Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 37

    "దీనమ్మ కడుపుమాడ.... అప్పుడే ఇంత టైమైందా? నేనింక వెళ్తాను బాబోయ్!" అంటూ సోపాలోంఛి లేచి నిలబడింది.

    రాజీ కూడా లేచి నిలబడింది.

    "అప్పుడే వెళ్ళి పోతున్నందుకు ఏమీ అనుకోకేం?" అంది సత్యవతి.

    ఏమైనా అనుకోకుండా.... అసలు ఎప్పుడేళ్తావో అని ఎదురు చూస్తుంటెను అనుకుంది రాజీ మనసులో.

    "ఏం లేదు మా అయన వచ్చే టైం అయ్యింది. గబగబ రెడీ కావాలి. ఎక్కడైనా బయట అలా అలా తిరిగి ఏదైనా రెస్టారెంట్ లో తిని యింటికొచ్చేద్దాం అని అన్నారు. వదమ్మ కడుపు మాడ ఆ రెస్టారెంట్ వాళ్ళు దోచుకుంటారండీ బాబూ! మీకేం కావాలో చెప్పండి నేనే వండి పెడతానంటే వినరు... వస్తానేఁ?" అని ముందుకు కదిలింది సత్యవతి.

     నీ అమ్మకడుపు మాడ... నువ్వెంత అదృష్టవంతురాలివే! ఒండు కూడా మీ ఆయనలాగా వుంటే మకిన్ని గొడవలు వచ్చి వుండేవా? అనుకుంది రాజీ ఆమెని ఫాలో అవుతూ.

    గుమ్మందాకా వచ్చి ఆగి వెనక్కి తిరిగి అయన కనిపించటంలేదేం?"

    సత్యవతి ప్రశ్నకి రాజీ వుల్లిక్కిపడింది.

    "ఓ... అదా? మరేంలేదు. అయన ఆఫీసు పనిమీద క్యాంపు వెళ్ళారు" తడబడుతూ చెప్పింది.

    "అబ్బో... నువ్వు గనక మే ఆయన్ని క్యాంపు కు పంపించావ్. నేను మా ఆయన్ని వదలి అస్సలు వుండలేను బాబూ! దానిమ్మ కడుపుమాడ క్యాంపు లేదూ.... గీంపు లేదూ... ఇక్కడే పది వుండండి అని ఆయనకి తెగేసి చెప్పేస్తా...ఇంకోస్తాను" అని గుమ్మంలోంచి బయటకి వెళ్ళింది సత్యవతి.

    రాజీ హాల్లోనే ఆగిపోయింది.

    ఇంటి  బయట...రాంపండు కౌపండ్ వాల్ మీదుగా తల కాస్తా పైకిపెట్టి చూశాడు. వీధి గుమ్మంలోంచి సత్యవతి రావడం కనిపించింది. కానీ మే వెనకాల రాజీ రాలేదు.

    పాపం! రాజీ ఎలా వుందో, ఏంటోనని ఒక్కసారి ఆమెను చూసి వెళ్దామని మనసు పీకి ఆఫీసు నుండి ఆటోలో యింటికి వచ్చాడు రాంపండు. ఇంటి బయటినుండే  ఆమెను ఒక్కసారి చూసి వెళ్ళిపోదామని అతని తపన.

    ఈ రాజీ బయటకి రాదేం? ఇప్పుడు రాజీ తలుపేసుకుని లోపలే వుండిపోతే ఆమెని ఎలా చూడాలి? అనుకున్నాడు.

    సత్యవతి కాంపౌండ్ వాల్ గేటు కేసి గబగబా రాసాగింది.

    "బాబోయ్ ఈమే వచ్చేస్తోంది! నన్నిలా నక్కి వుండటం చూస్తె బాగుండదు అనుకుని తల క్రిందకి దించి అటు ప్రక్కకి తిరిగాడు రాంపండు.

    సత్యవతి గేటులోంచి బయటకి వచ్చి అటుప్రక్కకి తిరిగి వాళ్ళింటివైపు వెళుతున్నదల్లా ఎందుకో అనుమానం వచ్చి కుడి ప్రక్కకి తిరిగి చూసింది. రామప్మ్డు ముందుకు వంగి అటు వైపుకి తిరిగి వుండడం ఆమెకి కనిపించింది.

    "ఏటండీ అన్నయ్య గరూ..." అంది సత్యవతి రాంపండు ఉద్దేశించి.

    అతని గుండెల్లో గుభేల్ మంది.

    "ఇది చూసిందా? నా ఖర్మ!!" అనుకుంటూ తిన్నగా లేచి నిలబడి సత్యవతి వైపు తిరిగి హిహి అంటూ యిబ్బందిగా నవ్వాడు.

    "ఏంటీ దాక్కుంటునట్టు అలా వంగి నిల్చున్నారు?" అడిగింది.

    తను గతుక్కుమన్నాడు.

    'దాక్కోడామా? హహహ...నేను ఎందుకు దాక్కుంటాను..... ఇక్కడ పదిరూపాయల నాణెం పడిపోతే వంగి  వెతుకుతున్నాన్నమాట. హహహ అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ.
 
    సత్యవతి అతనివంక ఆశ్చర్యంగా చూసింది.

    "అదేంటి పది రూపాయల నోటు వుంటుందిగానీ నాణెం ఎందుకుంటుందీ?"
 
    "అదే నేనూ ఆలోచిస్తున్నా... నిజమే కదూ? అయితే నోటే అయి వుంటుంది... ఎక్కడ పడిపోయి వుంటుందబ్బా?" గుటకలు మింగుతూ వంగబోయాడు రాంపండు.

    "అన్నట్టు మీ ఆవిడా మీరు క్యాంప్ కి వెళ్ళినట్టు చెప్పిందే?" మరో ప్రశ్న గుప్పించింది సత్యవతి.

    "అవునవును! రాజీ నిజమే చెప్పింది. నేను క్యాంప్ కి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చా... ఇంతలో పది రూపాయల నాణెం... అదే... నోటు పోయి వెతుకుతుంటే మీరు చూశారు హిహి"

    "మరి సూత కేసు ఏది?"

    "సూత కేసు అక్కడే వూళ్ళో వదిలేసి వచ్చానాన్నమాట!! రాజీని చూడాలని అనిపించింది వచ్చాను.... మళ్ళీ నేను వెళ్ళిపోవాలి!" అన్నాడు రాంపండు కంగారుగా.

    బయట సత్యవతి గొంతు వినిపిస్తూడడంతో ఎవరితోనబ్బా  మాట్లాడుతుంది అని చూడ్డానికి బయటకి వచ్చింది రాజీ.  రాంపండుని చూసిన రాజీ ఒక్కక్షణం తెల్లబోయింది.

    "మీ ఆయన! క్యాంప్ నుండి వచ్చారు" అదో మాదిరిగా చూస్తూ ఆమెతో అని ముందుకు కదిలింది సత్యవతి.
    రాంపండు రాజీ వంక చూసి యిబ్బందిగా నవ్వాడు.

    "ఏం అనుమానంరా బాబూ! క్యాంప్ కి వెళతానని చెప్పి దొంగచాటుగా వచ్చి గనిస్తున్నాడు. ఇలాంటి అనుమానం మొగుళ్ళుంటే కష్టమే" అనుకుంటూ వెళ్ళిపోయింది సత్యవతి.

    ఆమె మాటలు అతని చెవిన పడనే పడ్డాయి.

    "రా.... అక్కడే నిలబడిపోయావేం?" అంది రాజీ రాంపండుని  ఉద్దేశించి. అతను కాంపౌండ్ లోంచి  లోపలకి వెళ్ళాడు.

    "బాగున్నావా రాజీ?" ఆమెని మెల్లగా అడిగాడు. ఆమె తల వూపింది.

    "నువ్వు?" అడిగింది.

    "ఏదోలే ఇలా..."

    "అయినా అక్కడ తచ్చాడుతూ ఏం చేస్తున్నావ్... ఆ సత్యవతి ఏం అనుకుంటుంది?" అంది ఆమె.

    "నిన్ను చూడాలనిపించి వచ్చాను" అన్నాడు అతను.

    ఆమె ఏదో అనబోయింది?" అంది ఆమె.

    "నిన్ను చూడాలనిపించి వచ్చాను" అన్నాడు అతను.

    ఆమె ఏదో అనబోయింది. కానీ అంతలోకే  ఓ స్కూటర్ వాళ్ళింటి ముందు ఆగింది. దానిమీంచి దిగారు విశ్వం రాంపండుని.

    "బాగానే వున్నాను" అన్నాడు రాంపండు.

    రాంపండూ, విశ్వం కాలేజీలో క్లాస్ మేట్స్. మూడు నేల్లకో, ఆర్నెల్లకో వాళ్ళు వీళ్ళింటికీ, వీళ్ళు వాళ్ళింటికీ వెళ్ళి వస్తుంటారు.

    అందరూ హలో కూర్చుని కబుర్లు వేసుకున్నారు. రాజీ వాళ్లకి కాఫీ, టిఫిను అందించింది.

    వాళ్ళతో మాట్లాడుతున్నాడేగానీ రాంపండు మనసు మాత్రం వేరే ఆలోచిస్తూ వుంది.

    వాళ్ళు వెళ్ళిపోయాక మీరు లేక నాకు చాలా బోర్ కొడ్తుంది. మిమ్మల్ని చాలా మిస్ యింటికి ఎప్పుడైనా రావచ్చు... ఇది మీ ఇల్లు! దాని డబ్బులు దానికిచ్చేసి మిమ్మల్ని తెచ్చుకుంటా. ఇలా రాజీ తనతో అంటుందని రకరకాలుగా వూహించుకున్నాడు అతను.

     రాత్రి తొమ్మిది గంటలైంది.

    "ఇంకా వెళ్తామోయ్!" అంటూ లేచాడు విశ్వం. అతనితోబాటు అందరూ లేచి నిలబడ్డారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS