"వైష్ణవి" చెప్పింది ఆమె.
"బాగుంది...మంచి పేరు!"
"ఇంతకీ మీరు ఆ ప్రకటన సీరియస్ గానే యిచ్చారా?" రాజీని అడిగింది వైష్ణవి.
"సరదాకి అలాంటి ప్రకటన ఎవరూ యివ్వారేమో?" ఎదురు ప్రశ్న వేసింది రాజీ.
'ఆ విధంగా చూస్తే సీరియస్ గా కూడా అలాంటి ప్రకటన ఇవ్వరు" నవ్వుతూ అంది వైష్ణవి.
"నిజమే అనుకోండి... కొత్తగా మొదటిసారి ఎవరైనా ఇలాంటి పని చేసినప్పుడు అందరకీ వింతగా అనిపిస్తుంది గానీ, నాలానే ఇంకొంత మంది చేసి, చివరకి ఈ పద్దతి ప్రాచుర్యంలోకి వచ్చి అందరూ ఆచరించారనుకోండి.... అప్పుడు పాతబడిపోయి ఎవరికీ వింతగా అనిపించదు. ఇది వరకు వితంతువులుగానీ, భర్త వదిలిపెట్టిన ఆడవాళ్ళుగానీ పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే వింతగా అనిపించడం లేదే! కానీ మొదట్లో అలా చేసిన వాళ్ళు చాలా ఫేస్ చేసి వుండొచ్చు."
"మీరు చెప్పింది వింటుంటే నిజమే అనిపిస్తుంది" అంది వైష్ణవి.
లోపల రాంపండు పళ్ళు నూరాడు.
"చేస్తున్న వెధవ నళిని ఎంత చక్కగా సమర్దించుకుంటుందో!!" అనుకున్నాడు.
"మరో ఉదాహరణ... ఇదివరకు ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని ఎక్కడికోపోయి పెళ్ళి చేసుకుంటుంటే వాళ్ళు లేచి పోయారని నీచంగా అనుకునేవారు. వాళ్ళని బందువులూ, కులస్థులూ వెలి కూడా వేసేవారు. ఇప్పుడైతే మాది లవ్ మ్యారేజ్ అని గర్వంగా చెప్పుకుంతున్నారు. ఇప్పుడైతే మది లవ్ మ్యారేజ్ అని గర్వంగా చెప్పుకుంటూన్నారు... చూశారా కాలం ఎన్ని మార్పులు తెలుస్తుందో?" అంది రాజీ.
"అయితే ప్యూచర్ లో భర్తల్ని భార్యలు అమ్మే కాలం వస్తుందన్న మాట" నవ్వుతూ అంది వైష్ణవి.
"ఏమో వస్తుందేమో!" రాజీ కూడా నవ్వింది.
రాంపండు మాత్రం జుట్టు పీక్కున్నాడు.
"సరేగానీ మీరు ఆయనతో ఏమైనా మాట్లాడ్తారా?" వైష్ణవి ని అడిగింది రాజీ.
"అబ్బే! ఏం చెప్పర్లేదండీ.... అయన నాకు నచ్చారు!! మీరెంతకి అమ్ముతారో చెప్పండి."
రాంపండు గుండె దడదడా అంది.
రాజీ చెప్పిన రేటుకి ఆమె ప్రిపేర్ అయిపోతే?!
రాజీ ఏం చెప్తుందో అని టెన్ష న్ గా వినసాగాడు.కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత రాజీ అంది_
"అయిదు లక్షలు మరీ ఎక్కువేమో?! మరో మాట చెప్పండి" అంది వైష్ణవి.
మళ్ళీ నిశ్శబ్దం.... మళ్ళీ రాంపండు గుండెల్లో దడదడ....
"అరే! ఆఖరిసారిగా చెప్తున్నా! నాలుగున్నర లక్షలు! ఇంకా బేరం లేదు" అంది రాజీ,
"ఒక్కే...." అంది వైష్ణవి.
రాంపండు గుండె ఓ క్షణంపాటు ఆగింది.
"కానీ ఓ సారి ఆయన్ని కూడా కనుక్కోవాలి ఆయనకి యిష్టమో కాదో!" అంది వైష్ణవి.
"అయితే వుండండి.... ఆయన్ని పిలుస్తాను. పండూ!" అంటూ పిలిచింది రాజీ.
రాంపండు చురుకుగా అలోచించసాగాడు.
ఇప్పెడెం చెయ్యాలి? ఏం చెయ్యాలి?? ఏం చెయ్యాలి????
"పండూ!" మరోసారి పిలిచింది రాజీ.
రాంపండు రాజీ ప్రక్కన కూర్చున్నాడు.
వైష్ణవి మెల్లగా దగ్గిమ్ది. "చూడండి రాంపండుగారూ!" అంది.
రాంపండు ఆమె వంక చూశాడు. "చెప్పండి."
"మీకు నావెంట రావడానికి ఏమైనా అభ్యంతరం వుందా?"
"లేదు" అన్నాడు అతను.
రాంపండు యిలా సమాధానం చెప్పేసరికి రాజే వులుక్కిపడింది.
అయ్యిందిలే అమ్మగారి పని....? అని అమనసులో అనుకున్నాడు రాంపండు.
"మీకు నేను నచ్చానా?" అడిగింది వైష్ణవి.
"చాలా నచ్చారు" చిరునవ్వుతో అన్నాడు రాంపండు.
రాజీ ఆశ్చర్యపోతూ అతని వంక చూసింది.
అతను ముసిముసిగా నవ్వుకుంటూ లోపలకి వెళ్ళాడు.
"సో... ఆయనక్కూడా నేను నచ్చానంటే నో ప్రాబ్లెం అన్నమాట?" వైష్ణవి రాజీతో అంటున్న మాటలు అతని చెవిన సోకాయి.
రాంపండు బెడ్ రూమ్ లో మంచం మీద కూర్చుని విజయగర్వంతో నవ్వాడు.
ఆమె తనని యిబ్బంది పెట్టడానికో, ఏడ్పింఛడానికో మాత్రమే ఆ ప్రకటన యిచ్చింది. ఎలాగూ తను ఒప్పుకోడని రాజీకి తెలుసు. తను ఒప్పు కోనంతకాలం అమ్మేస్తా అమ్మేస్తా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది.
అదే రాంపండు ఒప్పుకుంటే ఏం చేస్తుంది?
రాజీ గిలగిల లాడ్తుందని తాను భవించాడు. అందుకే వైష్ణవి వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నాడు.
గుమ్మంలో అలికిడి వినిపించింది.
రాంపండు తలెత్తి చూశాడు.
"ఏంటి? నీకు ఆమె నిజంగానే నచ్చిందా?"అతని ముఖంలోకి చూస్తూ సూటిగా అడిగింది రాజీ.
"నచ్చింది" అన్నాడు రాంపండు దృడంగా.
"అయితే ఆమె వెంట వెళ్ళడానికి నీకేం అబ్యంతరం లేదన్నమాట."
"లేదు.... అయినా అనుమానం ఎందుకొచ్చింది?" విజయగర్వంతో అడిగాడు రాంపండు.
రాజీ వెనక్కి తిరిగి బయటకి అడుగులు వేసింది.
అతనికి పాతకాలం జనాపద సినిమాల్లో విలన్ రాజనలలా పకపకా నవ్వాలని అనిపించింది.
ఇప్పుడేం చేస్తుందో చూడాలి! ఇంకేం చేస్తుంది.... ఆ వైష్ణవితో చెప్పేస్తుంది.మా ఆయన్నిఅమ్మే ప్రపోజల్ నేను డ్రాఫ్ చేసుకున్నాను అని.
రాంపండు లేచి గబగబా అడుగులు వేసుకుంటూ బయటకెళ్ళి గుమ్మం చాటున నిలబడి ఏం జరుగుతుందా అని అత్రుతుగా వినసాగాడు.
"ఏంటి....?" అడిగింది వైష్ణవి రాజీని.
"అయన మొహమాటానికి యిష్టపడుతున్నారని అనుకున్నానుగానీ, అదేం కాదు. అయన నిజంగా యిష్ట పడుతున్నారు..." జవాబు చెప్పింది రాజీ.
"అయితే నో ప్రాబ్లం...."
రాంపండు చెవులు మరింత రిక్కించి వినసాగాడు.
"అయితే పేమెంట్ ఎలా చేస్తారు?" రాజీ అడిగింది.
రాంపండు ఉలిక్కిపడ్డాడు.
"ప్రస్తుతం లక్ష రూపాయలు తెచ్చాను. అది అడ్వాన్స్ గా తీస్కోండి.'
హ్యండ్ బ్యాగ్ లోంచి అయిదు వందల రూపాయల నోట్ల కట్టలు తీసి రాజీ ముందు పెట్టింది వైష్ణవి.
"మిగతాది ఓ వారం లోపల చెల్లించి ఆయన్ని పట్టుకెళ్ళండి" అంది రాజీ.
"వారం దాకా ఎందుకు? రేపే తెసుకొచ్చి రేపే ఆయన్ని తీసుకెళతాను. రేపు మంచిరోజు కూడానూ..."
