Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 38

    "ఈ  టేబుళ్ళు ఫామిలిస్ కి రిజర్వ్ చేశాం సార్?"

    చిట్టబ్బాయ్, కన్నరావులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

    "ఇంతకి మేము నీకు ఎలా కనిపిస్తున్నం.... ఫామిలి టైపులా  కనిపించడం లేదా?" ఆశ్చర్యంగా బేరర్ వంకచూస్తూ అడిగాడు కన్నారావు.

    అది వింటూనే ఫక్కున నవ్వాడు బేరార్.

    "మీరు భలే జోకేసారు సార్... మీరు ఫామిలి ఎలా అవుతారు?... ఫామిలి అంటే ఆడ మనుషులు  ఉండాలిగా!" నవ్వాపుకుంటూ అన్నాడు బేరర్. "ప్లీజ్ మీరు అక్కడ కూర్చోండి సార్"

    "మేం కూర్చోము. ముందు నువ్వు మీ మేనేజర్ని పిల్చుకురా" అన్నాడు చిట్టబ్బాయి.

    బేరార్ ఎంత స్పీడుగా వాళ్ళ దగ్గరికి వచ్చాడో అంతే స్పీడుగా వెనక్కి వెళ్ళాడు.

    కౌంటర్ దగ్గర ఉన్న మేనేజర్ కి వీళ్ళని చూపించి ఎదో చెప్పాడు. అది వింటూనే మేనజర్ హడావిడిగా వీళ్ళ దగ్గరికి వచ్చాడు. అతని వెనకాలే బేరార్ కూడా వచ్చాడు.

    మేనేజర్ ఎదో అడేగేంతలో  కన్నరావే గట్టిగా అన్నాడు.

    "ఏవండి...మేమేవ్తేనా బజారు మనుషుల్లా కనిపిస్తున్నామ?"

    అతను అలా అనగానే మేనేజరు కంగారు పడిపోయాడు.

    "అమ్మమ్మ...ఏంతమాట!అలా అని ఎవరంటారండి" అన్నాడు మేనేజరు.

    "మేము మంచి ఫామిలికి సంబందిచిన వాళ్ళలాగానే ఉన్నాం కదా?"

    "ఉన్నారుగాని వెంట ఆడమనిషి లేరు కదండి... ఆడ మనిషి ఉంటేనే ఫామిలి కిందికి వస్తుందండి" వినయంగా చెప్పాడు మేనేజరు.

    "అయితే మేం కూడా ఒక వ్యభిచారిణిని  తెచ్చుకున్నాం అనుకోండి. ఫామిలి అయిపోతుందా?..." కల్లెగారేస్తూ ప్రశ్నించాడు చిట్టబ్బాయ్.

    అలా ప్రశ్నించేసరికి మేనేజరు నీళ్ళు నమిలాడు.

    "అలా  అంటే ఎలాగండి  మరీనూ...." అంటూ గొణిగాడు.

    కన్నారావు చిట్టబ్బాయ్ కి షేక్ హండిస్తూ మెచ్చుకున్నాడు.

    "పోనీ ఇది చెప్పు. ఒక ఇంట్లో ఒక తండ్రి, నలుగురు కొడుకులున్నారను కోండి.... అది ఫామిలినా కాదా?" చిట్టబ్బాయ్ చేతిని వదుల్తూ అడిగాడు కన్నారావు.

    "ఫామిలినేనండి" అయోమయంగా చూస్తూ అన్నాడు మేనేజరు.

    "మరి అక్కడ ఆడమనిషి లేనప్పుడు అది ఫామిలి అమ్యితే ఇక్కడెందుకు కాదు?... మేమిద్దరం అన్నదమ్ములం ...కాబట్టి మేము కూడాఫామిలినే... ఇంక తమరు వెళ్తారా?... మేమిక్కడే కూర్చుంటాం..." అన్నాడు కన్నారావు.

    చిట్టబ్బాయ్ కన్నరావుకి షేక్ హ్యండిస్తూ కళ్ళతోనే మెచ్చుకున్నాడు.

    మేనేజరు ఎదో గొణుక్కుంటూ మెల్లగా వెనక్కి తిరిగాడు. ఆముదం తాగినట్టున్న మేనేజర్ మొహాన్ని చూసిన బేరార్ "హిహిహి" అంటూ నవ్వాడు.

    ఆ నవ్వ విన్న మేనేఅజర్ వాడిమీద మండిపడ్డాడు.

    "ఏంట్రా ని వెధవ  నవ్వు... ముందు వాళ్ళకెం కావాలో ఆర్డరు తీస్కో" అని చివాట్లేసి చరచరా  వెళ్ళిపోయాడు.

    చిట్టబ్బాయ్ , కన్నరావులు బేరార్ వంక విజయగర్వంతో చూసారు.

    "చెప్పండిసార్... ఏం తిస్కుంటారు? విస్కియ, బ్రందియ, బిరా, రమ్మ?...మంచింగ్ కి  చికెన్ సిక్స్ టి  ప్తేవా, చిల్లి చికెన్ పకోడానా? ఏం తెమ్మంటారు?" అడిగాడు కదలాడింది.

    చిట్టబ్బాయి బేరార్ వ్తెపు తిరిగి అన్నాడు.

    "తప్ప బాబూ - అలాంటివాన్ని తాగొచ్చా?...

    "మరి బార్ కి  ఇంకెందుకోస్తారు?" అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ బేరార్,
    "ఏం? - మీ బార్ లో  హాట్  డ్రింక్స్ తప్ప ఇంకేముండవా?... వెళ్ళి రెండు లిమ్కాలు తిస్కురా..."

    "ఈమాత్రందానికా అక్కడ కూర్చోము, ఇక్కడే కూర్చుంటాము అని ఇంత గొడవ పెట్టుకున్నారు" అన్నట్టుగా వాళ్ళ వంక చూసి లోపలికెళ్ళాడు బేరార్ .

    అప్పడు మెల్లగా ఇద్దరూ పక్కకి తిరిగి వాళ్ళ వ్తెపు చూశారు.

    ఆ రౌడిలిద్దరూ వాళ్ళ ముందున్న ప్లేట్లలోని తందూరి చికెన్ పిక్కుని తింటూ మధ్య మధ్య గ్లాసులోని బ్రందినో, విస్కినో చప్ప్రిస్తున్నారు.

    "అయితే వాడు రేపు బ్యాంకులోంచి  మరో లక్షరూపాయలు తిస్తాడంటావా డేవిడ్?" అన్నాడు వాళ్ళలో ఒకడు.

    "ఎందుకు తియ్యడు? చచినట్టు తిస్తాడ్రా... లేకపోతే మనం వాళ్ళబ్బాయిని చంపేస్తామని చెప్పాంగా?" అన్నాడు డేవిడ్ అన్నవాడు.

    ఆ రౌడిలిద్దరు సంభాషణ మీద జాగ్రత్తగా చెవేసి ఉంచారు చిత్తబ్బి , కన్నరావులు.
    "ఊ...అయితే రేపు మన చేతుల్లో మూడు లక్షలుంటుందన్న మాట!!..." హుషారుగా అన్నాడు మొదటివాడు.

    "మరేమనికున్నావ్?" అన్నాడు కాలర్ సవరించుకుంటూ డేవిడ్.

    "ని బొంద... అలా కాలర్ సవరించుకుంటావేం అదేదో మీ ఘన కార్యం అయినట్టు!... ఆ జనరల్ స్టోర్స్ లో ఆ సన్నాసులిద్దరూ ఫోన్ లో మాట్లాడుతుంటే విని ఐడియా చెప్పింది నేను... ఈ జాన్ ప్లాన్ వేస్తే దానికి తిరుగులేదు తెల్సా?" అన్నాడు మొదటి రౌడి.

    "అయితే వీళ్ళిద్దరి  పేర్లూ జాన్ డేవిడ్ అన్నమాట!" మెల్లగా అన్నాడు కన్నారావు.

    "వీళ్ళ మాటల్ని బట్టి చూస్తే పండుని వీళ్ళు ఏమి చేసినట్ట్రు లేదు... అన్నట్టు  వీళ్ళు మూడు లక్షలని అంటాంరెం?" సందేహంగా అడిగాడు చిట్టబ్బాయి.

    "బాగానే వుంది... మనం రెండు లక్షలు డిమాండ్ చేశామని వీళ్ళు కూడా అంతే దింమాద్ చేయాలనీ లేదుగా!... వీళ్ళు మూడు లక్షలు డిమాండ్ చేసినట్టున్నారు!..."

    "ఠాప్ !...."

    ఉన్నట్టుండి టేబులుమీద అయిన శబ్దానికి ఉలిక్కిపడ్డారు ఇద్దారూ.

    టేబులు మీద రెండు గ్లాసుల్లో లిమ్కా రెడీగా ఉంది. బేరార్. ఓసారి ఇదరి వంకా కోరగా చూసి వెళ్ళిపోయాడు.

         "చూడు విడి పొగరు.. లిమ్కా గ్లాసుల్ని ఎంత విసురుగా పెట్టాడో టేబులు మీద" అన్నాడు కన్నారావు.

    "మనం వట్టి లిమ్కానే ఆర్డరు చేశామని అలా విసురుగా పెట్టాడు గ్లాసుల్ని... అయినా మనం లిమ్కా తాగివేల్తాం లేదా వట్టి మంచినీళ్ళు తాగి వెల్తాం... విదికేందుకు బాధ? వీడే ఈ బార్ కి యజమాన్తేనట్టు!!" అన్నాడు చిట్టబ్బాయ్ లింకా గ్లాసుని అందుకుంటూ.

    "మనం కోళ్ళూ కుక్కలా మేసి బ్రాంది విస్కిలూ తాగి పెద్ద బిల్లు చేస్తే  వాడికి టిప్పు  ఎక్కువ దొరుకుతుందిగా ...అది వాడి బాధ..."

    ష్...ష్ ...వాళ్ళు ఎంటో మాట్లడుతున్నారు... విందాం" మెల్లగా అన్నాడు చిట్టబ్బాయ్.

    ఇద్దరూ జాన్, డేవిడ్ లు మాట్లాడే మాటల్ని జాగ్రత్తగా వినసాగారు.

    "ఈ వేళా కాస్త ఎక్కవ పెగ్గులు తాగాల్సి వచ్చేలా ఉంది...."అన్నాడు జాన్.

    "గుర్రం ఆట అని దొంగాటని చంపుకు తిన్నాడు కుర్రవెధవ. ఒళ్ళు పులిసిపోయింది...."

    చిట్టబ్బాయ్ కి నవ్వొచ్చి కిసుక్కున నవ్వాడు.

    "ఎంటానవ్వు.. వాళ్లు వింటారు..."మెల్లగా మందలించాడు కన్నారావు.

    రౌడీలు మాటలు ఆపి మెల్లగా గ్లాసులోది  ఖాలీ చేయసాగారు.

    చిట్టబ్బాయ్, కన్నరావులు కూడా కూల్ డ్రింక్స్  తాగేసారు.

    బేరార్ బిల్లు తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. డబ్బుల కోసం వాళ్ళ ముందు  నిల్చున్నాడు.

    "కాస్సేప్తేన తరువాత రా" అన్నాడు చిట్టబ్బాయ్.

    "మీరలా ఊర్కే కూర్చోకూడదు సార్... వేరే కస్టమర్ల కోసం సీట్లు ఖాళి చేయాలి!" అన్నాడు బేరర్.

    "అలాగ్తెతే మరో రెండు లింకాలుతే..." అన్నాడు కన్నారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS