రాంపండు సమాధానం కోసం చూడకుండా ఆమె వంట గదిలోకి వెళ్ళిపోయింది.
అతను ఊహించనది ఒకటైతే అక్కడ జరుగుతున్నదంతా మరోరకంగా వుంది.
'ఏంటి బాబోయ్ నకు పిచ్చేక్కేలా వుంది?' అనుకుంటూ కసిగా జుట్టు పీక్కున్నాడు రాంపండు.
"ఏంటి అల జుట్టు పీక్కుంటున్నారు? తలలో దురదగా వుందా? చికాకుగా వుందా? పోనీ తలకి స్నానం చేస్తారా?" మళ్ళీ వెనక్కి, హాల్లోకి వచ్చిన వైష్ణవి లోపలకి అడిగింది.
"అబ్బే... చికాక? లేదే!... దురదా?? అస్సలు లదే!!.... హహహ.... నాకేం తోచనప్పుడు అలా జుట్టు పీక్కుంటానన్నమాట!" కంగారుగా అన్నాడు రాంపండు.
వైష్ణవి నవ్వుకుంటూ వెళ్ళింది.
* * * *
డైనింగ్ టేబుల్ మీద ఐటమ్స్ చూసిన రాంపండుకి మతిపోయింది.
చికెన్ ప్రై, ఆలూ కర్రీ, కొబ్బరి పచ్చడి, సాంబారు, గుమ్మడి వడియాలు, అప్పదాలూ ఎట్సెట్రా ఎట్సెట్రా....
"ఇవన్నీ!...ఆశ్చర్యంగా ఏదో అనబోయాడు.
"ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదు... మిమ్మల్ని ఇప్పుడు యింటికి ఎలాగూ తీసుకోస్తానని ముందుగానే వండి వుంచా.... ఇప్పుడు కాస్త వేడి చేశా.... అంతే!" అంది ఆమె.
రాంపండు వాచ్ వంక చూశాడు.
"ఇప్పుడు టైం పదకొండు అయ్యింది! ఇంట రాత్రివేళ ఇంట హెవీ పుడ్ తినడం చాలా కష్టం!"
"మీ కెంత తోస్తే అంతే తినండి!"
ఆమె అల అనగానే అతనికీ రాజీ గుర్తుకొచ్చింది.
"నేనింత కష్టపడి చేస్తే నీకు తినడానికి ఏం రోగం? నువ్వు చచ్చినట్టు తినాల్సిందే?" అంటూ ఇంతెత్తున లేస్తుంది.
నేను తినలేదు బాబోయ్... చాలా హెవీగా వుంది... వంటి వచ్చేలా ఉందని అన్నా వినడు. చచ్చినట్టు బలవంతంగా తినాల్సిందే... సర్లే.... రాజీ పెళ్ళాం కాబట్టి అరిచే హక్కుంది ఈమే ఏమవుతుందని అరుస్తుంది.
అవును... ఈమే ఏమవుతుంది? యజమానురాలా? భార్య అయితే కాదు.
నాలుగు లక్షలు పెట్టి ఓ పనివాడిని ఎవరూ కొనుక్కోరు.... ఒక వేళ కొనుక్కున్నా ఇలా కూర్చోబెట్టి మేపారు.... అయితే భర్తగానా? పెళ్లి కాకుండా, తాళి కట్టకుండా భర్తెంటీ?
ఏమో బాబూ... అంతా కం ప్యూజన్ గా వుంది.
"ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ ఐటమ్స్ మీకు నచ్చావా?"
వైష్ణవి గొంతుతో వులిక్కిపడి ఆలోచనల్లోంచి బయటబడ్డాడు రాంపండు.
"ఊ...? ఆ...?" అన్నాడు అయోమయంగా.
"ఈ ఐటమ్స్ నచ్చావా తినకుండా కూర్చున్నారు?" అడిగింది వైష్ణవి.
"లేదు లేదు.... ఇవన్నీ నా కిష్టమే!" అంటూ కంచంలో చెయ్యిపెట్టాడు రాంపండు
ఐటమ్స్ అన్నీ చాలా రుచిగా అనిపించాయి అతనికి. రాజీ చేస్తే ఉప్పు తక్కువవడమో, కారం ఎక్కువవడమో ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నాడు.
పావుగంటలో భోజనం పూర్తయింది.
ఆటను హాల్లోకి పోయి కూర్చున్నాడు. ఆమె పది నిమిషాల్లో గది సర్దుకుని అక్కడకి వచ్చింది.
"ఇదిగొండి కిళ్ళీ" అంది ఆమె.
ఆటను కిళ్ళీ అందుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఆమె అతని ప్రక్కన కూర్చుంది. ఆమె శరీరం నుండి మట్టయిన పరిమళం....
"ఆహా!ఇక్కడ ఏం వైభోగంగా జరుగుతూంది!
అందమైన ఆడపిల్ల చేతి వంట.... ఆమె చేతితో కట్టిచ్చిన తాంబూలము! అతి చెరువులో ఆమె...
"మీకు?" కిళ్ళీ నములూతూ అడిగాడతను.
"నన్ను మీరు అనకండి..... నువ్వు అనండి" అంది ఆమె.
"నాకు ఇబ్బందిగా వుంటుంది. అయినా మీరు నన్ను మీరూ అంటూ నన్ను మిమ్మల్ని నువ్వు అని అనమంటారేం?"
"నేను మిమ్మల్ని మీరూ అని అనొచ్చు. మీరు మాత్రం నన్ను నువ్వు మిమ్మల్ని నువ్వు అనే అనాలి...ప్లీజ్! మీరలా అంటేనే నాకిష్టం!" ఆందమైన మొహాన్ని దీనంగా పెడుతూ అది వైష్ణవి!
"సరే... నీకు కిళ్ళీ ఏదీ?"
'నాకు అలవాటు లేదు! సరేగానీ మీరు పడుకుంటరా?"
"ఉహూ....ఇప్పుడేగా భైజనం చేశాం.... ఓ అరగంట పోయాక పడుకుంటా."
"టీవీ చూస్తారా?"
"ఊ...."
టీపాయ్ మీది రిమోట్ కంట్రోల్ అందుకుని టీవీ అం చేసిండి.
ఏవో రాష్ట్రానికి చెందిన జానపద నృత్యాలు ప్రసారం చేస్తున్నారు టీవీ వాళ్ళు.
పావుగంట గడిచింది.
అప్పుడు టైము పావు తక్కువ పన్నెండయ్యింది.
రాంపండు ఆవులించాడు.
"పడుకుంటారా?" అడిగింది ఆమె.
"ఊ" అన్నాడతను మరోసారి అవులిస్తూ.
ఆమె టీవీ కట్టేసి లోపలకి వెళ్ళింది.
అతను హాల్లోని లైటార్చి బెడ్ లైట్ వెలిగించుకుని సోఫాలో పడుకున్నాడు.
వెంటనే హాల్లోని లైటు వెలిగింది.
"అదేంటి ఇక్కడ పడుకున్నారు?" ఆశ్చర్యంగా అడిగింది ఆమె.
"మరెక్కడా పడుకోవాలి?!" మరింత ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అతను.
"లోపలకి రండి... భలేవారే" అంది అమె లోపకేళ్తూ.
రాంపండు సోఫాలోంచి లేచి ఆమెని అనిసరిమ్చాడు హిప్నటైజ్ చేయపడ్డ వ్యక్తిలా.
"ఇక్కడ పడుకొండి!"
బెడ్ రూంలోని డబుల్ కాట్ ని చూపిస్తూ అంది ఆమె.
"మరి నువ్వు?" అడిగాడతను.
"నేను హాల్లో సోపాలో పాడుకుంటూ."
"సోపాలో పడుకుంటావా? అబ్బే వద్దు.... నువ్విక్కడే పడుకో... నేను హాల్లో పడుకుంటా" ఇబ్బందిగా ముఖం పెట్టి అన్నాడతను.
ఆమె పకపకా నవ్వింది.
"లేకపోతే ఏటండీ.... నీనింకెక్కడ పడుకుంటానూ?... నేనూ ఇక్కడే, ఈ మంచం మీదే పడుకుంటాను."
ఎదురుగా ఎ.కే 47 పెలితనంగా వులిక్కిపడ్డాడు రాంపండు.
ఆమె మళ్ళీ నవ్వింది.
"మీ శీలానికి ఇప్పట్లో ఏం ప్రమాదం లేదు లెండి... డబుల్ బెడ్ రూం అంటే చాలా ప్లేస్ వుంటుంది. మేరు ఈ చివర పడుకుంటే నేనే ఆ చివర పడుకుంటూ..... మధ్యలో బోల్డంత ఖాళీ... సరేనా? ఇంకా చెప్పాలంటే నేను అటు తిరిగి పాడుకుంటూ మీరు ఇటు తిరిగి పడుకోండి....ఏవంటారు?"
"కానీ.... అసలూ...." మొహమాటంగా నసగడం మొదలు పెట్టాడు.
