Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 31


    పి.ఏ. కప్ బోర్డులో చూసి - "లేదు సర్" అన్నాడు నిశ్చయంగా.
    ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు ఆత్మారాం.
    "కనబడ్డాడా" అన్నాడు ఎడిటరు ఆతృతగా.
    "లేదు సర్! ఎటు పోయినాడో కూడా ఎవరూ చూడలేదు.
    "హతాశుడైపోయాడు ఎడిటరు.
    కొత్త సీరియల్ మొదలయిపోయింది. కొత్త రచయిత్రి. పేరు కీర్తి. మొత్తం నవల రాసి పంపేసింది పోస్టులో. సాధారణంగా తను అలా వచ్చిన వాటిని యాక్సెప్ట్ చెయ్యడు రైటరుని పిలిపించి , ప్రతి చాప్టరూ థరో గా చెక్ చేసి, ఉభయలకూ సంతృప్తికరంగా వచ్చాక, అప్పుడు రాయడం మొదలెట్టమంటాడు. అది తన పద్దతి. తన పాలసీ కూడా.
    ఇలా పోస్టులో వచ్చిన వాటిని యాజ్ ఇటీజ్ గా పబ్లిష్ చెయ్యడం ఇదే మొదటిసారి.
    దానికి కారణం ఉంది.
    చాలా గొప్పగా రాసింది ఆ రచయిత్రి కీర్తి. తప్పకుండా కీర్తి శిఖరాలను అధిరోహించే సూచనలు ఇప్పుడే కనబదిపోతున్నాయి.
    అసాధారణంగా , ఎక్కువ నోటీసు పబ్లిసిటీ లేకుండానే మొదలెట్టేశారు ఈ కీర్తి రాసిన సీరియల్ ని ఆ సబ్జెక్టు మీద అంత నమ్మకం కదిలింది తనకు.
    సీరియల్ మొదటివారం ప్రింటయిపోయింది. రెండో వారం కంపోజింగ్ లో ఉంది.
    మూడో వారం నుంచి మొత్తం స్క్రిప్టు మిస్సింగు.
    వాట్ టూ డూ! అతని కనుబొమలు ముడిపడ్డాయి.
    అప్పుడు అంది హరిణి మెల్లిగా.
    "కీర్తి రాసిన నవల స్క్రిప్టు కోసమేనా సర్ ఈ కంగారంతా! ఐయామ్ హియర్, నో ఫియర్!"
    "వాట్ డూ యూ మీన్" అన్నాడు ఎడిటరు.
    "ఆ స్క్రిప్టు తాలూకు కాపీ నా దగ్గర ఉంది సర్"
    "ఎవరో రాసిన స్క్రిప్టు తాలూకు కాపీ మీ దగ్గర ఉండటమేమిటీ?"
    "రాసింది ఎవరో కాదు. నేనే కాబట్టి."
    "యూ ఆర్ జొకింగ్" అన్నాడు ఎడిటరు నిశితంగా చూస్తూ.
    "నో సర్! ఐయామ్ వెరీ సీరియస్! కీర్తి పేరుతొ ఆ నవల రాసింది నేనే?"
    "మరి రచన అన్న పేరుతొ కధ" అన్నాడు ఎడిటరు అనుమానంగా.
    "అదీ నేనే?"
    "ఆర్ యూ ప్లేయింగ్ గేమ్స్?" అన్నాడు ఎడిటరు సీరియస్ గా మారిపోతూ.
    అది గమనించి చాలా వినయంగా అంది హరిణి. "దయచేసి తప్పుగా అర్ధం చేసుకోకండి సర్! తమ రచనలు ఎలాగైనా మీ పత్రికలలో ప్రచురితం కావాలని చాలామంది కొత్త రచయితల తాపత్రయం ఉంటుంది. నేనూ దానికి అతీతెరాలినేమీ కాను. ఒక పేరుతొ పంపిన రచన మీకు నచ్చకపోతే, దాని తాలుకు ఇంప్రెస్ నా రెండో రచన మీద కూడా పడి దాన్ని కూడా రిజెక్ట్ చేసేస్తారేమోనన్న భయంతో నా కధని 'రచన అన్న పెన్ నేమ్ తోనూ, నవలని కీర్తి అన్న పెన్ నేమ్ తోనూ పంపాను. నా అనుమానాలకి ఆధారం లేదని తేలిపోయింది. విత్ యూ ఓన్లీ టేలెంట్ కౌంట్స్" అంది సిన్సియర్ గా.
    ఒక్కసారి ఆమె వైపు తీక్షణంగా చూశాడు ఎడిటరు.
    దిస్ మిస్చివన్ లిటిల్ కిడ్.....
    "కీర్తి పేరుతో నవల రాసింది నిజంగా నువ్వేనా?" అన్నాడు.
    "దాని మీద అడ్రసు మా ఫ్రెండుది ఇచ్చాను సర్! అనుమానంగా ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి.
    ఇంకా తీక్షణంగా చూస్తూనే ఉన్నాడు ఎడిటరు. ఆ చూపులో తీవ్రతకు ఆమె జడిసి, తల వంచుకుంది.
    అప్పుడు వినబడింది ఆమెకు అతని నవ్వు. సందేహంగా తల ఎత్తి చూసింది.
    కుర్చీలో వెనక్కి జేరగిలబడి మనసారా నవుతున్నాడు ఎడిటరు మెల్లిగా. ఆమె పెదవులు కూడా చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
    నవ్వు తగ్గాక ఆమె వైపు, అభిమానంగా చూస్తూ అన్నాడు ఎడిటరు.
    "హరిణీ! నీలో ఒక అల్లరి పిల్లతో పాటుగా , గొప్ప రచయిత్రి కూడా వుంది! నా మాటలు గుర్తుంచుకో! యూ ఆర్ డేసైండ్ టూ గో ప్లేసెస్! సీరియల్ మూడో వారం దాటనీ, నాలుగో వారానికి నీ కీర్తి నేల నాలుగు చెరుగులా వ్యాపిస్తుంది! అలా రావాలి ఈ సీరియల్ రెస్పాన్స్. రావాలేమిటి! వచ్చి తీరుతుంది! తప్పదు.
    "మీ మాట చాలవ వల్ల అలాగే అయితే........" అంది హరిణి కృతజ్ఞతగా.
    "నా మాట చలవ వల్ల కాదు, కాగితాల మీద నువ్వు పేర్చే మాటల పొందిక వల్లే నువ్వు కీర్తి శిఖరాలను అధిరోహిస్తావు."
    "థాంక్స్ ఏ లాట్ సర్"
    "మే గాడ్ బ్లెస్ యూ"
    
                             *    *    *    *
    
    తమిళనాడులో తయారయిన అప్పదాలతో సాంబారులతో సాపాటు పూర్తీ చేసి, తమిళనాడు కో అఫెక్ట్స్ వారి లుంగీ విప్పి, తమిళనాడులో తయారయిన బట్టలు తొడుక్కుని, తమిళనాడులోనే తయారయిన టీవి.ఎస్ బయటికి తీశాడు అభిషేకన్.
    స్వాతంత్ర్య పోరాట సమరంలో చాలామంది దేశాభిమానులు కేవలం స్వదేశంలో తయారయిన వస్తువులనే వాడకం చేసినట్లు సమస్తం తమిళనాడులో తయారయిన వస్తువులనే వాడతాడు అభిషేకన్. అతని యింట్లో టీవి దగ్గరనుంచి అన్నీ అక్కడ తయారయినవే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS