"ఉండండి.... అలాగైతే ఆయన్ని పిలుచుకోస్తా" డబ్బు సంచి తీసుకుని లోపలకి వెళ్ళింది రాజీ.
డబ్బు బీరువాలో సర్ది రాంపండువైపు తిరిగి అంది_ "నువ్వు ఏవో కాగితాలమీద సంతకాలు పెట్టాలంట...రా"
"నేను రాను... నాకు యిష్టం లేదు... నేను వెళ్ళాను.... నువ్వేం అమ్మక్కర్లేదు కోపంగా అన్నాడు రాంపండు.
రాజీ తెల్లబోయి చూసింది.
"అదేంటి ఇంట జరిగిన తర్వాత యిలా అంటున్నావ్? నువ్వేగా అమ్మేసుకో అన్నావు. నేను ప్రకటన యిచ్చినా పెద్దగా బాధపడ లేదు."
"అప్పుడు అనుండోచ్చు. కానీ ఇప్పుడు ఒప్పుకోనని అంటున్నాను" మొండిగా అన్నాడు రాంపండు.
"అదేంటి అంతా అయ్యాక అలా అంటావు. నేను మొత్తం ద్దబ్బు తీసుకున్నాక వెళ్ళనంటే ఎలా? నిన్న లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నప్పుడు కూడా నువ్వు గోల చెయ్యలేదు."
"ఏమో... నాకు తెలీదు. నేను వెళ్ళాను!"
"నువ్వు నాకొద్దు అని నేనంటుంటే నన్నంటిపేట్టుకుని వుండటానికి నీకు సిగ్గులేదూ?" అంది ఆమె.
ఈ మాటతో రాంపండు అహం దెబ్బతింది.
బీరువ తెరచి తెరచి గబగబా సూట్ కేసులో బట్టలు సర్దుకుని, సూట్ కేసు చేతపట్టుకుని బయటకి నడిచాడు.
"ఎక్కడ సంతకం పెట్టాలి?" వైష్ణవిని అడిగాడు.
ఆమె చూపించింది. చకచకా సంతకం పెట్టి 'పండంది' అన్నాడు.
వైష్ణవి స్టాంఫ్ కాగితాలు హ్యండ్ బ్యాగ్ లో పెట్టుకుని లేచి నిలబడి రాజీతో అంది. "వస్తానక్కా! మీరు కూడా నన్ను చెల్లీ అని సంబోధించొచ్చు. మీరు ఈయన్ని ఓ స్నేహితుడిగా కలవదలుచుకుంటే మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. నాతో మాట్లాడాటానికైనా సరే."
"అలాగే" రాంపండుతో అంది వైష్ణవి.
రాంపండు రాజీవైపు చూడనన్నా చూడకుండా బయటకి అడుగు పెట్టాడు.
"రాజీ... నువ్వు చేసిన యీ పనికి చాలా పశ్చాత్తాపపడ్తావు" అని మనసులో అనుకున్నాడు.
బయట పార్క్ చేసి వున్న మారుతీ కారులో ఇద్దరూ ఎక్కారు. ఆమె డ్రయివింగ్ సీట్లో కూర్చుంది.
కారు ఒక్క జర్క్ యిచ్చి ముందుకు కదిలింది.
అప్పుడు రాత్రి పడి గంటలైంది.
వాళ్ళిద్దరూ బయటకి రావడం.... కారెక్కి వెళ్ళిపోవడం ఆ చుట్టుప్రక్కల వాళ్ళెవరూ చూడల్డు.
* * * *
"ఇదే మన ఇల్లు..." హాల్లోకి వస్తూ అంది వైష్ణవి.
రాంపండు ఆమె వెనకాలే యింట్లోకి ప్రవేశించి సూట్ కేసుని హాల్లోకి ఓ మూల పెట్టాడు.
"కూర్చోండి" సోఫా చూపిస్తూ అంది వైష్ణవి.
రాంపండు సోఫాలో కూర్చున్నాడు. ఆమె లోపలకెళ్ళింది.
అతని మనసంతా అల్లాకల్లోలంగా వుంది.
ఇప్పుడు తన లైఫ్ ఏంటి? అక్కడ తన స్టేటస్ ఏంటి? అక్కడ అంట్లు తోమాలా లేకపోతే ఇల్లు ఊడ్చాలా? ఇవి రెండూ కాకపోతే వంటచేసి బట్టలుతకాలా? లేకపోతే ఇవన్నీ చెయ్యాలా?
రాజీని తనని వద్దని అనుకుంది. తనకేం చెడు అలవాట్లు లేవు. తానెప్పుడూ రాజీ మీద చెయ్యి చేసుకోలేదు. తానేం నీచుడూ దుర్మార్గూడు కాడు. అయినా రాజీ తనని వద్దని అనుకుంది. పోనీలే! తను వద్దని అనుకున్నప్పుడు తాను మాత్రం నాకెందుకు? అంతవరకూ బాగానే వుంది. కానీ ఈమేకి అమ్ముడుపోవడం ఏంటీ...ఇక్కడొచ్చి ఈమెతో వుండడం ఏంటీ?
ఇఇమే తనని బ్నిస క్రింద ట్రీట్ చేస్తుందా?
అయినా ఈమె దగ్గర తను వుండాల్సిన అవసరం ఏముంది?
నేను నిన్ను కొనుక్కున్నాను. చచ్చినట్టు యిక్కడే వుండాల్సిందే అని అందనుకో...ఓ.కే! అంటాడు తను. గిన్నెలు తోమమంటే నాకిదేపనా అంటాడు.... వంట చెయ్యమంటే నాకు రాదనీ చెప్తాడు. జేతం అడిగితె ఇది నా కష్టార్జితం... నీకెందుకు ఇస్తా అని ఇంతెత్తున లేస్తాడు. ఇంకా చాలవిధాల విసుగెత్తించేస్తే నాయనా... నమస్కారం.... నీ దారిననువేళ్ళు అంటుంది. అప్పుడు ఈ ఇంటినుండి తనకీ విముక్తి కలుగుతుంది. తర్వాత రాజీ దగ్గరకి వెళ్ళాలా?
ఛిఛి.... తనని వద్దని అనుకునే డని దగ్గరకి ఎందుకెళ్ళాలి? ఆఫీసుకు దగ్గరగా ఏదైనా మంట పోర్షన్ అద్దెకి తీసుకోవాలి. అందంగా వుంది, చెప్పిన మాట వినే ఓ నెమ్మదస్తూరాలైన అమ్మాయిని వేత్తుకుని మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి.
అప్పుడుగానీ రాజీ టిక్కా వదలదు.
"కాఫీ!"
వైష్ణవి గొంతుతో ఆలోచనల్లోంచి బయటబడ్డాడు రాంపండు.
"నాకు రాదు" అన్నాడు తనని ఆమె కాఫీ పెట్టివ్వమని అంటోందేమో అనుకుని.
"ఏంటి కాఫీ తాగడం రాదా?" ఆమె నవ్వింది.
అతను తలెత్తి చూశాడు.
ఆమె చేతిలో ట్రే-దాంట్లో పొగలు కక్కుతున్న రెండు కాఫీ కప్పులు.
కాఫీ....ఎందుకూ...అసలు....ఇప్పుడు...." అలా సణుగుతూనే కాఫీ కప్పు అందుకున్నాడు.
ట్రేని టీపాయ్ మీద పెట్టి అందులోంచి రెండో కప్పు తీసుకుని సోపాలో రాంపండుప్రక్కన కూర్చుంది వైష్ణవి. ఆమె ప్రక్కనే కూర్చునేసరికి అతనికి యిబ్బందిగా అనిపించింది. అయినా హాయిగా కూడా అనిపించింది.
అతను మెల్లగా కాఫీ చెయ్యసాగాడు.
"చక్కర సరిపోయిందా?" అడిగింది ఆమె.
అతను తల వూపాడు.
ఇద్దరూ నిశ్చబ్దంగా కాఫీ త్రాగారు.
"మీకు ఏం వంటకాలంటే ఎక్కువ యిష్టం? వేజిటేరియనా? నాన్ వేజితేరియానా?" అడిగింది ఆమె.
"కొంపదీసి నాకిష్టమైనా వెంటో చేస్తే అవి తప్ప వేరేవన్నీ నా చేతే పండిస్తుందా ఏంటీ?" అనుకున్నాడు.
"ఎందుకూ?" అని అడిగాడు పైకి మాత్రం.
"చెప్పండి.... మీకు ఏం యిష్టం? వెజిటేరియానా?"
"ఊహూ! నాన్ వెజిటేరియన్!"
"వెరీగుడ్.... నేను కూడా అంతే నాన్ వెజిటేరియన్ నే యిష్ట పడతాను. వెజిటేరియన్ పుడ్ తింటే నాకు గడ్డి తింటున్నట్టనిపిస్తుంది" అంది ఆమె.
'అయితే నీ కోసం యిప్పుడు నన్ను నాన్ వెజిటేరియన్ కూరలనీ చేసి పెట్టమంటావా తల్లీ? చేస్తా చేస్తా... గుప్పెడు కరం, రెండు గుప్పెళ్ళ ఉప్పూ వేసి చేస్తా' అనుకున్నాడు రాంపండు.
నాన్ వెజిటేరియన్ లో ఏ తిప్ యిష్టం? గ్రేవీ టైపా, డ్రైటైపా?" మళ్ళీ అడిగింది.
"పూర్తిగా డ్రై...' అన్నాడు రాంపండు. మనసులో మాత్రం ఏం? ఇప్పుడు లేచి వందన అనుకున్నాడు పళ్ళు నూరుతూ కసిగా.
మొహం కడుక్కోడానికి వేణ్ణీళ్ళు పెడతాను... ఈ లోగా మీరు ఆ డ్రెస్ మార్చుకుని నైట్ డ్రెస్ వేసుకోండి."
