"నాక్కూడా ఈ కట్నం కానుకలు అవీ యిష్టం వుండదు. నిజం చెప్పాలంటే మా ఆవిడా వాళ్ళు యిచ్చిన కట్నం తీస్కోవద్దని నేను మా అమ్మనాన్నల మీద మండిపడ్డాను. కానీ నే చెల్లిలికి లక్షలకి లక్స్ఝాలు కట్నం అడుగుతున్నారు. పోనీ దానికి కట్నం లేకుండా మంచి మొగుడ్ని తెసుకురా.... అప్పుడు నీకు కట్నం తీసుకోకుండా వెళ్ళి చేస్తాం అన్నారు. నేను ఇంకేం మాట్లాడను? అయినా ఈ పెద్దాల్లు చేసే పెళ్ళిళ్ళు ఇలా కత్నకానుకుల చికాకులు తప్పవు... నేను మాత్రం మా అత్తా, మామల్ని ఎప్పొదోఒ ఇది కావాలి, అది కావాలి అడగలేదు. వాళ్ళ సంతోషం కోద్దీఏదైనా పెడతానని అన్నా వద్దనే అన్నాను..." భుజాలు తడుముకుంటూ అన్నాడు రాంపండు.
"సర్లెండి! మీలా అందరూ మంచివాళ్ళు ఎక్కడ వుంటారు..." అంది వైష్ణవి.
"సారీ! టాపిక్ డైవర్ట్ చేశాను... చెప్పండి?"
ఆమె చెప్పడం మొదలు పెట్టింది.
"మా బావకి డబ్బాసే కాదు... వాడు పరమ శాడిస్టు. మా అక్కని నానాహింసలు పెట్టాడు. దాని ఇంటి మీద సిగరెట పీకలు అంటించి వాతలు పెట్టాడు. మా అక్క వాడికోసం వాడొచ్చి టైంలో గుమ్మంలో ఎదురు చూస్తూ నిల్చుంటే ఇక్కడ ఎవడికోసం నిల్చున్నావే అని అడిగేవాడు. తలలో మల్లెపూలూ పెట్టుకుంటే సానిదానా ఎంతా వేషాలు అనేవాడు. చల్లగాలికోసం కిటికీ దగ్గర నిల్చుంటే అక్కడ ఎవడున్నాడు అని అడిగేవాడు అదో కారణం చెప్పి మా అక్కని బెల్టుతో గొడ్డుని బాదినట్టు బాది అది ఏడుస్తుంటే అప్పుడు పశువులా వాడి వాంఛని తీర్చుకునేవాడు... వాడు పెట్టెహింసని తట్టుకోలేక మా అక్క విషం మింగి ఆత్మహత్య చేసుకుంది!" జీరపావుయిన గొంతుతో అంది ఆమె.
"ఓ... అయాం సారీ..." బాధపడుతూ అన్నాడు రాంపండు.
"మా అక్క అంత హ్గోరంగా మరణించేసరికి మా నాన్నగారు అదే రాజు హార్ట్ ఫేయిలయ్యి మరణించారు. మా అమ్మ బెంగతో మంచం పట్టి సంవస్తరం తరువాత నన్ను ఇమ్తరిదాన్ని చేసి వాళ్ళిద్దరినీ చేరుకుంది..." వెక్కుతూ అంది వైష్ణవి.
రాంపండు కరిగిపోయాడు.
"ఊర్కో... ఊర్కో...!" అంటూ ఆమె తల నిమిరాడు. నీకు నేనున్ననుగా అని అనాలనుకున్నాడు గానీ ఆ మాట అనలేకపోయాడు. కారణం అప్పుడతనికి రాజీ గుర్తొచ్చింది.
ఆమె కళ్ళు తుడుచుకుంది. రెండు నిమిషాలసేపు వాళ్ళమధ్య నిశ్చబ్దం!
"నువ్వు చెప్పిన దానికీ, మన ఎపిసోడ్ కీ నాకు సంభంధం ఏమీ కనిపించడంలేదు?" అన్నాడు అతను మెల్లగా.
"అదే చెప్పబోతున్నా! మా బావ అలాంటివాడు కావడం చేత నాకు మగజాతి మీద తీరని అసహ్యం ఏర్పడింది. మా కుటుంబం యిలా చిన్నాభిన్నం కావడానికి ఒక మగపురుగు అత్యాశ, వాడిలోని శాడిజం... వాడిలోని అనుమానం.... వదిలోని పైశాచికత్వం! అందుకే నేను పెళ్ళి చేసుకోకుండా ఇలా వుండిపోయాను. అలాంటి పరిస్థితుల్లో మీ ఆవిడా యిచ్చిన ప్రకటన చూశాను. దాన్ని చూడగానే నాలో ఓ వికృతమైన ఆలోచన వచ్చింది! ఎంత డబ్బుయినా పోనీ మిమ్మల్ల్ని కొనాలని నిర్ణయించుకున్నా. అదీ పెళ్ళి అనే తంతుద్వారా వేట్లే నేను లక్షలు డబ్బు ఖర్చుపెట్టింది కాకుండా నేనే ఒకరికి బానిసగా వెళ్ళాలి! ఇక్కడ పరిస్థితి వేరుగా వుంది. నేను లక్షలు ఖర్చుపెట్టి మిమ్మల్ని బానిసగా తేచ్చుకోవచ్చు...మిమ్మల్ని కొని మగజ్తి మీద నాకున్న అసహ్యాన్నీ మొత్తం మీ మీద తీర్చుకోవాలని అనుకున్నాన్. కాని అది నా వల్ల కాలేదు... కోపంలో మనం ఎన్నో అనుకుంటాం...ఒక్కొక్కప్పుడు ఓ మనిషిని చంపెయ్యలన్నంత కోపం వస్తుంది! కానే నిజంగా చంపే అవకాశం వస్తే మనం హత్య చెయ్యగలమా? పుట్టకతో మనకి అబ్బిన సంస్కారం, వివేకం ఎక్కడికి పోతాయ్? అదీ కాకుండా మీరు చాలా మంచివారిలా కనిపింగారు... ఆ రాజు రోడ్ మీద నన్ను డ్యాష్ కొట్టినప్పుడే మీ మొహంలోని అమాయకత్వం చూసి మగవాళ్ళతో ఎక్కడైనా అమాయకులుంటారా అని ఆశ్చర్యపోయాను! అంచేత ఒకందుకు నేను మిమ్మల్ని కొన్నా మీతో కాస్తా కూడా మిస్ బిహేవ్ చెయ్యలేకపోతున్నా."
"థాంక్యూ..." అన్నాడు రాంపండు.
"మీరు ఎంత మంచివారు కాకపోతే మీ ఆవిడ మిమ్మల్ని అమ్మడానికి సిద్దపడినప్పుడు నన్నమ్మడానికి నువ్వెవరే అని ఆమె మెడ వంచి నాలుగు గుద్దులు గుద్ది వుంటే ఆమె ఏం చెయ్యగలిగి వుండేది?"
నిజంగా అలా చేసి వుంటే బాగుండేది కదా? అని మనసులో అనుకున్నాడు రాంపండు.
"మిమ్మల్ని ఇలా నాకు అమ్మేసినందుకు మీ ఆవిడా మీద మీకు కోపంగా లేదా?" అడిగింది వైష్ణవి.
"ఎందుకు లేదూ....? నాకు కోపం వచ్చింది కాబట్టే మీతో వచ్చేశా?" ఉక్రోషంగా అన్నాడు అతను.
"మరి నా మీద...?"
"మీ మీద ఎందుకూ?"
"మిమ్మల్ని కొన్నందుకు!"
"ఇది వరకు కొద్దిగా ఏమైనా ఉండేదేమో గానీ మీ గురించి తెలుసు కున్నాక కోపం సంగతి అటుంచి మీ మీద గౌరవం పెరిగింది."
"నాకు మీ నుండి కావలసింది గౌరవం కాదు... ప్రేమ!"
రాంపండు ఉక్కిరిబిక్కరి అయ్యాడు. ఆమె అన్నదానికి ఊ అనలేదు, ఆ అనలేదు.
"మీకు యిక్కడ వుండడం ఇష్టం లేకపోతే మీ యింటికి వెళ్ళిపోవచ్చు... నేనేమీ అనను!" అంది వైష్ణవి.
"ఇంటికా? నేను అక్కర్లేదని అనుకున్న మనిషి యిటికి ఏ ముఖం పెట్టుకుని వెళతాను?" అనుకున్నాడు మనసులో.
"మరి మీ నాలుగున్నర లక్షలూ వేస్తూ కదా?" అడిగాడు.
వైష్ణవి నవ్వింది.
"నా జీవితమే వేస్టయ్యింది. డబ్బుదేముంది?"
రాంపండు ఆలోచనలో పడ్డాడు.
రాజీ దగ్గరకే వెళ్లాలని ఏముంది? ఈ యింటినుండి వెళ్ళిపోయి వేరుగా వుండొచ్చు కదా? ఇక్కడ స్టేటస్ ఏంటి? వైష్ణవి బాగానే చూసుకుంటుంది. కానీ తన స్టేటస్?! అందుకే సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోవాలి!
పాపం.... మరి... వైష్ణవో... జీవితంలో అందర్నీ కోల్పోయి వంటరిగా?
రాజీ కూడా ప్రస్తుతంనా అన్నవాళ్ళు లేక ఒంటరిగా వుంటోంది.
రాజీ ఎలా వుందో? ఆలోచిస్తూ పడుకున్నాడు రాంపండు.
* * * *
మర్నాడు...
సాయత్రం అయిదయ్యింది.
ఇంటికి వెళ్ళడం కోసం సీట్లోంచి రాంపండు లేచాడు.
"ఏంటి... నీ పని అయిపోయిందా? బయటకి వస్తున్నావా?" అడిగాడు రాంపండు బ్రహ్మాజీని.
"నీతోనా... బయటికా? వద్దు నా చిట్టితండ్రీ... నేను నీతోపాటు బయటకి వచ్చాననుకో... పార్కుకొస్తావా? ట్యాంక్ బండ్ కి వెళ్దామా? సినిమా చూద్దామా అంటూ వెధవ పోగ్రాం లేస్తావ్... నాకేమో ఆపోగ్రాముల్తో చచ్చే చావొచ్చి పడిపోతుంది నువేళ్ళు తండ్రీ! అన్నాడు బ్రహ్మాజీ చేతెలెత్తి రాంపండుకి దండం పెడ్తూ.
రాంపండు ఆఫీసు బయటకొచ్చి పుట్ పాత మీద కొద్దిక్షణాలు నిలబడి ఆలోచించాడు. చివరకి ఓ నిర్ణయానికొచ్చి అడుగులు ముందుకు వేసి ఆ వైపుగా వెళుతున్నా ఆటోని ఆపి ఎక్కాడు. ఆటో ముందుకు కదిలింది.
* * * *
సత్యవతి గడియారం వంక చూసి కంగారు పడిపోయింది.
