చిత్రచేసి చూసింది.
చేసిన తప్పని దాచుకోలేక పోయింది చిత్ర.
చేతుల్లో మొహాన్ని దాచుకుంటూ బావురుమంది.
మేరీ నవ్వింది.
ఆ నవ్వలో విరక్తి ఇంకా తనకేం మిగిలిందన్న ఓ బాధ వున్నాయి.
"రాబర్టు " పిలిచింది.
రాబర్టు తలెత్తి చూశాడు మేరీని.
"నువ్వు ఉత్తముడి వనుకున్నాను కానీ కాదు నువ్వు రాస్కెల్ నీ రోగ్ వీ నీలో మనవత్వం నశించింది గెటవుట్ , వెళ్ళిపో" అంది. అంటూనే కళ్ళ నీరు పెట్టుకొంది.
"మేరీ, నువ్వు నన్ను అపార్ధం చేసుకొంటున్నావు" అన్నాడు రాబర్టు.
"చేసిన పాపం కుండబద్దలు కొట్టినట్టు కనుపిస్తుంటే ఇంకా అపార్ధం చేసుకొన్నానంటూన్నావా రాబర్టు నా ప్రేమకి సమాధి కట్టావు నా ఆశల్ని కోరికల్ని నిలువెత్తు గొయ్యతిసి పాతి పెట్టావు నిన్ను నమ్మినందుకు ప్రేమించినందుకు చాచి లెంపకాయ కొట్టినట్టు చేశావు నాకేం మిగింలింది" బావురు మన్నది మేరీ
రాబర్టు గుండె కలుక్కు మంది.
"ఏడవకు, ఎవరన్న వింటే బాగోదు" ఆమేని వూరడించడానికి భుజం పైన చెయ్యి వేశాడు రాబర్టు.
మేరీ విసురుగా అతని చేతిని తోసేసింది.
"కళ్ళ ముందు జరిగినదాన్ని అంత ఈజీగా మరచి పోయే శక్తి నాకుంటే ఇప్పడి నరకం ఎందుకు! రాబర్టు. ఓటమిని అంగీకరించ లేని 'ఇగో' నన్ను ఎడిపిస్తోందిప్పుడు. ఇంత కంటే చావే నయం."
మేరీ నాగురించి నీకేమి తెలీదు. చెప్పాలని ప్రయత్నం చేసినా చెప్పనిచ్చావు కాదు. ఎప్పడూ నన్ను వెంటాడే గతం నన్నో మనిషిగా బతకనివ్వడంలేదు మేరి జీవించడానికి బతకడానికి తేడా వుంది.
కేవలంబతుకున్నానంతే! నా చుట్టూ వున్న సమస్యలు సమాజం. చట్టం అన్నీ వన్నో నేరస్దుడిగా చేసి అడిస్తుంటే గుండెల్లో రగిలిన జ్వాల నన్ను రెచ్చగోడుతుంటే ఆశలన్నీ చచ్చిపోయిన నాలో మంచి కూడా చచ్చిపోయింది. బూడిదలోంచి జీవాన్ని రప్పించ గల నేర్పు ఎవరికి వుంటుంది చెప్పు" ఆవేశంగా అన్నాడు రాబర్టు.
మేరీ ఎడుపులోనే నవ్వింది.
"బాధ్యతలని అంగీకరించలేని మనుషులు న్తేతిక బాధ్యతలని. మానవతని గురించీ ఆలోచించరని నువ్వు రుజువు చేశావు. రాబర్టు నిన్ను నమ్మి నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టి నలిగిపోయి, ఒడిపోయిన నా తెలివి తక్కువ తనం మీద నాకు రోత కలుగుతోంది. కళ్ళు మూసుకున్నా నిన్ను కొలిచాను కానీ అప్పుడు! కళ్ళు ఎదురుగా వున్న నిన్ను చూడాలని లేదు నాకు బాగా బుద్ది చెప్పావు. నీకు రెండు చేతులూ ఎత్తి జోడిస్తున్నాను దయచేసి వెళ్ళి ఫో మళ్ళి నాకు కనబడ్డానికి మాత్రం ప్రయత్నం చేయకు" అంటూ మేరీ కూలబడి పోయింది.
చిత్ర లోపలి గదిలో ఏడుస్తోంది.
రాబర్టు బయటికోచ్చేశాడు.
అతన్ని సజీవంగా తగలబెడుతున్నట్టుగా వుంది.
రాబర్టుకి అంతా ఓ పిడ కలలా వుంది.
ఎందుకిలా జరిగిపోతున్నాయి? తన జీవితాన్ని ఒక్కో సంఘటన ఒక్కోమలుపు తిప్పతోంది.
ఏది జరిగినా అనుకోకుండా జరుగుతున్నాదే కానీ ఆలోచించి ప్లామ ప్రకారం చేసినవికావు.
అతనికి నవ్వొచ్చింది.
"ల్తేన్ ఈజ్ నధింగ్ బాట్ ఏ యూస్ లెఫ్ ఫాషన్."
రాబర్టు కిది అంత సీరియస్ విషయంలా కనబడలేదు. కారణం అతనికి మొరాలిటీ అనేది ఎప్పుడో పోవడమే!
అయితే అది పోవడానికి కారణం.
అతను అనుభవించే భయంకర జీవితం?
"కొందరి జీవితాలు ఇలా కష్టాలకే పరిమితం అవుతాయి కాబోలు" అనుకున్నాడు రాబర్టు.
అనుభావాలు మనిషికి మంచివారిని చూపిస్తాయని అంటారు
విజ్ఞనం, సంస్కారం, మంచితనం నీడనా పెరిగినా వాళ్ళకి ఓక్షణం కాదు ఒక్కసారి బాధని గుర్తుచేసిన అనుభవాన్ని మరో తియ్యని అనుభవం మాన్పుతుంది.
ఇది జీవితం.
ఆశమీద, బతుకుమీద మమకారం పెంచుకోకపోతే జీవితానికి అర్ద్గం లేదు నిర్వికారంగా మనిషి జివించనూలేడు.
బాధలని మరచిపోలేక__
బాధలో సుఖంకోసం వెతుకులాట!
రాబర్టు నవ్వుకున్నాడు.
బాధలో సుఖం!?
అలాంటి సుఖంకోసం ఆరాటపడ్డం సుద్ద వెర్రితనం.
అంతలోనే అతనికి బాధనిపించింది.
ఎవరో పనికట్టుకుని తనపైన కక్ష సాదిస్తున్నట్టుగా ఎందుకిలా జరుగుతోంది?
తలలో నరాలుచిట్లిపోయి ప్రాణం బోయేలా వుంది రాబర్టుకి.
తన కిప్పుడు విశ్రాంతి కావాలి.
అవును విశ్రాంతి.
అసలు విశ్రాంతి ఎలా వుంటుంది?
అదెక్కడ దోరుకుతుంది?
కాశ్మీర దగ్గరకి వెళితే!
శాంతి దొరుకుతుంది కానీ ఆమె భర్త అడ్డుగా వుంటాడు.
