Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 34

 

    అప్పుడు -
    తాచు తలని తన నోటితో పట్టుకుంది కింగ్ కోబ్రా.
    మెల్లమెల్లగా కింగ్ కోబ్రా నోట్లోకి వెళ్ళిపోవడం మొదలెట్టింది త్రాచు.
    కొద్ది క్షణాల తర్వాత అది పూర్తిగా కింగ్ కోబ్రా కడుపులోకి వెళ్ళిపోయింది.
    షాక్ లో ఉన్నట్లు కళ్ళార్పకుండా ఆ దృశ్యాన్నే చూస్తూ ఉండిపోయింది సృష్టి.
    అమె భయాన్ని పోగొట్టడానికా అన్నట్లు సరదాగా అన్నాడు రాజు.
    "ప్రతీ దాన్ని కళ్ళార్పడం మర్చిపోయినట్లుగా తదేకంగా చూడడం నీకు అలవాటు అనుకుంటానే "
    ఏమీ మాట్లాడలేదు సృష్టి.
    "ఇందాక ఏదో చేబుతుంటివే చెప్పు " అన్నాడు రాజు.
    తెప్పరిల్లుకుంది సృష్టి.
    "ఇందాక ఏదో చెబుతుంటివే చెప్పూ" అన్నాడు రాజు.
    తెప్పరిల్లుకుంది సృష్టి.
    "కానిబాలిజం- అంటే స్వజాతి జంతు భక్షణ -- చాలా కొద్ది జంతువులలోనే వుంటుంది. ఉదాహరణకి ఆ కింగ్ కొబ్రానే వుంది. ఈ మహా సర్పానికి పాములే ఆహారం ."
    "దీనికి పాములే ఆహారం కావచ్చును. కానీ మనిషి ఇంకో మనిషిని ఆహారంగా తింటాడా?
    "మనిషి మనిషిని ఆహారంగా తినడం తక్కువ. చాలా సందర్భంలలో ఏదైనా పూజతాలుకూ తంతులో భాగంగా నరమాంసం తింటారు. దీన్నే తెగల మనుషులు తమ తెగలోని పెద్దలు చనిపోయినప్పుడు వాళ్ళ మాంసం తింటే వాళ్ళ శక్తి యుక్తులు తమలోనే ఉండిపోయి, తమకు రక్షణ కలుగుతుందని భావిస్తారు. పెద్దల వేళ్ళ తాలుకూ ఎముకలూ, వగైరాలని తాయెత్తులాగా మెళ్ళో వేసుకుంటారు ."
    వింటున్నాడు రాజు.
    "ఇందాక చెప్పావే -- ఇంగ్లాండులో కొన్ని ఎముకలు దొరికాయి -- వాటిని ఎవరో చీల్చి మూలగని తిన్నట్లు ఆనవాళ్ళు దొరికాయనీ , పరిశీలిస్తే అవి ఎవరో రోగగ్రస్తులూ, వికలాన్గులూ అయిన మనుషులవనీ తేలింది. అంటే ఏమిటి ? సొసైటీకి పనికిరారనుకున్న వాళ్ళని బలి ఇచ్చి, వాళ్ళ శరీర భాగాలని తినడం , అనేది ఒక ఆచారంగా వుండేదన్నమాట .......
    "అయితే నరమాంసభక్షణ అనేది చాలా రకాలుగా ఉంటుందన్నమాట!"
    "డౌటు లేదు! ఈ ఎముకలు నరమాంస భక్షకులు వదిలి వెళ్ళినవి కావచ్చును. లేదా - నర బలి తాలుకూ ఆనవాళ్ళు కావచ్చును. కానీ గొప్ప రిలీఫ్ ఏమిటంటే , ఇవి కూడా కనీసం ఓ రెండు వేల సంవత్సరాల క్రితం వి అయి వుండాలి. కాబట్టి మనకి ఇమిడియెట్ డేంజరు ఏమీ లేదులే ! అంది సృష్టి.
    "ఈ ఎముకలు అంత పురాతనమైనవని ఎట్లా చెప్పగలుగుతున్నావు?"
    "అనుభవం వల్ల" అంటూనే ఎముకల గుట్ట వైపు తీక్షణంగా చూసింది సృష్టి.
    సృష్టి చూపులు ఒక వైపు నిలిచిపోవడం గమనించి తను కూడా అటువైపు చూశాడు రాజు.
    ఎముకల గుట్ట పక్కనే -- ఒక కపాలం పడి ఉంది.
    "ఓహ్! నేను చూస్తున్నది కలా నిజమా? అంది సృష్టి , సంభ్రమంగా.
    "వాటీజ్ సో స్పెషల్?" అన్నాడు రాజు.
    ఆ కపాలాన్ని అందుకుని చూస్తూ "ఇదొక నరవానరం తాలుకూ కపాలం!" అంది సృష్టి ఎగ్జయిటేడ్ గా. "మనిషికీ కోతికీ మధ్య ఒక దశ వుందనీ దాని తాలుకూ పూర్తి వివరాలు మనకి తెలియరావడం లేదని చెప్పాను గదా! నాకు తెలిసినంతవరకూ ఇది అట్లాంటి -- అటు పూర్తిగా కోతీ, ఇటు పూర్తిగా మనిషీ కాని-- నరవానరం తాలుకూ కపాలమే అయి ఉండాలి. దాదాపు ఇట్లాంటి కపాలమే ఇంకొకటి కొంతకాలం కిత్రం ఆఫ్రికాలోని కెన్యా దేశంలో దొరికింది. కెన్యాన్ ద్రోపస్ ప్లేటియోప్స్ అంటారు దాన్ని. అంటే చదునుగా వున్న మొహం గల కెన్యా మనిషి అని అర్ధం. అది కోతి కంటే కాస్త మనిషికి దగ్గర! రాజూ! వండర్ పుల్! అట్లాంటి మనుషులు ఇక్కడ ఇండియాలో ఈ అడవుల్లో కూడా ఉండెవాళ్ళనడానికి ఇది మొదటి రుజువు కావచ్చును.
    అనుమానంగా అన్నాడు రాజు.
    "అయితే ఇందాక మనకి కనబడిన ఆకారం ఒక నరవానరం అయి వుండవచ్చునా?"
    "అదే గనక నిజం అయితే , మనం ఒక అద్భుతాన్ని చూశామన్నమాట -- రాజూ -- నిజంగానే ఇదొక అద్భుతం !
    "ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది " అన్నాడు రాజు సాలోచనగా.
    "ఏమిటది ?"
    "ఇందాక మనం అనుకున్నట్లుగా జనాలని చెదరగొడుతున్న ఆ రాక్షసుడు ఈ నరవానరమే అయి ఉండవచ్చును గదా!"
    "వెరీ పాసిబుల్!" అంది సృష్టి.
    "అయితే ఈ ఎముకలు ?"
    "ఇది అనాది మానవులు నివసించిన ప్రాంతం. ఇక్కడ అప్పట్లో నరభక్షణ జరిగి ఉండవచ్చును. నరబలులు జరిగి వుండవచ్చును. ఇట్లాంటి నరవానరాలు జంతువులనీ, మనుషులనీ కూడా పీక్కుతింటూ ఉండవచ్చును.
    "అది ఇంకా జరుగుతూనే ఉండి ఉండవచ్చును గదా! ఇప్పుడర్ధమవుతుంది . ఆ డుముకు అనే గిరిజనుడిని పొడగాటి గోళ్ళూ, కోరల్లాంటి పళ్ళు ఉన్న శాల్తీ ఏదో గాయపరిచింది. డుముకు వంటికి అయిన గాయాలలో ఎలుగుబంటి బొచ్చులాంటి వెంట్రుకలు ఇరుక్కుని ఉన్నాయి. అవి ఏ జంతువూ తాలూకువో చెప్పలేకపోయారు. టెస్టులలో కూడా తేలలేదు. ఈ నరవానరం అనేది సైన్సుకి అందని స్పెసి]మను. అందుకే ఎవ్వరూ కూడా డుముకుని చంపినా జంతువు ఏదో పోల్చుకాలేకపోయారు. నరవానరాన్నే చూసి డుముకుతో సహా అనేక మంది అది ఒక రాక్షసుడని భ్రమ పడటంతో ఆశ్చర్యం ఏమీ లేదు.
    "అయితే అయి వుండవచ్చును" అంది సృష్టి.
    "సృష్టీ! మనం నిజానికి దగ్గరగా వెళ్తున్నాం అన్నాడు రాజు.
    నిట్టూర్చింది సృష్టి. జగమేమాయ అని వినలేదా రాజూ. దీన్నీ పూర్తిగా నమ్మెయవద్దనీ , దేన్నీ పూర్తిగా కొట్టి వేయవద్దనీ సైన్సు నాకు పాఠాలు నేర్పింది. లెటజ్ సి!" అంది.
    రాజు మాట్లాడలేదు. నోటమాట రానట్లుగా ఒక వైపు చూస్తున్నాడు.
    "ఏమిటి ?" అంది సృష్టి కూడా అటువైపు చూసింది.
    చెట్ల వెనక అలికిడి అవుతోంది.
    చెట్లు చలిస్తున్నాయి.
    వాటి వెనకగా --
    రెండు బ్రహ్మాండమైన ఆకారాలు !!
    "ఇందాకటి ఏనుగులేనా?" అంది సృష్టి గుసగుసగా.
    'అయివుండాలి "
    "నెమ్మదిగా వాటిని సమీపించాడు రాజు. రెండు ఏనుగులూ యమ బాధపడుతున్నాయి. వాటికి అంతిమ క్షణాలు ఆసన్నమయినట్లుగా ఉంది. కిందపడి అటూ ఇటూ కదులుతున్నాయి అవి. కొద్ది క్షణాల తర్వాత నెమ్మదిగా వాటి కదలిక ఆగిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS