Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 26

    "ఊహూ! అటువంటివేమీ లేవు."

    "అయితే వేరే అమ్మాయిలతో సంభందాలు ఏమైనా..."

    "ఆయనకి నాతో సంభంధం పెట్టుకోడానికే తీరిక లేదు. ఇంకా వేరే అమ్మాయిలతో సంభంధం కూడానా?" దీర్ఘాలు తీస్తూ అంది రాజీ. నేను దార్లో పెట్టుకుంటాన్లే" అంది వెంకటలక్ష్మి రాంపండు వంక చూస్తూ.

    నువ్వు దార్లో పెట్టుకోవడం ఏంటీ నీ బొంద! అత్తగారు కూడా చెలాయిస్తే యింకైనట్టే!
 
    ఇలా మనసులో అనుకుని మళ్ళీ నాలుక్కర్చుకున్నాడు రాంపండు.

    "ఇదేంటి... నేనిలా ఆలోచిస్తున్నా...అపుఉడే దీని కూతుర్నినేను చేసుకున్నాట్టూ, ఇది నకు అత్తగారైపోయినట్టూ" అనుకున్నాడు.

    "సరేగానీ! మీ అమ్మాయిని తీసుకుని రాలేదేం? కనీసం ఫోటో అయినా తీసుకుని 'రావలసింది' అంది రాజీ.
    రాజీ మాట వినగానే తన గుండ్రని ఒళ్ళు మెలికలు తిప్పుతూ అంది ఆమె.

    "అమ్మాయా...? భలేవారే. నాకింకా పెళ్ళి కాలేదు!"

    "ఈ అమ్మా అమ్మాకాడ... కుమారీనా?" అనుకున్నాడు రాంపండు.

    "మరి మీరు ఎవరికోసం వచ్చారు?" అడిగింది రాజీ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ.

    "నా కోసమే!" అంది వెంకటలక్ష్మి సిగ్గుపడుతూ.

    రాజీ పులిక్కిపడింది. ఇంకా రాంపండు సంగతి చెప్పాక్కర్లేదు. అప్పుడు ఇంటికి పెద్దయిన నా మీదే బాధ్యతలన్నీ పడ్డాయి... తమ్ముళ్ళనీ, చేల్లిళ్ళనీ, పెంచి పెద్దచేసి, చదివించి,వాళ్ళందరి పెళ్ళిళ్ళూ చేసే సరికి నాకీ వయసు వచ్చింది. నేను పెళ్ళి చేసుకోవాలని అనుకునేసరికి అందరూ నాకు వయసు ఎక్కువైపోయిందని ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా వాళ్ళు పెళ్ళాం పోయి ఎద్దులాంటి పిల్లలున్న వాళ్ళూ, బట్ట తలలోచ్చేసి, లావుగా పెద్ద పొట్టతో వికారంగా వున్న వాళ్ళూ వస్తున్నారు. ఇంటా చసి వాళ్ళకి మళ్ళీ కట్నం కావాలట! లక్షలు పోసి అలాంటి పనికిరాని సరుకుని కొనుక్కునే కంటే ఇలాంటి..." రాంపండు చూస్తూ ఆగింది వెంకటలక్ష్మి.

    "మీరు చెప్పేది నిజమేగాని... మీకంటే మా రాంపండు చిన్నవాడు కదా!" సందేహంగా అంది రాజీ.

    "చిన్నవాడై తేనేం...? నాకేం అభ్యంతరం లేదు. న వుద్దేశ్యంలో పెళ్ళాం కంటే మొగుడు చ్చిన్నవాడైతేనే ఆ సంసారం బాగుంటుంది. మొగుడు వయసులో పెద్దవావడం చేతే అన్ని సంసారాల్లో వాళ్ళు పెళ్ళాం మీద అధర్జీ చేలాయిస్తారు, నేత్తిమీద మొట్టికాయలు కొడతారు... వాళ్ళిష్ట ప్రకారమే జరగాలని మొండి పట్టు పడతారు. అదే పెళ్ళాం తనకంటే పెద్దదయితే బుద్దిగా పడుంటాడు. ఇంకా సంసార సుఖం గురించి ఆలోచించినా..."

    "ఇంకాపండి!" గట్టిగా అరిచాడు రాంపండు దిగ్గున ల్స్తూ. అప్పుటిదాకా అక్కడ చాలా ఒప్పిగా భరిస్తూ కూర్చున్నాడు.

    "మీరు చేసుకోవాలని అనుకున్నా ఇక్కడెవరూ రెడీగా లేరు..." అంటూ రివ్వుమని లోపలకి వెళ్ళిపోయాడు అతను.

    "సారీ లక్ష్మిగారూ! మీరేమీ అనుకోకండి. ఆయనకి నేను నచ్చజెప్తాగా...?" అని రాజీ వెంకటలక్ష్మితో అనడం లోపలకి వెళుతున్నా రాంపండుకి వినిపించింది.

    బెడ్ రూమ్ లోకి వెళ్ళిన రాంపండు జుట్టు గట్టిగా పీక్కుని, పక్క మీద గట్టిఇగా గుద్ది మంచం మెడ కోర్క్క్ష్హుమ్తో"హే భగవాన్!" అన్నాడు.

    బయట రాజీ, వెంకటలక్ష్మి మాట్లాడుతున్న మాటలు రాంపండుకి అస్పష్టంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏవో బెరసానాలు సాగుతున్నాట్టుగా అనిపించింది అతనికి.

    "రాజీకి ఏమైనా మతిపోయిందా? ఆవిడతో ఎలా వెళ్లిపోతానని అనుకుంది? నేనేమైనా అట బొమ్మనా అవరకి పడితే వారికి అమ్మి పారేయ్యడానికి?" అనుకున్నాడు కోపంగా.

    వేది తలుపు వేసిన శబ్దం అయ్యింది.

    వెంకటలక్ష్మి వెళ్ళిపోయినట్టుంది! అనుకున్నాడు.

    రాజీ బెడ్ రూంలోకి వచ్చింది.

    "హూ...! రెండు లక్షలైతే రెండు లక్షలకి ఎలా ఇస్తాను?" అంది విస్సుగా.

    అతను బాధగా జుట్టు పీక్కున్నాడు.

    "నలుగు లక్షలకి వడ్డీ కలపి అమ్మలనుకుంటుంన్నా."

    "ఏంటి న్యూసెన్స్? నువ్వు అమ్మేస్తే అమ్ముడయ్యిపోవడానికి నేనేం సిద్దంగా లేను" అరిచాడు అతను.

    "ఏం? పెళ్ళి టైంలో కట్నం రూపంలో అమ్ముడయిపోవడానికి ఎలా సిద్దపదతావ్...? మేము నీ గిరించి మీ అమ్మా నాన్నలకు ఎలా కట్నం యిచ్చామో ఇప్పుడు అవతలి వాళ్ళు నే గిరిమ్చే నాకు అలా కట్నం ఇస్తున్నారని అనుకోండి" అంది రాజీ.

    "అలాగైతే నన్ను నుజంగానే అమ్మేస్తావన్న మాట?" ఉక్రోషంగా అడిగాడు రాంపండు.

    "నిజంగా కాకపోతే పేపర్ ప్రకటన ఎందుకిస్తానూ?"

    "అయినా నువ్వేమ్మేసినంత మాత్రాన నేను వల్ల కూడా వెళ్ళి పోతానని ఎలా అనుకున్నావు? ఓహవేళ వాళ్ళు బలవంతంగా తెస్కేళ్ళినా నువ్వు లేనింట్లో ఎలా వుంటననుకుంటున్నావు? పారిపోయి వచ్చేసా."

    "నేను నిన్ను ఇంట్లోకి ఎందుకు రానిస్తానూ....? అప్పుడు నువ్వు నకు పరాయి మగాడితో సమానం!
అయినా నువ్వు పారిపోతావ్ అక్కడ వుంటావో అది నీ యిష్టం.... నిన్ను కొనుక్కుంటున్నా వాళ్ళ యిష్టం! నా డబ్బులు నకు ముడితే అంతే చాలు."

    "అయితే ఇందాక ఆ వృద్దవారితో బేరంకుదిర్తేనన్ను అమ్మేసి వుండేదాని వన్న మాట!"

    "ఓ..."

    "దానితో ఎలా వెళతాననుకున్నావు?" పళ్ళు నూరుతూ అన్నాడు రాంపండు.

    "ఒహొ! అయితే కాస్త మంచమ్మాయి దొరికితే నేకేం అబ్యంతరం లేదన్నమాట!" కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంది రాజీ.

    "అలా అని నేనన్నానా?... నువ్వు నా అన్నావు.... మళ్ళీ విడిగా అడగడం ఎందుకూ అని!"

    "ఇప్పుడు కుదర్దని అంటున్నాను."

    "సారీ...లేటయ్యింది!.... ఇంకా నా నిర్ణయం మారదు! అయినా నాకు మేరావుడ్డు బాబోయ్ అంటుంటే నన్ను అంటి పెట్టుకుని వుండడానికి నీకు సిగ్గులేదూ?"

    రాజీ మెల్లగానే అన్నా అ మాటకి రాంపండు అహం దెబ్బతింది కోపం కూడా చాలా వచ్చింది.

    "నువ్వు చేస్తున్నా ఈ పనికి అనుభావిస్తావ్..." అక్కడి నుండి లేచి విసురుగా హాల్లోకి వచ్చి కూర్చున్నాడు.

    వెంటనే డోర్ బెల్ మోగింది.

    విసుక్కుంటూ లేచి తలుపు తీశాడు.

    ఎదురుగా ఓ అరవై ఏళ్ళ ముసలమ్మా. దాన్ని చూడగానే  రాంపండుకి బీపి పెరిగిపోయింది.

    "ఏం...? నీక్కూడా నేను కావలసి  వచ్చానా?" గట్టిగా అరిచాడు.

    "ఆ ముసలావిడ బిత్తరపోయి అతని వంక చూసింది.

    "ఇక్కడెవరూ అమ్మకానికి లేరు" అని అతను తలుపులు మూసి వెయబోయాడు.

    కానీ అప్పుడే లోపలనుండి అక్కడికి వచ్చిన రాజీ "అగు... ఆమెని నేనే పిలిచాను" అంది.

    అతను రాజీ వంక చూశాడు.

    "ఈమేని నేనే రమ్మని పిలిచాను... మనింట్లో పనికీ, నాకు తోడుగా మనింట్లోనే వుండటానికి పనికి వస్తుందని. మరి నేను కొద్దిరోజుల తర్వాత ఒంటరిగా వుండాల్సి వస్తుంది కదా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS