"యమ్జి ఆర్ అనర్ఘల్! తమిళ్ నాడుకు తలైనర్!" అని ఒకసారి అరిచి, టివీఎస్ స్టార్ట్ చేశాడు అభిషేకన్.
అక్కడే ఆడుకుంటున్న ఒక చిన్న అబ్బాయి ఆ కేకకు అదిరిపడి , ఏడుపు లంకించుకున్నాడు.
"వెధవా! నీకేం పొయ్యేకాలం దాపురించిందిరా?" అంది ఒక స్త్రీ ఇంట్లోంచి బయటికి వస్తూ.
టీవీఎస్ ఆపాడు అభిషేకన్.
"ఎవర్ని నన్నా!" అన్నాడు అనుమానంగా.
"ఎవరు ఎవర్ని ఏమన్నా అది తననే అనుకోని భుజాలు తడుముకుంటాడు అతను.
తగని ఇన్ ఫిరియాటీ కాంప్లెక్స్ అతనికి.
"అబ్బే! మిమ్మల్ని కాదు! మా వెధవని. " ఆని "ఊరకే ఏడుస్తా వెండుకురా! మాయరోగమా!" అందామె.
"ఇది అరిచింది" అన్నాడు గ్రామరు రా\ని ఆ కుర్రాడు అభిషేకన్ ని చూపించి ఏడుస్తూ.
ఉలిక్కిపడి, వెంటనే టీవీఎస్ స్టార్టు చేసాడు అతను.
అశోక్ నగరునుంఛి లక్డీకాపూల్ కి ఏడు నిమిషాల్లో వెళ్ళిపోయాడతను. అ వేగానికి అతని తమమీద ముచ్చటగా మూడే వున్న వెంట్రుకలు త్రివర్ణ పతాకంలా రెపరెపలాడాయి.
ఆఫీసు గేటు ముందు సడెన్ బ్రేక్ తో టివీఎస్ ఆపాడు అభిషేకన్.
నీరెండలో తళుక్కుమని మెరుస్తున్నదేదో అతని దృష్టిని ఆకర్షించింది.
రూపాయి నాణెం!
వెంటనే టీవీఎస్ దిగి, అటూ ఇటూ చూసి, ఆ నాణెం మీద కొచ్చి నిలబడ్డాతను.
ఎవరో వస్తున్నారు అటువేపే!
అతను వెళ్ళిపోగానే తను వంగి ఆ నాణాన్ని .......
ఆ మనిషి దగ్గరయి, మళ్ళీ దూరమైపోయాడు.
ఆశగా వంగాడు అభిషేకన్.
అతను మనసు మూలిగింది.
ఆ మెరుస్తోంది రూపాయి కాదు. రోడ్డు మీద తారులో యిరుక్కు పోయిన కూల్ డ్రింక్ మూత!
నిరాశతో లోపలికెళ్ళి పోయి, ఆ ఆక్రోశం తగ్గేదాకా యాభై ఫోన్ కాల్స్ చేశాడు అభిషేకన్. తమ వాళ్ళందరికీ చెప్పింది ఒకే విషయం.
ఉదయార్కర్ తప్పతాగి చెత్తకుండీ పక్కన పడివుంటే తను చూసి జాలిపడి నర్సింగ్ హోమ్ లో చేర్చాడు.
ఆ యాభై కాల్స్ చేసిన తరువాత అంతటితో ఆగకుండా మరో పదిహేను కాల్స్ చేశాడు అతను.
అవన్నీ ప్రేమ్ కుమార్ కోసం!
ఉదయార్కర్ సమాచారం తను అందరికీ చెప్పాడు. కానీ ప్రే మ్ కుమార్ కి మ,మాత్రం ఇంతవరకు చెప్పలేకపోయాడు. నిజంగా జరిగిన సంగతులేవీ!
ప్రేమ్ కుమార్ ని అర్జెంటుగా కాంటాక్ట్ చెయ్యాలి. అతను కూడా బహుశా తనకోసం వెయిట్ చేస్తూనే వుండవచ్చు.
కానీ ఎక్కడ వున్నాడు అతను? ఎక్కడా దొరకడెం?
పదహారో కాల్ చేశాక అతనికి దొరొకింది ప్రేమ్ కుమార్ ఆచూకి. అతను మరో అయిదుమంది ఫ్రెండ్స్ ని వెంటబెట్టుకుని డిన్నరు ఇస్తానని చెప్పి ఒక హోటల్ కి తీసుకెళ్ళాడు నిన్న మధ్యాహ్నం. హోటల్లో ఒక రూమ్ బుక్ చేశాడు పార్టీ కోసం. వెళ్ళినవాడు ఇంతవరకూ తిరిగి రాలేదు.
బహుశా ఇంకా ఆ హోటల్లోనే వుండి వుండవచ్చు.
టీవీఎస్ మీద వెంటనే ఆ హోటల్ కి వెళ్ళిపోయాడు అభిషేకన్.
అతని ఉహా నిజమే అయింది.
ప్రేమ్ కుమార్ , అతని ఫ్రెండ్స్ డ్రింకింగ్ స్ప్రే లో ఉన్నారు. తాగడం నిద్రపోవడం, లేవడం, త్రాగడం.........
పేక ముక్కలు పడి వున్నాయి నేలమీద.
"స్కాచ్ అయితే యిదే లాభం!
ఎంత తాగినా హాంగోవర్ వుండదు. మెత్తగా , సిల్కులాగా, గొంతులోకి జారిపోతూ......" అంటున్నాడు ప్రేమ్ కుమార్. ముద్దగా వస్తోంది అతని మాట! అని కాసేపు మౌనంగా వుండి అన్నాడు "స్కాచ్ రుచి అందరికీ ఏం తెలుసుందీ?
పందిముందు ముత్యాలు పోస్తే దానికి సంతోషమా!
ఆ ఎడిటరూ అంతే! లిక్కర్ తాగడు. ఆల్కహాల్ తాగనివాడూ రైటరూ కాలేడు. ఎడిటరూ కాలేడు , అవునా?" అని అరమూతలు పడిపోతున్న కళ్ళు బలవంతంగా తెరిచి "ఆల్కహాల్ అంటే గుర్తొచ్చింది. నేనొక పీస్ ఆఫ్ పోయిట్రీ రాశాను. మీకు వినిపించనా? లేదా? వినండి అని రాగయుక్తంగా అన్నాడు "సత్కపుల్ హోలీకులైన నేమి, అక్క హాలికులైననేమి?
అవునా? ఎలా వుంది? వండ్రపుల్ కదూ? హ్హే హ్హే!" అన్నాడు మత్తుగా.
చాలా కాలం కిందటే ఎవరో ప్లే చేసిన "వన్" ని తన సొంతం అన్నట్లు చెప్పుకుంటున్న అతన్ని వింతగా చూసినా, పైకి మాత్రం ఏమీ అనలేకపోయాడు మిత్రులెవరూ కూడా!
కొద్దిసేపటి తరవాత వాళ్ళలో ఒకతను అడిగాడు.
"మరి ఆ ఎడిటరు మీద ఈ టాక్ ఎలా వచ్చింది?"
"ఏ టాక్!" అన్నాడు ప్రేమ్ కుమార్."టాంక్ బండ్ మీద తప్పతాగి పడిపోతే ఎవరో ఇంటికి చేరవేశారని?"
అర్ధవంతంగా నవ్వాడు ప్రేమ్ కుమార్.
