చిట్టబ్బాయి సందేహించాడు.
"అలా దేభ్యం మొహమేస్కుని చూస్తావేం? వాళ్ళు లోపల రెండు గంటలు తాగుతూ కూర్చుంటే మనం బయట నిలబడాలా?" విసుగ్గా మొహం పెట్టి అన్నాడు కన్నారావు.
"నా భాద అదికాదు... బార్లో దూరేంత డబ్బులేమి లేవు నాదగ్గర, ఉన్న డబ్బులన్నీ ఆ పండుగాడికి ఐస్ర్కిమ్ లూ , పోట్లాలూ కొనడానికే అయిపోయాయి."
"బార్లో దూరినంత మాత్రాన మనం చికెన్ సిక్స్ టి ప్తేవ్ లూ, జింజర్ చికెన్ లూ, బిర్యానీలు తినాలనేం లేదు. ఏ కుల్ డ్రింకో ఆర్డరు చేద్దాం..."
"వట్టి కూల్ డ్రింకు తాగి అంతసేపు బార్ లో కూర్చుంటే బాగుంతుండంటావా?" సందేహంగా అడిగాడు చిట్టబాయి.
"బాగుండదు. కాబట్టి కూల్ డ్రింక్ తాగేసి బయటికి వచ్చేసి ఇక్కడే నిలబడి ఎదురు చూద్దాం.. ఎవడ్రావీడు ప్రతిదానికి సందేహిస్తాడు? పద" చిట్టబాయి విపుమిద చెయ్యి పెట్టి ముందుకు తోశాడు కన్నారావు.
8
పండు ఆ గదిలో పిచ్చిపట్టినట్లు అటూ ఇటూ తిరుగుతున్నాడు.
అప్పటికి ఒక గంట నుండి వాడు తారాస్ధాయిలో ఏడ్చి ఏడ్చి అలసిపోయాడు.
అలా ఏడ్చి ఇంక ప్రయోజనం లేదని తెలిసి ఊర్కున్నాడు.
చిన్నపిల్లలు అంతే... దేనికోసమ్తెనా పేచిపెట్టి ఏడిస్తే తల్లిదండ్రులు కొనిస్తారని అనుకుంటే అలా ఏడుస్తూనే ఉంటారు కొనిచ్చేదాకా. ఏడ్చినా లాభం లేదని అనిపిస్తే ఏడవడం మానేస్తారు.
పండుకూడా అంతే. గట్టిగా ఏడిస్తే ఎవర్తెనా జాలిపడి గది తలుపులు తిసి తనని బయటికి పంపిస్తారని ఆశపడ్డాడు. కాని ఆ ఇంట్లో ఎవరూ లేరని అనిపించింది, ఏడుపు మానేశాడు. కాస్సేపు దిగులుగా మంచం మీద కూర్చుని ఆ తరువాత గదిలో అటూ ఇటూ తిరగసాగాడు.
"వెధవ సంత...మాయదారి సంత...ముదనష్టపు సంత, వెధవల్ని తంతే వెళ్ళి సంతలో పడ్తారు." ఉక్రోషంగా తిట్టుకున్నాడు పండు.
అప్పడప్పడూ తిట్టడంలో తండ్రిని అనుకరిస్తూంటాడు పండు.
"మొదట రిక్షాలో తీసుకెళ్ళిన వాళ్లు చాలా మంచివాళ్ళు. నాకు అడిగిన వాణ్ణి కొనిపెట్టారు. నాకు నిద్రొచ్చి నిద్దరోయాక వాళ్లు ఎక్కడి కెళ్ళిపోయారో యెంటో, ఈ శనిగాళ్ళు నన్నెందుకు తిసుకోచ్చారో యెంటో. వెధవలు ఎద్తేనా అడిగితే విసుక్కుని చస్తున్నారు. మాయదారి సంత కాసిన్నే కొనిపెట్టారు. పోనీ నన్నేమ్తేనా ఆటలాడిస్తారా అంటే అయిదు నిముషాలు ఆడించి నడ్డి నొప్పని అంటారు. పోనీ దొంగాట ఆదించండిరా అంటే మేం పరిగేత్తలేం నోర్ముస్కో అంటారు. మొదట తిస్కెళ్ళిన వాళ్ళే మంచోళ్లు! - ఈ వెధవలు ఏమ్తెనా అడిగితే నోర్మూస్కోమని కత్తి చూపించి చంపేస్తామని బెదిరిస్తున్నారు దొంగా వెధవలు!! ఆ - ఆ - చంపితే పోలీసులు ఊర్కుంటారా? వెధవల్ని నడ్డి విరక్కొట్టి జ్తేల్లో పారేస్తారు. అప్పుడు తిక్క వాడుల్తుంది!! ఈ సన్నాసి వెధవలు గదిలో పెట్టి ఇంటికి తాళం వేస్కుని వెళ్ళిపోయారు, మళ్ళి ఎప్పడోస్తారో యెంటో? ఆకలేస్తుంది. నాకు భోజనం పెడ్తారో,పెట్టారో? ఇంట్లో అయితే చక్కగా టి.వి.లో ప్రోగ్రాములు చూపిస్తూ అక్క వేడివేడి అన్నంలో నెయ్యేసి మెత్తగా కలిపి తినిపిస్తుంది. వీళ్ళు నన్ను ఇంటికి ఎప్పుడు తిస్కెళ్తారో ఎంటో? అసలు నన్ను ఇంటికి తిస్కెళ్తారా అని?
ఇలా ఆలోచిస్తూ గదిలో అటూ ఇటూ తిరగసాగాడు పండు.
ఉన్నట్టుండి మంచంకింద ఎదో కదుల్తున్నట్టు చప్పుడు కాసాగింది.
పండుకి భయంవేసింది.
గబగబా మూలకి పరుగెత్తి మంచంవ్తెపు కళ్ళు పెద్దవిచేసి చూసాడు. మంచం కిందికి వంగి చూడాలంటే వాడికి భయం వేసింది.
మంచం కింద శబ్దం మరి పెద్దదయింది.
పండు ఇంకా మూలకి జరిగి ముడుచుకుపోయి నిల్చున్నాడు. వాడి చూపులన్నీ మంచం వ్తేపే వున్నాయి.
హఠాత్తుగా మంచం కింది నుండి ఒక ఎలక, దాన్ని వెంబడిస్తూ ఒక పెద్దపిల్లి పరుగెత్తుకుని బయటికి వచ్చాయి.
పిల్లి ఎలుక గదంతా గజిబిజిగా పరుగెత్తసాగాయి.
ఓసారి ఎలక పండు కాళ్ళ మధ్య నుండి రివ్వున పరుగెత్తింది. పిల్లి పండు కాళ్ళని రాసుకుంటూ పరుగు తీసింది. భయంతో కెవ్వుమని అరిచాడు పండు.
అవి అలా ఒక నిమిషంపాటు పరుగులేసాక పిల్లి లటుక్కున ఎలాకని తన కాలితో నిక్కిపత్తి తరువాత దాని పికని నోటితో కరిచిపట్టుకుంది. ఎలక పిల్లి నోటిలో గిజగిజ కొట్టుకుంది.
కొన్ని క్షానాల తరువాత దానిలో చలనం ఆగిపోయింది. ఎలక తలని మెల్లగా కొరుకుతూ చప్పరించసాగింది పిల్లి. ఎలక శరీరం నుండి బొట్లు బొట్లుగా నేలమీదికి రక్తం కారసాగింది.
"ఏయ్.. ఛి ఛి"
అసహ్యంగా చూస్తూ పిల్లిని అదిలించాడు అపండు. పిల్లి నోటిలో ఎలాకని పట్టుకునే గదిలోంచి పరుగుతిసి చెంగున కిటికీ మీదికి ఎగిరి కూర్చొని ఓ క్షణం పాటు అక్కడ నుండి పండుని చూసి ఆ తరువాత కిటికీ ఊచల్లోంచి బయటికి దూకి వెళ్ళిపోయింది.
పండు మెల్లగా కిటికీ దగ్గరికి వచ్చాడు. కిటికీలోంచి బయటికి చూడడానికి వాడి హ్తెటు సరిపోలేదు, గదిలో ఓ పక్కగా వున్నా స్టూలు వాడి దృష్టి ని ఆకర్షించిది. ఆ స్టూలు తిసికోచ్చి కిటికీ దగ్గరవేసి దానిమీద ఎక్కిబయటికి చూశాడు.
9
బార్ లోకి అడుగు పెట్టగానే అక్కడ డిమ్ ల్తేట్లు ఉండడం చేత కళ్ళకి కాస్సేపుదాకా ఏమి కనిపించలేదు చిట్టబ్బాయి కన్నరావులకి. అందరూ మసక మసకగా నిడల్లా కనిపిస్తున్నారు వాళ్ళ కళ్ళకి. కాస్సేపు గుమ్మం దగ్గరే నిలబడ్డారు. ఒక నిముషం తరువాత ఆ మసక చీకటి కళ్ళకు అలావాటుయింది.
ఇప్పుడు మనుషులు స్పష్టంగా కనిపిస్తున్నారు.
"అదిగో. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చున్నారు!" వాళ్ళని చూపించాడు కన్నారావు.
చిట్టబ్బాయి గబుక్కున కన్నారావు చేతిని అందుకుని కిందికి దించి వెళ్ళని గట్టిగా పట్టుకుని విరిచేశాడు.
"హమ్మోయ్..." బాథగా అన్నాడు కన్నారావు.
"నువ్వేమ్తేనా విరగ్గోట్టదల్చుకుంటే వాళ్ళని విరక్కోటాలి! నా వెళ్ళు విరుస్తావేం?" కోపంగా అన్నాడు కన్నారావు.
"మరి వాళ్ళకి అనుమానం కలిగేలా వాళ్ళ వంక చేయెత్తి చూపిస్తావేం?..." పళ్ళు కొరుకుతూ అన్నాడు చిట్టబ్బాయి.
కన్నారావు చేయెత్తి వెళ్ళని ఊదుకోసాగాడు.
అక్కడ పక్కనే ఉన్న టేబులు దగ్గర కూర్చుని "నువ్వు కూడా కూర్చో" అన్నాడు కన్నరావుతో చిట్టబ్బాయి.
కన్నారావు చిట్టబ్బాయ్ జబ్బ పట్టుకుని విసురుగా లేపాడు.
"ఎక్కడ కుర్చీ ఖాళీగా కనిపిస్తే అక్కడ కూర్చోడమేనా?" పళ్ళు బిగబట్టి అన్నాడు కన్నారావు.
"మరి ఎక్కడ కూర్చుందామాంటావ్?"
"వాళ్ళ పక్క టేబులు దగ్గర కూర్చుందాం"
"అమ్మో!... వాళ్ళు మనల్ని చూస్తారుగా!!"
"చూస్తే ఏమ్తేంది? వాళ్లు మనల్ని గుర్తుపట్టారు. మధ్యాహ్నం మనం మారువేషాల్లో ఉండగా వాళ్ళు మనల్ని చూసారు...పద" అంటూ అడుగులు ముందుకు వేసాడు కన్నారావు.
చిట్టబ్బాయి బితుకు బితుకుమంటూ కన్నారావుని అనుసరించాడు.
ఇద్దరు ఆ రౌడిల టేబుల్ కి పక్క టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్లు ఇలా కూర్చోగానే అలా ఒక బేరార్ పరుగెత్తుకుంటూ వచ్చాడు.
"సార్! ఈ టేబులు దగ్గర మీరు కూర్చోకూడదు సార్!!" అన్నాడు వాడు.
"మరి ఎక్కడ కూర్చోవాలి?" అడిగాడు చిట్టబ్బాయి.
"అక్కడ కూర్చోండిసార్!" నాలుగు టేబుళ్ళ అవతలి టేబుల్ చూపించాడు.
"మాకిక్కడే బాగుంది!... మేమిక్కడే కూర్చుంటాం" అన్నాడు కన్నారావు
"కాద్సార్!... మిరక్కడే కూర్చోవాలి!!" అన్నాడు బేరార్.
"ఇక్కడున్న టేబుళ్ళన్ని ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోమంటావెం?" విసుగ్గా అన్నాడు చిట్టబ్బాయ్.
