చెప్పలేని ఆరాధన ఆమె కళ్ళలో.... ....చూశాడు రాబర్టు.
"దేవుడ్ని చూసినంత సంతోషంగా వుంది విజయ్ మళ్ళి జన్మంటూ కన్నీళ్ళు నిండుతున్న కళ్ళతో చూస్తూ దిగులుగా నించుండి పోయింది.
రాబర్టు మాట్లాడలేదు. గేటు దాటాడు. కాశ్మీర అతను వెళ్ళి పోతుంటే కన్నీళ్ళు నిండుతున్న కళ్ళతో చూస్తూ దిగులుగా నించుండి పోయింది.
నిజం తెలిసేక కాశ్మీరపైన రాబర్టు పూర్తి సానుభూతి కలిగింది.
అతనికి ఆమెపైన కలిగిన అభిమానం వల్లనే శశిభూషణ్ కి ప్రాణాలు దక్కాయి.
రాబర్టు ఆలోచనలకి పదును పెడుతున్నాడు. పూర్ణ వాడి ముఠాహైదరాబాదులోనే వున్నారు.
ఈ సారి తన కళ్ళబడితే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు తను దేవుడు కూడా గుర్తుపట్టాలేనంత చిత్రి పట్టేయ్యాలి.... కొడుకుల్ని, కసిగా అనుకున్నాడు.
అప్పటికే మేరి ఇంటి దగ్గర కోచ్చేశాడు. చేతిలో చివరి దశలో వున్న సిగరెట్ పికని అవతల పారేసి మెత్తెక్కి తలుపు కొట్టాడు.
చిత్ర తలుపు తీసింది.
అతన్ని చూడగానే ఏనుగెక్కినంత సంబరం కలిగింది చిత్రకి.
రాబ్ర్టు లోపలి కోస్తూనే అడిగాడు.
"మేరి ఏం చేస్తోంది?"
అతని ప్రశ్నకి చిత్ర చిన్నబుచ్చుకొంది.
"ఎప్పడూ క్కగురించే అడుగుతావు ఎదురుగా వున్న దాన్ని నేనసలు నీ కంటికే కనబడనా?"
రాబర్ట్ చిత్రకేసి చూశాడు.
నిండు యవ్వనంతో పెట పెట లాడిపోతుంది చిత్ర.
"పనికిరావకీ నేను అన్నానా?" అన్నాడు కాళ్ళనింఛి బూట్లు నిప్పతూ.
చిత్ర తలుపులు బిగించి వచ్చింది.
"అక్కకి స్కూల్లో పంక్షన్ వుంది. కాస్త ఆలస్యంగా వస్తుంది" చెప్పింది చిత్ర అదోలా నవ్వుతూ.
రాబర్ట్ మంచంప్తెన పడుకున్నాడు. అక్కగారికి కాబోయే భర్తని తెలిసి చొరవగా వచ్చి మంచంప్తెన కూర్చుంది చిత్ర మెల్లగా అతని గుండెమీద వాలిపోయి అతని కళ్ళలో కళ్ళుపెట్టి చూస్తూ అంది.
"ఇప్పడి మంచానికే అందమొచ్చింది" రాబర్టు నవ్వాడు.
"నీకేం కావాలి" అడిగింది.
"ఏమివ్వాలనుకొటుంన్నావు.
"నువ్వేం కావాలంటే అది. కాఫి టి విస్కీ కౌగిలి ముద్దు ఇంకా" అంటూ నవ్వేసింది.
"కాఫి ఇవ్వు" అన్నాడు.
చిత్ర అలిగినట్టుగా బుంగామూతి పెట్టి అంది.
"ఇంతదూరం వచ్చింది కప్పు కాఫి కోసమా?" ఆమె లేవబోతుంటే జాకెట్ లోంచి నున్నని నునుప్తెన టెన్నిస్ బంతుల్లా తళ తళ లాడుతూ కనపడ్డాయి రాబర్టుకి.
చిత్ర వెళ్ళి ప్లాస్కులో కాఫీని కప్పులోపోసి తీసుకొచ్చి అతనికి అందించింది.
అతను కాఫి తాగుతుంటే అడిగింది చిత్ర.
"నన్ను చూస్తే నికేమనిపోస్తుంది?"
"చెంపలు పగలకొట్టాలనిపిస్తుంది. అన్నాడు రాబర్టు.
"నిజామా?" జాలిగా అడిగింది చిత్ర .
"అవును లేకపోతే అదేంప్రశ్న" అన్నాడు.
చిత్ర మెల్లగా వంగి అతని చెంపప్తెన ముద్దు పెట్టుకొంది. రాబర్టు చేతులు ఆమె నడుంచుట్టూ పడినయి దగ్గరగా తీసుకుని గట్టిగా కౌగింలించుకున్నాడు.
"రాబర్ట్ నువ్వంటే నాకు పిచ్చి!" అంది చిత్ర. లాస్యం అయితే మళ్ళి మేరి ఎక్కడ వస్తుందో, దొరికిన అవకాశమ పోతుందన్న భయంతో చిత్ర అతన్ని మరింతగా చుట్టుకుపోయింది.
ఒకరి ఊపిరి ఒకరికి తగులుతోంది.
రాబర్టునీ తన మీదికి లాక్కుంది చిత్ర. అతను తనకి పూర్తిగా అధినం అయాడన్నా నమ్మకం చిక్కాక తృప్తిగా కళ్ళు మూసుకుంది చిత్ర ఇద్దరికీ టైమ్ తెలీడం లేదు ఒకరి నొకరు చూసుకుంటూన్నారు. అతను ఆమెలో ఇంకా ఏదో మిగిలిపోయిందిమో అన్నట్టుగా మత్తుగా తడుము తున్నాడు.
తలుపు చప్పుడు.
ఎవరో కొడుతున్నారు.
"అక్క" అంది చిత్ర భయంగా.
రాబర్ట్ లేచి కూర్చుని సిగరెట్ వెలిగించాడు. చత్ర లోపలకి పరుగెత్తింది.
తలుపుకొడుతూనే వున్నారు.
రాబర్ట్ వెళ్ళి తలుపుతీశాడు.
మేరి!
అతన్ని చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి నడిచింది.
చిత్ర బెదిరిపోయిన మనసుతో నలిగిపోయిన శీలంతో కంగారు కప్పపుచ్చకోడానికి చేస్తున్నా ప్రయతాన్ని మేరి గ్రహించింది. మంచం కేసి చూసింది.
నలిగిపోయి, చెదిరిపోయి. అలసిపోయి నట్టున్న దుప్పటి కనబడింది.
మేరికి ఇంకేమి చెప్పనవసరం లేదు అక్కడ ఆ గదిలో మంచంపైన జరిగిందేమిటో పూర్తిగా తెలుసుకోంది.
అతని పట్ల ఆమె పెంచుకొన్న మమతానురాగాలు, ప్రేమా అన్ని ఆ క్షణంలో జుగుప్పగా మారి పోయినాయి.
