"ఓ... అయితే అన్నీ చాలా పకడ్బందిగా చేస్తున్నవన్నమాట! సరే... అదీ చూద్దాం..." అని అతను వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.
రాజీ ఆ ముసలామెతో ఇంటి పనికీ, వంట పనికీ, ఇంట్లోనే ఆమెతోపాటు వుండడానికి మాట్లాడుకుంది మాట్లడుకుంది.
నెలకి ఆరు వందలకి బేరం కుదిరింది.
"నువ్వు ఎప్పటినుండి రావాలో నేను మళ్ళీ చెప్తాను" అని చెప్పి ఆ ముసల్దాన్ని పంపించేసి లోపలకి వెళ్ళిపోయింది.
అతను తలకాయ్ పట్టుకుని సోఫాలో అలానే కూర్చున్నాడు కాసేపు.
తన కళ్ళముందు జరుగుతున్నదేమిటో అతనికి బొత్తిగా అర్ధం కావడంలేదు. అతను మెదడు మొద్దుబారిపోయింది.
రాజీ పేపర్లో తనని అమ్ముతానని ప్రకటన ఇస్తే రాజీ ఎంత పియిల్, ఎవరైనా రెడీమేడ్ మొగుడుని కొనుక్కుంటానని వస్తారా? అని అనుకున్నాడు గానీ ఇందాక వెంకటలక్ష్మి వచ్చేసరికి అతను చాలా ఆశ్చర్య పోయాడు. అతని అనుమానాలన్నీ పటాపంచలై పోయాయ్.
రాజీ మొగుడ్ని అమ్ముతానని ప్రకటన ఇవ్వడమే ఓ వింతైతే, దాన్ని చూసి తనని కొనుక్కోవడానికి ఆ తుచ్చ వెంకటలక్ష్మి రావడం మరీ వింత!....
చివరకి ఈ పరిస్తితు లన్నీ ఎక్కడికి దారి తెస్తాయో!
"ట్రింగ్ ట్రింగ్..."
డోర్ బెల్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చాడు రాంపండు.
"మళ్ళీ ఎవర్తి వచ్చిందో!" అనుకుంటూ లేచేల్ళీ తలుపు తీశాడు.
ఎదురుగా బ్రహ్మాజీ!
"ఏంటీ చాలా వింతగా వుంనే?!" కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యముగా చూస్తూ అన్నాడు బ్రహ్మాజీ.
"ఏంటీ.... సంభాషణని ఎక్కడో మధ్యలోంచి మొదలు పెట్టినట్టు అలా అర్ధం పర్దం లేకుండా మాట్లాడు తున్నావ్... రా లోపలకి" అమ్తూ తలుపుకి అడ్డు తోలిగాడు.
ఇద్దరూ హాల్లో కూర్చున్నారు.
"ఏంటీ వింతగా వుంది నీకు?" అడిగాడు రాంపండు బ్రహ్మాజీని.
"అదే మొన్న పేపర్లో పడిందే... ఎవరో రమ అనే ఆమె మొగుడివి అమ్ముతానని ప్రకటన యిచ్చిందీ...."
"అబ్బ... ఆమె ఏం ప్రకటన ఇచ్చిందో మనకెందుకులెద్దూ...వేరే విషయాలైమైన మాట్లాడు" కంగారుగా అన్నాదు రాంపండు.
భలేవాడివే.... మన కెందుకంటవెంటీ! ఆ రమ అనే ఆమె ఇచ్చింది మీ యింటి ఆడ్రస్!" అన్నాడు బ్రహ్మాజీ.
"అవునా?.... హుర్రే!... బహుశా ప్రింటింగ్ మిస్టేక్ అయి వుంటుంది."
"ప్రింటింగ్ మిస్టేక్ అని అంత తెల్లిగా తీసి పారేస్తావెం...అట వంటి ప్రకటన క్రింద మీ యింటి ఆడ్రస్ పడింది....నీకెంత అవమానం? ఆ న్యూస్ పేపరు మీద పరువు నష్టం దావా వెయ్యి!"
"అయినా నాకెందుకు అవమానం? ఆ రమ అనే న భార్య కాదుగా?"
"అయితే మాత్రం.... అడ్రసు నీదెగా? పరువు నష్టం దావా వేసెయ్." "అంతదాకా ఎందుకులే... ఆడ్రస్ తప్పు పండిందని కరెక్షన్ వేయమని పేపరు వాడికి చెప్పాను!"
"అదికాదు... పరువు నష్టం..."
"అబ్బా! నువ్వీ విషయం వదిలిపెట్టి ఇంకా వేరే ఏమైనా మాట్లాడు" అన్నాడు రాంపండు.
బ్రహ్మజీ, రాంపండు కాసేపు ఆఫీసు విషయాలు మాట్లాడుకున్నారు. మధ్యలో రాంపండుకి అనుమానం వచ్చింది. ఒకవేళ బ్రహ్మాజీ వుండగానే ఎవరైనా వచ్చి రాజీతో బెర సారాలాడ్తారని. అలాగైతే కొంప మునుగుతుంది.
అంతే....బ్రహ్మాజీతో కంగారు కంగారుగా మాట్లాడి హడావిడిగా లేగ్గొట్టి బయటకి పంపించేశాడు రాంపండు.
బ్రహ్మాజీ వెళ్ళిన అయిదు నిమిషాలకి మళ్ళీ ఎవరో డోర్ బెల్ నొక్కారు.
రాంపండు నెత్తికొట్టుకుంటూ లేచాడు.
ఈ తలుపులు బార్లా తీసేసి వుంచడమే మేలు.
రాంపండు తలుపు తీశాడు.
ఎదురుగా ఉన్న మనిషిని చూసి అతను వులిక్కిపడ్డాడు. ఆ అమ్మాయి!....
తను బజార్లో రెండుసార్లు డ్యాష్ కొట్టినమ్మాయి!!...
బాబ్డ్ హెర్ అమ్మాయి!!!
ఇక్కడికెందుకొచ్చిందీ అని అతను అనుకుంటుండగానే ఆమె ఆశ్చర్యపోయి రాంపండు వంక చూస్తూ "మీరా?" అని అంది.
"నే..నే..నేనే..." అన్నాడు రాంపండు తడబడుతూ.
రమగారు వుండేది యిక్కడేనా?" రాంపండు గుండెల్లో బాంబులు పేలుస్తూ అడిగింది ఆమె.
రాంపండుకి ఏం సమాధనం చెప్పాలో తెలీలేదు.
రమ! రమ గురించి అడుగుతుంటే కొంపదీసి ఇఇమే కూడా ఆ ప్రకటన చూసి వచ్చిందా?
"నేనే రమని! లోపలకి రండి!" అతను ఆలోచిస్తుండగానే వెనక నుండి రాజీ సమాధానం చెప్పింది.
అతను మర బొమ్మలా ప్రక్కకి తప్పుకున్నాడు. ఆమె అతన్ని దాచుకుంటూ యింట్లోకి అడుగుపెట్టింది. ఆమె దాటి వెళుతుండగా అతని ముక్కుపుటాలను మత్తుయిన ఫారిన్ స్ప్రే పరిమళం సోకింది.
"కూర్చోండి" రాజీ కూర్చుంటూ ఆమెకి సీటు చూపించింది.
ఆమె కూర్చుంది. రాంపండు అయోమయంగా గుడ్లప్పజెప్పి ఆమె వంక చూస్తున్నాడు.
"పేపర్లో మీ ప్రకటన చూసి వచ్చాను!" అంది ఆమె.
"ఓ... అలాగా!" అని ఒక్కక్షణం ఆగి ఆమెని యిలా అడిగింది రాజీ "అవునుగానీ మీరా? అంటూ ఈయన్ని అడుగుతున్నారు కదా... మీకు ఈయన ఇంతకముందే పరిచయమా?"
"అబ్బే! పరిచ్ఝయం ఏమీ లేదుగానీ బజార్లో నన్ను ఈయన రెండు సార్లు వెనక్కి మళ్ళీ రెండోసారి డ్యాష్ కొట్టారా?" ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించింది రాజీ.
ఆమె పకపకా నవ్వింది.
"ఛాఛా...అలా ఎవరు చేస్తారులెండి... రెండుసార్లూ రెండు వేర్వేరు రోజుల్లో,వేర్వేరు స్థలల్లో డ్యాష్ కొట్టారులెండి" అంది.
"ఓహొ! అయితే నీకు ఎక్స్ ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా వున్నయన్నమాట..." రాంపండు వంక అదో మాదిరిగా చూస్తూ అంది రాజీ.
"నేనేం కావాలని ఆవిడని ద్యః కొట్టలేదు. పొరపాటున డ్యాష్ కొట్టా" అన్నాడు రాంపండు.
"ఓహొ!అయితే పొరపాటున రెండుసార్లూ ఒకరినే డ్యాష్ కొట్టావన్నమాట?! చాల వింతగా వుందే" తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అంది రాజీ.
"నువ్విచ్చిన పేపరు ప్రకటనకంటే ఇదేం వింతకాదు!" అన్సి విసవిసా లోపలకి వెళ్ళిపోయాడు రాంపండు.
అలా లోపలకి వెళ్ళిపోయాడు గది గుమ్మం దగ్గర ఆగి వాళ్ళేం మాట్లాడుకుంటారో అని చెవులు రిక్కించుకుని వినసాగాడు రాంపండు.
"మీరు అలా అన్నారుగానీ... పాపం అయన కావాలని డ్యాష్ కొత్త లేదండీ... పొరపాటునే అలా జరిగింది. అయన మొహం చూస్తుంటే తెలీడంలేదూ అమాయకుడని" అంది ఆమె.
"ఊర్కే ... ఆయన్ని టీజ్ చెయ్యాలని అలా అన్నాను" నవ్వుతూ అంది రాజీ. "సరేగానీ మీ పేరు?"
