"వంట మనిషి ఇంట్లోలేదా?"
"సినిమాకి పోయింది. అది నా అదృష్టం."
"శశిభూషణ్ ఇంజనీర్ కదూ?"
"అవును ఉద్యోగం చేయడం లేదు కంట్రాక్టులు చేస్తున్నారు. మా నాన్నకి పక్షవాతం వచ్చినప్పుట్నుంచి."
"ఎక్కడికెళ్ళాడు?"
"క్లబ్బుకి, రాత్రి రెండువరకూ రారు"
"అప్పటివరకు నువ్వు ఒంటరిగా ... ..."
"అలవాటయి పోయింది.
"నిన్నెలా చూసుకోంటాడు?"
అతని ప్రశ్నకి కాశ్మీర సమాధానం చెప్పలేదు.
"మాట్లాడవే!" రెట్టించి అడిగాడు రాబర్టు.
"విజయ్ " అంటూ అతని కళ్ళలోకి చూసింది.
ఇదివరకటి చిలిపితనం ఆమెలో ఏమ్తేపోయిందో అతనికి అర్ధం కాలేదు.
"చెప్పవా? చెప్పలేవా అడిగాడు.
కాశ్మీర నేలకేసి చూస్తూ చెప్పింది.
"పెళ్ళికి ముందు నీతో చనువుగా వుండేదాన్నాని ఎవరో చెప్పారట. అందుకని దొరికిన ప్రతి చిన్న విషయాన్నీ ఆసరాగా తీసుకుని నన్ను మాటలతో చంపుతుంటారు" అంది.
శశిభూషణ్ ప్తెన చాలా చెడ్డ అభిప్రాయం గలిగిందతనికి
రాబర్టుకి అతన్ని దెబ్బ తీయాలన్న అభిప్రాయం పూర్తిగా పోలేదు. అతని భార్యానే అతను వాడుకున్నాడు. అంతకంటే ప్రతికారం ఏం తీర్చుకోవాలి? కానీ ఆ సంగతి వాడికి తెలియదు తెలిసి మళ్ళి మళ్ళి చావాలి. అందువల్ల కాశ్మీర జీవితం నాశనం అవుతోంది. ఇప్పుడు రాబర్టుకి కాశ్మీరకి అన్యాయం జరగటం ఇష్టంలేదు. అందుకే శశి భూషణ్ ప్తెన పాగని ఉపసంహరించుకోవాలి. ఇది తప్పనిసరి పరిస్ధితి అతనికి.
"నే వెళతాను" అన్నాడు.
"మళ్ళి ఎప్పుడు?" అడిగింది.
రాబర్టు చాలా జాలిగా చూసేడు ఆమెని.
తను వేస్తున్న ప్రతి అడుగూ ఎంత ప్రమాదమ్తెనదో అతనికి తెలుసు ఎప్పుడు తప్పటడుగు పడుతుందో ఎప్పుడు తను అంతమ్తేపోతాడో తెలీని స్ధితి అతనిది. ఎప్పుడోస్తావని అడిగితే ఏమని చెప్పగలడు?
"రావా?" అడిగింది. ఆ అడగడంలో అసలు నువ్వెక్కడికి వెళ్ళకు. ఇక్కడే వుండిపో" అని అన్నట్టుగా అనిపించిందతనికి.
"వస్తాను"
"రేపా?"
"ఏమో, ఎప్పుడో నేనే వస్తాను. నా ప్రాణం పోయేలోగా నిన్నోసారి కలుస్తాను" అన్నాడు రాబర్టు.
"ఏమిటా మాటలు!" దిగులుగా అంది కాశ్మీర.
"ఒకవేపు పోలీసులు మరోవ్తేపు చట్టం నా కోసం వేటాడు తున్నారు. నేను హంతకుల నన్వేషిస్తూ కత్తిమీద సాము చేస్తున్న దురదృషవంతుడ్ని విజయ్ అని పేరు పెట్టుకున్నందుక్తేనా జీవితంలో ఒక్క విజయాన్ని సాధించకపోగా అన్ని అపజయాలే నాకు నా గురించీ ఆలోచించి మనసుని పాడుచేసుకోకు కాశ్మీరా!" అన్నాడు రాబర్టు గదిలోంచి బయటకు నడుస్తూ.
అతనోకటనుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించాడు.
కానీ జరిగింది మరొకటి
తెలుసుకున్నది చాలా వుంది.
అదే విచిత్రం.
కాశ్మీర అతని చేతిని పట్టుకొని నడుస్తోంది. చేతిని వాడిలాపెడితే అతను వెళ్ళి పోతాడన్నా భయం ఆమె గుండెలనిండా నిండిపోయింది.
వాళ్ళిద్దరివీ రెండు వై విద్యమైన పోరాటాలు.
గెలుపు.
ఓటమి.
సమాజానికి, ప్రపంచానికి తలవంచి కట్టుకున్న వాడితో బతకాలి.
కానీ మనసు, శరీరం కోరేది ప్రేమించి పోగొట్టుకున్న మనిషిని.
ర్తెలు పట్టాలు ఎంతదూరం కలిసి ప్రయాణం చేసినా అని కలవ్వని ఓ ధియరీ.
అవసరం అనుకుంటే ఆ రెంటినీ కలిపే మార్గం లేదా?
మనసునిండా ఆర్తి.
ఆర్తితో చేతులు చాచినా అందుకోగలిగి, అందుకోలేని దౌర్భాగ్యపు స్ధితిని దేవుడు తనకి కలిగించాడు.
ఒక వేళ అతను తనని ఆహ్వానించినా అతని జీవితంలో ప్రవేశించ గలదా?
ఏమో- ఆ పరిస్దితంటూ వస్తే ఏం చేస్తుందో! కాశ్మీరా మనసులో ఎన్నో ఆలోచనలు.
కీడు చేసినా మనుషుల్ని క్షమించే క్షమాగుణం తనకు వున్నందుకు రాబర్టుకే ఆశ్చర్యంగా వుంది.
ఒకరి చెయ్యి మరొకరి చేతిలో వుంది. ఇద్దరూ పక్క పక్కగా వాడుస్తున్నారు.
చెయ్యి విడవకా తప్పదు.
అతను వెళ్ళిపోకా తప్పదు. ఆమె భర్త ఇంటికి రాడా మరి!
అతనీ స్ధానంలో మరో మగాడుంటే ఆ మనిషి ఏం చేస్తాడు. వహించాగాలడా?
పశువులా మారిపోతాడు. రాక్షసత్వంతో వీజృంభిస్తాడు హత్యలు జరగిపోతాయి.
గేటు దగ్గర కోచ్చేశారు.
అతను ఆమె కళ్ళల్లోకి చూశాడు.
