Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్  పేజి 27

    "చాల్లే. చిన్నపిల్లవాడి మాటలకి ఉడుక్కుంటావెం?"  కన్నారావుని మంద లించి పండు వ్తేపుకి తిర్గాడు చిట్టబ్బాయ్...."చెప్పబాబు"

    "ఏంటి చెప్పాలి?"

    "మీ ఇంటి పేరు ఏంటి?"

    "హయ్యో... ఇల్లు ఏమ్తెనా మనిషా? ఇంటికేక్కడ్తెనా పెర్లుంటాయా? హవ్వా...హిహిహి"

    కన్నారావు తల పట్టుకున్నాడు.

    "అది కాదు బాబు... ని పేరేంటి చెప్పు?

    "ప్రశాంత్...." గర్వంగా అన్నాడు పండు.

    "ఏ ప్రశాంత్....అంటే ని పేరు ముందు 'ఏ' ఉందా 'బి' ఉందా 'సి' ఉందా లేకపోతే వేరే లెటర్ ఎద్తేనా ఉందా? ఇపుడు చెప్పు...ని పేరేంటి!"

    "ఎ బి సి డి ఇ యెఫ్ జి హెచ్...  యక్స్   వ్తే జడ్ ప్రశాంత్ "

    ఈ సారి చిట్టబ్బాయి  తలపట్టుకున్నాడు.

    'అలా' హ్తెరానా పడిపోకపోతే   స్కూల్ బ్యాగ్ లోంచి పుస్తకాలు తిసి చూడకూడదు? వాటిమీద అంటించిన లేబుల్స్ మీద విడి పేరు వాళ్ళ నాన్నో, అక్కో రాసి ఉంటారు"  అన్నాడు కన్నారావు.

    "నేను పడ్తున్న అవస్తలు  చూస్తూనే ఉన్నావ్.  ఈ ఐడియా ఇందాకే చెప్పి ఉండొచ్చుగా!" చిట్టబ్బాయి  విసుక్కున్నాడు.

    "నాకూ ఇప్పడే తట్టింది" చెప్పాడు కన్న్రారావు.

    చిట్టబ్బాయి పండు స్కూల్ బ్యాగ్ లోంచి పుస్తకాలు తిసి చూశాడు.

    "కె. ప్రశాంత్ అని ఉంది విడి పుస్తకాల మీద 'కె' అంటే ఎంటో?"  ఆలోచిస్తూ అన్నాడు చిట్టబ్బాయి.

    "ఏమిటయితే నికెంటి? మనకి రంగనాయకులు ఫోన్ చేద్దాం..."  అన్నాడు కన్నారావు.

    "ద!..." పండు చేయిపట్టి లేవదిస్తూ అన్నాడు చిట్టబ్బాయి.

 
   
                                                                                     5



    పోలిస్ స్టేషన్ లో....

    ఇన్ స్పెక్టర్ బంగార్రాజు గదిలో.....

    ఇన్ స్పెక్టర్ బంగార్రాజు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతనిఎదురుగచిన్నమ్మాయి, రంగనాయకులు కూర్చుని ఉన్నారు.

    కానిస్టేబుల్ ఏడుకొండలు కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతని బూట్లు చేసే టకటక శబ్దం ఆ గదిలోంచి నిశ్శబ్దాన్ని భంగాపర్తుస్తుంది

    ఇన్ స్పెక్టర్ బంగార్రాజు చికాకుగా మొహం పెట్టి ఏడుకొండలు వంక చూశాడు.

    "మిస్టర్ సెవెన్ హిల్స్?" అంటూ అరిచాడు.

    అటూ ఇటూ పచార్లు చేస్తున్న ఏడుకొండలు చటుక్కున ఆగిపోయాడు.

    "యస్ సార్".

    "ఇన్ స్పెక్టర్ ని నేనా?  నువ్వా?"

    "మిరే సార్...."

    "మరి అలాగ్తేతే నువ్వే ఇన్ స్పెక్టర్ అయినట్లు అలా సీరియస్ గా పచార్ల చేస్తావెం? మర్డరు చేసేస్తా జాగ్రత్త!!...."

    "ఆ బాబుని ఎవరు ఎందుకు ఎత్తుకుని  వెళ్ళారో  ఆలోచిస్తున్నా సార్"

    "అది ఆలోచించాల్సింది  నేను.... నేను ఏది చెప్తే అది చెయ్యల్సింది నువ్వు!"

    "యస్ సార్...."

    కానిస్టేబుల్ ఏడుకొండలు ఓ మూలకి వెళ్ళి నిల్చున్నాడు.

    ఇన్స్ పెక్టర్ బంగార్రాజు రంగనాయకులు వ్తెపుకి తిరిగాడు.

    "బాగా గుర్తు చేస్కొండి....ఇందాక మీకు పాత కేడిలా ఫొటోలన్ని చూపించాము కదా?.... వాటిల్లో  మీ అబ్బాయిని తిస్కెళ్ళినవాడి ఫోటో లేదా?

    "లేదు ఇన్స్ పెక్టర్!.. మాయదారి సంత... వాడు  ఈ వృత్తిలోకి కొత్తగా దిగాడెమో!!" దిగులుగా అన్నాడు రంగనాయకులు.

    "మీరు మా పండుని ఎలాగ్తెనా వెతికి పట్టుకోవాలి ఇన్స్ పెక్టర్ గారూ" చిన్నమ్మాయి కళ్ళనీళ్ళు  పెట్టుకుంటూ అంది.

    "అయ్యో! నువ్వు అంతగా చెప్పాలా అమ్మా!....  అది మా డ్యూటి.  మీ తమ్ముడిని  ఎత్తుకుని వెళ్ళిన వాళ్ళని తప్పకుండా పట్టుకుని వాళ్ళని మర్డర్  చేస్తాను. ఈ గోల్డెన్ కింగ్ అంటే బంగార్రాజు తడాఖా గురించి నీకింకా తెలిదు"

    "అంత పసివాడు.... వాడు ఎవరికీ అన్యాయం చేశాడని ఇన్ స్పెక్టర్ వాడిని తిస్కెళ్ళరు? ఆ తిస్కెళ్ళేది నన్త్నేనా తిస్కెళ్ళరు  కాదు" గద్గద స్వరంతో అన్నాడు రంగనాయకులు.

    "మిమ్మల్ని తిస్కెళ్ళడం కష్టమని బాబుని  తిస్కెళ్ళి ఉంటారు. మీరూరుకోండి సార్... ఆ దుండగుల్ని పట్టుకుని నేను మర్డర్  చేస్తాగా?" ఊరడిస్తూ అన్నాడు బంగార్రాజు.

    "మీరు ఎవర్ని మర్డరు చేయనక్కర్లేదు మాయదారి సంత! మా బాబుని  మాకు తేచ్చివ్వండి చాలు"

    "ఆ వీధిలో ఇంకా చిన్న పిల్లలు ఎవరూ లేరా?" కళ్లు చిట్లించి అడిగాడు బంగార్రాజు.

    "లేకేం? చాలామంది ఉన్నారు"  చెప్పాడు రంగనాయకులు.

    "మరి అంతమంది పిల్లలు ఉండగా మివాడినె  ఎందుకు ఎత్తుకుని పోయారు?..."

    "దిక్కుమాలిన సంత!.... అదే అర్ధం అయి చావడంలేదు  ఇన్ స్పెక్టర్"

    "మీకు శత్రువులేవర్తెనా  ఉన్నారా?"

    ""అట్లాంటి పనికిమాలిన  సంత నాకెవరూ లేరు ఇన్ స్పెక్టర్ ....."

    "మీ పండుని ఎవరో కొడ్నాప్ చేసి తిసుకెళ్ళరాణి మీకు ఎప్పుడు తెలిసింది?"

     "నేను కూరగాయలు కొంటుంటే నాకు బజార్లో రామయ్య కనిపించాడు. అప్పడే తెలిసింది. అప్పటికి పండు ఇంట్లోంచి వెళ్ళి దాదాపు రెండు గంట ల్తెంది"  చెప్పింది చిన్నమ్మాయి.

    "అసలు స్కూల్లోనే ఉన్నాడేమో చూశారా?"

    "స్కూలు ప్రిన్సిపాల్ కి ఫోన్ చేశాం ఇన్ స్పెక్టర్.... పండు ఈ వేళ స్కూలుకి రాలేదని వాళ్లు చేవ్పారు."

    "ఆ రామయ్య ఉన్నాడా?"

    "బయటి నిల్చుని ఉన్నాడు" అన్నాడు రంగనాయకులు.

    "ఏయి సెవెన్ హిల్స్?"

    "యస్ హర్"

    "బయట నిల్చుని ఉన్న రిక్షావాడిని లాక్కురా"

    "యస్సార్"

    ఏడుకొండలు బయటికివెళ్ళి రామయ్యని లాక్కొచ్చాడు.

    బంగార్రాజు రామయ్యని ఏం జరిగిందో చెప్పమన్నాడు. రామయ్య పండుకు జ్వరం వచ్చిందని ఈ వేళ  స్కూలు రాడు అని ఎవరో చెప్పి పంపించడం గురించి చెప్పాడు.

    'ఆ మనిషి ఎలా ఉన్నాడు?'

    రామయ్య వర్ణించి చెప్పాడు.

    ఇన్ స్పెక్టర్  బంగార్రాజు చిన్నమ్మాయి వంక చూశాడు.

    "మీరు చెప్పిన వర్ణన ప్రకారం చూస్తే మీరు మాట్లాడింది మరో  మనిషితో.... కాబట్టి పండుని కిడ్నాప్ చేయడంలో  ఇద్దరి హ్యండ్ ఉంది...  వాళ్ళిద్దర్ని  మర్డర్  చేస్తా...." పళ్ళు  బిగించి అన్నాడు బంగార్రాజు.

     అంతలో ఫోన్ మోగింది.... బంగార్రాజు ఫోన్ ఎత్తుకున్నాడు.

    "హలో... ఎవరూ? ...ఆ...ఒహొ!!! మర్డరు జరిగిందా?  లేదా? వట్టి దోంగాతనంమే  జరిగిందా? ఎక్కడ? ఆ... ఆ... ఆ... ఇప్పడే వస్తున్నా..."

    పోన్ పెట్టేసి సీట్లోంచి హడావిడిగా లేచాడు బంగార్రాజు.

    "దొంగతనం కేసు....నేను వెంటనే వెళ్ళాలి..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS