"మరి మీరు మా ఇంటికెప్పుకోస్తారు?" అడిగింది లక్ష్మి రాంపండుని.
రాంపండు రాజీ వంక చూశాడు.
"ఎప్పుడో వీలుచూసుకుని వస్తాంలే" అంది రాజీ లక్ష్మితో.
అందరూ గేటుదాకా వెళ్ళారు.
వాళ్ళు వెళ్ళిపోయాక రాజీ గనుక తనని ఆ రాత్రికి తండిపొమ్మని అంటే వైష్ణవికి ఏమని సమాధానం చెప్పాలి?! సదన్ గా ఆఫీసు నుండే క్యాంప్ కి వెళ్ళిపోయానని సమాధానం చెప్పాలా? అని ఆలోచిస్తూ వున్నాడు రాంపండు.
విశ్వం, లక్ష్మి స్కూటర్ ఎక్కి రాజీ, రాంపండులకి వాళ్ళింటికి రమ్మని మరోసారి చెప్పి, టాటా చెప్పి వెళ్ళిపోయారు.
రాజీ రాంపండు వైపు తిరిగి యిలా అంది_
"ఇం కిప్పుడూ ఇక్కడికిరాకు.... ఇలా నాకు ఇష్టం వుండదు."
* * * *
ఆలస్యంగా ఇంటికి వచ్చిన రాంపండుని వైష్ణవి ఎందుకు ఆలశ్యంగా వచ్చారని గానీ, ఎక్కడికి వెళ్ళారని గానీ ఏమీ అడగలేదు.
రాంపండుకి ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు.
రాజీ తనని చూడగానే సంతోషిస్తుందని అనుకున్నాడతను. తను చేసిన పనికి పశ్చాత్తాపడ్తుదని అనుకున్నాడు. నేనేదో ఆవేశంలో అలా చేశాగానీ మీరు లేకుండా నేను బ్రతకలేనండీ అని తనని కౌగలించుకుని భోరున ఏడుస్తుందని అనుకున్నాడు.
కానీ పూర్తిగా అతనికి అంతుబట్టని సంఘటన జరిగింది.
వివాహబంధం అంటే అంతేనా, ఊర్కే పుటుక్కున తెంచెసుకుంటే తెగిపోయేదా? అయిన తనేం సకల దురాలవాట్లూ ఉన్న భర్తకాడే... పెళ్ళాన్ని హింసబెట్టె భర్త కూడా కాడే... మరి తనతో అంత కఠినంగా ఎందుకు ప్రవర్తించింది రాజీ? తనంటే ఎందుకంత అసహ్యం?
ఆలోచనల్తో అతని బుర్ర వేడెక్కిపోయింది. పక్కమీద అటూ ఇటూ కదిలాడు.
"ఏం? నిద్రపట్టడం లేదా?" అడిగింది వైష్ణవి.
అప్పుడు రాత్రి ఓంటిగంట అయ్యింది.
"లేదే...బాగానే నిద్రపోతున్నా!" కంగారుగా అన్నాడు రాంపండు.
"మీరు చెప్పేది చాలా బాగుంది. అంత బాగా నిద్రపోయేవారు నేనడిగిన ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పారు?"
"అంటే ఇప్పుడే ఎందుకో మెలుకువ వచ్చిందన్నమాట...!" అంటూ ఆవులిస్తున్నట్టు నోరంతా చాపి నిద్ర పాడుతుంటేనూ?"
"సరే మీ యిష్టం"? అంటూ అటు తిరిగి పడుకుంది ఆమె.
తనను మళ్ళీ ఆలోచనల్లో పడిపోయాడు. ఆలోచించి ఆలోచించి ఎప్పుడు నిద్రపట్టిందో అతనికే తెలీదు.
నిద్రలో కల!...
కలలో రాంపండు యింట్లొంఛి బయటకి వెళుతున్నాడు. రాజీ అతన్ని వెళ్ళొద్దని బ్రతిమలాడుతుంది. అయినా రాంపండు ఆమె మాటల్ని పేడచెవిన పెట్టి ముందుకు అడిగులు వేస్తున్నాడు.
రాజీ నెల మెడ పది రాంపండు కళ్ళని రెండు చతులతావు చుట్టేసింది.
"వద్దండీ... మీరు వెళ్ళకండీ" అని విలపిస్తూంది.
కానీ రాంపండు మాత్రం సినిమాల్లో వ్యసన పరుడైన హీరో కాళ్ళు హీరోయిన్ పట్టుకుంటే ఆమెని నెల మీద బరబరా ఈడ్చుకుంటూ ఎలా నడుస్తాడో అలా రాజీని క్రూరంగా నెల మీద ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు.
అలా గుమ్మదాకా రాజీని ఈడ్చుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కసారి కాలుని విదిల్చాడు. రాజీ నెల మీద బోర్లాపడింది.
గుమ్మంలో ఎదురుగా రాంపండుకి వైష్ణవి కనిపించింది.
వైష్ణవి రేమ్న్డు చేతులూ చాపి రాంపండుని ఆహ్వానించింది. రాంపండు ఆమెని చేరుకొని గట్టిగా కౌగలించుకుని ఆమె పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.
రాంపండుకి హాతాట్టుగా మెలుకువ వచ్చేసింది. అతని గుండె భారముగా కొట్టుకోసాగింది.
ప్రక్కకి తిరిగి చూశాడు.
మంచం మీద వైష్ణవి లేదు. ఆమె అప్పటికే తన పనుల్లో మునిగిపోయింది.
ఆఫీసుకెళ్ళే ముందు భోజనం చేస్తుండగా ఆమె అడిగింది_
"నిన్న అంత ఆలస్యంగా వచ్చారేం?"
"ఆఫీసులో కాస్తా పని వుండీ...." నసిగాడతను.
"అంత రాత్రి దాకా ఆఫీసులోనే వున్నారా?"
"ఊ... అర్జంటు పని!" ఆమె వంక చూడకుండా జవాబు. చెప్పాడు.
"నేను మీ ఆఫీసుకి అయిదు గంటలకి ఫోను చేస్తే మీరు అప్పుడే వెళ్ళిపోయారని చెప్పారు."
అతను గతుక్కుమన్నాడు.
"ఆమె యింటికి వెళ్ళారా?" అడిగింది ఆమె.
"ఎందుకు?!" విస్సుగ్గా ముఖం పెట్టి అన్నాడతను.
"ఎందుకేమిటి? చూడ్డానికి?!"
"ఎందుకు చూడ్డానికి?!"
"అయితే ఆమెని చూడాలనే అనిపించదా మీకు?"
"ఉహూ! నేను అక్కర్లేదని కదా నన్ను అమ్మేసింది.... అటువంటిప్పుడు నేను దాన్ని చూడ్డానికి ఎందుకేళతాను?"
"దాన్ని కాదు... ఆమెని అని అనాలి! నా గురించి ఎవరికైనా చెప్పాల్సి వస్తే నన్ను కూడా అదీ, ఇదీ అనే అంటారా?"
"నువ్వు వేరు... నువ్వు మమ్చిదానివి౧" తల వంచుకునే పళ్ళెంలోని అన్నాన్ని చూపుడువేలుతో కేలికుతూ చెప్పాడు.
