Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 29

 

   
    అతనికి ఆమె ప్రవర్తన  అర్ధంకాలేదు. ఆమె కళ్ళలోని కన్నీటి పొరల్ని చూసి విస్తుపోయాడు రాబర్ట్.

    "దాంక్యు విజయ్ నేనిన్నాళ్ళు ఈ క్షణం  కోసమే తపస్సు  చేస్తూ గడిపాను. చంపేయ్ విజయ్ నేనిప్పుడు చాచ్చిపోడానికి రెడిగా వున్నాను" అంది.


    "ఏమిటిది?" అన్నాడు.

    "నువ్వు నన్ను అర్ధంచేసుకోలేదు విజయ్. నిన్ను నా ప్రాణంతో సమానంగా  ప్రేమించాను నీతో జీవితమమతా బతకాలనుకున్నాను. కానీ ఆ రోజు  నా జీవితానికో పిడకలగా  మిగిలిపోయింది . నిన్ను పోగొట్టు కున్నాను, కుమిలి కుమిలి ఏడుస్తూ నువ్వు కనబడతావనే  ఆశతోనే ఇంకా  బతికున్నాను" వెక్కి వెక్కి ఏడుస్తోంది కాశ్మీర.

    నువ్వు నన్ను చంపుతానంటే ఆనందంగా నీకు సహకరిస్తాను విజయ్ నిజానికి అది చాలా చిన్న శిక్షే నాకు విజయ్ నా పైన  నీకెంత ద్వేషంవుందో గ్రహించి చచ్చిపోయే ముంద్తేనా  ఒక్కసారి నీ చేతుల్లో నలిగిపోవాలని నిన్ను రేచ్చగోట్టాను. నా కోరిక తీరింది ఈ పాపిని చంపేయ్ విజయ్" ఏడుస్తూ అతని కాళ్ళ పైన వాలిపోయింది కాశ్మీర.

    "లే" అంటూ ఆమెని  లేవనెత్తి మంచం పైన  కూర్చోబెట్టాడు రాబర్ట్.

    "ఈ ఇల్లు నీకెలా తెలిసింది?" అడిగింది.

    "శశిభూషణ్ కోసం వచ్చాను"

    "ఎందుకు?"

    "అతన్ని చంపడానికి."

    "విజయ్" అంది  కంగారుగా.

    "ఏమిటి?"

    "ఆయన  నీకేం ద్రోహం చేశారు. చేసింది నేను" అంది కాశ్మీర.

    రాబర్ట్ నవ్వేడు.

    "నేను జేబుదోంగానని  పోలిసులకి పట్టించి ఆర్నెల్లు జ్తేలుశిక్ష వేయించాడు. నువ్వు చేయలేని పని అతను చేశాడన్నమాట కాశ్మీరా నాల్ నీ సాధువు చచ్చిపోయాడు. అయాం ఏ  రఫ్ మెన్.

    "నాకోసం నువ్వు ఆయన్ని క్షమించాలేవా విజయ్" అడిగింది దినంగా  కాష్మర రాబర్టు కాశ్మీర కేసి చూశాడు. జేబులోంచి పిస్తోలుతిసి గాలిలోకి విసిరేసి తిరిగి  పట్టుకున్నాడు.

    "అతని భార్యే నా సాధ్వినం  అయినప్పుడు అంతకంటే శిక్ష ఏం కావాలతనికి" అన్నాడు రాబర్టు.

    "అంటే  ఇదంతా అతనికి..." ఆగిపోయింది. కాశ్మీర.

    "భయపడకు. నేను మరి అంత నీచున్నీ కాదు. అసలు నువ్వు నన్నెలా గుర్తుపట్టావు?" అడిగాడు.

    కాశ్మీర అదోలా నవ్వింది.

    "ఆడది ప్రేమిస్తే ఆ మనిషి ఏ పూపంలోవున్నా పోల్చుకుంటుంది విజయ్  నేను బతికున్నది  నీకోసమే  నువ్వే కనబడకపోతే ఆశాంతితో ,దిగులుతో ఎప్పుడో చాచ్చిపోఎదాన్ని " ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది.

    కాశ్మీర చెప్పకుపోతోంది.

    "నాన్న ముందు  నీమీద రాపోర్టు ఇవ్వాలనుకున్నాడు. కానీ నా బతుకు బజార్లో పడుతుందని  భయపడ్డాడు. అది కానీ మర్నాడు  నువ్వు అర్జున నీ చంపెశావని  పేపర్లో చదివాను. గుండె  పగిలేలా ఎడిచాను నువ్వు నేరం చెయ్యలేదని  నాకు తెలుసు. ఆ రోజంతా నేను నిన్ను గమనిస్తూనే వున్నాను అదే రాత్రి కదా  నువ్వు నా దగ్గరకొచ్చి నాన్న కళ్ళలో  పడింది  నువ్వు నేరస్దుడివి  కాదని పోలిసులకి కోర్టుకెళ్ళి సాక్ష్యం చేపుతానన్నాను, కానీ నాన్న వప్పకోలేదు ఆ విధంగాన్తేనా నిన్ను జ్తెలుకి పంపాలన్నాడు."

    "నువ్వెంత మంచిదానివి కాశ్మీరా!" అన్నాడు రాబ్ర్టు ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ.

    "నేను మంచిదాన్నాని సర్టిఫికేట్  ఇస్తున్నావా  విజయ్! నిజంగా  నేనే మంచిదాన్నాయి వుంటే ఓ నిరపరాధిని కాపాడేందుకు నాన్నని ఎదిరించ లేక పోయేదాన్నా నువ్వేమయిపోయావో  తేలిక నేనంతగా ఏడ్చానో నీకు  తెలిదు. నేను మ్తేనర్ నీ కావడం చేత సాక్ష్యం చెప్పినా  పనికిరాదనీ తిట్టాడు. ఆఖరికికొట్టాడు. కాశ్మీర ఏడుపు ఆగలేదు.

    రాబర్టు వింటున్నాడే  తప్పు ఆమెని ఓదార్చడానికి  ప్రయత్నం చెయ్యలేదు.

    "విజయ్ నా మీద కక్షతో అర్జుననీచంపేశారు. అర్జున ఆ రోజూ నిన్ను బీచికి  రమ్మని రాసిన ఓ ఉత్తరం ఆమె కారులో  దొరికిందట. అందరూ నువ్వు హంతకుడివని అంటుంటే 'కాదు' అని అరచి చెప్పాలనిపించింది. కానీ అసమర్దురాలిని. తెలిసి నీకు అపకారంచేసిన రాక్షసిని నేను"

    రాబర్టు గట్టిగా నిట్టూర్చాడు.

    కాశ్మీర తలపైన చేత్తో నిమిరాడు ఓదార్చాడు.

    "ఏడవకు  నిన్ను గురించీ నేను అపార్ధం చేసుకున్నాను కాశ్మీర ఏడవకు ఈ ప్రపంచంలో కనిసం  నువ్వొక్కదానివి చాలు న్యాయం చచ్చిపోలేదనడానికి. నేను హంతకుడ్ని, దొంగని కానని నీ ఒక్కదానిక్తేనా తెలుసు. కాశ్మీరా అర్జునని చంపినా ఆ పురుగులెవరో నాకిప్పుడు బాగా  తెలుసు. వాళ్ళు అంతు చూడందే నేను నిద్రపోను" అన్నాడు ఆవేశాంగా.

    ఆ రోజు నాన్నాకి భయపడి నీకు తీరని ద్రోహం  చేశాను. నన్ను క్షమిస్తావా  విజయ్" అంది.

    "నేనిప్పుడు విజయ్ కాదు. రాబర్టు. అంటూ చేతిపైన పచ్చని చూపించాడు.

    కాశ్మీర కాళ్ళ నిరు తుడుచుకుంది.

    "ఈ ఇంట్లో ....ఎవరేవరుంటారు?"

    "నేను నా భర్త వంటమనిషి గెస్ట్ హౌస్ లో వుంటుంది" చెప్పింది జిర బోయిన గొంతుతో కాశ్మీర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS