అతను రాంపండు వంక ఆశ్చర్యంగా చూశాడు. "అదేంటోయ్! ఎవరయినా యింటికి వస్తానంటే తప్పకుండా రా అంటారుగానీ నువ్వేంటీ ఎందుకని అడుగుతావ్?"
"నువ్వు తప్పకుండా రావాల్సిన వాడివేగానీ ఇప్పుడు నేను యింటికి వెళ్ళడం లేదు కదా మరి?!"అన్నాడు రాంపండు.
ఈసారి బ్రహ్మాజీ ఉలిక్కిపడ్డాడు.
"అదేంటి? ఇప్పుడే కదా ఇంటికేనా వెళుతున్నావ్ అని అడిగితె నేను పరధ్యానంగా 'ఊ' అని అనుకుమ్త్ను. నేను నిజంగానే యింటికి వెళ్ళడం లేదు."
"అయ్యో! నేను మీ యింటికి వద్దామని అనుకున్నానే!" బాధపడుతూ అన్నాడు బ్రహ్మాజీ.... ఇంతకీ నువ్వెక్కడికి వెళుతున్నావ్?" అడిగాడు
ట్యాంక్ బండ్ కి వెళుతున్నా!" చెప్పాడు రాంపండు.
"మీ ఆవిడతోనా?"
అదేంటీ! హఠాత్తుగా ట్యాంక్ బండ్ ప్రోగ్రాం పెట్టుకున్నావ్...ఒక్కడినే అంటే నేన్నమ్మను. ఎవరయినా గర్ల్ ప్రెండ్ ని అక్కడికి రమ్మన్నావా ఏంటి?" కన్ను కొడుతూ అడిగాడు బ్రహ్మాజీ.
"నా మొహానికి అదోక్కటే తక్కువ?"
"అయితే ఒక్కడివే వెళుతున్నావా?"
"అవును!"
"నిజం"
"అవునని చెప్పానుగా" కాస్త విసుగ్గా అన్నాడు రాంపండు.
"అయితే పద నేను కూడా నీతో వస్తా" కొంటెగా అన్నాడు బ్రహ్మాజీ.
"రా... నాకేం అబ్యంతరంలేదు" అని ఏయ్ ఆటో!" అంటూ ఆ దారిన అపోతున్న ఆటోవాడిని పిలిచి ఎక్కాడు రాంపండు. బ్రహ్మాజీ కూడా ఆటో ఎక్కాడు.
"ట్యాంక్ బండ్ పోనియ్."
ఆటో కదిలింది.
"ఇంతకీ యింత అర్దాంతరంగా ట్యాంక్ బండ్ కి వెళ్ళాలనే కోరిక నీ కెందుకు కలిగిందో?" అడిగాడు బ్రహ్మాజీ.
"కాస్సేపు ఆ ట్యాంక్ బండ్ మీది బెంచిమీద కూర్చుని హుస్సేన్ సాగర్ మీది నుండి చల్లగాలిని అనుభవిద్దామనీ...." చెప్పాడు రాంపండు.
"ఒంటరిగా వెళుతున్నావ్... ఏం మీ ఆవిడతో మళ్ళీ ఏదైనాగొడవా?"
'అదేంకాదు! ఊర్కే వెళ్ళాలనిపించింది.... వెళుతున్నా."
"మరి నేను యింటికి వెళ్ళకుండా నీతో ఎందుకోస్తున్నానో అడగవేం?"
"ఎందుకు?" అడిగాడు రాంపండు
"మా ఆవిడా ఈ వేళ యింటికి త్వరగా రండి... లేకపోతే నేను వూర్కోనంతే అని అంది. అది చెప్పినట్టు త్వరగా వెళితే ఇంకేమైనా వుందా? నెత్తికెక్కుతుంది? ఈ వేళ రిక్వెస్టు చేసింది_రేపు డిమాండ్ చేస్తుంది అందుకే కావాలని ఈవేళ ఇంటికి లేటుగా వెళ్ళదలుచుకున్నాడు హిహి...." అన్నాడు బ్రహ్మాజీ.
అసలీ భార్యలు భర్తల్ని యింటికి త్వరగా రమ్మని ఎందుకు పీడిస్తారో...?
ఇంటికి త్వరగా వస్తే చేసేదెం వుండదు.... వాళ్ళు వంటగదిలో.... భర్తలు హాల్లో టి.వి ముందు వంటయ్యాక భోం చెయ్యడం, ఆ తరువాత పడుకోవడం....అంతేగా?
అసలు ఈ బ్రహ్మాజీకి భలే గట్స్ వున్నాయ్ లే! పెళ్ళాం మాటని అస్సలు ఖాతరు చెయ్యడు అనుకున్నాడు రాంపండు.
పాపం! బ్రహ్మాజీ ఇంట్లోని రాంపండుకి తెలిస్తే కదా!
నిజానికి ఆ రాజు వుదయం బ్రహ్మాజీ యింట్లో జరిగిన సంఘటనే వేరు!
"సాయంత్రం ఆఫీసు నుండి తిన్నగా యింటికి తగలడ్తున్నారా?" అడిగింది దుర్గ బ్రహ్మాజీని.
"అవును....! నువ్వెల తగలడమంటే అలానే తగలబడతా హిహి... ఎంతైనా నువ్వీ యింటికి యజమాను రాలివి కదా?" అన్నాడు బ్రహ్మజీ.
"ఈ వేళ ఆఫీసు నుండి తిన్నగా యింటికొచ్చాక కాస్సేపు ఎక్కడైనా ప్రెండ్స్ ఇళ్ళలో తగలడి రండి."
"అలాగే" బుడ్డిగ తలూపాడు బ్రహ్మాజీ.
"ఎందుకని అడగేరేం?"
"అలా అడిగితె నీకు కోపం వస్తుందేమోనని" నసిగాడు అతను.
"ఊహూ... ఫర్లేదే! నేనంటే భయభక్తులున్నాయన్న మాట! ఎం లేదు... నేనలా షాపింగ్ కేళుతున్నా.... సాయత్రం వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమోనని. ఇంటికి తాళం వేసి వుండి మీరు బయట మెట్లమీద నాకోసం ఎదురుచూస్తూ కూర్చుంటే అంతా న్నన్నంటారు మొగుడ్ని బయట పెట్టి తాళం వేసుకుని పోయిందని!"
"పోనీ డూప్లికేట్ తాళం చెవి నాకివ్వరాదూ?" భయపడుతూనే అడిగాడు బ్రహ్మాజీ.
"ఎందుకూ.... నేను లేకుండా చూసి వంటగదిలో చేరి ఆమ్లెట్లనీ వేసుకుని మింగుదామనా? అల వీల్లేదు..... ఎక్కడకైనా వూరేగి రండి" అంది దుర్గ క్రూరంగా చూస్తూ.
"అలాగే.... అలాగలాగే! నువ్వెలా చెప్పితే అలానే చేద్దాం.... అల్ రైట్" అన్నాడు బ్రహ్మాజీ గలగలా నవ్వేస్తూ.
బ్రహ్మాజీ దీర్ఘంగా నిట్టూర్చాడు.
"ఇక్కడాపు" ఆటో వాడికి చెప్పాడు రాంపండు.
ఇద్దరూ ఆటో దిగారు. రాంపండు ఆటో వాడికి డబ్బులిచ్చాడు.
పదడుగుల దూరంలో ఓ సిమెంట్ బెంచి వుంది.
"అక్కడ కూర్చుందాం పద!" అన్నాడు రాంపండు.
ఇద్దరూ ఆ బెంచిమీద కూలబడ్డారు. హుస్సేన్ సాగర్ అలలమీంచి చల్లని గాలి వీస్తుంది. ట్యాంక్ బండ్ మీద బస్సులూ, కార్లు, స్కూటర్లు, ఆటోలు గాలి వీస్తుంది ట్యాంక్ బండ్ మీద బస్సులూ, కార్లు, స్కూటర్లు, తోలు అన్నీ వందల సంఖ్యలో పెద్దగా రాదా చేస్తూ... బోల్డంత పోగా చిమ్మూతూ అటూ ఇటూ తిరిగితున్నాయి. అంతా రద్దీగా అక్కడకి వచ్చి కాస్సేపు తిరిగి పోవడానికి చాలామంది వుస్తాహం చూపిస్తారు.
"చూశావా? ఇక్కడున్న సిమెంట్ భెంఛీలన్నిటిలోనూ అడ, మగల జంటలే కూర్చున్నాయ్ మనం తప్ప" అన్నాడు బ్రహ్మాజీ.
రాంపండు అవునన్నట్టు తల వూపాడు.
"ఎంటో...ఇక్కడందరూ జంటలుగా వస్తారు. మన ఒక్క జంటే ఇలా...! నా కెంటో ఇబ్బందిగా వుంది అసలు యింత ఛండాలమైన ప్రోగ్రాం ఎందుకేశావనీ?" అడిగాడు బ్రహ్మాజీ.
నేనేం ప్రోగ్రాం వేసి నిన్ను రమ్మనలేదు. నేనొక్కడినే వద్దామని అనుకుంటే నువ్వే నా వెంట పడ్డావ్...." విసుక్కుంటూ అన్నాడు.
"నువ్వోక్కడివే అయిన ఎం బాగుంటుందీ...? బోరు కొట్టడూ?"
"ఏం కొట్టదు. పైగా ప్రశాంతంగా వుంటుంది. ఇలాంటి చచ్చు ప్రశ్నలేసేవాళ్ళు వుండరు."
" బఠానీలు కావాలా సార?" మళ్ళీ అడిగాడు ఆ కుర్రాడు.
"ముందు నీ తలకాయ్ ని మా యిద్దరి తలకాయల మధ్యలోంచి తియ్యి."
ఆ కుర్ర్డు బుట్టతో సహా రూపాయలివ్వమంటారా? నాల్రూపాయలవి యివ్వమంటారా?"
"మాకేం వద్దు"గట్టిగా అరిచాడు రాంపండు.
