సెంటిమెంటల్ పూల్ తనని నమ్మింది, ఆశపడింది, మోసపోయింది అందుకే శవంగా చలనం లేకుండా ఇలా .
మేరీ ఆత్మహత్య చేసుకుంది.
కాదు ఆమె ఆత్మహత్య చేసుకునేలా తనే చేశాడు.
అంటే తను హంతకుడు.
అతని కళ్ళనించి రెండు కన్నీటి బోట్లురాలి ఆమె పాదాలప్తెన పడినాయి.
మేరీకూడా వెళ్ళిపోయింది.
అన్ని ఫార్మాలిటిస్ ముగిసేక మేరీని పెళ్ళి కూతురిలా అలంకరించారు. బతికి తిర్చుకోలక పోయిన కోరికనీ చనిపోయాక తీర్చుకున్నది మేరీ.
రాబర్టు ఆమెను పూల మాలతో అలంకరించాడు. అప్పడతని చేతులు వణికాయి. అతని గుండెని కత్తితో కోస్తున్నట్టుగా భ్రాంతి చెందాడు.
మేరీ శవాన్ని చెక్క పెట్టిలో పెట్టి రెండు గుర్రాల బండిలోకి చేర్చారు.
బండి కదిలింది.
ఆ బండిముందుగా రివరెన్ జాన్సన్ తెల్లని గౌమ ధరించి తల వంచుకొని నడుస్తున్నాడు.
మేరీ అంతిమ యాత్రలో పాల్గొన్న బృందం రెండుదారులుగా తిరి తలవంచుకొని ప్రార్ధనా గీతాలు పాడుతున్నారు.
అతని బుర్ర వాయు గుండం పడిన బంగాళాఖాతంలా వుంది.
ప్రోపెషన్ చర్చిలోకి నడిచింది.
చర్చిలో మేరీ వ్యక్తిగత గుణాల గురించీ ప్రస్తావన జరిగింది.
అటు తర్వాత ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు. రెవరేన్డ్ ప్రసంగం చేశాడు.
ప్రభువు అనతిప్తెన మేరీకి విశ్రాంతి నివ్వటం జరిగిందని, మళ్ళీ ప్రభువు వచ్చి ఆనతిచ్చినప్పుడు మేరీ విశ్రాంతినించి లేస్తుందని అన్నాడు రెవరేన్డ జాన్సన్.
బ్తేబిల్ నించీ స్క్రిచ్చర్ పోర్షన్స్ చదివారు. ప్రోపెషన్ మళ్ళీ కదిలి గ్రేవ్ యార్డ్ చేరింది.
మేరీ శవాన్ని వుంచిన చెక్క పెట్టిని గోతిలో పెట్టాక అందరూ ఒక్కొక్కరే వచ్చి దోసిళ్ళతో మట్టిని వేశారు.
మేరీకి పూర్తి విశ్రాంతి దొరికింది.
* * * *
చాలామంది జోసఫ్ నీ పలకరించి వెళుతున్నారు. రాబర్టు ఈజీ చెర్లో కూర్చుని కణతలు నిక్కుకుంటున్నాడు.
చిత్ర మాటా పలుకూ లేకుండా ఓ మూలగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది.
రాబర్టు మెల్లగా లేచి గదిలోకి నడిచాడు.
ఆ గదిలో___
మేరీ సర్వస్వాన్ని తనకి ధారపోసింది. గదిని ప్రతి అంగుళం పరీక్షగా చూశాడతను.
మేరీ మొదటిసారిగా ఆ గదిలోనే తన కన్యాత్వాన్ని రాబర్టుకి సమర్పించుకున్నది
మేరీ అ గదిలోనే రాబర్టు గురించీ ఆశాసౌదాలనీ కట్టుకోంది.
ఆ ఆశాసౌదాలన్ని ఒక్కసారిగా కూలిపోగా చివరికి ఆ గది లోనే ఫాన్ హుక్ కి షిఫాన్ చీరని కట్టి ఉరిపోసుకోంది మేరి.
మేరీ ప్రాణాలు ఆ గదిలోనే ఎక్కడో పదిలంగా వున్నాయని పించింది రాబర్టుకి.
దేవుడు తనని శపించాడు.
లేకపోతే ఈ దారుణాలకి అంతమే లేదా?
అర్జున తనని ప్రేమించింది దక్కించుకోలేకపోయాడు. హత్యగావించబడింది.
మేరీ తనని ప్రాణం అనుకోంది. కానీ ఆమెచివరికి ఉరిత్రాడుని ఆశ్రయించింది.
మనిషి దౌర్భాగ్యమదే ఏదన్నా ప్రమాదం జరిగిపోయేవరకూ, జరదబోయేదాని గురించీ ఆలోచించడు.
పరిస్ధితులు కాలం మన చెప్పుచేతల్లో వుంటే అసలు మనిషికి దేవుడి అవసరమే వుండదు.
అందుకే మనిషిని కర్మ జీవిగా చేశాడు దేవుడు.
మేరీ ఇక తన జీవిత కాలంలో తనకి కనబడదన్న నిజం గుర్తు రాగా అతను నిలువెల్లా కంపించిపోయాడు.
అతను విసురుగా ఆ గదిలోంచి బయటకి వచ్చాడు.
అతని విధి గుమ్మం దాటుతుంటే చూస్తూ వుండిపోయింది చిత్ర.
రాబర్టు గ్రేవ్ యార్డ్ దగ్గరకి నడిచాడు. ప్రశాంతంగా వుందక్కడ.
ఎంతమందో, ఎన్ని వేలమందో, లక్షల మందికో విశ్రాంతినీ ప్రసాదించిన పుణ్యభూమి, అదే శ్మశాన వాటిక.
మనిషికి శాంతికి ప్రసాదించి, విశ్రాంతిలోకి తీసుకెళ్ళే అతి పవిత్రమ్తెన ఆ ప్రదేశంలోకి అతను అడుగుపెట్టాడు.
అతని కళ్ళు వర్షిస్తున్నాయి.
మేరీని పాతిపెట్టిన దిబ్బ దగ్గరికి వెళ్ళాడు రాబర్టు.
అక్కడతను చతికిలబడి పోయాడు.
ఆ దిబ్బని చేతులతో తడిమాడు ఆప్యాయంగా, ప్రేమగా.
"మేరీ నన్ను క్షమించవా!" దినంగా అతని నోటి వెంట వెలువడినాయి ఆ మాటలు.
"నన్ను నమ్మి నీ మనసులో చోటు ఇచ్చినందుకు చూశావా నీకెంత అపకారం చేశానో నిన్ను వందన చేశాను మోసం చేశాను నువ్వు దేవతవి మేరీ అందుకే ఈ పాపి మొహం నీకు కనబడకూడదన అదృశ్యమ్తె పోయావు. నీకు చేతులెత్తి జోడిస్తున్నాను నన్ను క్షమించు మేరీ, ఈ పాపిని క్షమించి"
