Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 38

 

       రోడ్డుమీద సుడిగాలి రివ్వుమని వీస్తోంది. దమ్ము చక్రాల్లా లేస్తోంది.

    హ్తెదరాబాదులో ఇది మామూలే. పగలు వీపు  పగలు గొట్టే  ఎండ సాయంత్రం అయ్యేసరికి  గాలి  దుమ్మూ లేవడం మామూలేను. రాబర్టు అనాలోచితంగా  నడుస్తున్నాడు.

    ఇప్పడతని స్ధితి తాడులేని బొంగరంలా  వుంది.

    చిత్ర విషయంలో తను తప్పు నిర్ణయం తీసుకున్నట్టుగా అనుకొంటున్నడిప్పుడు.

    చిత్ర తనని ప్రేమించింది.

    ప్రేమకి అసలు అర్ధమేమిటి?

    రాబర్టు బాధగా  నవ్వుకున్నాడు.

    అర్జునని ప్రాణంతో సమానంగా ప్రేమించాడు తను ఒక ఆడదాన్ని ప్రేమించాక మరో ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు అదినిజమైన ప్రేమికుడు చేసేది.

    కానీ తనేం చేశాడు?

    ప్రేమంటే అసలు తనకి తెలీదు. తేలిసై ఈ విధంగా ఎప్పడూ చేసేవాడు కాదు.

    కానీ అతని గుండెల్లోనీ అగ్నిపర్వతాలు పగిలి జ్వాలారగిలింది.

    ఆ జ్వాలలో కాలిపోతూనే కసితో  కాశ్మీరని అనుభవించాడు.

    మేరీ  విషయం.

    ఆమె తనని ప్రేమించింది కానీ తనకి ఆమెమైన ఇష్టం వుంది అది ప్రేమకాదు.

    అలాంటప్పుడు ఆమెనేందుకు పొందినట్టు?  తాగి ఒళ్ళు తెలీవి స్ధితిలో  ఆమెతో సుఖాన్ని పొందాడు. ఆ తర్వాత అదో అలవాటుగా మారిపోయింది.

    ఎంత మడి కట్టుకు కూర్చున్న మనిషిఅయినా ఆడది రెచ్చగొడితే మగాడిలో కోరిక బుస కొడుతుంది. మోహిని చిత్రల విషయంలో ఆ విధంగానే జరిగింది.

    రాబర్టు ఓ పాన్  షాపుదగ్గర ఆగి సిగరెట్ పెట్టె కొన్నాడు.

    సిగరెట్ వెలిగిస్తూ వెనక్కి తిరిగాడు అంతే!

    అతను నిశ్చేష్టడయ్యాడు.

    అక్కడికి పదిహేను గజాల దూరంలో జనం గుమ్మిగూడి వున్నారు.

    అక్కడ ఆగివున్న కారుని పోల్చుకున్నాడు రాబర్టు.

    అది మోహిని కారు

    అంటే మోహిని మళ్ళీ ఎవరికో ఎరవేసిందన్న మాట.

    ,మోహినీ బారినుంచి  అతన్ని కాపాడాలి ఈ దొంగ అంతు చూడాలిరోజు' అనుకున్నాడు రాబర్టు.

    అలా  అనుకోవడమే తడవుగా అక్కడికి నడిచాడు రాబర్టు.

    శశిభూషణ్ నీ బలవంతంగా కారులోకి తోసారు జనం' మోహీని  కారెక్కి కారును స్టార్టు చేసింది.

    రాబర్టుకి చెమటలు పట్టాయి.

    "శశిభూషణ్, అతను కాశ్మీర భర్త" అతను అడుగు ముందుకి వేసే లోపలే కారు వెళ్ళిపోయింది.

    అక్కడ జనంమైన రాబర్టుకి చాలా కోపం వచ్చింది.

    "శశిభూషణ్ కద ఈ రోజుతో... ..." ఆలోచించలేక పోయాడు రాబర్టు.

    అతనికి కాశ్మీర గుర్తుకు వచ్చింది. వెళ్ళి ఆమెకి తను చూసింది చెప్పటం  తన కర్తవ్వంగా  భావించాడు రాబర్టు.

    రాబర్టు అటూ ఇటూ  చూశాడు. చేతిలోని సిగరెట్ అవతల పడేసి అక్కడే వున్న ఆటో ఎక్కాడు రాబర్టు.

    చేతి గడియారంలో టైమ్ ఎనిమిది గంటలయింది. కనీసం  మరో నాలుగుగంటలపాటు శశిభూషణ్ కి ప్రమాదం వుండదని రాబర్టుకి ఖచ్చితంగా తెలుసు.

    పావుగంటలో కాశ్మీర ఇంటిముందు ఆటోలోంచి దిగాడు రాబర్ట్.

    గేటు తీసుకొని గబగబ లోపలికి నడిచాడు రాబర్టు. వరండా మెట్లెక్కి కాలింగ్ బెల్ నొక్కాడు. రెండు మూడు నిమిషాల తర్వాత కాశ్మీర తలుపు తెరచింది.

    అతన్ని చూడగానే  పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టయింది కాశ్మీరకి.

    "విజయ్" అంది.

    "కాదు రాబర్ట్" అంటూ లోపలికి నడిచాడతను అతని  వెనకే వచ్చింది కాశ్మీర.

    రాబర్టు సోఫాలో  కూర్చుంటూ కాశ్మీరని చూశాడు. కాశ్మీరలో చాలా మార్పు వచ్చింది. తనుచూసినప్పుటికంటే బాగా  చిక్కిపోయింది.

    "అలా అయిపోయావేం?" అడిగాడు.

    "విజ.... సారీ రాబర్టు" అంది ఆమె కళ్ళలో అనందం తోణికిస లాడుతోంది.

    అతనికి దగ్గరగా వచ్చి రెండు చేతుల్నీ  పట్టుకోంది.

    "ఆ రోజునుంచి నీకోసం మళ్ళి ఎప్పుడోస్తావా అని కళ్ళల్లోవత్తు లేసుకొని ఎదురు  చూస్తున్నానంటే నమ్ముతావా" అంది.

    రాబర్టు జాలిగా చూశాడు.

    "నాకు తెలుసు కాశ్మీరా నీ ఇంటికి తలుపుల్నే కాదు. నీ గుండె తలుపుల్ని నా కోసం తేరిచెఉంచుతానని నాకు తెలుసు."

    "ఆ మాత్రం నన్నర్ధం చేసుకున్నావ్  రాబర్టు నాకు ఆ మాత్రం చాలు" అంది.

    శశిభూషణ్ గురించీ చెప్పాలా వద్దా?

    అతన్ని తను కాపాడాలంటే కాపాడగలడు, కాశ్మీరకి అతనిపైన వున అభిప్రాయం తెలుసుకోవాలి ముందు. అయినా అతన్నేందుకు కాపాడాలి అంతరాత్మ ఎదురుతిరగి అడుగుతుందో పక్క అతను అ కారణంగా తనని జ్తేలుపాలు చేశాడు.

    "ఏమిటాలోచిస్తున్నావ్" అడిగింది కాశ్మీర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS