ఇంక అతనిలో మాట్లాడం వేస్టని అనుకుంది వైష్ణవి. చుట్టూ ఓ సరి కలియ జూసి కారెక్కి వెళ్ళిపోయింది.
"హమ్మా పండుగా! నా దాగ్గరే నీట్రీక్కులా? ఈ బాబ్డ్ హర్ అమ్మాయిని ట్యాంక్ బండ్ కి రమ్మని చెప్పి నువ్వు కూడా యిక్కడికి వచ్చావ్. అనుకోకుండా నేను వెంట రావడంతో నాకసలు విషయం తెలీకూడదని ఈ అమ్మాయి వచ్చిన టైంలో పరిగెత్తికెళ్ళి దాక్కున్నావ్.... హమ్మా!" అనుకున్నాడు అతను. ఇంతలో బ్రహ్మాజీ భుజం మీద ఓ చెయ్యి బరువుగా పడింది.
ఎవరబ్బా అని ప్రక్కకి తిరిగి చూసిన అతను అదిరిపడ్డాడు.
ఎదురుగా దుర్గ!
"ను...ను... నువ్వా..." అన్నాడు కంగారుగా.
"ఏం అంత కంగారు పడుతున్నారు? మీ బ్వందరం బయట పడిందనా?" అంది దుర్గ.
"బండరమా? అదేంటి?" భయం భయంగా అడిగాడు అతను.
"సరిగ్గా సమయానికి నేను షాపింగ్ చేస్కుని ఈ వైపుకి రావడంతో తెల్సింది గానీ లేకపోతే నాకు తెలిసుండేదా? పదండి" అంటూ ఆ ప్రక్కనే ఆపించిన ఆటో దగ్గరకి బ్రహ్మజీ ని జబ్బు పట్టుకుని లాక్కెళ్ళింది.
"ఎక్కండి!"
బ్రహ్మాజీ ఆటో ఎక్కాడు. దుర్గ కూడా ఆటో ఎక్కింది. ఆటో కదిలింది.
"ఇంతకీ ఆ ట్యాంక్ బండ్ కి తమరితో బాటు వచ్చిన వాళ్ళెవరో?" కోరగా చూస్తూ అంది దుర్గ.
"రాంపండు...!" అన్నాడు అతను.
"ఏదీ...? ఆ జుట్టు కత్తిరించుకుని జబ్బుల జాకెట్టుస్కున్న ఆ వన్నెలాడి పేరు రాంపండా?"
"ఛీ...ఛీ...ఛీ.. ఆమె పేరు రాంపండు కాదు."
"మరి ఆమె పేరేంటీ?"
'ఏమో! నాకేం తెల్సూ? ఆమెవరో నాకు తెలీదే బాబూ..."
"ఆమెవరో నీకు తెలియదు గానీ మాతో ట్యాంక్ బండ్ కి వచ్చింది యోం? నేను ఆటో ఆపి మీ వైపు చూస్తుండటంతో కారెక్కి పారిపోయింది. దంగా ముండ! ఇంటికి పదండి మీ పని చెప్తా" అంది దుర్గ అతని నెత్తిన మోడ్తూ.
"బెర్ ర్ ర్" మన్నాడు అతను.
* * * *
భోజనం చేస్తుండగా వైష్ణవి రాంపండుతో అంది_
"నేను యింటికి త్వరగా రమ్మంటే ఆఫీసు నుండి మీరు త్వరగా వస్తే రెస్ట్ తీసుకుంటారనే ఉద్దేశ్యంతోనే రంమానాను. అంతేగానీ బలవంతం ఏమీ లేదు."
రాంపండు ఏమీ మాట్లాడలేదు. తలొంచుకుని సాంబార్ అన్నం కలపసాగాడు.
"ఇంటికి త్వరగా రావడం యిష్టం లేకపోతే ఏ ప్రెండు యిమ్తికో వెళ్ళి కాలక్షేపం చేసి రండి... అంతేగానీ ట్యాంక్ బండ్ల మీద, రోడ్లు మీద తిరగడం ఎందుకూ పావుకీరి కుర్రాళ్ళలా?"
రాంపండుకి పోరబోయి దగ్గోచ్చేసింది.
రాత్రి పది గంటలైంది.
వైశానవి, రాంపండూ ఇద్దరూ మంచం మీద పడుకుని వున్నారు.ఇద్దరి మనసుల్లో ఎన్నో ఆలోచనలు....!
ఇద్దరూ మంచం మీద ఇబ్బందిగా కదులుతున్నారు.
రాంపండు గొంతు సర్దుకున్నాడు.
"నాతో చెప్తానని అన్నావ్...కానీ ఏమీ చెప్పలేదు!" అన్నాడు.
"ఏ విషయం గురించి?" అడిగింది వైష్ణవి.
"అదే... నాలుగున్నర లక్షలు ఖర్చు బెట్టడం గురించి!"
ఆమె ఏం మాట్లాడలేదు.
"ఎవరైనా పెళ్ళికాని కుర్రాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా...? నీకు అందం వుంది, డబ్బు వుంది! ఏం కర్మ పట్టిందని ఇలా...' అన్నాడు రాంపండు.
"ఏదో బలమైన కారణం ఎవరూ ఇలా చెయ్యరు కదా?" అంది వైష్ణవి.
"ఆ కారణం ఎంటో నేను ఒకరోజు మీకు చెప్పాల్సిందే కదా...?"
"నువ్వు ఒంటరిగా వున్నావేం? నీ కెవ్వరు లేరా...?" అడిగాడు రాంపండు.
"అన్ని విషయాలూ చెప్తాను!" అంది వైష్ణవి.
రాంపండు తల ప్రక్కకి త్రిప్పి ఆమె వంక కోతుహాలంగా చూశాడు. మళ్ళీ అలా చూస్తె మర్యడుగా వుండదేమోననితల తిన్నగా పెట్టి సీలింగ్ వంక చూశాడు.
పది క్షణాలు నిశ్చబ్దం.... తర్వాత వైష్ణవి గొంతు సర్దుకుంది.
"టూకీగా చెప్తాను!" అంది.
"ఊ...' అన్నాడు రాంపండు.
"మా అమ్మా, నాన్నలకి నేను, మా అక్క ఇద్దరమే సంతానం! మాది బాగా కలిగిన కుటుంబం. మా నాన్నగారు గవర్నమెంటు ఆఫీసులో చాలా పెద్ద పెదవి నిర్వహించి రిటైరయ్యారు. ఇందాక మీరు అన్నారు కదా నేను అందంగా వుంటానని? కనీ మా అక్క నాకంటే చాలా అందంగా వుండేది... కానీ దాని జీవితం ఏ విధంగా నాశనం అయ్యిందో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు."
"అవునా...?" అన్నాడు రాంపండు.
"మా అక్క పేరు రాగిణి! ఎమ్మే ఇంగ్లీష్ రిటరేచర్ చేసింది... డాన్స్ కూడా నేర్చుకుంది. చక్కగా పాడుతుంది _ మంచి గొంతు! అలాంటి దానికి ఒక పశుపు భర్తగా దొరికాడు."
"ఊ..." ప్రక్కకి తిరిగి చూశాడు రాంపండు. ఆ బెడ్ లైట్ వెలుతురులో ఆమె కల్లలిని కన్నీటిపోర తళుక్కున మెరవడం అతనికి కనిపించింది.
"ఎన్నో సంభందాలు చూసి, చూసి, వెతికి వెతికి ఆ దరిద్రుడి సంభాధం ఏరికోరి తెచ్చారు. మా నాన్న...! కట్నంగా ఆరు లక్షలు ఇచ్చారు!! ఇంకా యితర లాంఛనాలు అన్నీ కలసి లక్షపైనే దాటింది. మొత్తం పెళ్లి ఖర్చులూ అన్నీ కలపితే ఎనిమిది లక్షలు ఖర్చయ్యింది! అంతే ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి మా అక్క జీవితాన్ని బుగ్గి చేశారన్న మాట మా నాన్నగారు..." ఆమె గొంతు బోంగురుపోయింది.
"ఏం జరిగింది?" అడిగాడు రాంపండు మెల్లగా_సీలింగ్ వంక చూస్తూనే ఆమె ఏడుస్తుందని అతనికి తెలుసు.
"వైష్ణవి చెప్పడం కొనసాగించింది.
"అందం, చదువూ, కళలలో ప్రవేశం అన్నీ వున్నా మా అక్కవాడికి నచ్చలేదు. ఎందుకంటే మా అక్క తెచ్చిన కట్నం వాడికి చాల్లేదట! వేరే వాళ్ళయితే వాడికి పది లక్షల కట్నం యిస్తానని వచ్చరట!! పోనీ వల్లనే చేసుకుని వుండొచ్చు కదా? ఒక నెలరోజులు కూడా దానితో సరిగ్గా కాపురం చెయ్యలేడు. చీటికీ మాటికి ఇంకా డబ్బుతే... ఇంకా డబ్బుతే, అవితే...ఇవితే అని మా అక్కని యింటికి పంపించేసేవాడు."
"మీకు బాగా డబ్బుంది అని అన్నావ్ కదా.... అతనదిగిన డబ్బు అతని మోహాన కొడితే మీ అక్క జీవితం బాగానే వుండేది కదా? "ఆమె మాటలకి అడ్డు తగులుతూ అడిగాడు రాంపండు.
"మీరెంత అమాయకులండీ....అలాంటి డబ్బాశ, నీచత్వం వున్న వాళ్ళని ఎంతకీ సంతృప్తిపరచలేం ఒక లక్ష అడిగాడనుకోండీ....ఇచ్చి పంపిస్తే పై నెలలో రెండు లక్షలు కావాలని పంపిస్తాడు.... దానికి అంతువండదు. అదీకాక మా నాన్న చాలా ఆదర్శాలు వున్నా వ్యక్తీ. అతను చేసిన వుద్యోగంలోనే వేరేవాళ్ళు చేస్తే లక్షలకి లక్షలు పైరాబడి సంపాదించేవారు. కనీ మనకే బోల్డంత ఆస్థి వుంది... అలంటి నీచ సంపాదన మనకెందుకు? అనేవారు. అసలు కట్నాలు ఇచ్చుకోడం పుచ్చుకోడం ఇవన్నీ మా నాన్నకి పడవు. కానీ కట్నం ఇవ్వను అని భీష్మించుకునికూర్చుంటే కూతురు పెళ్ళికాదని, అదర్శాన్ని ప్రక్కకి పెట్టి కట్నం యిచ్చి కూతురు గొంతు కోశాడు. అంతకంటే పెళ్ళి లేకుండా యింట్లో పడుండమేనయం."
