అతను పరితాపంతో గుండె పగిలిపోయేలా వున్నాడు.
నిజంగా ఆమె విషయంలో అతను పాపమే చేసి వుంటే, అది అక్కడ కడిగేసుకున్నట్టే.
రాబర్టు కళ్ళోత్తుకున్నాడు.
చీకటి పడుతోంది.
లేచి నించున్నాడు.
ఎక్కడికి వెళ్ళాలి?
ఏం చెయ్యాలి?
అతని గుండె పూర్తిగా బాధతోనూ, దిగులుతోనూ నింటి పోయింది.
అతను అడుగులు భారంగా వెస్తున్నాడు. అతనేక్కడి కేళుతున్నాడు?
ఏం చెయ్యాలను కొంటున్నాడు?
రాబర్టు కళ్ళలో కన్నీరు తిరిగింది.
ఇది శాపం. లేకపోతే ఇన్ని దారునాలిలా జగగావు. మేరీ చావు రాబర్టునీ బాగా కదిలించింది.
మనిషి ఎంత సెంటిమెంటల్ అయితే మాత్రం కోరి ఆత్మ హత్య చేసుకోవడాన్ని అతను మన్నించలేక పోతున్నాడు.
చిత్ర తనలోని బలహీనతని రెచ్చగొట్టినా లోంగాకుండా ఉంటే ఇలా జరిగేదికాదు.
అది కాక పిలిచినట్టు అదే సమయానికి ఆమె రావడం కూడా యాదృచ్చికమే.
అతని ఆలోచనలూ, మనసూ రాజి పడ్డ౦లేదు. అతను రెండు సిగరెట్ పెట్టెలు కొని తిరిగి జోసఫ్ ఇంటికి వచ్చాడు.
జోసఫ్ విచారాన్ని తను పోగొట్టలేడు. అంతులేని వ్యధతో వున్నాడు జోసఫ్.
చిత్ర మాటా పలుకూ లేకుండా మూగదానిలా కూర్చుని శూన్యంలోకి చూస్తోంది.
రాబర్ట్ ఈజీచైర్లో కూర్చుని సిగరెట్ పైన సిగరెట్ కాలుస్తున్నాడు.
ఎవరో ఒకరు వస్తూనే వున్నారు జోసఫ్ కి సంతాపాన్ని తెలియ చేస్తున్నారు. మేరీ గురించీ వాళ్ళకు తోచిన మంచిని గురించీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాటలు అతన్ని వూరడించ లేవని రాబర్టు కి తెలుసు!
కానీ ఎవరి తృప్తి వాళ్ళదనుకున్నాడు రాత్రి పడి కావస్తోంది.
ముగ్గురికి ఆకలిగా వుంది. కానీ ఎవరికీ ఏమీ తినాలని లేదు.
అందరూ మేరీ గురించే ఆలోచిస్తున్నారు.
మేరీ ఏమ్తేపోయింది.
నిద్రలో వుందా?
మళ్ళి లేచి వస్తుందా?
ఎంత పిచ్చి నమ్మకం.
మేరీ మట్టిలో మట్టిగా కలిసిపోయింది ఇక మేరీ కనబడదు?
చచ్చిపోయింది.
మేరీతోపాటు పనిచేస్తున్న శ్యామసుందరం అనే అయన వాళ్ళ కోసం రొట్టెలు తీసుకొచ్చాడు ఆయనే ప్లాస్క్తీసుతీసుకెళ్ళి నిండా టి పోయించుకొచ్చాడు.
ఇంటాయన వచ్చాడు.
"ఏమన్నా తీసుకోండి బాబూ ఎంతసేపని కూర్చుని వుంటారు. జరగ కూడంది జరిగి పోయింది" అన్నాడు.
"నేనేం పాపం చేశానని నాకీ శిక్ష వెంకట్రావుగారు నూరేళ్ళ బతుకుని పెట్టుకుని ఇంత అర్ధాంతరంగా వెళ్ళిపోయింది! నేనేం చేశానని నాకి దుఃఖాన్ని మిగిల్చాడు ప్రభువు" అన్నాడు జోసఫ్.
వెంకట్రావు అన్నాడు.
"నాకు ఆడపిల్లలులేరు, మేరీని నా బిడ్డను కున్నాను లక్ష్మి దేవే నా ఇంటి కోచ్చిందనుకొన్నాను, విధీని మనం తప్పించుకోలేం జోసఫ్ మేరీకి దేవుడి ఆజ్ఞ అయింది. వెళ్ళిపోయిం."
"నాన్నా నేను వెళ్ళిపోతున్నాను అని ఒక్కమాట నా చిట్టితల్లి నాకు చెప్పివుంటే నా ప్రాణాన్ని అడ్డువేసి బిడ్డని కాపాడుకొనేవాడిని" జోసఫ్ ఏడుస్తూ చెప్పాడు.
అతని మాటలు రాబర్టు కి గుండెల్లో చెయ్యి పెట్టి కెలికినట్టయింది.
తండ్రి మాటలు విని చిత్ర వెక్కి వెక్కి ఏడుస్తోంది.
శ్యామసుందరం ముగ్గురికి ప్లేటుల్లో రొట్టెలు పెట్టి అందించాడు.
కానీ ఎవరూ తీసుకోలేదు.
వాళ్ళ బాధ ఎలాంటిదో శ్యామసుంద కానికి, వెంకట్రావుగారికి తెలుసు. కానీ కష్టంలోవున్న మనిషిని ఓదార్చటం సాటిమనిషి కర్తవ్యం.
"కనీసం టీ నిళ్ళన్నా తీసుకోండి" అన్నాడు వెంకట్రావు.
రాబర్టు కప్పు తీసుకొన్నాక మిగిలిన ఇద్దరూ కూడా తీసుకున్నారు.
శ్యామసుందరం, వెంకట్రావు ఉదయం కనబడతామని చెప్పి వెళ్ళి పోయారు.
ఇప్పుడు గదిలో మిగిలింది ముగ్గురే.
పడుకున్నారు కానీ ఆ రాత్రి నిద్ర ఎవరికీ లేదు మాటాడుకోవడానికి మాటలు లేకపోయినయి నిజంగా మాట్లాడాలంటే ఎంతోవుంది.
ఉదయం జోసఫ్ రాబర్టు తో అన్నాడు.
"చిత్రని తీసుకొని వెళ్ళిపోతాను బాబూ" రాబర్ట్ కేం చెప్పాలో తోచలేదు.
"కాలేజి చదువు" అన్నాడు మెల్లగా.
"పోనీ బాబూ, మిగిలిన ఈ బిడ్డనయినా నా కళ్ళముందు పెట్టుకుంటాను అదీ కంటికి కనబడక పోతే నేనుండలేను " అన్నాడు జోసఫ్.
రాబర్ట్ మాట్లాడలేక పోయాడు ఆయన మాటలకి.
