ఒక్కసారి ప్రేమించిన ఆడది అంత తేలికగా ద్వేషించలేదు రాబర్టు నువ్వేలాంటి వాడివైనా నీ జీవితంలో ప్రవేశించగల ద్త్యేరమూ, మనసు నాకున్నాయి" అది చిత్ర.
రాబర్టు ఆమె తలపైన చెయ్యి వేసి మెల్లగా నిమిరాడు.
"ఏ క్షణంలో ఉరికంబం ఎక్కవలసి వస్తుందో తెలీనిస్ధితిలో వున్నాను చిత్రా" అన్నాడు రాబర్టు ఉద్వేగంగా.
చిత్రా అతని మాటలకి ఉలిక్కిపడింది.
"ఏమిటి నువ్వనేది?" అంది.
"చూసేవా అప్పడే నీలో ఎంత కలవరం కలిగిందో అంతే చిత్రా నేను దురదృష్ట వంతుడ్ని చేయని నేరానికీ నన్ను హంతకుడిగా భావించి నా కోసం వెంటాడుతున్నారు పోలీసులు"
చిత్ర అతనికేసి చూస్తూ బేలగా వుండిపోయింది.
"నా అసలు పేరు విజయ్. రాబర్టు నా మారు పేరు పోలీసులకి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న వేరస్తుడ్ని" అన్నాడు ఆవేశంగా.
చిత్ర ఏడుస్తోంది అతని మాటలు విని.
ఆమెని ఓదార్చాలన్న ధ్యాసకూడా అతనికి కలగలేదు.
"నువ్వసలు మా కెందుకు తారసపడ్డావ్? మాకు ఎండుకంత మానసిక సంక్షోభాన్ని కలిగించి పారిపోవాలనుకుంటున్నావు. ఇవన్ని ముందే తెలిసిన వాడివి ఎందుకిలా చేశావ్? వంచన తప్పని నీ మన స్సాక్షి నీకు చెప్పలేదా? నువ్వు మోసగాడివి వంచాకుడివి" అని చిత్ర తనని దూషిస్తున్నట్టుగా ఫీలయ్యాడు రాబర్టు.
"రాబర్టు" పిలిచింది చిత్ర.
"ఏమిటి?"
"నువ్విన్ని మాటలు చెప్పావు అయినా నా మనసు రాజీపడడం లేదు. నువ్వే కావాలంటోంది. నన్నేం చేయ్యమంటావో చేప్పు లేక పోతే నాకింత విషం ఇవ్వు. బతికి శాంతిలేదు. చస్తే అన్నా నిన్ను మరచి పోగాలనేమో ప్రయత్నిస్తాను" అంది చిత్ర.
రాబర్టు చిత్రంగా నవ్వాడు.
"మేరీ చచ్చిపోయి . ఏంసాదించింది చిత్రా. మనిషి చచ్చిసాధించేది ఏమిలేదు ఆ మాట కొస్తే నేనేనాడో చావాల్సింది. కాని పగ పట్టిన పాములా బతికున్నాను ఏదో ఒకనాడు ఆ ఆగంతుకులు నా కళ్ళబడక పోరన్న ఓ నమ్మకం నన్ను బతికిస్తోంది. సమస్యకి పరిష్కారం చావు కాకూడదు చిత్రా!"
"అయితే బతుకుతూ ప్రతి క్షణం చావమంటావా రాబర్టు."
"నువ్వు మనసుని అదుపులో పెట్టుకో చిత్రా తండ్రి దుఃఖాన్ని పోగొట్టడం ఏ ప్రస్తుత కర్తవ్యం" అన్నాడు రాబర్టు.
"అదే రాబర్టు ఆడదానికి మగవాడికి తేడా నువ్వు చాలా తేలికగా చెప్పెశావు కానీ అదెంతవరకూ ఆచరణలో పెట్ట లానో కూడా నీకు తెలుసు ఏమో నేను అక్కలాగే పోతానేమో!" అతని కాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తోంది చిత్ర.
అంతలో జోసఫ్ ఇంటికి వచ్చాడు. చిత్రకి అక్క గుర్తుకొచ్చి ఏడుస్తుందనీ అనుకున్నాడు జోసఫ్.
జోసఫ్ ఇంట్లో సామాను సర్డుకోడానికి మౌనంగా సాయపడ్డాడు రాబర్టు లగేజ్ నీ ట్రాన్స్ పోర్టు చేసి ఆ సాయంత్రం గోదావరి ఎక్స్ ప్రెస్ కి వాళ్ళని ఎక్కించడానికి వెళ్ళాడు రాబర్ట్.
ఆ విధమ్తెన పరిస్ధితిలో ఆ వూరుతో అన్ని బంధాలని తెంచుకొని వెళ్ళిపోవల్సి వస్తుందనుకొని చిత్రకి మాట్లాడితే ఏడుపు ముంచు కోచ్చేలా వుంది.
కిటికీ పక్కనే కూర్చుని సుడులు తిరుగుతున్న కన్నీటి కళ్ళతో అతన్నే చూస్తోంది చిత్ర.
జోసఫ్ ర్తెలు దిగి, ఇప్పడే వస్తానని వెళ్ళడంతో చిత్ర అతని చేతిని తన చేతిలోకి తీసుకోంది.
రాబర్టు పాట్ పాదమ్మిద నించొని ఆమెకేసి చూశాడు.
"రాబర్టు!"
"చెప్పు"
"నన్ను మరచిపోతావా?" అడిగింది.
"లేదు" అతని గొంతు బొంగురుపోయింది.
చిత్ర కన్నీళ్ళతోనే నవ్వింది.
"కనిసం ఈ మాటలన్నా నాకిష్టమయిన జవాబు ఇచ్చావు. ధాంక్యూ రాబర్టు" అంటూ అతని చేతిని పెదవుల దగ్గరకి తీసుకొని ముద్దు పెట్టుకుంది చిత్ర.
జోసఫ్ వచ్చాడు.
ర్తేలేక్కి కూతురి పక్కనే కూర్చుని .
"బాబూ రాబర్టు! ఏనాటి బుణమో, మనల్నీ విధంగా కలిపింది. నువ్వెంతో దగ్గరవుతాను ఆశపడ్డాను. కానీ ఆఖరికీ విధంగా విడిపోతున్నాం నీ కేప్పడన్నా మేం గుర్తు కొస్తే అక్కడికి రా బాబూ!" అన్నాడు.
"అలాగే" అన్నాడు.
"వస్తావా?" అడిగింది చిత్ర.
బతికి వుంటే అని మనసులో అనుకుని "ఊ" అన్నాడు.
ర్తెలు కదిలింది.
ర్తెలుతోపాటే ప్లాటుఫారమ్మీద కొంతదూరం నడిచాడు రాబర్టు.
చిత్ర కన్నీళ్ళతో చెయ్యి వూపుతోంది. అతనికి ర్తేలుకీ మధ్య దూరం పెరిగిపోతోంది.
రాబర్టు అక్కడే నిలబడిపోయాడు.
అతనికి ఆడదానిలా బోరుమని ఏడవాలనుంది.
మనసుని దిటవు పర్చుకోడానికి ప్రయత్నిస్తూ మెల్లగా స్టేషన్ బయటకి నడిచాడు.
అతనికి నీరసంగా వుంది. కళ్ళు బాగా లోపలికి పీక్కుపోయినాయి. విపరీతమ్తెన తలనొప్పిగా వుంది.
నాంపల్లి స్టేషన్ సమీపంలో వున్న బార్ లోకి నడిచాడు రాబర్టు.
* * *
