Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 36

 

     ఆయన మాట నిజమే .

    ఈ పరిస్ధితిలో చిత్ర అతని దగ్గర వుండటం చాలా మంచిది.

    "ఇప్పడే వస్తా బాబూ" అని జోసఫ్ బయటికి వెళ్ళాడు.

    చిత్ర రాబర్టుకి కాఫి ఇస్తూ అంది.

    "విన్నావుగా నాన్నా నన్ను తీసుకెళ్ళి పోతాడుట."

    "ఉ!" అన్నాడు రాబర్టు కాఫి తాగుతూ.

    "నీకేం అనిపించడంలేదా?" అడిగింది అతని కాళ్ళ దగ్గరే కూలబడిపోతూ చిత్ర.

    "దేనికి?" అడిగాడు.

    చిత్ర అతని కళ్ళల్లోకి జాలిగా చూసింది.

    "రాబర్టు"

    "ఉ"

    "నువ్వు నన్ను పెళ్ళి చేసుకోలేవా?"

    రాబర్టు కోపంగా చూశాడు.

    అక్క చచ్చిపోయి ఇరవ్తేనాలుగు  గంటలు కాలేదు తన పెళ్ళి గురించి అడుగుతోంది, ఎంత స్వార్ధం దీనికి?" అనుకున్నాడే కానీ, ఆమె గుండెల్లో అతని పట్ల ఆమెకిగల  ఆరాధన గురించీ ప్రేమ గురించీ  అతనికి తేలిక పోయింది అసలు  ఆమె గుంరిచి  మరో  విధంగా ఆలోచించడానికి కూడా అతను ప్రయత్నం చెయ్యలేదు.

    "చెప్పు రాబర్టు  నన్ను పెళ్ళి చేసుకోవా?" మళ్ళి అడిగింది చిత్ర.

    "నిన్నా?" కర్కశంగా అన్నాడు రాబర్ట్ .

    "నన్ను  పొందిన  దానికి పరిహరంగా నిన్నీ కోరిక  నేను కోరడంలేదు రాబర్టు నిన్నోడలి నాన్నతో వెళ్ళాలని  లేదు" అంది  కన్నీళ్ళతో చిత్ర.

    "నన్ను విసిగించకు" అన్నాడు రాబర్టు సిగరెట్ వెలిగిస్తూ.

    "నిన్ను విసిగించాలని నా ప్రయత్నం కాదు రాబర్టు."

    తెల్లవార్లు అదే పనిగా సిగరెట్లు కాల్చడం చేత నోరంతా చెదు గానూ, మంటగానూ వుందతనికి.

    "అయితే  నేనేం చెయ్యను?"

    చిత్ర బాధగా అంది.

    "నాది స్వార్ధమని నువ్వును కొంటున్నావు. అవకాశవాదినని నువ్వు అపోహపడుతున్నావు. నువ్వనుకునెంత నీచురాల్ని కాదు నేను అక్కబతికే వుంటే ఏమో నువ్వు  తనని చేసుకొనే వాడివేమో!

    అప్పుడు నా జీవితం నీతో ముడిపడకపోయినా నువ్వు నా కళ్ళ ముందే  వుండే వాడివన్న  తృప్తితో ఆనంద పడేదాన్ని నిన్ను కోరుకున్నానే కానీ అక్క జీవితానికి అడ్డు రావాలని ఆమె బతుకులో నిప్పులు పోయాలని నేనేరోజునా అనుకోలేదు రాబర్టు ఇప్పుడు నువ్వా సాలు  నాకు కనిపించవనే ఓ భయం  నన్ను వేదిస్తూంది నువ్వు కనబడక పోతే నేను జీవించలేను రాబర్టు" అంది అతని కాళ్ళ పైన పడి ఏడుస్తూ చిత్ర.


    రాబర్టు  ఆమె మాటలకి  కరిగిపోలేదు  జాలిపడలేదు ఆమెకి లొంగిపోలేదు.

    "చిత్రా!" గంభీరంగా పిలిచాడు రాబర్ట్.

    చిత్ర మెల్లగా తలెత్తి అతని మొహంలోకి  చూసింది.

    అతను వదిలిన  సిగరెట్ పొగ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసింది.

    "మేరీ ఎందుకు చచ్చిపోయింది నీకు తెలుసుకదూ!" అడిగాడు.

    చిత్ర మాట్లాడలేదు అతనేం  చెబుతాడో అని ఆమె కంఠం వణుకుతోంది.గుండెలు భారంగా ఎగిరిపడుతున్నాయి.

    "నువ్వు  సమాధానం  చెప్పలేవా" అడిగాడు రాబర్టు.

    చిత్ర తిరిగి అతని కాళ్ళపైన వాలిపోయింది.

    రాబర్టు అన్నాడు.

    "నువ్వు మాట్లాడనంత మాత్రంచేత నిజం తెలిదనీకాదు చిత్రా తప్పు కేవలం నీ ఒక్కదానిదే అని నీ పైన తోసేసే అంతఆడముడ్ని కాదు నేను రెండు చేతులు మోగిస్తేనే చప్పట్లు వినబడేది. నిన్ను నేనేరోజునా కోరుకోలేదు మేరీ బతుకిలా అవ్వాలని రాసిపెట్ట  మన మధ్య ఆ సంఘటన జరిగింది సారీ చిత్రా నన్ను మరచిపో" అన్నాడు స్ధిరంగా.

    చిత్ర తలెత్తి అతన్ని చూస్తూ జాలిగా అంది.

    "అంతేనా?"

    "నువ్వయినా నీ తండ్రిని జాగ్రత్తగా  చూడు చిత్రా" బాధగా అన్నాడు రాబర్టు.
 

    అతని గుండెల్లో గుబులుగా వుంది.

    నిజానికి జోసఫ్ తో చిత్ర వెళ్ళిపోతే  తను ఒంటరిగా మిగిలిపోతాడు.

    తనకెవరూ వుండరు.

    ఒంటరిగా పక్షిలా,  దిక్కులేని ఏ కాకిగా ఓ ప్రక్క, ఏ క్షణంలో ఏమవుతుందో అన్న భయంతో  మరోపక్క దొంగలా బతకాల్సిన పరిస్ధితులు.

    "నన్నింతేనా అర్ధం చేసుకొంది. ఆడది  కావాలని మగాడికి దగ్గరయితే  ఎప్పడూ లోకువే రాబర్టు"

    "నువ్వేలాగే అనుకోచిత్రా! కానీ నీకు తెలిదు నన్ను జేరాలని పెయత్నంచేసే వాళ్ళెవరూ నాకు మిగలడంలేదు. అది నా పాలిట శాపం చిత్రా ఈ సారి నేనే మిగాలకపోవచ్చు" అన్నాడు బాధగా .

    అతని మాటలకి చిత్ర జాలిగా నవ్వింది.

    "భయపడుతున్నావా రాబర్టు!"

    "అవును" అన్నాడు.

    "కానీ నాకు ఆ భయంలేదు నీ భార్యనని చెప్పుకొని బతికే ఒక్క రోజైనా   నాకు చాలు.

    "చిత్రా! ఏమిటి"

    "నీకు నా గురించీ నిజం  ఏమిటో తేలిసై నీ గుండె పగిలి పోతుంది నన్ను  సహ్యించుకొంటావు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS