Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 30


    "అంత అదృష్టమా నా ముఖాన! పెళ్ళికైతే ఒప్పు కుందిగానీ ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోదట."

    అతను చెప్పిందంతా విన్న శ్యామ్ కి నవ్వు వచ్చేసింది. "పోనీ ఆ  ఎక్స్ పెరిమెట్ అయ్యేదాకా ఆగరాదూ!" అన్నాడు నవ్వేస్తూ.

    పేలవంగా నవ్వాడు మోహన్. ఏడవలేక నవ్వినట్లు వుంది ఆ నవ్వు. "నవ్వండి! ఏం చేస్తాం! ఇలా నవ్వులపాలు అయిపోయింది నా బ్రతుకు!"

    "ఛ ఎంతమాట! ఏదో సరదాగా నవ్వేశాను మీకేం సాయం కావాలన్నా చేస్తాను. చెప్పండి!" అన్నాడు శ్యామ్.

    "మీకూ, ఆవిడకీ అంగీకారం అయింది. ఇకపోతే  పెద్దవాళ్ళు సరే అనాలి. అంతేకదా! దైర్యం చేసి మంచిరోజు చూసి అడిగెయ్యండి!" సలహా చెప్పాడు.

    ఆ సలహా అంతగా నచ్చకపోయినా అంతకంటే మార్గం లేదనిపించింది మోహన్ కి.

     నాల్రోజులు రిహల్స ల్ వేసుకుని అయిదవరోజు దీపా వాళ్ళింటికి వెళ్ళాడు యధాప్రకారం వరండాలోనే కూర్చుని వున్నాడు ఆయన.  "ఏమండీ!" అనిపిలవగానే తల  ఎత్తి చూశాడు. చూసీ చూడగానే గుర్తుకూడా పట్టాడు.

    "మళ్ళీ వచ్చావా? ఏదీ ఏదీ  నా కర్ర!" అమిత ఆగ్రహంతో కర్ర వెతుక్కుంటున్న ఆయన్ను చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి వెనక్కి తిరిగి పరిగెట్టుకుని వచ్చేశాడు.

    ఆ సాయంత్రం దీపికని కలవగానే  మరోసారి బ్రతిమాలాడు. "మీ నాన్నగారితో మాన్ విషయం మాట్లాడరాదూ?" అన్నాడు.

    "అమ్మొ! ఇంకేమైనా వుందా  చంపేయ్యరూ! మొన్న  ఓ సారి అమ్మమా  పెళ్ళి ప్రసక్తి తీసుకువస్తే మండిపడి పోయారు. నా వల్ల కాదు బాబూ" అనేసింది. అంతేకాదు, "అసలైనా యిప్పుడే పెళ్ళికేం తొందర? మనకని అయ్యేదాకా ఆగుదాం!" అనికూడా అనేసింది.

    తల గోడకేసి బాదుకోవాలనిపించింది మోహన్ కి.

    అలవాటు ప్రకారం దీపికని బస్ ఎక్కించి, తను వెనక్కి వుండిపోయాడు.

    ఆఫీసు నుండి వస్తూ లైబ్రరీకి వెళ్ళి ఆలస్యంగా ఇంటి ముఖం పట్టాడు కృష్ణ. బస్టాండ్ లో చెల్లెల్ని చూశాడు అంతవరకూ బాగానే వుంది చెల్లెలి వెంట వున్న ఆ యువకుడిని చూసి అనుమానం వేసింది. ఎంతో సన్నిహితంగా నిలబడి వున్నాడతను. దీనంగా మొహంపెట్టి దీపికని ఏమిటో  బ్రతిమాలుతున్నాడు. అతన్ని యెక్కడో చూసినట్లేవుంది.

    అంతలోనే బస్ వచ్చింది. దీప ఎక్కింది. అతనూ వెంట యెక్కాడు బస్ లో  దీప పక్కనే కూర్చున్నాడు. మళ్ళీ ఏదో బ్రతిమాలాడు. సరిగ్గా బస్ కదిలేముండు దిగి పోయాడు.

    ఇదంతా చూస్తున్న కృష్ణకి అనుమానం వచ్చింది. వెంటనే వేగంగా నడుస్తూ అతని దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళేసరికి గుర్తువచ్చింది. అతనెవరో ఓసారి బట్టల షాప్ లో సూర్యం మావయ్య పరిచయం చేశాడు నాక్కాబోయే అల్లుడు అని సంబరంగా చెప్పాడు.

    మరి ఇతడికీ చెల్లాయికీ ఎలా పరిచయం? అనుమానం ఇంకా  ఎక్కువకాగా వేగంగా రెండడుగులు వేసి అతని భుజంమీద చెయ్యివేశాడు.

    గిర్రున వెనక్కి తిరిగాడు మోహన్. ఎదురుగావున్న మనిషిని చూడగానే  ముందు గతుక్కుమన్నాడు. ఆ తరువాత అతనిప్రాణం లేచి వచ్చింది. ఇతనేమైనా సాయం చేస్తాడేమో అని ఆశపడ్డాడు చిన్నగా నవ్వేడు.

    కానీ కృష్ణ నవ్వలేదు. కొరకొరా చూశాడు. ఆ చూపు ఆ వాలకం చూసి కొంచెం బెదిరిపోయాడు మోహన్.

    "దీపిక నీకెలా పరిచయం?" సూటిగా రంగంలోకి దిగి పోయాడు కృష్ణ.

    అతనే ఆ ప్రసక్తి తేచ్చేసరికి వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు అయింది మోహన్ కి. ముఖం ఇంతచేసుకుని దీపికా నేనూ ప్రేమించుకుంటున్నాం. ఐ లవ్ హెర్. పి లవ్స్ మి. మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికిచచ్చేంత ఇష్టం!" అసలు విషయం మూడు ముక్కల్లో చెప్పేశాడు.

    "మరి మిమ్మల్ని తన కాబోయే అల్లుడిగా చెప్పాడు సూర్యం మామయ్య. భారతిని మీ కిచ్చి పెళ్ళిచేస్తాననీ, మీరు తన ఫ్రెండ్ కొడుకనీ మీరు తనింట్లోనే వుంటాన్నారని చెప్పాడు అదంతా అబద్దమా?" మరింత కరుగ్గా అడిగాడు.

    వేగంగా తల ఆడించాడు మోహన్. "కాదు! అదంతా అక్షరాలా నిజం! కానీ"  అతని మాట పూర్తికానే లేదు. కృష్ణ చెయ్యి మోహన్ కాలర్ మీదికి వెళ్ళింది.

    "రాస్కెల్ ఎంత దైర్యం నీకు! మా కళ్ళల్లో కారం కొట్టి యింత నాటకం ఆడతావా? ఇదే ఫస్టు అండ్ లాస్ట్ వార్నింగ్. నేను నిన్నోకంట కనిపెడుతూనే వుంటాను. మళ్ళీ చెల్లాయితో మాట్లాడినట్లుగానీ తెలిసిందా నరికి పారేస్తాను. జాగ్రత్త! మెల్లిగానే మాట్లాడుతూ కఠినంగా వార్నింగ్ యిచ్చి వినవిన వెళ్ళిపోయాడు కృష్ణ.

    మొద్దుబారిపోయాడు మోహన్. యాంత్రికంగా ఓ రిక్షా పిల్చి దాన్లో  యెక్కి కూర్చున్నాడు.

    ఆ రాత్రి అంతా కంటిమీద కునుకేలేదు. తెల్లారాక టైఫాయిడ్ జ్వరంపడి లేచినవాడిలా  వున్న మోహన్ ని చూచి కంగారుపడిపోయారు సూర్యంగారు.

    అప్పటికప్పుడు ఫేమిలీ డాక్టర్ చలపతిరావుగారిని పిలిపించారు. భారతి అయితే పాపం నవల చదవటం కూడా మానేసి పక్కన  కూర్చుంది. వాళ్ళ ఆప్యాయత ఆదరణ చూస్తుంటే సిగ్గుగా వుంది.

    ఆఫీసుకి వెళ్దామని వచ్చిన శ్యామ్ కూడా ఇతడిని చూసి లబలబలాడాడు. "ఏమిటి? ఏమైంది?" అన్నాడు కంగారుగా.

    అటూ ఇటూ చూసి "ఏముంది? మీ  సలహా సాటించాను. పెద్దవాళ్ళని ఒప్పించే ప్రయత్నంచేశాను" అన్నాడు మోహన్.

    "ఏమైంది? ఫలించిందా?"

    "ఆ! బ్రహ్మాండంగా. మామగారేమో నన్ను చూడగానే కర్ర పుచ్చుకుని వెంటపడ్డారు బావమరిదిగారేమో వాళ్ళ చెల్లిలివంక చూస్తే నరికిపారేస్తానన్నాడు!" దీనంగా చెప్పాడు.

    "శ్యామ్ కి చాలా జాలివేసింది. ప్చ్ ఏమిటి! చెడు రోజులు వస్తే  అంతే. ఏది తలపెట్టినా ఎదురు తిరుగుతుంది. కానీండి ఏంచేస్తాం! గడువు యింకా వారంరోజులుంది. ఈ  లోగా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఈ పూటకి రెస్ట్  తీసుకోండి." అనేసి వెళ్ళిపోయాడు.

    దీర్ఘలోచన మొదలు పెట్టాడు మోహన్. మెరుపులా తట్టింది ఓ ఆలోచిన వెంటనే లేచి తయారై బతల్దేరాడు వద్దని సూర్యంగారు వారించినా వినలేదు.

    తిన్నగా ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళాడు. ఆయన లంచ్ తీసుకుంటున్నారు "నువ్వా! రా!" అని పిలిచారు.

    "అన్నం ఒక్కటే తక్కువ యిప్పుడు. అవతల  కొంపలు అంటుకుంటున్నాయి" అన్నాడు కంగారుగా.

    "ఏమిటి? ఏమైంది?" ఆదుర్దాగా  అడిగారు ఆయన.

    "ఏముంది మీ పరిశోధనలకి మళ్ళీ బ్రేకు పడేలావుంది."

    ఆయన గుండె ఠారుమంది! "ఏమిటి మోహన్? ఏం జరిగింది?" అన్నారు దగ్గర కంఠంతో. నా మేరేజి సెటిల్ చేస్తున్నారు. మా వాళ్ళు. అక్కడ దీపికకి కూడా  సంబంధాలు వెతుకుతున్నారు వాళ్ళవాళ్ళు. త్వరలోనే ఒకటి సెటిల్ అయ్యేలావుంది కూడా!" అన్నాడు.

    ప్రొఫెసర్ గారి ముఖంలో ఆదుర్దామాయంఅయి ఆనందం కనిపించింది. "అలాగా! చాలా సంతోషం!" అన్నారు.

    "ఏం సంతోషం నా తలకాయ. ఈ పెళ్ళిళ్ళు అయితే కొంపమునిగిపోదూ!"

    "ఎలా?"

    "చెప్తాను వినండి. రేపు నా పెళ్ళి అయిందనుకోండి. నా భార్య కాపురానికి వస్తుంది. వచ్చింది వూరికే వుంటుందా? సినిమాలూ షికార్లూ అంటూ మొదలు పెడుతుంది. ఆఫీసుకి తిన్నగా వెళ్ళి ఆఫీసునించి తిన్నగారండి అని ఆర్డర్లు వేస్తుంది. మరి పెళ్ళి చేసుకున్నాక ఆవిడ అదుపాజ్ఞలలో వుండక తప్పదుకదా!   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS