది మాత్రం తీరని ఆశతో అలాగే కూర్చుండిపోయారు.
    జయసింహ పిట్టగోడ మీద కాలు పెట్టి శూన్యం లోకి చూస్తున్నాడు.
    సృష్టి అంతా శూన్యంలోంచే కదా పుడుతుంది.
    నిశ్శబ్ధం వల్ల ఆలోచనలు ప్రేరేపించ బడతాయి.
    అలాగే శూన్యానికి ఆత్మ శక్తుల్ని నిద్ర లేపగల శక్తి ఉంది. శూన్యంలో గుచ్చుకున్న చూపులు క్రమంగా క్రిందికి దిగి వచ్చాయి. చుట్టూ ఉన్న ప్రతి అణువును క్షుణ్ణంగా పరిశీలించాడు.
    పిట్టగోడ మీద పెన్సిల్ తో వ్రాసిన చిన్న బాణం గుర్తులు కన్పించాయి. చిన్నపిల్లలు ఆకతాయితనానికి గీచిన గీతల్లా ఉన్నాయి. వాటిని అనుసరించి అతని అడుగులు ముందుకి పడుతున్నాయి.
    పిట్టగోడ చుట్టూ తిరిగి వచ్చాక ఆ గుర్తులు ఒకచోట అదృశ్యమయినాయి. వెనుక నుంచి దిగి వెళ్ళేందుకు మెట్లు దగ్గరలోనే ఉన్నాయి.
    అక్కడ ఓ చిన్న వాల్ పోస్టర్ అతికించి ఉంది. అది బ్యాటరీలు తయారుచేసే ఓ కంపెనీ వారు యిచ్చిన అడ్వర్టయిజ్ మెంట్!
    చిరకాలం మన్నే బ్యాటరీలు! శక్తిని పుష్టిని కలిగి ఉంటాయి. నాణ్యత విషయంలో నిశ్చింతగా నమ్మవచ్చు. అదీ అడ్వర్టయిజ్ మెంట్ సారాంశం!
    దాని మీద శక్తి అన్న అక్షరాలు యెర్రని రంగులో ఉన్నాయి.
    అత్యంత శక్తివంతమయిన బ్యాటరీలు అనే విషయాన్ని బాగా ఎక్స్ పోజ్ చెయ్యటం కోసం "శక్తి" అనే అక్షరాల్ని ఎరుపు రంగులో ముద్రించారు.
    ఆకుపచ్చ రంగులో ఉన్న అక్షరాలూ మధ్య ఎరుపు శక్తి!!
    దాన్ని ఎవరు అతికించారు! అలాంటి వాల్ పోస్టర్ అతికిన్చేందుకు అది సరి అయిన చోటు కాదు.
    దాని అంచును గోటితో కదిలించాడు. పెష్ట్ యింకా అరిపోలేదు.
    దాన్ని అతికించి కొద్ది సేపే అయిందన్న మాట!
    అదే నిజమయితే ఆ పని యాజమాన్యం చేసి ఉండాలి! అదే నిజమయితే వారి ఉద్దేశ్యం ఏమయి వుండాలి!
    అతని మనోలోకంలో వెలుగు వాకిళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే లాంటి మెరుపు ఆలోచనలు! 'శక్తి' అనే అక్షరాల్ని ఎరుపు రంగులో ముద్రించిన వాల్ పోస్టర్!
    కావాలనే దాన్ని అక్కడ అతికించారు!
    'శక్తి' అనేది క్లూ దొరికే ఒక చోటు అయి వుండాలి. అలాంటి చోటు ఎక్కడుంది. నగరంలో ఉండాలి కదా!
    చిన్నతనం నించి నగరంలో కన్పించిన బోర్డులన్నీ జ్ఞాపకం తెచ్చుకున్నాడు.
    శక్తి నాన్ వెజిటేరియన్ హోటల్!!
    శక్తి టెక్స్ టైల్స్ ప్రైవేట్ లిమిటడ్!
    శక్తి వ్యాయామ క్రీడామండలి!!
    శక్తి సిమెంట్ డీలర్స్! శక్తి అపార్టుమెంట్స్! శక్తి లెత్ మిషన్! అన్నీ వరుసగా జ్ఞాపకం వస్తున్నాయి. వీటిలో ఏదయి వుండాలి!
    ఆలోచిస్తూ ఉండగానే ఆకాశంలో క్రిందిగా ఉన్న వర్ష మేఘాల్ని సైతం వెలుగుతో నింపుతున్న పవర్ పుల్ టార్చి ఫోకస్ కన్పించింది.
    అది మూడు వందల అరవై డిగ్రీలు తిరిగి వచ్చేందుకు రెండున్నర నిముషాలు పడుతోంది. దాని వెలుతురు క్రిందిగా ఉన్న మేఘంల మీద పడటం కన్పిస్తోంది.
    పది కిలోమీటర్లు దూరం పైగా దాని ఫోకస్ కన్పిస్తూ ఉండాలి! సాధారణమయిన ఆ టార్చి అదే వేళ ప్రతిరోజూ కన్పిస్తుంది పది రోజులుగా!
    ఓ సర్కస్ కంపెనీ వాళ్ళు విచిత్రమయిన ప్రచారం అది.
    అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు.
    అవును క్రొత్తగా వచ్చింది శక్తి సర్కస్ కంపెనీ! పులులతో పోరాడవలసి రావచ్చు. పాముల్నించి తప్పుకోవాల్సి రావచ్చు అంటూ ప్రియాంక చెప్పిన క్లూ వివరాలు ఇప్పుడు జయసింహ చెవుల్లో మార్మోగుతున్నాయి.
    పులులు సింహాలు నగరంలో ఎక్కడుంటాయి? జూలో ఉంటాయి. సర్కస్ కంపెనీల్లో ఉంటాయి.
    ఆలోచనలు కట్టిపెట్టి మేఘాల మీదికి లైటు ఫోకస్ చేస్తున్న సర్కస్ కంపెనీ వైపుగా పరుగు తీశాడు జయసింహ.
    అప్పటికి రెండు షోలు  పూర్తీ చేసి మూడో దానికి సిద్దమవుతున్నారు. క్యూలో నిలబడిన జనం క్రమంగా తరిగిపోతున్నారు.
    మెయిన్ గేటు ఎదురుగా "శక్తి సర్కస్" అన్న పెద్ద అక్షరాలూ కన్పిస్తున్నాయి. ఎత్తయిన డేరా మీద బారులు తీర్చి దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి.
    ఒంటెలు, ఏనుగులు, జిరాఫీలు ఉన్న దిక్కు నించి గాలి వీచినపుడు అదో రకమయిన వింత వాసన వస్తుంది.
    మరో వంక వరుసగా బోనులున్నాయి. ఒకదానిలో సింహం! మరో దానిలో పెద్ద పులి! ఇంకొక దానిలో చీటా!
    అన్నింటి కన్నా ఎత్తయిన చోటున కొత్తగా తయారు చేసిన బోనులో చాల భయంకరమైన జంతువూ కన్పిస్తుంది.
    బోను ఎదురుగా ఏ రాష్ట్రం నించి వచ్చిందీ గుర్తించటానికి వీలుకాని సర్కస్ డ్రస్ లో ఒకమ్మాయి నిలబడి ఉంది.
    బోనులో నల్లగా భయంకరంగా ఉన్న ఆ మృగం మీది నించి చూపులు మరలచుకోలేకపోయాడు జయసింహ! షోకి చాల త్వరగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరి హడావుడిలో వారున్నారు.
    "ఇది బ్లాక్ ఫాంధర్ ! నల్ల చిరుత! బ్లాక్ టైగర్ అని కూడా అంటారు. ప్రపంచంలో చాల అరుదయిన ప్రాణి! ఇది వొక్క మా సర్కస్ లో మాత్రమే వుంది. చూశారు కదా! ఇంక వెళ్ళిపొండి. టికెట్స్ అయిపోతున్నాయి. అందామె ప్రచార ధోరణిలో! నల్లపులిని రిక్క వేసి పిలిచింది."
    పడుకోవాలనే ప్రయత్నంలో ఉన్న చిరుత చివాలున లేచి వెను దిరిగింది. దాన్ని కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి.
    కాళ్ళు చాల బలంగా ఉన్నాయి. జంతువుని వేటాడెప్పుడు వంద కిలోమీటర్ల వేగంతో పరుగు తీయటం దానికి ప్రకృతి ఇచ్చిన శక్తి! అంత వేగంలోను లక్ష్యాన్ని అందుకునేందుకు ఏ కోణంలో పరుగెత్తాలో నిర్ణయించుకోవటం క్షణంలో దిక్కుని మార్చుకోగలగటం దానికి మాత్రమే ఉన్న ప్రత్యెకమయిన అద్భుత శక్తి!
    కొండ కోన కొమ్మ మీద కూర్చుని కిలోమీటరు దూరంలో ఉన్న వేట జంతువుని అది బాగా గుర్తించగలదు.
    అది పంజా విప్పి కొడితే శరీరమంతా స్మర్శజ్ఞానం లేకుండా పోతుంది. దాని పంజా దెబ్బలో ఉంది అంతటి శక్తి.
    కోతలు ఎంత కఠినమయిన వస్తువునయినా చీల్చి చెండాడ గలిగినంత పదునుగా కత్తుల్లా ఉంటాయి. దానికి అది మరో శక్తి!
    రిక్క వేయటంతో రెచ్చిపోయి వేటకి తనకీ మధ్య బోను తాలుకూ యినుప ఊచలున్నాయిని సంగతి ,మరచి పోయింది. వేట జంతువుని భయపెట్టే అలవాటుతో కత్తుల్లాంటి కొరలు బయట పెట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS