ఏం కావాలి సాబ్"
"నట్వర్ లాల్!"
"కుచ్ జరూరీ కామ్ హై క్యా!"
"హా జరూరీ కా,మ్"
"బైటియే!" ఇంటర్ కం రిసీవర్ అందుకున్నాడు. ప్రక్కనున్న సోఫాలో కూర్చున్నాడు జయసింహ.
"బాపూజీ కొయీ ఆయా! స,మ్ వన్ కేమ్ టు సీయూ!"
అవతల నించి ఏమని విన్పించిందో మరి!
"తమరిది యిలాఖా చెప్పండి. ఎవరి తాలుకా?"
"భారత నాట్యకళానిలయం నించి వచ్చాను. ప్రం లక్ష్మీ నిరంజనం" సరిగా లేని ఉచ్చారణలో తండ్రికి చెప్పాడు.
"అందర్ చలియే!" అద్దాల తలుపువంక చూపించాడు. జయసింహ లేవగానే తనూ లేచాడు. లోపలివరకూ ముందు నడిచి అద్దాల తలుపు తెరిచి పట్టుకున్నాడు.
"చలియే! చలియే! బాపూ సాబ్ వహ దేఖో" అన్నాడు.
"అయియే సాబ్ అయియే! పధారియే!" అంటూ ఆహ్వానించాడు నట్వర్ లాల్! జయసింహ అడుగు ముందుకు వేయగానే వెనుక నుంచి తలుపులు మూసుకున్నాయి.
వాకిలి ప్రక్కనే ఒక వస్తాదు కూర్చుని ఉన్నాడు. అతని దగ్గర రివాల్వర్ కూడా వుంది. చేతిలో లాఠీ ఉంది. బొద్దుగా మీసాలున్నాయి.
మేల్డా మీద కూర్చుని లోనికి వచ్చిన వ్యక్తిని నిశితంగా పరిశీలించాడు.
అది మృత్యువు ద్వారం. లోనికి వెళ్ళాలంటే అనుమతి ఉండి తీరాలి. ఇక బయటికి రావటమనేది వెళ్ళిన వారి ఇష్టంతో కాదు.
నట్వర్ లాల్ అనుమతిస్తేనే బయటికి రాగలుగుతారు.
అయితే సీట్ క్రూరంగా కనిపించలేదు. చాల మంచివాడులా ముఖం నిండా నవ్వు పులుముకుని కన్పించాడు. ఎయిర్ కండిషనర్ వినిపించి విన్పించని విధంగా మెత్తని శబ్దం చేస్తోంది.
"అమ్మాయి గారు క్షేమంగా ఉన్నారా?" అని అడిగాడు లక్ష్మీ నిరంజనం ఉద్దేశించి.
"ఈ బ్రీఫ్ మీకు యిమ్మన్నారు." అంటూ బ్రీఫ్ అందించాడు జయసింహ.
దాన్ని తీసుకుని తన దగ్గరే ఉన్న తాళపు చెవితో తెరిచి చూచాడు నట్వర్ లాల్! అతని ముఖంలో అనందం మరింత అయింది.
దానిలో ఏముందో జయసింహకి కన్పించలేదు.
నట్వర్ లాల్ అందించిన లెదర్ కేసు తీసుకున్నాడు.
"బహుత్ బహుత్ షుక్రియా చెప్పు! మాల్ పక్కా! మాకు వారితో దోస్తీ. ఇంకా ఇంకా ఎక్కువ కావాల! నమస్తే చెప్పు.
లెదర్ కేసు భద్రంగా వారికి యివ్వు.
టెలిఫోన్ చేయవద్దు అని చెప్పు. సెంట్రల్ ఎక్సయిజ్ వారు టెలిఫోన్ కాల్స్ ట్రాప్ చేస్తున్నారు. అలర్ట్ గా ఉండాల!' అతనింకా ఏదో చెప్తూనే ఉన్నాడు జయసింహ ;లేచి బయటి కొచ్చేశాడు.
తిరిగి వెళ్ళే దారి ఆలోచిస్తూ నడుస్తున్నాడు.
అప్పుడే షాపు ముందు అటో లోంచి దిగిన ఆకారం అతన్ని చూసి నిలిచిపోయింది, జయసింహ ముందుకు వెళ్ళే దారి లేదు.
"హలో! మీరేనా!? అనుకుంటూనే ఉన్నాను. ఏం తీసుకున్నారు? ఏదీ మీ చెల్లి కూడా ఉందా?" జయసింహ హడావుడి పడి చూశాడు.
ఈ ప్రపంచంలో ఒంటరివాడు . తన తల్లి కడుపున ఒక్కడే సంతానం. లేని చెల్లి గురించి అడుగుతున్న ఆ వ్యక్తీ వంక చిత్రంగా చూశాడు.
షీనా! చాల అందంగా నవ్వుతూ దగ్గరగా వచ్చింది.
"లేదు. చెల్లి రాలేదు. ఊరికే చూచేందుకొచ్చాను" అన్నాడు . ఎలాగయినా తప్పుకోవాలన్న అతని ప్రయత్నం సాగలేదు.
"నేను చెయిన్ ఒకటి తీసుకోవాలని బయల్దేరాను"
"మెషిన్ మీద తీసినవి అయితే బావుంటున్నాయి కదండీ! రండి రండి! సెలెక్షన్ చేద్దాం" అంటూ చేయి పుచ్చుకుంది షీనా!
"ప్లీజ్ ! నేను వెళ్ళిపోవాలి! మరోసారి వస్తాను "
"నో పర్మిషన్ ఫరవాలేదు! మీరు రావాలి. సెలెక్టు చెయ్యాలి! అన్నప్పుడల్లా కలుస్తారా? ఇప్పుడు మిమ్మల్ని విడిచి పెట్టను రండి ,మీరు! చెప్పేనే కదా నట్వర్ లాల్ షాపుకి వచ్చాను" అందామె.
ఒక అబద్దం సరదా కోసం చెప్పాడు. వాస్తవానికి నట్వర్ లాల్ ఎలా ఉంటాడో , ఆ షాపు ఎక్కడుందో కూడ ఇంతకూ పూర్వం తనకి తెలియదు. నగరంలో కెల్లా నట్వర్ లాల్ బంగారు దుకాణం చాలా పెద్దదని విన్నాడు.
ఆ వార్త ఆధారంగా ఆమె దగ్గర కోశాడు. అది పుచ్చుకుని ఆమె అతన్ని రమ్మని లాగుతోంది.
ఎలా తప్పించుకోగలడు? ఆమెతో లోనికి నడిచాడు.
కౌంటరు లో కూర్చున్న యువకుడు చిరునవ్వు నవ్వాడు.
"ఇక్కడ అందరూ మీకు బాగా పరిచయం అన్నమాట. గుడ్! రేటు గురించి ఆలోచించను. కారేట్స్ గ్యారెంటీ కావాలి " అంది.
షోకేసు లోంచి సేల్స్ మేన్ తీసి యిచ్చిన ప్రతి నగా మెడలో అమర్చుకుని అద్దంలో చూసుకుంటోంది.
"ఇదెలా ఉంది? అదెలా ఉంది?" అంటూ ప్రాణం తోడేస్తోంది.
"చాల బాగుంది. వెరీ గుడ్ , చామింగ్, మర్వ్ లెస్!!" అంటున్నాడు జయసింహ పరధ్యానంగా!
షోకేసుల్లో ఉన్న నగలన్నీ పెట్టుకుని చూసుకునేందుకు అరగంట పైగా పట్టింది. ప్రతిసారీ ఆమె అతి చనువు ప్రదర్శిస్తోంది.
"ఎలా ఉందండీ! బాగుందా? తీసుకుమంటారా!" అని అడుగుతోంది.
షాపులో ఉన్న వారందరికీ జంట బావుందనిపిస్తోంది. లోపలి గది లోంచి నట్వర్ లాల్ వెలుపలకు వచ్చాడు. తన దగ్గర లెదరు కేసు తీసుకున్న వ్యక్తీ ఇంకా ఇక్కడే ఉండటం అతనికి ఆశ్చర్యమనిపించింది.
ఆ యిద్దరి కదలికల్ని పరిశీలిస్తున్నాడు.
"తనకి 'మాల్' ఎవరయితే తెచ్చి యిచ్చారో వారి చేతికే ఆతను డబ్బు యివ్వాలి. కాబట్టి అతనికి భయం లేదు. కాని పరిశీలిస్తున్నాడు.
"ఈ నక్లెస్ తీసుకోమంటారా?" ముత్యాలు పొదిగిన దండ మెడలో పెట్టుకుని చూపించింది షీనా!
ఆ చోటు నించి జయసింహ త్వరగా బయట పడాలి. ఆ తొందరలో అతనికి ఆలోచనలు స్థంభించి పోతున్నాయి.
"చాలా బాగుంది . మీ కోసమే చేశారు అన్నంత ఖచ్చితంగా మాచ్ అయింది. సూపర్బ్! ఇది తీసేసుకోండి" అంటూ అంతటితో ఆలస్యాన్ని తగ్గించాలని అన్నాడు.
"అంత బాగుందా? ఇదే తీసుకోమంటారా?"
"అవును. అంతే! మరేమీ ఆలోచించకండి"
దాన్ని తూకం వేయించి బిల్లు వ్రాయించే వరకూ వెనుక ముందు ఆలోచించటం మర్చిపోయింది షీనా!
తీరా బిల్లు చూశాక అదిరిపడింది.
'అయ్యో! మిషన్ మీద తీసిన సన్నని చెయిను తీసుకోవాలని వచ్చాను. అంత డబ్బు తీసుకురాలేదు . ఎలా?" అంది.
జయసింహ నివ్వెరపోయాడు. మాటలు పెగిలి రాలేదు. పెదవి కదపటం అసాధ్య,అమిపించింది.
"మీరేమీ బాధ పడకండి . తిరిగి యిచ్చేస్టాలే! బాగానే ఉందనుకొండి. ఇంకోసారి తీసుకుంటాను. ఇప్పటికీ చెయిను తీసుకుంటాను" చాల బాధపడి పోతోందామె.
ఆమె ముఖం మాడిపోయింది. జయసింహ దిగులు ముఖం పెట్టాడు. ఆమె నగ తీసుకోలేక పోయిందని కాదు. తనకి ఆలస్యం అవుతుందని!
వారి ముఖ కావళికలు గమనించి నట్వర్ లాల్ అపార్ధం చేసుకున్నాడు.
"బేటా! నగ బాగుంటే తీస్కుపొండి! డబ్బుదేముంది . అబ్బాయి గారు తర్వాత యిచ్చుకుంటారు ! క్యా సాబ్!" అన్నాడు జయసింహ ఉద్దేశించి.
