Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 36

   
    తపాలా బంట్రోతు

"మైడియర్ సుబ్బారావ్
కనిపించడం మానేశావ్
ఏఁవిటీ - పోస్టుమాన్ మీద గేయం వ్రాయాలా!

అందమైన అమ్మాయి మీద కాని
చందమామ మీద కాని
వంద్యుడైన ధీర నాయకుడు మీదకాని అ
వంద్యుడైన ధీర నాయకుడు మీద కాని
పద్యాలల్లమని మన పూర్వులు శాసిస్తే
ఎక్కడి పోస్టుమానో యీ గోల
ఈ సాయంత్రం వేళ

ధనవంతుణ్ణి స్తుతి చేస్తే
పది డబ్బులు రాలుతాయి
సచివోత్తముణ్ణి స్మరిస్తే
పదికళ్ళు మనమీద వాలుతాయి
ఈ నీ ప్రార్ధన కడుంగడు అసభ్యం సుబ్బారావ్
ఉత్త పోస్టుమాన్ మీద ఊహలు రానేరావు
   
మూడవ పంచవర్ష ప్రణాళిక
ఏడవ వన మహోత్సవ దినం

బిర్లా దాల్మియా
సినీమా దలైలామా
యుద్ధం పరమార్ధం
రాజులూ రాజ్యాలూ, తారుమార్లూ
ఇటువంటివి చెప్పు
మరి చూడు నా తడాఖా
మృదు మాధ్వీ పదలహరీ
తరంగ మృదంగ విలసద్భంగీ
మనోహరాలౌ కావ్యాల్ గేయాల్
కొల్లలుగా వ్రాస్తాను

కానీ, తపాలా బంట్రోతు మీదా
హవ్వ!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS