"అయ్ బాబోయ్.... అదేంటి సార అలా అరుస్తారు? వద్దని కాస్త మెల్లగా చెప్పొచ్చుగా?" అనుకుంటూ ఆ కుర్రాడు అక్కడి నుండి ముందుకు కదిలాడు.
రెండ్రూపాయలకి వస్తున్నాడు. ఏం పిసినార్రో నాయనా...." అంటూ ఆ కుర్రాడు సనుక్కోడం ఆ ఇద్దరికే వినిపించింది."అంటి చిర్రు బుర్రులాడ్తన్నావ్.... ఇంట్లో ఏమైనా గొడవా?" అడిగాడు బ్రహ్మాజీ.
"అదే లేదులే" అన్నాడు రాంపండు.
"నీ వాలకం చూస్తుంటే అలానే అనిపిస్తోంది. లేకపోతే ఈ టైం లో ఇక్కడ కొచ్చి ఒంటరిగా కూర్చోవలని అనుకోడం ఏంటి?"
"ఏం లేదని అన్నను కదా?"
ఇంతలో అక్కడకి ఓ పూలమ్ముకునే వాడోచ్చాడు.
"మల్లెపూలు కావాలా సార్?" అడిగాడు రాంపండు.
"మూర ఎంత?" అడిగాడు రాంపండు.
"రెండు రూపాయలు సార్."
"రెండు మూరలివ్వు.... ఇద్దరం చెవులకి చుట్టుకుంటాం...." అన్నాడు రాంపండు వెటకారంగా బ్రహ్మాజీ కిసుక్కున నవ్వాడు.
"పూలు బాగున్నాయ్... నాలుగు మూరలు తీసుకోండి సార్' అన్నాడు వాడు అదేం పట్టించుకోకుండా.
"ఏవయ్యా....! ఇక్కడ మేమిద్దరం మగవాళ్ళం కూర్చుని మాట్లాడుకుంటుంటే పూలు కావాలా అని అడుగుతావేం? అడవాళ్ళుండే చోటకి వెళ్ళి అడుగు" అన్నాడు రాంపండు.
"అంటే అమ్మగారి కోసం యింటికి తీస్కేళ్తారెమోనని..." నసిగాడు వాడు.
"మా ఇద్దరి అమ్మగార్లు మొన్నీ మధ్యే తిరుపతేళ్ళి వచ్చారు... ఇద్దరకి గుళ్ళే... నువ్వింకెళ్ళు" విస్సుగా అరిచాడు రాంపండు.
వాడు సణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
"సార్ ఐస్క్రీం" అడిగాడు ఒకడు.
"వద్దు" అన్నాడు రాంపండు.
"సార్ పాఫ్ కార్న్ " అన్నాడు ఇంకొకడు.
"వద్దు... వద్దు మాకేం వద్దు" విసుక్కున్నాడు రాంపండు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
"ఇక్కడ ప్రశాంతంగా వుంటుందని అన్నావుగా!" నవ్వుతూ అన్నాడు బ్రహ్మాజీ.
రాంపండు ఏదో అనబోయాడు. కానీ అల్లంత దూరంలో వస్తున్నా మారుతీ కారుని చూశాడు. అది వైష్ణవి కారు!
"కెవ్వు" మని అరిచాడు రాంపండు.
"ఏంటి? ఏమైంది? ఈ సారి ఎవడోస్తున్నాడు?" అడిగాడు బ్రహ్మాజీ.
"ఎవరూ కాదు గానీ! నువ్విక్కడే వుండు... నేనిప్పుడే వస్తా!" అని బ్రహ్మాజీ సమాధానం కోసం ఎదురుచూడకుండా రాంపండు కంగారుగా రోడ్డు క్రాస్ చెయ్యడం మొదలు పెట్టాడు.
"కీ...ష్..."
"కీ ...చ్ ..."
అట్నుండి వచ్చే ఓ బస్సు, ఇట్నుండి వెళ్ళే ఓ కారు సడెన్ బ్రేక్ ఆగే.
రాంపండు వాళ్ళని గమనించను కూడా నాయనా" కారు నడిపే అయన అన్నాడు
"అర్రే బేవకూఫ్...!" బస్సు డ్రయివర్ అరిచాడు.
అతనికి ఇవేమీ వినిపించలేదు. కంగారుగా రోడ్డు క్రాస్ అక్కడ వున్నా పోతన శిలా విగ్రహం వెనకాలికి వెళ్ళాడు.
అంతదాకా విస్తుపోయి చూస్తున్న బ్రహ్మాజీకి రాంపండుకి అలా విగ్రహం చాటుకి వెళ్లేసరికి నువ్వు వచ్చింది.
"పాపం! ఎంతర్జంటో ఏంటో?" అని నవ్వుకున్నాడు. "ట్యాంక్ బండ్ మీదికి యింతమంది విజటర్స్ వస్తారు కదా... అందుకనే ఇక్కడ ప్రభుత్వం టాయిలెట్స్ కట్టిస్తే జనం ప్రాణాలకి తెగించి యిలా రోడ్డుకి అడ్డంగా పరుగు తియ్యనక్కర్లేదు!" అనుకున్నాడు.
విగ్రహం వెనక్కి వెళ్ళిన రాంపండు చాలా యిబ్బందిగా ఫీలయ్యాడు.
కారణం విగ్రహం చాటుసుచేకుని ఓ లవర్స్ జంట కూర్చుని వుంది.
రాంపండు వంక వాళ్ళు కొరకొర చూశారు. చూట్టూ ఇంత ఖాళీ స్థలం వుండగా యిక్కడకే రావాలా అన్న భావం వాళ్ళ చూపుల్లో కదలాడింది.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతను ఏమే చెయ్యలేడు. అతను విగ్రహం వెనకనుండి మెల్లగా తొంగి చూశాడు.
బ్రహ్మాజీ దిక్కులు చూస్తున్నాడు. అతని ముందు మారుతీ కారు ఆగింది. దాంట్లోంచి వైష్ణవి దిగి అతని దగ్గరకొచ్చింది_
"చూడండి మిస్టర్!" బ్రహ్మాజీ నుద్దేశించి అంది ఆమె.
బ్రహ్మాజీ ఉలిక్కిపడ్డాడు. తనని బాబ్డ్ హేర్, స్లీవ్ లేస బ్లౌజ్ లో వుండే ఓ అల్ట్రా మోడ్రన్ యువతి పలకరించడమా?
"య..య..య...యస్.. మేడమ్?" అన్నాడు అతనేక్కాడా?" అడిగింది వైష్ణవి.
"ఇంతక్రితం మీతోపాటు ఒక వ్యక్తిని చూశాను. అతనేక్కడా?" అడిగింది వైష్ణవి
బ్రహ్మాజీ చాలా యిబ్బందిగా ఫీలయ్యాడు. రాంపండు విగ్రహం చాటుకి అందునా అ పనికొసం వెళ్ళాడని అంతా మోడ్రన్ గా వుండే ఆమెకి ఎలా చెప్పగలడు?!"
అతనికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు.
విగ్రహం చాటునుండి ఆమె బ్రహ్మాజీతో మాట్లాడ్డం చూశాడు రాంపండు.
"కేవ్ వ్ వ్ ..." అని అరిచాడు.
ఆ లవర్స్ జంట ఉలిక్కిపడి ఒకరికొకరు దూరంగా జరిగి కూర్చుని అతనికేసి వింతగా చూశారు.
"సారీ! హిహిహి... అప్పుడప్పుడు అలా అరవడం నా హాబీ అన్నమాట...! ఏమీ అనుకోకండేం?" అన్నాడు అతను వాళ్ళతో.
"పోనీ మేరు ఆ ప్రక్కా బొమ్మచాటు కెళ్ళి అరుచుకోవచ్చుకండండీ?" అన్నాడు ఆ కుర్రాడు కస్తా ధైర్యం చేసి.
"అబ్బే! ఈ పూతకింకా అరిచే కార్యక్రమం అయిపోయింది. ఓంకో నిమిషంలో వెళ్ళిపోతాగా?" అన్నాడు రాంపండు.
రోడ్డుకి ఇవతల...
"ఏంటండీ? నేనడిగిన దానికి సమాధానం చెప్పరేం?" అంది ఆమె బ్రహ్మాజీతో
అలా అంటూ శీలా విగ్రాహం వంక చూశాడు. రాంపండు దాని కాలనుండి దొంగాచాటుగా చూడటం అతనికి కనిపించింది. రాంపండు బుర్ర కాయ్ అడ్డంగా వూపుతూ సైగ చేశాడు.
అయితే పండుగాడు పరుగు తీసింది ఆ పని కోసం కాదన్నమాట
వైష్ణవి అతని వంక వింతగా చూసింది. అతనికి తను అడిగినది వినిపించిందో లేదో అన్న సమాధానం ఆమెకి కలిగింది. లేదా అతనికి తను ఏమడుగుతొందో అర్ధం కాలేదా?
"అది కాదండీ! కొన్ని క్షణాలక్రితం మీ ప్రక్కన ఓ వ్యక్తీ కూర్చుని వున్నాడు. నేను అంతదూరం నుండి కార్లో వస్తూ చూశాను. ఈ లోగా ట్రాఫిక్ మీద పది సెకన్ల దృష్టి పెట్టి మళ్ళీ చూసేసరికి అతను నాకు కనిపించలేదు. అతని పేరు రాంపండు!" అంది ఆమె.
"రాంపండా? అబ్బే... లేదండీ. జాంపళ్ళూఅమ్మేవాడు మాత్రం వచ్చాడు. బఠానీలూ, పల్లీలూ, మల్లెపూలూ అమ్మేవాడు కూడా వచ్చాది అన్నాడు బ్రహ్మాజీ.
"అది కాదండీ! ఇప్పుడే మీ ప్రక్కన కూర్చుని వున్నాడే అతని గురించి అడుగుతున్నా."
"ప్రక్కన కూర్చున్నాడా... అయితే జాంపళ్ళూ అమ్మేవాడే!"
