Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 33

 

    నువ్వు చూడ వలసిన ప్రపంచం చాల వుంది నాతొ రా!" అంటూ అటో ఎక్కి కూర్చున్నాడు.
    అయిదు నిమిషాల ప్రయాణం తరువాత చాల విలాసవంతమయిన లొకేషన్ లో ఓ ఇంటి ముందు దిగారు.
    నేరుగా లోనికి నడిచాడు బైరాగి!
    ఇంటి ముందు "భారత నాట్య కళా మందిరం" అన్న బోర్డు ఉంది. విజిటర్స్ రూమ్ లో ఉన్నత స్థాయి కలాకారులతో, అత్యున్నత శ్రేణి, అధికారులతో ఫంక్షన్ లు జరిగినప్పటి ఫోటోలు వ్రేలాడుతున్నాయి.
    గొప్పగొప్ప వారి నుంచి బహుమతులు అందుకుంటూ అన్ని ఫోటోగ్రాపులలో ఒకావిడ కన్పిస్తోంది.
    భరతనాట్య కళామందిరం డైరెక్టర్ ఆవిడ!
    "డైరక్టరమ్మగారు చాల గొప్పావిడ! కనిపించగానే దండం పెట్టాలి! అసలు పేరు లక్ష్మీ నిరంజనం. భర్త లేడు. మా ప్రపంచంలో అందరూ అమ్మగారిని "ఎక్ సితారా' అనే పేరుతొ చెప్పుకుంటారు." ప్రాధమిక పరిచయం పూర్తీ ఆయిం తరువాత లోనికి తీసుకుపోయాడు.
    విజిటర్స్ రూమ్ ప్రక్కన ఓ చిన్న అద్దాల గది వుంది.
    దానిలోంచి పోలిదిన్ పాకెట్స్ తీసుకుని ఒకరిద్దరు బయటకు వెళ్ళి పోతున్నారు.
    నిర్భయంగా లోనికి వెళ్ళాడు బైరాగి!
    "అమ్మగారిని చూడాలి! అన్నాడు నిర్భయంగా! సెక్రటరీ స్థానంలో కూర్చున్నావిడ నిర్లక్ష్యంగా చూసింది.
    "ఏం? నాతొ చెప్పకూడదా?" అని అడిగింది.
    "చెప్పవచ్చు. కాని అమ్మగారిని చూడాలి"
    "ఎవరూ లేరు వెళ్ళు" అందావిడ! అద్దాల గదిలోంచి అత్యాధునికంగా లానిష్ గా ఉన్న మరో గదిలో కాలు పెట్టారు.
    ఓ ఖరీదయిన దంతపు బొమ్మని పరిశీలిస్తున్న లక్ష్మి నిరంజనం  తల యెత్తి చూసింది. కనుబొమ్మలతో ప్రశ్నించింది.
    "ఈ బాబుగారూ ఎం.ఏ చదువుకున్నారమ్మ! నా అనే వాళ్ళు కూడ లేని అవరా! అర్జంటుగా డబ్బు కావాలి!"
    "పదివేలు ! అది చాలదు. ఆ తరువాత లక్షలు కావాలి" అన్నాడు .
    "నువ్వు స్థిరబడ్డ గలిగితే లక్షలు సంపాదించటం గొప్ప కాదు. ధైర్యం కావాలి! చలాకీతనం కావాలి! అంతకు మించి విశ్వాసం కావాలి! చదువుకున్నవాడివి!
    "అర్ధం చేసుకో! డబ్బు యెంత కావాలన్న యిస్తాను" అందామె.
    ఇలా తీసుకువచ్చి యిరికించేశాడు బైరాగి!
    ఆలోచించుకునేందుకు సమయం చాలదు.
    "నాకు డబ్బు కావాలి. అందుకోసం ఏమైనా చేస్తాను" అన్నాడు.
    "నేనొక బ్రీఫ్ కెస్ యిస్తాను. అది సేట్ నట్వర్ లాల్ కి యిచ్చి అతడి యిచ్చే డబ్బు తీసుకురా! చిన్న పనికి ప్రతిఫలం పదివేలు" అందావిడ. జయసింహ తల ఊగించాడు.
    
                               14

    "ఇప్పుడు సమయం ఎంతయింది?" ఎద్దులా ఉన్న బుల్ డాగ్ ని ఓళ్ళోకి తీసుకుని బుజ్జగిస్తూ అడిగింది లక్ష్మీ నిరంజనం.
    జయసింహ గోడ గడియారం వంక చూశాడు.
    "మూడు గంటల అయిదు నిముషాలయింది" అన్నాడు. ఆమె అమితశ్చర్య పడిపోతున్నట్లు కళ్ళు చికిలించింది. బుల్ డాగ్ ని మరింత మీదికి లాక్కుంది. దాని వెనుక కాళ్ళు ఆమె ఒడిలో వున్నాయి.
    ముఖం ఆమె గుండెల మీద వుంది. గరుకుగా వున్న నాలుక బయటికి తీసి మెడ క్రింద నాకుతోంది. దాని స్పర్శలో ఏదో తన్మయభావం వున్నట్లుగా ఆమె క్షణ కాలం పాటు కళ్ళు మూసుకుంది.
    "చేతికి గడియారం కూడ లేదన్నమాట! ఎందుకింత దరిద్రం అనుభావిస్తున్నావు? ఈ ప్రపంచంలో కావలసిందల్లా సంపాదించుకో గలిగినవాడే గొప్పవాడు , వాడే మగాడు.
    నీ తెలివి తేటలకు తోడు నమ్మకంగా పనిచెయగలిగితే నీ దరిద్రాన్ని కొద్ది రోజుల్లో మాయం చేస్తాను. సెక్రటరీ!' అని పిలిచించామే. ఆ పిలుపు అందుకుని అద్దాల గదిలో ఉన్న అమ్మాయి పరుగు పరుగున వచ్చింది.
    "నీ పేరేమిటన్నావూ?" బుల్ డాగ్ తో ఏక్ సితారా వ్రేళ్ళు అడుగుకుంటున్నాయి. తల యెత్తి చూసి అడిగింది.
    "జయసింహ!"
    'చూడు జయసింహ! ఆమె వెంట వెళ్ళు! ఈ దరిద్రపు గొట్టు వేషం మన వ్యాపారం లో పనికి రాదు. నువ్వు ప్రతి క్షణం ఖరీదయిన మనిషిలా కన్పించాలి! అది నీ ఉద్యోగ బాధ్యతల్లో ఒకటి!
    ఏం కావాలో అడిగి తీసుకో!' బుల్ డాగ్ ని అలా కానిలించుకునే రెండు కాళ్ళ మీద నడిపిస్తూ ఆ గది వెనుక వున్న పడక గదిలోకి వెళ్ళి పోయింది ఏక్ సితారా!
    సెక్రటరీ జయసింహ వెంట పెట్టుకుని తన గదిలోకి వచ్చింది. బైరాగి తన రికమెండేషన్ అద్భుతంగా సక్సెస్ అయినందుకు ఏంతో సంతోషంగా చూస్తున్నాడు.
    "మీకు నచ్చిన గడియారం తీసుకోండి" బీరువా లోంచి ఓ యిరవై ఫారిన్ కంపెనీల గడియారాలు టేబిల్ మీద పెట్టింది.
    అదోలా చూశాడు జయసింహ!
    "ఇవి నచ్చకపోతే మరికొన్ని చూపుతాను" అంది సెక్రటరీ!
    "నో! నో! ఇది చాలు" ఓ రిస్టు వాచీ అందుకున్నాడు. మరో గదిలోకి వెళ్ళారు. అక్కడ వివిధ దేశాలకి వివిధ జాతులకి సంబంధించిన రెడీమేడ్ దుస్తులున్నాయి.
    హ్యాండ్ స్టిక్ లు, షూలు, టై లు కారు నంబరు ప్లేట్లు ఎయిర్ బాగ్ లు, టీవి లు, టేప్ రికార్దర్లు వున్నాయి. అదొక లోకంలా వుంది.
    ఇతర దేశాల నించి ఎక్కువ జనాభా కళ్ళు కప్పి దేశంలోకి దూరి వచ్చిన వస్తువులు ఎన్నెన్నో వున్నాయి!
    పది నిమిషాల అనంతరం ట్రిమ్ గా తయారయి బ్రీఫ్ పట్టుకుని విజిటర్స్ రూం లోకి వచ్చాడు జయసింహ!
    అక్కడ యిద్దరు పోలీసు అధికారులు కూర్చుని వున్నారు.
    "భ్రీఫ్ ఏమయింది?" అని అడిగాడు ఒక వ్యక్తీ!
    ఇలాంటివి ఎదురయినప్పుడు తాను చేయవలసిందేమిటో అంతా సెక్రటరీ బోధించింది.
    బ్రీఫ్ ని కింద ఉంచాడు. కోటు జేబుల్లోకి వెళ్ళాయి చేతులు!
    మరు క్షణంలో అతని ముఖం కఠినంగా మారిపోయింది. జేబులోంచి వెళ్ళిన చేతులు బయటికి వచ్చాయి.
    ఒక చేతిలో నోట్ల కట్ట వుంది.
    మరొక చేతిలో రివాల్వర్ వుంది.
    "చూడు మిష్టర్! ఈ చేతిలో డబ్బుంది. ఈ రివాల్వర్ లో బుల్లెట్లున్నాయి. నీకు ఏది కావాలనుకున్నా కోరుకునే అవకాశం నీకే యిస్తున్నాను. అర నిముషంలో తేల్చుకో!" అన్నాడు జయసింహ! అనుకోని తీవ్ర పరిణామాలు యెదురుయినప్పుడు స్మగ్లర్ కి వుండవలసిన గుండె నిబ్బరం తెగింపూ అతని మాటల్లో ధ్వనించాయి.
    "వెరి గుడ్! నువ్వు నేను ఊహించిన దాని కన్నా స్పీడుగానే వున్నావు. వాళ్ళు పోలీసు అధికారులు కారు. ఆ వేషంలో నగరం మీద తిరుగుతున్నవాళ్ళు! మనవాళ్ళే! వెనుక నించి మాటలు విన్పించాయి . తల త్రిప్పి చూశాడు జయసింహ!
    అతని ముఖం సీరియస్ గా అయిపొయింది.
    "ఇంకెప్పుడు నాతొ ప్రాక్టికల్స్ చేయకండి. మరో అర నిముషం ఆలస్యమయితే బులెట్ రిలీజ్ అయ్యేది!" అన్నాడు.
    "వెరీ గుడ్! పైకి వస్తావు. నాయకత్వ లక్షణాలు చాలా వున్నాయి. వెళ్లిరా! నాలుగు గంటల ముప్పై నిముషాలకి సేట్ నట్వర్ లాల్ షాపు నించి ఎయిర్ పోర్టుకి వెళ్ళిపోతాడు."
    "ఈ లోగా ఈ బ్రీఫ్ అతనికి అందించాలి నువ్వు" అంది ఏక్ సితార బుల్ డాగ్ ని క్రిందికి దింపుతూ!
    బ్రీఫ్ తీసుకుని వెళ్ళిపోయాడు జయసింహ!
    "ఎక్కడిదీ క్రొత్త ముఖం" ఒకడు ప్రశ్నించాడు.
    "మీ పాత ముఖాలు అప్పుడే పోలీసుల దృష్టికి వెళ్ళాయి. మా స్మగ్లింగ్ వ్యాపారంలోకి ఎప్పటికప్పుడు తాజా ముఖాలు కావాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS