Previous Page Next Page 
యువత నవత  పేజి 35

   
     "చెడగొట్టబడతాం అన్న భయాన్ని జయిస్తే తప్ప మీరు మగవాళ్లతో సమంగా పురోగమించలేరని నా అభిప్రాయం. మగవాళ్లందరికీ ఆడవాళ్లని చెడగొట్టడంతప్ప  ఇంకేంపని,  ఇంకేం ఆలోచనలు ఉండవనుకోవడంకూడా  పొరపాటు.  శాలిని ముఖంలోకి చూసిన శర్మ ఆమె నుదుటబొట్టు పొరపాటు." శాలిని ముఖంలోకి చూసి శర్మ ఆమె నుదుటబొట్టు లేకపోవడం అప్పుడే గుర్తించినట్టుగా, చటుక్కున  లేచివెళ్ళి ఇంటిముందు నిలబడి, "మణి మణి" అని పిలిచాడు.

      ప్రక్కింట్లోనుండి ఓ పదేళ్ళ అమ్మాయి పరిగెత్తుకు వచ్చింది. "ఏంది సార్?" అంటూ.

    "ఈరోజు శాలిని టీచర్ కు ఊరికి వెళ్ళడానికి బస్సు రాలేదు. మనింటికి తీసుకువచ్చాను. ముఖం కడుక్కుంది. కాస్త బొట్టు తెచ్చి పెట్టమ్మా."

    మణి ఇంట్లోకివెళ్ళి వాళ్లనడిగి ప్లాస్టిక్ కుంకుమ భరిణి తీసుకువచ్చింది శాలిని నుదుట బొట్టుదిద్దుకుంది.

     "మణీ! ఈరోజు తోటనుండి ఏం కోసుకువచ్చారు?"

    "అమ్మని అడిగొస్తానుసార్!" ఆపిల్ల క్షణంలో తిరిగొచ్చి "వంకాయలు, టమాటాలు ఉన్నాయంటసార్!" అని చెప్పింది.

    "పావుకిలో వంకాయలు పావుకిలో టమాటాలు తీసుకురా మణి! ఇవిగో డబ్బులూ, బుట్టా"
    మణి వంకాయలు, టమాటాలతో తిరిగొచ్చింది.

     "ఇప్పుడు నాకోసం వంటచేస్తారా?ఏం వద్దులెండి! ఉన్నదే ఇద్దరం తిందాం" అంది శాలిని.

     "ఉన్నది ఆకలి మాత్రమే!"

    "ఏం? మీరు ప్రొద్దున ఏం చేసుకొన్నారు?"

    "ప్రొద్దున నిమ్మకాయ పచ్చడీ, పెరుగుతో తిన్నాను. రాత్రికి నిదానంగా చేరుకోవచ్చులెమ్మని! ఈ పత్రికలు తిరగేస్తూ కూర్చోండి. ఎంతలో అయిపోతుంది?"

    "మీకు నేనేమైనా సాయం చేయగలనా?"

    "వంట అయ్యేవరకు  నన్ను డిస్టర్బ్ చెయ్యకుండా  ఉండటం!"అని కిచెన్ లోకి వెళ్లాడు శర్మ.

    అయిదారు నిమిషాస తరువాత శాలిని కుర్చీలోంచి లేచివచ్చింది. "కాస్త కూరగాయలైనా తరిగిపెట్టనివ్వండి" అంటూ.

     "మగవాడు వంటచేస్తూంటే కూర్చొని ఎలా తినడమా అని ఫీలవుతున్నట్టున్నారు. సమయంవస్తే "ఏం? ఆడవాళ్లే ఎందుకు వంటచేయాలి? మగవాళ్ళెందుకు వంట చెయ్యకూడదు? ఇదెక్కడి అన్యాయం?" అని  వాదం పెట్టుకొనే శాలినిగారూ మాటల్లో మాత్రమే మగ ఆడకు భేదాలెందుకు అనడంకాదు, ఆచరణలోనూ అలాగే వుండాలి. వాళ్లకి మాకు భేదం లేదన్నట్టుగా ప్రవర్తించాలి. ఇదే ఒక మగవాడినే  గెస్ట్ గా దొరబాబులా తినిపోయేవాడు! అవునా?  మీరు లజ్జతో ఫీలవడం చూస్తే మీరు ఆడతనం ఏం పోగొట్టుకోలేదని అర్దమవుతూంది."

    "అలా ఎందుకనుకుంటారు? ఒక మనిషి కష్టపడుతూంటే, ఆ శ్రమని పంచుకోడానికి వచ్చిన మరో మనిషిని ఎందుకనుకోలేరు? నాలో ఆడతనమే పోనిమాట  నిజమైతే కూరగాయలు కరిరి పెట్టటంకాదు. మీరలా కూర్చోండి చిటికెలో వంటచేస్తాను. నా చేతివంట ఎలా వుంటుందో రుచి చూపిస్తాను" అంటూ కొంగు నడుముకు చుట్టేసి, మీ వంటింటిచార్జీ నేను పుచ్చుకునేదాన్ని తెలుసా?"

    "నిజంగానా ఆపని చేద్దురూ! కమ్మటి వంటకి ముఖం వాచిపోయాను. వారానికి రెండుసార్లయినా  పచ్చళ్లతో భోజునం అయిందనిపిస్తాను వంట బద్దకించి! నాకు వంట అంతబాగా చేతకాదుకూడా "శర్మ జాలిగా పెట్టాడు ముఖం.

     "ఆశ! అయ్యో! పచ్చళ్ళతో భోజనమా అనినేనేం జాలిపడను లెండి! ఏం? మా ఆడవాళ్లకే వంట అంటే ఓపిక, మీకెందుకుండకూడదు? బ్రహ్మ ఆడవాళ్ల ముఖాలమీదే రాసి పంపాడేమిటి వంట...... వంటా అని?" పెదవుల మధ్య నవ్వు బిగబడుతూ అంది శాలిని.

    "మీరేం నన్నుచూసి జాలిపడొద్దుగాని, అలా గడపదగ్గర కూర్చోండి. నేను కొన్నిడైలాగులు చెబుతాను మీకు బోర్ కొట్టకుండా ఏం?" బియ్యం కడిగి పొయిమీద పెట్టేసి వంకాయలు తరుగుతూ అన్నాడు శర్మ.

     "ఏం డైలాగులు?"

    "వినండిమరి!.....ఏమే? పదిన్నర అయింది. వంటయిందా?"

    "వంటకాదు! వల్లకాడు తయారయింది. ఏం చేసేది నా ఖర్మ? చేసేది ప్లీడరుపని, నగలన్నీ మార్వాడీ కొట్టుతో తాకట్టు! వేగినన్ని రోజులు వేగాను. ఇక వేగలేను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS