Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 36


    భరోసా లేకుండా చీకటి ప్రపంచం లేదు. వాళ్ళు ప్రపంచాన్ని మోసగించగలరు. కాని ఒకర్నోకరు మోసగించుకోరు.
    ఆ సిద్దాంతం మీదే ఈ ప్రపంచం నడుస్తోంది. చీకటి ప్రపంచం!!
    షీనా చాలా సంతోషపడింది.
    "మీకింత పలుకుబడి ఉందని నాకు తెలీదు. యూ ఆర్ గ్రేట్! డబ్బు యింటికి వెళ్ళి పంపుతాను" అంటూ నగని మెడలోంచి తీయకుండా తిరిగి వెళ్ళేందుకు తయారయింది షీనా!
    త్వరగా వెళ్ళిపోవాలి. "అలాగే ! అలాగే!!" జయసింహ ముందుకు కదిలాడు.

    
                                15

    సవాయ్ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ప్రియాంక బ్రిగ్రేడ్ ఒక పెద్ద ఆకర్షణ అయింది. వారంతా జయసింహ కోసం ఎదురు చూస్తూన్నారు.  
    నిమిషాల్లో దొర్లిపోతున్నాయి!
    ఆ భవనం చాలా పాతది. దాని ముందు సువిశాలమయిన మైదానం వుంది. కొద్ది సంవత్సరాల క్రితం వరకు అది ఓ అమీరు గారి తాలుకూ పద్నాలుగు మంది సంతానం అధీనంలో వుండేది జాయింటుగా.
    సకల సౌకర్యాలు, విశాలమైన మైదానంలో టెన్నిస్ కోర్టులు కూడా వుండేవి. కార్లు వెళ్ళటానికి వెడల్పుయిన రోడ్డు కూడ వుంది. అక్కడక్కడ నియాన్ లైట్లు వెలుగుతున్న అందమయిన యినుప స్తంభాలున్నాయి. ఒకటి రెండు చోట్ల యినుప కుర్చీలున్నాయి.
    దాని మీద టాక్సులు కట్టలేక , దాన్ని నిర్వహించే ఖర్చులు భరించలేక అమీరు గారి బహు సంతానం దాన్ని అమ్మేసుకున్నారు.
    నగరంలో కెల్లా అత్యంత ఆకర్షణీయమయిన సవాయ్ బార్ అక్కడ వెలిసింది. జనాకర్షణ కోసం అక్కడ గతంలో స్కిల్ గేమ్స్ పేరుతొ పరోక్షంగా జూవాలు నడిచేవి.
    వాటి మీద ప్రభుత్వ ఆంక్షలు పెరిగిపోయి పోలీసుల నిఘా ఎక్కువయింది. యిప్పుడూ స్కిల్ గేమ్స్ జరుగుతున్నాయి. అయితే వాటి యాజమాన్యం దూరంగా వుండి ప్రజల చేత నడిపిస్తోంది.
    ఈ దేశంలో తిండికి లేని వాళ్ళు పడే బాధలు ఒక రకంగా వుంటాయి. బాగా డబ్బుండి పని లేని వాళ్ళు పడే బాధలు మరో రకంగా వుంటాయి.
    అలాంటి వాళ్ళు స్కిల్ గేమ్స్ నిర్వహిస్తారు.
    డబ్బున్న వారయినా లేని వారయినా మనిషి అనబడే ప్రాణిలో కొన్ని అద్భుతమయిన శక్తులుంటాయి. మనిషిలో వుండే అద్భుత శక్తులు అకారణంగా బయట పడవు. పరిస్థితులు రావాలి! ఒత్తిడి పెరగాలి. అప్పుడే ఆ శక్తులు నిద్రలేస్తాయి.
    డబ్బు ఎర చూపించి అలాంటి అద్భుత శక్తుల్ని తట్టి లేపి చూపి అనందించడం కొందరికి హాబీ!
    గ్రీకు రాజులు రోమ్ సామ్రాజ్య అధినేతలు బాసిసల చేత యిలాంటి ఆటలు ఆడించేవారు. వారికి పదునయిన అయుదాలిచ్చి  బరితకి దింపేవారు. శరీరమంతా బిల్లులు పొడుచుకుని రక్తం కాలువలు కారుతుంటే చూచి ఆనందించేవారు.
    కండలు తెగిపడుతుంటే ఎవరి ప్రాణాలు రక్షించు కోవటానికి వారు పడుతున్న తాపత్రయం , యెదుటి వారిని చీల్చి చెండాడే విద్యలో వారు చూపే నైపుణ్యం వారికీ సంతోషన్నిచ్చేవి.
    అ సమయంలో బానిసలుగా అయినా సరే బ్రతికి వుండటం కోసం ఆ నిస్సహాయ జీవులు పడే తాపత్రయం వారికి మంచి కాలక్షేపం వుండేది.
    ఆ నిర్భాగ్యులు ప్రాణోవసాన సమయంలో పడే వేదన చేసే ఆర్తనాదాలు వారికి కులాసా యిచ్చేవి. మరొకరి ఆనందం కోసం రక్తాన్ని కాలువలు కట్టించుకుని కండలు త్రెంచి పోసుకుని ప్రాణాలను అర్పించుకునేవారు ఆ దురదృష్టవంతులు.
    అప్పటి రోజుల్లో రాజులు ఏ మాటా చెప్పినా అది శాసనం. వారి మనసులోకి ఏ పూట ఏ ఆలోచన వచ్చినా అదే చట్టం!
    ఇప్పటి సమాజానికి చట్టాలు నిబద్దమాయి వున్నాయి. కాని మనిషిలో ఆ ఎలిమెంట్ మారలేదు. చట్టానికి అనుగుణంగా రూపాన్ని మార్చుకుని ఇంకా సజీవంగానే వుంది.
    బాక్సింగ్ అలాంటిదే! సర్కస్ అలాంటిదే! మరొకరి కాలక్షేపానికి ప్రాణాలను తెగించి పని చేయటం!
    పర్వతారోపణ జిమ్నాస్టిక్స్ పరిష్కరించబడిన వాటి దూపాలు!
    ఎమ్యూజ్ మెంట్స్ నిర్వహించుతున్నందుకు ఔత్సహికులు యాజమాన్యం వారికి వెయ్యి రూపాయలు చెల్లించాలి. ఎంట్రీ ఫీజు యెంతయినా నిర్ణయించుకోవచ్చు. అది వారి యిష్టం!
    నోటీసు బోర్డు మీద వ్రాయించారు. "ఆకర్షనీయమైన పోటీ! ప్రయిజ్ లక్ష రూపాయలు నగదు" నగరమంతా ప్రచారమయి పోయింది.
    వందల సంఖ్యలో జనం వచ్చారు. పోటీలో పాల్గొనేందుకు కొందరు, చూచి ఆనందించేందుకు మరికొందరు.
    సమయం దగ్గర అవుతోంది!
    జయసింహ ఇంకా రాలేదు. అతని కోసం ఎదురు చూస్తోంది ప్రియాంక. అంతకన్నా ముందే వచ్చి చేరుకుంటాడన్న జయసింహ ఎందుకు రాలేదు. ఈ పోటీల్లో ఆతను గెలవాలి. గెలిచి తీరాలి!
    తన చేతుల మీదుగా లక్ష రూపాయలు అతనికి అందించాలి. వాటిని తీసుకున్న తరువాత వెన్నంటాలి. చేజ్ చేసి ఆ డబ్బు యెక్కడికి పంపుతున్నాడో ఆ వివరాలు తెలుసుకోవాలి!
    అప్పుడు కాని అతని వెనక ఉన్న జీవిత రహస్యం తెలియదు.
    లాటరీలో పదిలక్షలు పోగొట్టుకుని వాటి కోసం ప్రాణాల్ని కూడ పణంగా ఒడ్డి తిరిగి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు.
    తనేమో అతని వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా ఎవరు జయిస్తారు?
    ప్రియాంక చాలా టెన్షన్ అనుభవిస్తోంది.
    జయసింహ ఎక్కడున్నాడు ? ఏమయ్యాడు? వస్తాడా ? లేదా?

                           *    *    *
    "వస్తావనే అనుకున్నాను. అనుకున్న సమయానికే వచ్చావు. ధాంక్స్ . వెరిగుడ్! ఈ దారిలో నువ్వు మరింత వేగంగా పయనించాలని మరింత బాధ్యతాయుతంగా పని చెయ్యాలని కోరుకుంటున్నాను.
    అప్పుడు నువ్వు సమస్యలుగా అనుకుంటున్నవి సమస్యలుగా కన్పించవు. చాలా సహజంగా జీవితాదర్శాన్ని సాధించగలుగుతావు.
    గో ఎ హెడ్!" అంటూ అభినందించి భుజం తట్టి ప్రోత్సహించింది. ఏక్ సితారా అలియాస్ లక్ష్మీ నిరంజనం.
    గూండా మార్కు పడిపోయి పోలీసుల దృష్టిలో చిక్కుకున్న మనుషుల వల్ల ఆమెకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. క్షణక్షణం గూండాల వల్ల దిగులు అవుతోంది. ఇప్పుడు క్రొత్త ముఖాలు కావాలి!
    ఇలాంటి చురుకైన వాళ్ళు చాలా త్వరగా డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉన్న వాళ్ళు తనకి కావాలి. క్రొత్త ,ముఖాల్ని రంగంలో ప్రవేశ పెడితే పనులు సులభంగా అవుతాయి.
    వారి పేర్లు వివరాలు పోలీసులకి చేరిపోయేలాగా చాలా పనులు పూర్తీ అయిపోతాయి. ఆ తరువాత మరొకడు.
    ఆమె తనని పొగుడుతున్న కారణం యేమిటో జయసింహ గ్రహించాడు.
    "నేను పొగడ్తల కోసం ఈ పని చేయలేదు. డబ్బు కోసం చేశాను. నా డబ్బులు నాకిస్తే వెళ్ళిపోతాను" అన్నాడు. ప్రక్క గదిలోకి వెళ్ళి డ్రస్ మార్చుకుని వచ్చాడు. మళ్ళీ తన మామూలు రూపం!
    చూడగానే నిరుపేద నిరుద్యోగి అని తెలిసిపోయేలా!
    ముందు కాళ్ళు గుండెల మీదా వెనక కాళ్ళు ఒడిలోనూ వుంచి ముఖంలోకి చూస్తున్న సీమ కుక్క పిల్లని భుజం మీదికి యెత్తుకుని ప్రక్క గదిలోకి వెళ్ళిపోయింది ఏక్ సితారా!
    ఆ గదిలో వున్న ఖరీదయిన విదేశీ ఫర్నిచర్స్, వంకా వెస్ట్రన్ స్టయిల్ లో ఉన్న పెయింటింగ్ వంక చూస్తూ కూర్చున్నాడు.
    ముందుగా గదిలోకి వచ్చింది లక్ష్మి నిరంజనం సెక్రటరీ! ఒక ట్రే తీసుకుని వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS