Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 29

   
    కాని డబ్బు కలిగిన వాళ్ళ మీద డబ్బు లేని వాళ్ళు పెంచుకునే ఆశలు ఎన్నటికీ తీరవు.
    ఆ సంగతి ముందుగానే మనకి తెలియాలి!
    ఆశకి లొంగిపోతే మనం మరొకరి చేతిలో ఓడిపోతాం.
    ప్రియాంక వస్తే నా గురించి ఏమీ తెలియదనీ, నేను రావట్లేదని చెప్పు" అంటూ సాగిపోయాడు.
    వేలూ లక్షలూ డబ్బు కావాలి!
    ఆశయాలకీ ఆత్మ గౌరవానికి భంగం కాకూడదు! ఈ మనిషి ఎలా నెగ్గుకోస్తారో అని అయోమయంగా చూస్తున్నాడు పానకాల్సామి . అతని కేమీ అర్ధం కాలేదు.
    "సరే వెళ్లొస్తాను,"
    "మళ్ళీ ఎప్పుడు వస్తావు బాబూ!"
    "ఏమో ! నాకే తెలియదు."
    "ఎక్కడికి పోతున్నావు"
    "అదీ తెలియదు"
    "సరే వెళ్ళి రండి. జాగ్రత్త బాబూ!' వీడ్కోలు చెప్పాడు."
    క్రమంగా పార్కులో జనం నిండుతున్నారు.

                           *    *    *

    ఆకాశం అంచుల మీద నారింజ రంగు కిరణాలు అలుముకుంటున్నాయి.
    "పెద్దయ్యా! జయసింహ ఇంకా రాలేదా?"
    "రాత్రి వచ్చాడమ్మా! అయిదు రోజుల అనంతరం బట్టలు మాసి   పోయి వున్నాయి. యెప్పుడు తిన్నాడో! యెక్కడున్నాడో! మనిషి చిక్కి శల్యమై పోయాడు.
    "ఎక్కడకు పోయావని నువ్వు అడగలేదా"
    "అడిగినా సరిగా సమాధానం చెప్పడు కదా!"
    "రాత్రి బట్టలు పిండుకున్నాడు. నాకు చేతనయిందేదో చేసి పెట్టాను. తిన్నాడు. ఉత్తరం చదువుకుని హడావుడిగా వెళ్ళిపోయాడు.
    "ఉత్తరమా? ఎవరు రాశారు?"
    "నాకు చదువు రాదు కదా తల్లీ! టెలిగ్రాం కూడా వచ్చింది "
    "ఓహో! ఉత్తరం సంగతులేమీ నీకు తెలియవు , అంతేనా?"
    "పదివేలు డబ్బు కావాలిట! ఎవరో రాశారు"
    "అలాగని నీతో చెప్పాడా?"
    "అవునమ్మా చెప్పాడు. వెంటనే వెళ్ళిపోయాడు. ఎక్కడకు పోతున్నావంటే డబ్బు కోసం వెడుతున్నానని చెప్పాడు!"
    "అంత డబ్బు యెలా తెస్తాడు"
    'అది ఆ భగవంతుడికే తెలియాలి! ఆ బాబు ఎప్పుడేం చేస్తాడో ఏ మాలోచిస్తాడో యెవరికి తెలియదు"
    "ఇప్పుడు ఎక్కడుంటాడో తెలుసా?"
    "తెలియదమ్మా! అడిగాను చెప్పలేదు"
    "మిషోరియాస్ పర్సనాలిటీ !  వాట్ వండర్ పుల్ మాన్!" అనుకుంది ప్రియాంక!
    "ఊహించగలవా?"
    "టెలిగ్రాం వచ్చిందని చెప్పాను కదా! ఆఫీసుకి వెళ్ళి ఉండొచ్చు !
    "ఓ అలాగా!' వెంటనే అక్కడ నించి బయలుదేరిందామే. నోబుల్ పార్కు రోడ్డులో ఉంది పోస్టాఫీసు!
    లోనికి వెళ్ళింది. ఆ ఏరియా పోస్టు మాన్ రెప్పవాల్చి చూస్తున్నాడు వివరాలు అతన్ని అడిగి తెలుసుకుంది.
    "జయసింహ పేరు మీదుగా టెలిగ్రాం వచ్చింది. అవునా?"
    "అవునంమాయిగారూ వచ్చింది"
    "ఇంకా డెలివరీ యివ్వలేదు కదా!"
    "సహజంగా టెలిగ్రాంలు మూడు గంటలలోగా డెలివరీ వెళ్ళిపోతాయి. రెండు సార్లు వచ్చాను. అయన లేరు. అప్పుడప్పుడు అతనకు టెలిగ్రాం లు రావటం, అయన లేకపోవటం , నేను తిరిగి రావటం తరువాత అయన వచ్చి తీసుకుపోవటం ఇదంతా అలవాటే!
    ఇంటి అడ్రస్ ల వాళ్ళకయితే బాధ లేదు.
    కేరాఫ్ నోబుల్ పార్కు! కేరాఫ్ రైల్వేస్టేషన్ , కేరాఫ్ బస్ స్టాఫ్ , కేరాఫ్ పేవ్ మెంట్స్ ఇలాంటి అడ్రస్ లు మా ప్రాణాలు తీస్తాయి. ఒక్కోసారి గొంతు మీదికి తెస్తాయి."
    "టెలిగ్రాం అయన తీసుకు పోయారా?"
    "అవును, తీసుకు పోయారు"
    "వివరాలు చెప్పగలవా?"
    "మీరు అడగకూడదు. మేం చెప్పకూడదు."
    "టెలిగ్రాం హైదరాబాద్ నుంచి నేనే యిచ్చాను" ట్రాప్ చేసిందామె.
    "అయితే యిప్పుడోచ్చిన టెలిగ్రాం అది కాదు. బొంబాయి నించి వచ్చింది. అయన కెప్పుడూ హైదరాబాద్ నుంచి టెలిగ్రాం రాలేదా"
    "ఎప్పుడూ వచ్చేది బొంబాయి నించే అన్నమాట"
    "అవునవును" అంటూ నాలుక కరుచుకున్నాడు పోస్టు మాన్! అతను తెరుకునేలోగానే మెరుపులా అక్కడి నుంచి వెళ్ళిపోయింది!
    ఆ కారు వంకా చూస్తూ నిలిచి పోయాడు పోస్టు మాన్!
    "మొత్తం మీద సాధించావోయ్! మిస్టరీ లో ఒకడుగు నువ్వు ముందుకు వేసినట్లే!' అందరూ తలలూగించారు.
    గర్వంగా చూచి యాక్సిలెటర్ బలంగా నొక్కింది ప్రియాంక!

                           *    *    *
    "వొస్తున్నాను. ఎందుకలా కాలింగ్ బెల్ పగిలి పోయేలా కొడతారు. మనుషులు రావాలి కదా! ఈలోగా మళ్ళా మళ్ళా బెల్ కొట్టాలా! అబ్బబ్బ!
    ఈ అటెండర్ తో కలిసి తాళాలు తీసేపని ఒప్పుకోవటం నా ప్రాణం మీదికి వచ్చింది. యేవేళప్పుడోస్తాడో తెలియదు.
    నెలకి అయిదు వందలు పెట్టి లాటరీ టికెట్స్ కొంటాడు. కాని ఓ గడియారం కొనుక్కోడు. వేళాపాళా లేకుండా తొమ్మిదింపావుకే వచ్చి ప్రాణాలు తీసేస్తున్నాడు." గోనుక్కుంటూ వచ్చి తలుపులు తెరిచింది షీనా!
    ఆమె కనుబొమ్మలు ఆశ్చర్యంగా వొంపు తిరిగాయి.
    "ఓ మీరా! లోపలికి రండి" అంటూ ఆహ్వానించింది.
    "నా పేరు మీరా కాదండి జయసింహ!' ఆమె నవ్వింది.
    "మీరు వస్తారనుకోలేదు. మాటవరసకు రమ్మన్నాను"
    "నాది చాల ముఖ్యమయిన పని కదండీ! రాకుండా ఎలా ఉంటాను?"
    "లాకర్స్ ప్రేలిపోయాక పాపం చాలామంది నష్టపడ్డారు. అన్నీ ప్రాబ్లమ్స్ గానే వున్నాయి. పాపం నష్టపడి పోయారు కదండీ!
    అంతా పోగొట్టుకున్న తరువాత మేమేదయినా సాయం చేస్తామని ఆశిస్తారు. బ్యాంకు ఉద్యోగులం కదా!
    మాకు తెలిసినంత వరకూ సలహాలు యిస్తూనే ఉన్న. కొంతమందికి మేలు జరుగుతోంది. కొంతమందికి ఏమీ చేయలేక పోతున్నామని బాధగానూ ఉంటోంది.
    ఇంతకూ మీ ప్రాబ్లం ఏమిటాంటారు?" ఎదురుగా కూర్చుందామే. వెనుకనున్న అద్దం లోంచి జయసింహ వీపు కనిపిస్తోంది. అతని మీదుగా తన ప్రతిబింబం కూడా కన్పిస్తోంది.
    దాని వంక రెప్పవాల్చకుండా చూసుకుంది రెండు సార్లు. గార్డెన్ సిల్కు శారీ మీద పెట్టుకున్న ముత్యాల గొలుసు నప్పులేదనిపిస్తోంది. నెక్లెస్ పెట్టుకుంటేనే బాగుండేదేమో!
    చివాలున లేచి లోనికి వెళ్ళింది.
    సంభాషణ మధ్యలో ఆపేసింది. ఓ ప్రశ్న వేసింది. సమాధానం వినలేదు. హటాత్తుగా లేచి వెళ్ళిపోతున్న ఆమె వంక చిత్రంగా చూస్తూ కూర్చుండి పోయాడు జయసింహ!
    అయిదు నిమిషాల అనంతరం ప్రిజ్ వాటర్, ఐస్ క్రీం తెచ్చి యిచ్చింది. యిప్పుడామే మెడలో ముత్యాల హారం లేకపోవటం, నెక్లెస్ ఉండటం చురుకయిన చూపులతో గమనించాడు.    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS