"ఇంకేం మాట్లాడోద్దు.... పడుకోండి!" అతని రెండు భూజల మీద చేతులేసి కూర్చోబెట్టింది.
అతను ఒళ్ళు ఝల్లుమంది.
ఆమె బెడ్ రూం లైటు అర్పి మంచం మీద ఆ చివర పడుకుంది.
"ఏంటి? ఇంకా అలానే కూర్చుని వున్నరా? పడుకోండి."
దడదడలాడే గుండెతో రాంపండూ మంచం మీద శరీరాన్ని వాల్చాడు.
నిశ్చబ్దం.... వైష్ణవి ఎటు తిరిగి పడుకుంది? రాంపండు మనసులో ఆలోచన.
అతను మాత్రం వేల్లకిలా పడుకుని వున్నాడు.
బాగోదేమో?!....
అటువైపుకి తిరిగి పడుకున్నాడు.
"మీకు వెల్లకితలా పడుకోవడం అలవాటైతే అలానే పడుకోండి. నా గురించి ఆ ప్రక్కకి తిరిగి పడుకోవాల్సిన అవసరం లేదు" వైష్ణవి మృదువుగా పలికింది.
రాంపండు ఉలిక్కిపడ్డాడు.
ఈమేకి ఛీకట్లో కూడా కనిపిస్తుందా?
"పర్వాలేదు! నేను ఎ పొజిషన్ లోనైనాపడుకోగలను" అన్నాడు.
కొన్ని క్షణాలు మౌనం తర్వాత అడిగాడు రాంపండు-
"అసలిలా ఎందుకు చేశారు? చేశావు?"
"బయట మిమ్మల్ని సోపాలో పడుకోబెట్టడం యిష్టం లేక.... పోనీ ఆ సోఅపాలో నేనే పడుకుందాం అంటే నాకు నిద్ర పట్టాడు గనుక.... నేనిక్కడ పడుకోవడం మీకు అభ్యంతరం అయితే నేనే బయటికెళ్ళిపోతాలెండి..." అంది వైష్ణవి.
"అబ్బే! అభేభ్హే! నేనడుగుతుంది ఆ విషయం గురించి కాదు.... నన్ను... ఇలా...నాలుగున్నర లక్షలూ..." నసిగాడు రాంపండు.
"ఇప్పటికీ అర్దరాత్రి అయ్యింది. ఆ విషయం గురించి మరోసారి తీరుబడిగా చెప్తా.... పెఅస్తుతానికి పడుకోండి" అంది వైష్ణవి.
రెండు నిమిషాల తర్వాత వైష్ణవి భారంగా ఊపిరి తియ్యడం వినిపించింది అతనికి.
నిద్ర పోయినట్టుంది....!
అతనికి అ రాత్రి నిద్రపట్టలేదు. కారణం రకరకాలా ఆ ఆలోచనలు. అంతేకాకుండా ప్రక్కన మంచం మీద అందమైన అమ్మాయి!
ఏ మగాడి నిద్ర పడుతుంది?
* * * *
ఉలిక్కిపడి నిద్రలోంచి లేచాడు రాంపండు.
గడియారం వంక చూశాడు. టైము ఎనిమిది గంటలైంది. రాత్రంతా నిద్రలేక ఎప్పుడో తెల్లారుతుండగా నిద్రలోకి జారుకున్నాడు. అందుకే లేచేసరికి ఆలస్యం అయ్యింది.
బాబోయ్ ఆఫీసు! "రాజీ!" అని అరుస్తూ మంచం మీంచి ఒక్కదూకు దూకాడు.
గది గుమ్మం రాకెట్ ళ దాటుతుండగా మెత్తని శరీరం అతని శరీరాన్ని డీ కొంది.
"ఎందుకండీ అంత కంగారూ?" అడిగింది వైష్ణవి.
అప్పుడు గుర్తొచ్చింది అతనికి తను ఇది వరకటి యింట్లో లేడని.
"ఆఫీసుకు టైమైంది. సారీ!" అన్నాడు రాంపండు.
"మరేం ఫర్వాలేదు. మీకు టైంకి అన్నీ అందించడానికి నేనున్నానుగా?" చేతిలోని టూత్ బ్రష్ పేస్ట్ తో సహా అతని చేతిలో పెట్టండి తన భుజం మేడి టవల్ ని అతని భుజం మీద వేసింది.
"మోహం కడుక్కొండి .... ఈలోగా నేను కాఫీ కలిపి రెడీ చేసిపెడతా."
రాంపండు ఆమెవంక కృతజ్ఞతా పూర్వకంగా చూశాడు.
అతనికి రాజీ గుర్తొచ్చింది. రాజీని అడిగినా చెయ్యదు. "అన్నీ నేనే అందిచాలా? పేస్టూ, బ్రష్హూ అక్కడే విన్నయిగా....మీరు అందుకోలేరూ?" అంటూ చికాకు పడ్తుంది.
వంట కూడా చకచకా చేసేసింది వైష్ణవి. ఆమె మొహంలో చికాకనేది లేదు. చెక్కు చెదరని చిరునవ్వు!
ఆహ! ఆడదంటే ఇలా వుండాలి అనుకున్నాడు.
ఆ పూట భోజనంలో కూడా అన్నీ అతనికి యిష్టమైన ఐటమ్సే!
తృప్తిగా భోజనం చేసి ద్రాస్ వేసుకుని ఆఫీసుకు బయలుదేరాడు.
"ఇదిగోండి.... టీఫిన్ బాక్స్! మీకు లంచ్ టైమ్ లో తినడానికి." అంటూ బాక్స్ అందించింది వైష్ణవి.
ఆమె తీసుకున్న శ్రద్దకి ముచ్చటేసింది అతనికి.
"మన కారు తీసుకెళ్ళండి" అంది వైష్ణవి.
"వద్దు! నాకు డ్రయివింగ్ రాదు. బస్సులోనే వెళతా... ఇక్కడకి దగ్గరే...." అన్నాడు రాంపండు.
"ఆఫీసునుండి త్వరగా వచ్చేయండి."
అమ్మో! చూశావా అప్పుడే పెళ్ళాంలా ఎలా శాసిస్తుందో?! పెళ్ళాంలా శాసించడమేంటి పెళ్ళామే కదా? పెళ్ళామా? ఎలా? ఛీఛీ.... ఏంటీ కన్ ప్యూజన్.... నెత్తిన గట్టిగా మొట్టుకున్నాడు రాంపండు.
"ఆపీసునుండి త్వరగావచ్చేయండి."
నెత్తిన గట్టిగా మొట్టుకున్నాడు రాంపండు.
"పోనీ మీకంత అర్జంట్ పనులుంటే ఆలశ్యంగానే రండి" అంది ఆమె.
"అబ్బే! ఛీఛీ... నేనిప్పుడు బుర్రకాయ్ మీద మొట్టుకున్నది అందుక్కాదులే. వేరే విషయం. అని గబగబా బయటికొచ్చాడు.
"ఏవండీ!" వెనకనుండి వైష్ణవి పిలిచింది.
రాంపండు వెనక్కి తిరిగాడు.
నవ్వుతూ టాటా చెప్పింది వైష్ణవి.
రాంపండు గుమ్మాయిపోయాడు. అతను కూడా ఆమెకి టాటా చెప్పి ముందుకు కదిలాడు.
హూ! రాజీ అనాడయినా యింత ముచ్చటగా టాటా చెప్పిందా? అనుకున్నాడు.
'బాబోయ్ ఏంటది? కొంపదీసి నేనుగానీ వైష్ణవి మాయలో పడుతున్నానా? అలాగైతే రాజీ అన్యాయమైపోదూ? నో నో.. నా మనసుని అదుపులో వుంచుకోవాలి! అనుకున్నాడు రాంపండు.
పూర్ రాంపండు! అదేంత కష్టమో అతనికి అప్పుడు తెలీదు!
* * * *
సమయం సాయత్రం అయిదయ్యింది. ఫైల్స్ అన్నీ సర్దిపెట్టిలేచాడు రాంపండు.
ఉదయం వైష్ణవి తనని యింటికి త్వరగా రమ్మని చెప్పింది. ఆమె చెప్పినట్టు త్వరగా వెళితే లోకువ కట్టేస్తుందని అనుకున్నాడు. రాజీ తనని వైష్ణవి అమ్మి వుండొచ్చునేమోగానీ అతను మానసికంగా ఆ విషయాన్ని అంగీకరించడంలేదు. ఆమె చెప్పినట్టు ఎందుకు చెయ్యాలి? ఆమె త్వరగా రమ్మని అంది కాబట్టి ఇంటికి ఆలశ్యంగా వెళ్ళాలి!అనుకున్నాడు రాంపండు.
అప్పటిదాకా ఏం చెయ్యాలి?
ట్యాంక్ బండ్ కివెళ్ళి కాస్సేపు కూర్చుంటెనో?
ఆ ఆలోచన అతనికి బాగా నచ్చింది.
అతను గుమ్మవైపు అడుగులు వేశాడు.
"పండూ!" వెనక నుండి బ్రహ్మాజీ పిలిచాడు.
"నేను కూడా వస్తున్నా అగు!"
బ్రహ్మాజీ రాంపండుని చేరుకున్నాడు.
ఇద్దరూ ఆఫీసు బయటకి వచ్చారు.
"ఏంటి యింటికేనా?" అడిగాడు అతను రాంపండుని.
"ఆ!" యధాలాపంగా అన్నాడు రాంపండు.
"పద.... నేను కూడా వస్తాను." రాంపండు ఉలిక్కిపడ్డాడు.
"మా యింటికా? ఎందుకు?"
