శవంగా - దారుణంగా హింసించి చంపగా బలయిపోయిన అర్జున చిరిగ్పోయిన జాకెట్ , చెదిరిపోయిన లంగా, గాయాలతో అర్జునఫోటో.
మట్టిలో మట్టిగా కలిసి పోయిన తన సుందరస్వప్నం.
అర్జున తండ్రి వరదరాజులు పేరు మోసిన క్రిమినల్ లాయర్.
ఎందరో హంతకులని నిరపరాదులుగా నిరూపించి విడుదలచేసిన ఘనత ఆయనకుంది. కన్నా కూతుర్ని చంపినా హంతకుడ్ని ఉరికంబం ఎక్కించలేని దౌర్భాగ్యుడా ఆయన?
ఏ కేసులోనో ఎవరికో తీవ్రమైన అన్యాయం చేసి వుంటాడు. ఆ ఉసురు ఆయన కొట్టి ఉంటుంది.
ఒకే ఒక కూతురు. ఆ కూతురిలా అయిపోయేసరికి ఆయన పిచ్చివాడ్తె పోయి వుండాలి. సర్వసంగ పరిత్యాగి అయినా అయివుండాలి.
పగ తీర్చుకొని తను హంతకుడ్ని కాదు అని ఆయన దగ్గర కెళ్ళి చెప్పాలని రాబర్టు తాపత్రయం.
రాబర్టు కళ్ళనించీ రెండు కన్నీటిచుక్కలు రాలాయి.
ఖచ్చితంగా ఇది పూర్ణాగాడి పనే అతనికి అంతరాత్మ చెబుతోంది.
పోలీసులు నిరపరాధి అయిన తనకోసం వెదకుతున్నారే తప్పు కేసుని పరిశోధించి ఆ హత్య వెనుక కారణాలని వెతికి అసలు నిందితుల నెందుకు పట్టుకోవడంలేదు.
భుజంప్తెన ఏదో చెయ్యి మెత్తగా పడింది తలెత్తి చూశాడు రాబర్టు.
మేరి
"ఏడుస్తున్నావా?" అడిగింది.
రాబర్టు విషాదంగా నవ్వేడు. ఆ నవ్వులో ప్రపంచంనిండా చోటు చేసుకొన్నా బాధ తళుక్కున మెరిసింది.
"ఇది కన్నీళ్ళు కాదు మేరి, రక్తం నాలో అనుక్షణం పెరిగి పోతున్న అశాంతికి చిహ్నం ఈ రక్తపు చుక్కలు."
"నీ అశాంతిని నేను పోగొట్టనా?" అడిగింది మేరి.
"నువ్వు నాకు శాంతి నివ్వగాలవా మేరి నువ్వెంత పిచ్చిదానివి. కాష్టంలో కాలిపోతున్న శవానికి ప్రాణం పోయడం లాంటిది నీ ప్రయత్నం ఈ రాబర్టు గుండెలో అగ్ని పర్వతాలున్నాయి మేరి అని చాలా త్వరలోనే పేలిపోతాయి. బహుశా అప్పడే రాబర్టు కూడా మిగలక పోవచ్చు" అన్నాడు.
మేరి ఆందోళనగా అతడి పెదవుల్ని సున్నితమ్తెన తన చేతి వేళ్ళతో మూసింది.
"ప్లీజ్ నువ్వలా మాట్లాడి నన్ను భయపెట్టకు రాబర్టు నీకోసం నేనున్నానని మరచిపోకు. నీ జీవిత కాలమంతా నీకు తోడుగా నిలిచి నీకు చల్లని నీడ నివ్వాలనుకునే ఈ మేరీని దయచేసి బాధపెట్టకు. నువ్విలా వుంటే నేను చూడలేను నా గుండె పగిలిపోతోంది." అంది
"మేరి" ఆ పిలిపుకి మేరి ఉలిక్కిపడింది. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు రాబర్టు.
"నామీద ఆశల్ని పెంచుకోవద్దు. నేను గాలిలో వెలుగుతున్న దీపంలాంటి వాడిని."
"ఆ దీపాన్ని నిండుగా వెలిగించేందుకు నా ప్రయత్నం నేను చేస్తాను.
"హు దేవుడి గుడిలోంచి దిపమ్తెన, పూరి గుడిసేలోని దిపమైన గాలికి ఆరిపోతాయి మేరి" అన్నాడు తూలిపోతూ రాబర్టు.
మేరి అతన్ని గట్టిగా పట్టుకుంది. చిత్ర సహాయంతో అతన్ని మంచం దగ్గరకి తీసుకెళ్ళి పడుకోబెట్టింది.
మేరి మెల్లగా వంగి అతని పెదవులప్తెన ముద్దు పెట్టుకుంది. ఆ సమయంలో ఆమె కళ్ళనించీ జారిన రెండు కన్నీటిబోట్లు అతని చెంప ప్తెన పడినాయి.
ఆ రెండు కన్నీటి చుక్కల్ని రాబరై గనక చూసివుంటే అతని ఆలోచనలు ఎలా మారావోగాని, ఆ అదృష్టం ఆమెకి లేకపోయింది.
రాబర్టు మూలుగుతున్నాడు.
అతని కెదురుగా కుర్చీలో కూర్చుంది అతనిలా ఎండుకవుతున్నాడో అర్ధం కాకపోవటం తో ఏడుపొచ్చింది.
* * * *
రాబర్టు రోడ్డుచివర ఓ చెట్టుకింద నిలబడ్డాడు. అతనక్కడ నించుని పదనిముషాల యింది.
అప్పుడు రాత్రి ఎనిమిది గంటలయింది. ఆ రోడ్డు కిరువైపులా ఇళ్ళున్నాయి.
ఇంచుమించు అన్ని ఇళ్ళలోనూ దీపాలు వెలుగుతున్నాయి.
రాబర్ట్ మెల్లగా కదిలాడు. వాహనాలు కూడా అంతంత మాత్రంగా వెళుతున్నాయి.
ఆ మేడ ముందున్న ప్తెన్ బోర్డు కేసి చూశాడు.
జి. శశిభూషణ్ బి.
ఇంజనీర్
అని వుంది.
"శశిభూషణ్" అతనే తనని పర్స నీ దొంగతనం చేశాడని ఆరోపించి జైలుకి పంపింది. ఆ మధ్యాహ్నం శశిభూషణ్ నీ గుర్తు పట్టి ఆటలా అనుసరించాడు రాబర్ట్ ఇల్లు చూసి వెళ్ళిపోయాడు.
శశిభూషణ్ నీ దేబ్బతియ్యాలి.
అన్యాయంగా ఆరునెల్లపాటు జైలుపాలు చేసిన ఆ రాస్కెలు గాడి తోలు వలిచేయ్యాలి.
రాబర్ట్ చూశాడు.
