Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 26

    ఇద్దరూ ఆలోచనల్లోంచి ఈ లోకంలో పడ్డారు. అదే ఇదివరక్తేతే  వాళ్ళకి పండు మీద విపరీతంగా  కోపం చిరాకు కలిగేది. కాని ఇప్పుడు వాడిని చూస్తుంటే విపరితమ్తెన జాలేస్తుంది.

    పాపం, తండ్రి ప్రేమకి నోచుకోలేదు వీడు.... తనకంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తాడు తన తండ్రి  అని గ్రహించే వయసు కాదు విడిది. విడి ప్రాణాలు పోయినా ఫర్వాలేడుగాని డబ్బుని వదులుకోలేడు విడి తండ్రి!

    ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఇద్దరూ.

    "ఏంటి దేభ్యం మొహలేస్కుని అలా చూస్తున్నారు?  నాకు ఇంకా చాక్లెట్లు కావాలని అన్నానా?"

    చిట్టబ్బాయి పండుగాడి వంక జాలిగా చూస్తూ అన్నాడు "ఇంకా ని దగ్గర కాసిన్ని ఉన్నాయిగా, అవి కూడా అయిపోయాక కొనుక్కుందాంలే బాబూ!"

    ఏ కళనున్నాడోగాని బుద్దిగా తల ఊపాడు పండు.

    "ఇప్పుడు  విడివి ఏం చేద్దాం?" అడిగాడు కన్నారావు.

    "ఏం లేదు... వాళ్ళ నాన్న మనం అడిగిన డబ్బులు ఇవ్వమని అన్నాడుగా! వీడిని సఫా చేసేద్దాం!!" అన్నాడు  చిట్టబ్బాయ్.

    కన్నారావు ఉలిక్కిపడ్డాడు.

    "ఏవిటి నికేమ్తెనా  మతిపోయిందా?  మనం నిజంగా ఏమ్తెన కిడ్నాప్ చేశామా ఏంటి?"

    "మరి  నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? ... వీడిని ఏం చేద్దాం అంటే? ఏం  చేస్తాం...ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతాం...అంతే"

    "రేపు కూడా మాఇంటికి వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అన్ని కొనిస్తారుగా?"  పండు ఇద్దరి వంకా చూస్తూ అడిగాడు.

    "ఆ.... ఆ... అలాగే బాబూ"  అన్నాడు చిట్టబ్బాయ్.

    "పద ... ఇంక పోదాం... మన ప్లానంతా వెస్టయిపోయింది...." చిట్టబ్బాయ్ తో  అని "లేరా పండూ పోదాం"  అన్నాడు కన్నారావు.

    "ఊహు.... నేనప్పడే మీతో రాను... ఇంక స్కూలు వదిలే టైం కాలేదుగా....నాకు మరి కాసిన్ని పొట్లాలు కొని ఇవ్వండి!" అన్నాడు అందు నిర్లక్ష్యంగా వీళ్ళని చూస్తూ.

        కన్నారావు నెత్తి కొట్టుకున్నాడు.

    "అందుకనే వీళ్ళ నాన్న సఫా చేసేయమని అనుంటాడు!!"

    హఠాత్తుగా చిట్టబ్బాయ్ కి  ఎదో స్పురించింది. కన్నారావు వంక కళ్ళు పెద్దవి చేసి చూశాడు.

    "నువ్వు టెలిపోన్ డ్తెరెక్టరిలో  చూసి  కదా రంగాయకులు ఫోన్ నెంబరు  నాకు చెప్పావు/" అని కన్నారావు భుజాలు కుదుపుతూ అడిగాడు.

    "అవును యేం?"

    "నువ్వు సరిగ్గా చూశావా అని?"  మళ్ళి కన్నారావు భుజాలు పట్టి కుదిపాడు చిట్టబ్బాయ్.

    "సరిగ్గానే చూశాను. నువ్వు డయల్ చేసిన తరువాత అవతల ఫోన్ ఎత్తిన మనిషి తను రంగనాయకులు అనే ఒప్పకున్నాడుగా!"

    "అతను రంగనాయకులు  అయితే అవ్వోచ్చుగాని మనకి కావలసిన రంగనాయకులు కాకపోవచ్చుగా!!"

    మళ్ళి గట్టిగా కన్నారావు భుజాలు కుదిపాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు వెనక్కి తూలి పడ్డాడు.

   "నువ్వు మరి ఇంత గట్టిగా కుదిపితే నేనూర్కొనంతే!..."  కింది నుండి లేస్తూ బట్టల కంటిన మట్టి దులుపుకుంటూ  అన్నాడు కన్నారావు.

    "సర్లె ...అలాగే కాని! చెప్పు... అతను మనకి  కావలసిన రంగనాయకులు కాకపోవచ్చు కదా?" మళ్ళి అదే ప్రశ్నని అడిగాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు ఆలోచనలో పడ్డాడు.

    "అంటే మనం ఇంకో రంగాయకులికి  ఫోన్ చేశామంటావా"

   "అంతే జరిగి ఉంటుంది... లేకపోతే కనకోడుకుని చంపేసుకో నాకేం అభ్యంతరం లేదని ఎవరంటారు?... అసలు డ్తెరెక్టరి నీకు రంగనాయకులు పేర్లు ఇంకా కనబడలేదా?"

    "ఇంకా ఉండే ఉంటాయేమో  మరి. నేను చూడగానే కనిపించిన మొదట రంగనాయకులు పేరు ఎదురుగా ఉన్న నెంబరు నీకు చెప్పాను. కింద ఇంకా ఉన్నాయేమో!!..."


    కన్నారావు ఇలా అనడంతో చిట్టబ్బాయ్ కి ద్తేర్యం వచ్చింది.

    తమ ప్లాన్ ఇంకా ప్లాప్ కాలేదన్నమాట!!"

    "అలాగయితే పద!... మళ్ళి  వెళ్ళి ఈసారి అసల్తెన రంగానాయకులికి ఫోన్ చేద్దాం" హుషారుగా అన్నాడు చిట్టబ్బాయ్.

    "ఎలా?...అసల్తెన రంగానాయకులెవరో మనకి ఎలా తెలుస్తుంది? నేను వాళ్ళ ఇంటిపేరు  కనుక్కోలేదే?" తెల్లమొహం వేస్తూ అన్నాడు కన్నారావు.

    "ఇదిగో... పండుగాడు ఇక్కడ ఉన్నాడుగా మనకేం ప్రాబ్లెం?"

    చిట్టబాయ్ పండు ముందు మోకాళ్ళమీద  కూర్చుంటూ అడిగాడు "పండూ పండూ మీ ఇంటి పెరంటమ్మా?"

    "నేను చెప్పను! నాకు ఇంకా ఏమ్తెనా కోనిపెడ్తేనే చెప్తాను!"

    "కోంటనమ్మ.. నువ్వు మీ ఇంటి పేరు  చెప్పిన తరువాత మీ నాన్నకి ఫోన్ చెయ్యడానికి  షాపు కెళ్తాముగా అక్కడ కొనిపెడ్తాను!!"

    "ఊహు...."

    "ప్లీజ్ పండూ"

    "ఉహు...ముందు కోనిపెడ్తేనే!"

    ఇంతలో వీధిలో "ఐస్కీమ్"  అని కేక వినిపించింది.

    "నాకు ఓ ఐస్ర్కిమ్ కొని పట్టుకురా... అప్పుడు చెప్తాను"  అన్నాడు పండు.

    "ఒరేయ్ కన్నా!... త్వరగా వెళ్ళి ఓ ఐస్ర్కిమ్ కొనుక్కుని తుసుకుని రారా..."


    చిట్టబ్బాయ్ లేచి నిలబడుతూ అన్నాడు.

    "నువ్వే వెళ్ళి తెచ్చుకో నాకేం? వాడేమ్తెనా  నాకు బామ్మర్దా?" చిరాకుపడ్డాడు కన్నారావు.

    చిట్టబ్బాయ్ ఓ సారి కన్నారావు వంక కొరకొరా చూసి బయటికి  వెళ్ళి ఓ  ఐస్ర్కిమ్ కొనుక్కుని వచ్చాడు. పండు సంతోషంగా చిట్టబ్బాయి చేతిలోని ఐస్క్రిమ్ అందుకున్నాడు.

    "ఊ... ఇప్పుడు చెప్పమ్మా" మళ్ళి మోకాళ్ళ మీద పండు ముందు కూర్చుంటూ అడిగాడు చిట్టబ్బాయి.

    "వుండు...ఐస్క్రిమ్ తిననివ్వవా? పాడుసంత!" చిరాకుపడ్తూ అన్నాడు  పండు.


    చిట్టబ్బయికి ఒళ్ళు మండిపోయింది. వాడి చేతిలోంచి ఐస్ర్కిమ్ లాక్కుని నేలమీద విసిరి కొడ్దమని అనిపించింది.

    కాని మనిషికి ఇటువంటి  క్లిష్టపరిస్దితుల్లోనే సహనం కావాలి. అందుకే  ఓపిక తెచ్చుకుని ఓ వెర్రినవ్వు నవ్వి "అలాగే బాబూ ఐస్ర్కిమ్ మింగు" అన్నాడు చిట్టబ్బాయి.

    పండు ఐస్ర్కిమ్ మెల్లగా నాకుతూ తినసాగాడు.

    "త్వరగా తినుబాబు... కరిగిపోతుంది" అసహనంగా అన్నాడు కన్నారావు.

    "నాకు తెలుసులే  బోడి!" కన్నారావు వంక చూడన్తేనా చూడకుండా ఐస్ర్కిమ్ తింటూ  అన్నాడు పండు.

    కన్నారావు కోపంగా పిడికిళ్ళు బిగించాడు.

    "శాంతించరా... అవసరం మనది ఏం చేస్తాం!" అన్నాడు చిట్టబ్బాయ్.

    పండుగాడు వాళ్ళిద్దరి సహనాన్ని పరీక్షిస్తూ ఐస్క్రిమ్ ని మెల్లగా తిని పుల్లవతల పారేశాడు.
   
    "ఇప్పుడు చెప్పు! కుతూహలంగా అడిగాడు చిట్టబ్బాయి.

    "నా కింకో ఐస్ర్కిమ్ కావాలి!"

    "ఇంకోటా? ఎక్కడి నుండి వస్తుంది? ఐస్ర్కిమ్ బండివాడు ఇందాకే ఇక్కడి నుండి ఎక్కడికో తగలబడి పోయాడు" అరుస్తూ అన్నాడు కన్నారావు.

    "అలా అరుస్తావేం?... మా నాన్నతో చెప్పానంటే రేపట్నుండి వేరే రిక్షా వాడిని మార్చేస్తారు. అప్పుడు మీ తిక్క వదిలిపోతుంది" అన్నాడు పండు మొహం చిట్లించి.

    నేనేం రిక్షావాడిని కాదు... ని ఎదురుగా కూర్చుని ఉన్నాడే వాడే రిక్షావాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS