Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 32

 

    "నరవానరం - మిస్సింగ్ లింక్ అయి వుండాలి "
    "నరవానరమా?"
    "తర్వాత చెబుతాను . ముందు మనం దాన్ని చేజ్ చెయ్యాలి. రాజూ! ఇది గొప్ప అపర్చునిటీ! ఇద్దరూ పరిగెత్తడం మొదలెట్టారు. అక్కడికి కొద్ది దూరంలో ఒక చిన్న బ్రిడ్జి కనబడుతోంది.
    ఉన్నట్లుండి దాని మీద ప్రత్యక్షమయింది ఆ ఆకారం.
    ఇద్దరూ అటు పరిగెత్తారు.
    వాళ్ళు అక్కడికి చేరుకునే లోపలే ఆ ఆకారం అదృశ్యమయింది.
    "పద!" అంది సృష్టి. బ్రిడ్జి మీద అడుగు పెడుతూ.
    రాజు కూడా బ్రిడ్జి మీద పాదం మోపాడు.
    తక్షణం -
    ఫెళఫేళ మంటూ బ్రిడ్జి కాస్తా విరిగి అగాధంలా కనబడుతున్న లోయలోకి పడిపోయింది !
    "రాజూ!" అని కేక పెట్టింది దూది బొమ్మలా పడిపోతున్న సృష్టి.
    రాజు కూడా తలక్రిందులుగా పడిపోతున్నాడు.
    అగాధంలా వున్న ఆ లోయలోకి వాళ్ళిద్దరూ పడిపోవడం యెట్లా వుంది ?
    విమానాల్లో నుంచి దూకి పారా జంపింగ్ చేస్తుంటారే- అట్లా వుంది.
    పారాచూట్ సాయంతో విమానాల్లో నుంచి దూకేయడం ఒక సాహస క్రీడ - ఒక సైనిక అవసరం కూడానూ.
    విమానంలో నుంచి దూకీ దూకేయగానే పారాచూట్ తెరుచుకోదు.
    తొమ్మిది పది సెకెండ్ల పాటు అట్లా పడిపోతూ వున్న తర్వాత , అప్పుడు తెరచుకుంటుంది పారాచూట్.
    ఒకసారి పారాచూట్ ఓపెన్ అయిన తర్వాత "ఫాల్" వేగం తగ్గుతుంది. గాల్లో తెలుతున్నట్లుగా కిందికి దిగుతారు. పారా చూట్ వల్ల పడిపోయి వేగం తగ్గినా కూడా , అది పూర్తిగా రిస్క్ ఫ్రీ కాదు -- ఒక్కోసారి చెట్ల మీద దిగవలసిరావచ్చును. ఒక్కసారి దిగేటప్పుడు కిందపడిపోయి గాయాలు తగలవచ్చును.
    ఈ సాహసక్రీడలో ఇంకా ఎక్జ్స్ ట్రా స్పెషల్ ఫ్రీ ఫాలింగ్!
    పైనుంచి కిందికి దూకేసిన వాళ్ళు పారా చూట్ ని తెరవకుండా, సాధ్యమైనంత ఎక్కువసేపు కిందపడిపోతూనే ఉండి, గాలితోనే విన్యాసాలు జరిపి, చివరి క్షణాల్లో పారా చూట్ ఓపెన్ చేసి దిగడమే ఫ్రీఫాలింగ్.
    అగాధంలోకి పడిపోతున్న రాజు, సృష్టిల పరిస్థితి కూడా ఫ్రీ పాల్ లాగే వుంది.
    క్షణంలో సగం సేపు ఆలోచించాడు రాజు. గాల్లోనే ఈదుతున్నట్లుగా ఒడుపుగా సృష్టి వైపు వెళ్ళిపోయాడు.
    అతని కంటే అయిదడుగులు కింద వుంది సృష్టి.
    చెయ్యి జాపాడు రాజు.
    ఇద్దరి మధ్య దూరం తగ్గుతోంది.
    కానీ ఈలోగా భూమిని తాకితే ? చటుక్కున సృష్టి నడుము అందుకున్నాడు రాజు.
    అదే క్షణంలో -
    నిలువుగోడలా ఉన్న లోయ అంచున పుట్టి, అడ్డంగా పెరుగుతున్న ఒక చెట్టు కొమ్మని అందుకున్నాడు.
    "బతికిపోయాం!" అంది సృష్టి , ఊపిరి అందాక.
    చుట్టూ చూసి "పైకెళ్ళడం కష్టం లోయలోకే వెళ్ళాలి మనం" అన్నాడు రాజు.
    "నువ్వు రమ్మంటే నరకానికైనా వస్తాను -- నువ్వు ఎక్కడుంటే అదే స్వర్గం అనుకుంటాను " అంది సృష్టి కృతజ్ఞతగా.
    అతి కష్టం మీద ఇద్దరూ లోయలోకి చేరుకునేసరికి గంట పైనే పట్టింది.
    "ఇందాక ఏమిటి నరవానరం అన్నావ్?" అన్నాడు రాజు.
    "వింటావా? సైన్సు చెప్పేస్తున్నా -- మనిషి అనేవాడు పుట్టి ఎన్నాళ్ళయిందో తెలుసా?"
    "చెప్పు"
    "ఇప్పటిదాకా దొరికిన ఆధారాలని బట్టి చూస్తె మానవ జాతి ఒక రెండు లక్షల సంవత్సరాల క్రితం రూపు దిద్దుకుంది."
    "అలాగా!"
    "ఈ మధ్య జెనెటిక్స్ శాస్త్రం చాలా డెవెలప్ అయింది కదా -- జెనెటిక్స్ ఆధారంగా పరిశోధనలు చూస్తె ఒక విషయం బయటపడింది.
    "ఏమిటది?"
    "ఇప్పుడు బతికి ఉన్న మనుషులందరికీ పూర్వీకులు ఇప్పటికీ ఒక లక్షా ఎనభై వేల సంవత్సరాల క్రితం బ్రతికి వుండిన ఒక నీగ్రో వనితట!"
    "నిజంగానా?" అన్నాడు రాజు ఆశ్చర్యంగా.
    "అవును, కులాలు, మతాలూ, భాషాలు, రాష్ట్రాలు, దేశాలు- ఇన్ని రకాలుగా విడిపోయారు కదా మనుషులు - వెళ్ళందరికీ వాళ్ళు ఆర్యులు గానీ , ద్రావిడులు గానీ ఆఫ్రికన్లు గానీ, అమెరికన్లు గానీ, తెల్ల జాతి వాళ్ళు కానీ , నల్లజాతి వాళ్ళు గానీ -- అందరికీ అమ్మ ఒక నీగ్రో స్త్రీ !"
    వింటున్నాడు రాజు.
    డ్రమేటిక్ గా అంది సృష్టి.
    "అయితే - అది ఒక సిద్దాంతం మాత్రమే! ప్రతి సిద్దాంతాన్ని ప్రతివాళ్ళు ఒప్పుకుని తీరాలని లేదుగా ."
    "మరి నువ్వు ఈ సిద్దాంతాన్ని సమర్ధించవా?" అన్నాడు రాజు.
    "నా సొంత సిద్దాంతాలు నాకు ఉన్నాయి ." అంది సృష్టి స్థిరంగా.
    "ఏమిటవి?"
    "అన్నీ ఒక్కసారే చెబితే డైజెస్టు చేసుకోవడం కష్టం -- వన్ ఆట్ ఏ టైం .... వన్ అట్ ఏ టైం"
    "మరి ఆ నరవానరం సంగతి."
    "అది చెప్పుకుందాం. మనిషి పుట్టి దాదాపు రెండు లక్షల సంవత్సరాలు అయిందని చెప్పుకున్నాం కదా -- అంతకు ,ముందు ఏం జరిగింది ! చెట్టు మీద వుంటున్న కోతి కిందికి దిగింది.
    నిటారుగా నిలుచుకోవడం అలవాటు చేసుకుంది. ఆ దశని హోమో ఎరక్టస్ అంటారు. తర్వాత చిన్నచిన్న ఆయుధాలు తయారు చేసుకోవడం మొదలెట్టింది. ఆ దశని హోమోహ బిలస్ అంటారు. అట్లా దశలుగా ఎదిగిన వానరం చివరికి హొమో సేపియన్స్ - అంటే నవీన మానవుడిగా మారింది . అయితే " అని ఆగింది సృష్టి.
    "అయితే ?"
    "మనిషిగా మారే ముందు ఒక దశ ఉండి ఉందని, అది అటు కోతి కాకుండా, ఇటు మనిషి కాకుండా ఉండే దశ అన్నమాట . అంటే నరవానరం! ఆ దశ తాలుకూ అవశేషాలు పూర్తిగా మనకు దొరకలేదు .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS