అతన్ని చంపి....
అంతలోనే ఓ విషాదమైన చిరునవ్వు అతని పెదవులప్తెన వెలిగీ వెలగాకుండా ఆరిపోయింది.
అతని భార్య దగ్గరికి తను వెళ్ళాడనికి ఆమె భర్త తనకి అడ్డా?
నిజానికి ఆ సంగతి తేలిసైఅతనే తనప్తెన చర్య తీసుకోవాలి.
అతనికి ఒళ్ళు తెలియటంలేదు.
అప్పటికే బాగా తాగాడు.
గొంతూ, గుండెలు మండుతున్నాయి. జుత్తు చెదిరిపోయి, టాక్ చేసిన షర్టు సగం బయటికి వచ్చి ఏరుపెక్కిన కళ్ళతో ఆ కళ్ళలోని ఎర్రని జిరలతో అశాంతికి ప్రతిరూపంలా అగుపిస్తున్నాడతను.
మేరీ కెలా నచ్చచెప్పాలి?
నచ్చచెప్పవలసినవసరం అతడికుందా?
బ్లడీ బుల్ షిట్
అవసరం లేదు
మృత్యు దేవత చేతులుచాచి కౌగిలించుకోడానికి కొస్తేచిరు నవ్వుతో ఎదురెళ్ళడానికి సిద్దంగా వున్న తను ఏ విషయంలోనూ రాజీ పడలేదు.
దూరంగా చర్చిలో గంటలు వినిపిస్తున్నాయి.
తూలుతూ వెళ్ళి కిటికీ దగ్గర నించున్నాడు రాబర్టు.
రోడ్డుమీద ఓ కుక్క ఏడుస్తోంది.
కుక్క ఎడవకూడదా.
కుక్క ఏడిసైఎవరన్నా చచ్చిపోతారాట. కుక్కలికి యమభటులు కనబడి అలా ఏడుస్తాయట.
తానుగానీ చనిపోతాడా.
అంత అదృష్టం ఏది తనకి?
ఇప్పడిహ ఎవరూలేరు తనకి ఒంటరి బతుకు చీకటి బతుకు దొంగ బతుకు.
ఇది బతుకేనా?
ఇది జివితమేనా?
"ఛి అసహ్యం, రోత , ర్తెలు కిందపడి చావు" ఎవరో ప్రబోదిస్తున్నారు.
ఎవరిది!
అంతరాత్మ.
అంతరాత్మా?!
"ఈ పాపిష్టివాడి శరీరంప్తెన నీ కింకా మక్కువ చావలేదా!" నవ్వుకున్నాడు రాబర్టు.
అతనికి స్పృహ తప్పింది.
ఆ కిటికీ దగ్గరే నిలువునా కుప్పలా కూలిపోయేడు రాబర్ట్.
__కిటికీ లోంచి సూర్య కిరణాలు మీదపడుతుంటే కళ్ళు విప్పాడు రాబర్టు.
బద్దకంగా, తలనొప్పిగా వుంది.
కణతలు నొక్కుకుంటూ లేచి కూర్చున్నాడు మంచంమీద.
రాబర్టు లేచి మెల్లగా తయారయ్యాడు అద్దంలో అతని మొహం అతనికే అసహ్యం కలిగేలా కనుపించింది.
"చావు కళా!" అనుకున్నాడు.
మేరీ తెల్లవార్లూ ఏడ్చివుంటుంది. ఆమె కోపం, దుఃఖం కొంత వరక్తేనా చల్లారితే ఏదోలా నచ్చచెప్పాలనుకొని బయలుదేరాడు.
అవసరం అయితే ఈ రోజున తన నిజ స్వరూపం ఏమిటో కూడా మేరీకి తెలియచెప్పాలి.
బంధాలని పెంచుకొని పెంటిమెంట్లతో నలిగిపోవడం అతనికి పూర్తిగా విరుద్దం అందుకే మేరీ అంటే ఇంత చిరాకు కలుగుతోంది.
సెంటిమెంట్ అంటే ఏమిటి?
మానసికంగా నమ్మే విషయం!
తనకి ఏ విధమైన నమ్మకాలు లేనప్పుడు. అన్ని ఓదిలేసాడు.
అస్తవ్యస్దమైన ఆలోచనలతో రాబర్టు మేరీ ఇంటికొచ్చాడు.
ఆ ఇంటిముందు చాలామంది మూగివున్నారు.
రాబర్టునీ చూస్తూనే కొంతమంది పక్కకి తప్పుకున్నారు.
ఎవరో అంటున్న మాట వినబడింది.
"చాలా మంచి పిల్ల ఉరిపోసుకొని చనిపోవల్సినంత కష్టం ఏం కలిగిందో పాపం."
కొరడాతో కొట్టినట్టయింది రాబర్టుకి. గుండె చల్లబడి పోయింది.
అదురుతోన్న గుండెతో అడుగు లోపల పెట్టాడు రాబర్టు.
రాబర్ట్ మౌనంగా నిలబడిపోయాడు.
మేరీ చనిపోయింది.
జోసఫ్ బావురుమన్నాడు రాబర్టునీ చూడగానే.
"బాబూ రాబర్టు నా చిట్టితల్లి వెళ్ళిపోయింది. నిన్న న్యాయం చేసి వెళ్ళిపోయింది ఈ వయసులో కన్నబిడ్డ చావు చూడ్డానికి నేను బతికున్నాను. నా బిడ్డని నీ కప్పగించాను నువ్వుకూడా కాపాడలేకపోయావా రాబర్టు"
జోసఫ్ ఓదార్చడానికి ఏ విధమైన ప్రయత్నమూ చేయలేదు రాబర్టు.
అతని కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి. పళ్ళు కోరికాడు. పెదిమ చిట్లి రక్తం స్రవిస్తోందతనికి.
మేరీ ఎందుకు చచ్చిపోయిందో వీళ్ళేవరికీ కారణం తెలిదు.
రాబర్ట్ కి తెలుసు.
చిత్రకి తెలుసు.
చిత్రకేసి చూశాడు రాబర్టు.
ఆమె రెండు కాళ్ళమీద తల పెట్టుకుని గోడ కానుకుని కూర్చుని రోదిస్తోంది.
మేరరీస్కూలు స్టాఫ్ చాలా మంది వచ్చారు అప్పటికే.
రాబర్టు మెల్లగా అడుగులు వేశాడు మంచం దగ్గరికి.
మేరీ నిర్జీవంగా మంచంప్తెన పడివుంది.
