Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 29

    రాంపండు ఢామ్మని వెనక్కి విరుచుకుపడిపోయాడు.
 
   
                                        *    *    *    *
   
    రాంపండుకి చాలా తిక్క తిక్కగా వుంది. ఆలోచనలు అతని బుర్రని తీనేస్తున్నాయ్.

    'సాయంత్రం వైష్ణవి మిగతా డబ్బు తీసుకొచ్చి రాజీకి యిస్తుంది. తరవాత నేను వైష్ణవితో బాటు ఆమె యింటికి వెళ్ళిపోవాలా? అలా వెళ్ళిపోతే మరి రాజీ ఏమవుతుంది? అమవుతుందేమిటి...అసలు రాజీయేగా నేను వద్దని అనుకున్నది?! అసలు యిదంతా నిజంగానే జరుగుతుందా లేకపోతే పెద్ద కళా?' అనుకుంటూ చేతిమీద గట్టిగా గిచ్చుకున్నాడు రాంపండు.

    "బాబోయ్!" చేతిమీది గిచ్చుకుంటున్నారు?" ఎదురుగా నిలబడి వున్న ప్యూన్ అడిగాడు.

    "ఏం లేదు! కాలో నిజమోనని!" అన్నాడు రాంపండు వెర్రిమొహం వేసుకుని.

    "కళ కాదు. నిజమే సార్! అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అయినా అయన పిలుస్తున్నారంటే కలో, నిజమో అని చేతిని గిచ్చి చూసుకుని ఆశ్చర్యపోయొంత విషయం ఏముంది సార్?"

    "ఆ?" అయ్యగారు పిలుస్తున్నారా?" కుర్చీలోంచి లేచి కంగారుగా సర్వోత్తమరావు క్యాబిన్ వైపు అడుగులు వేశాడు రాంపండు.

    "ఏమిటో! రాంపండు సార్ చాలా గమ్మత్తుగా చేస్తున్నాడు" అన్నాడు ప్యూన్ బ్రహ్మాజీతో.

    "ఈ వేళ కాదులే. వాడు ఓ రెండు మూడ్రోజుల్నుండీ  యిలానే విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఉన్నట్టుండి సీలింగ్ వైపు  చూసి నవ్వుతాడు. అంతలోనే జుట్టు పీక్కుని శూన్యంలోకి చూస్తాడు. అర్ద గంటకోసారి చేతిమీద గిల్లుకుని 'నిజమే... అవును....' అటుంటాడు. తనలో తాను మాట్లాడుతుంటాడు. ఏమైందిరా అంటే చెప్పాడు" అన్నాడు బ్రహ్మాజీ.

    "మీలాంటి స్నేహితులంతా కల్సి సార్ ని మంచి డాక్టర్ దగ్గరకి తీసుకేల్లాలండీ బాబూ!"

    "అదే ఆలోచిస్తున్నా....." అన్నాడు బ్రహ్మాజీ.

    రాంపండు సర్వోత్తమరావు క్యాబిన్ లోకి రెడీమేడ్ మేగుళ్ళనిఎక్కడ అమ్ముతారు?" కల్లెగారేస్తూ అడిగాడు సర్వోత్తమరావు రాంపండుని.

    అతను ఖంగు తిన్నాడు.

    'ఇఇయన కేలా తెల్సింది? అయితే అఫేసులో అనేది పరువు పోయినట్టేనా' అనుకున్నాడు.

    "అంతే... రెడీమేడ్ మొగుళ్ళనిఅమ్మడం అనేది చాలా గమ్మత్తయిన విషయం అనుకోండి. రమ అనే ఆమె ఒకామె వుందండీ.... కానీ నిజానికి ఆమె రమ కాదండీ. ఇంకా గమ్మత్తుమిటంటే ఆమె పేపర్లో యిచ్చిన ఆడ్రస్ కూడా రమది కాదండి. మరి రమ వుండేది ఎక్కడో ఏమో తెలీదండీ. హిహి... మరేనండీ" బలవంతంగా నవ్వుతూ అన్నాడు రాంపండు.

    "నువ్వు చెప్పే రమ వ్యవహారం నాకేం అంటుబట్టడం లేదు. వ్యవహారం అసలు అర్ధం కావడం లేదు.
రెడీమేడ్ మొగుళ్ళేంటీ వాళ్ళని అమ్మే వ్యవహారం ఏంటీ...?" గుడ్లేర్రజేసి చూస్తూ అడిగాడు  సర్వవోత్తమారావు.
 
    "మీరే కదండీ రెడీమేడ్ మొగుళ్ళని ఎక్కడ అమ్ముతారు అని అడిగారు?" అయోమయంగా అడిగాడు రాంపండు.

    "అడక్కా...? ఈ ఫైలేంటీ? ఇందులోంచి వ్యవహారం ఏంటీ? మనకి ఎక్స్ ట్రా ఫర్నిచర్ కావాలని హెడ్ వంక చూపిస్తూ అడిగాడు సర్వోత్తమరావు.

    "ఓ టేబుల్, రెండు కుర్చీలు, రెండు బీరువాలూ కొనడానికి పర్మిషన్ యివ్వమని రిక్వెస్టు చేస్తూ రాశాను సార్? ఏం సార్?"

    వ్యవహారం అంత సిపుల్ గా వుంటే నిన్నెందుకు పిలిపిస్తాను? నేవ్వెం రాశావావు తెలుసా? ఓ సెకండ్ హ్యండ్ మొగుడూ, రెండుమొగుళ్ళూ, రెండు రెడీమేడ్ మొగుళ్ళూ కొనడానికి పర్మిషనడుగుతూ లేటరు రాశావ్. ఈ వ్యవహారం మీద నేను సంతకం పెట్టి పంపిస్తే హేడ్డాఫీసు వాళ్ళు వ్యవహారం చూస్తారు. అసలేంటీ ఈ గందరగోళ వ్యవహారం?" అడిగాడు అయన.
    "అదే సార్! నాక్కూడా అర్ధం కావడంలేదు" భయం భయంగా అన్నాడు రాంపండు.

    "షటప్!ఈ ఫైల్ తీసుకెళ్ళి యిందులోని వ్యవహారాన్ని మొత్తం మార్చిరాసి తీసుకురా."

    రాంపండుకి ఫైలు తీసుకుని బయటకోచ్చేసి తన సీట్లో కూర్చున్నాడు.

    "అన్నట్టు పండూ! పేపర్లో ఆ ప్రకటన క్రింద మీ యింటి ఆడ్రస్ పడింది కదా... దాన్ని ఎడిటర్ నోటీసుకు తెచ్చావా? నోతీసుకి తేవడం ఏంటి వార్నింగ్ యివ్వాలసలు. అన్నట్టు ఆ ప్రకటన చూసి ఎవరయినా వచ్చారా?" అడిగాడు బ్రహ్మాజీ.

    "హబ్బా!" జుట్టు పీక్కుంటూ అన్నాడు రాంపండు.

    బ్రహ్మాజీ నే చెప్పాలే అన్నా అర్ధం వచ్చేలా ప్యూన్ వంక చూశాడు.

     ప్యూన్ తల వూపాడు నిజమే అన్నట్టు.
       

                                                                     *    *    *    *
   
    "మొత్తం డబ్బు కరెక్టుగా వుందా?" అడిగింది వైష్ణవి.

    "ఊ..." అంది రాజీ అప్పుడే డబ్బు లెక్క బెట్టడం పూర్తిచేసి.

    "అయిపోయింది. అంతా అయిపోయింది..." తలుపు చాటునుండి అనుకున్నాడు రాంపండు.

    "వీటిమీద సంతకాలు పెట్టండీ" రాజీ ముందు స్టాంప్ పేపర్లు పెట్టింది.

    "ఏంటివి?" అడిగింది రాజీ.

    "సెల్ డీడ్. రాంపండుగార్ని నాకు నాలుగు లక్షలా యాభైవేలకు అమ్ముతున్నట్టూ ఇకముందు అతని మీద మీకేం అధికారం లేదనీ దీంట్లో రాశాను."

    "ఓ అలాగా! ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలి?" అడిగింది రాజీ. వైష్ణవి చూపించింది. ఆమె చూపించిన చోటు సంతకాలు పెట్టింది రాజీ.

    "సో! ఈ రోజుతో రాంపండు న వాదైపోయాడు... ఇంతకీ భర్తనియిలా అమ్మాలనే ఆలోచన మీకెలా వచ్చింది?" అడిగింది వైష్ణవి.

    "ఒకవేళ భార్యభర్తలు విడి పోవాలనుకున్నారనుకొండి, వాళ్ళిద్దరూ విడిపోతే నష్టపోయేదిభార్య. మాత్రమే ఆర్దికంగా చూసినా, సాంఘిక పరంగా చూసినా" అంది రాజీ.

    "ఎలా?"

    "పెళ్ళప్పుడు పెళ్ళి చేసుకుంటున్నందుకు మగాడికి లక్షలు కట్నంయిస్తారూ. ఎందుకూ? జీవితాంతం కలసి వుంటమనే ఉద్దేశ్యంతో. కాఫీ విడిపోయేప్పుడు ఆ కట్నం ప్రసక్తి రాదు. మొత్తం కట్నంవడ్డీతో ఇవ్వాల్సిన బాధ్యత అతనికుంది. అతను మళ్ళీ కట్నం తీసుకుని పెళ్ళిచేసుకునే అవకాశం వుంది. కానీ ఆడదానికి ఆ అవకాశం లేదుగా. అదే కట్నం డబ్బు వెనక్కి తీసుకుంటే ఆ డబ్బుతో ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీనో పెట్టుకోవచ్చు.... లేదా ఆశ చూపించి మరో మొగుడ్ని కొనుక్కోవచ్చు  అందుకనే ఆయన్ని అమ్మేయ్యాలనే ఆలోచన వచ్చింది."

    "చాలా బాగుంది మీ ఆలోచన! ఇంతకీ మీరెందుకు విడిపోవాలని అనుకున్నారు? అయన మంచివాడు కాదా? అడిగింది వైష్ణవి.

    "అబ్బే! అలాంటిదేమీ కాదు! అయన మంచివాడే కానీ మా అభిప్రాయాలు లేదా మా నసులకోండి .... కలవలేదు. ఇలా కలవని మనసులతో, అభిప్రాయాలతో జీవితాతం బ్రతకడం కష్టం కదా! అందుకని నేనే ఆయన్నుండి విడిపోవాలనుకున్నాను. అందరిలో మామూలుగా విడిపోతే చాలా నష్టపోతానని ఆయన్ని అమ్మే ఆలోచన పెట్టుకున్నా."

    "వెరీగుడ్.... మీ ఆలోచనావిధానం నాకు నచ్చింది. ఒకవేళ రాంపండు  గానీ నచ్చకపోతే అతన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తా! సరేగానీ కాగితాల మీద అయన కూడా సంతకం చెయ్యాలి, తాను అమ్మాబడటానికి అభ్యతరం ఏమీ లేదని!" చెప్పింది వైష్ణవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS