Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 27


    " నిజంగానే రేప్...  అంటే ...." అంది.

    "అవును సరస్వతీ! నువ్వు మామూలుగా నిజం చెప్పవని నాకు తెలుసు. దీని వెనుక ఎవరిదో అదృశ్యం హస్తం వుందని నాకు ముందే తెలుసు. అందుకే నిన్ను బెదిరించిన నీచేత నిజం చెప్పించాలని ఈ నాటకం ఆడాను. లేచి ముందు చీర కట్టుకో" అన్నాడు పరుశురాం.

     అతని మాటలకి సరస్వతి కళ్లు కృతజ్ఞతతో మెరిసాయి.

     "చీకటి పడిపోయింది" అంది భయంగా.

     "తెల్లవార్లూ నాతోవున్నా నీపైన ఈగ కూడా వాలదు.  చెప్పు. అసలేం జరిగింది" అడిగాడు పరుశురాం.

     సరస్వతి ఒకసారి కళ్ళు మూసుకొంది. ఆమె కళ్ళనించి కన్నీరు  జారుతోంది.

     ఆమె కన్నీటిని తుడుస్తూ-

    "ఏడవకు. ఇంత నష్టపోయి నేను కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు. నీకేం జరగలేదుగా కన్నీటిని వృధా చేసుకోడానికి చెప్పు" ఆమె భుజం పైన చేత్తో తట్టాడు పరుశురాం.

    సరస్వతి కళ్లు తుడుచుకుంది.

    " ఆ రణధీర్ గాడికి నేను బుద్ధి చెప్తాను. నీకేమీ భయంలేదు సరస్వతీ!నీ కేసి కన్నెత్తి వాడి కళ్ళు పీకేస్తాను చెప్పు!"అన్నాడు పరుశురాం.

    సరస్వతి తల దించుకొని చెప్పసాగింది.

                                           **               *               **

    లేబొరేటరీలో ఆలస్యం అయింది. సరస్వతికి. మెల్లగా లాబ్ లోంచి బయటకొచ్చి నేరేడు చెట్ల పక్కనించి కాలేజీ వెనక గేటు కేసి నడుస్తోంది దామె.  అప్పటికే చీకటి తెరలు కమ్ముకొచ్చాయి.   

     క్రికెట్ ఆడుతున్నారు ప్లే గ్రౌండ్ లో కొందరు. వున్నట్టుండి ఆరు సైకిళ్ళ పైన రణధీర్ అతని మిత్రబృందం ఆమెని  చుట్టుముట్టారు.

    అనుకోని ఆ సంఘటనకు బిత్తరబోతున్న సరస్వతి మొహం పైన గుప్పుమని సిగరెట్ పొగని ఊదాడు రణధీర్.
                "    ఆ  పొగ ఘాటుకి ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోయింది.

    అది చూసి అతని మిత్రులు హేళనగా నవ్వేశారు. సరస్వతి వాళ్ళని తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ, చుట్టూ సైకిళ్ళు, వాటిపైన రౌడీ సన్నాసులు మధ్యగా నిర్బంధంలో ఆమె.

     రణధీర్ ఆమె జబ్బపైన చేత్తో బలంగా కొట్టి గుచ్చి పట్టుకుని-

    "మమ్మల్ని తప్పించుకొని పోవాలనే" ఎగతాళి గా అన్నాడు.

    అతనెలాంటివాడో ఆమెకి తెలుసు.

     రౌడీ!

    ఆడపిల్ల పాలిట రావణాసురుడు. అతనంటే కాలేజీలో ఆడపిల్లలకి అసహ్యం,భయం.....

     వాళ్ళకి దొరికిపోయినందుకు తనని తానే నిందించుకొందామె.

    అసలు తనని  వాళ్ళెందుకు ఆపారో ఆమెకి అర్థం. కాలేదు. కాలేజీలో తనేమీ పాపులర్ కూడా కాదు. ఏ వర్గంలోనూ తను ఏక్టింగ్ మెంబరు కూడా కాదు. అలాంటి తనతో వాళ్ళకి పనేమిటి!

    " ఏం కావాలి?" అడిగింది ధైర్యాన్ని కూడదీసుకొంటూ.

    "ఏం కావాలో కోరుకోమంటుందిరా!" అన్నాడో వెధవ.

     "నువ్వే కావాలి!"

    "నాకో ముద్దు!"

    "వెచ్చని కౌగిలి కావాలి నాకు."

    "నాకు అన్నీ కావాలి."

    "నాకు మాత్రం టబ్బులో పన్నీరుపోసి నీతో పడుకోవాలనుంది" ఒక్కో వెధవా ఒక్కో కూత కూశాడు.

     చెప్పు తీసుకు కొట్టాలనిపించిందామెకి. కానీ, అలాంటి అవకాశం ఆమెకి లేదు. వాళ్ళ బారినుండి  ఆ సమయంలో ఎవరూ కాపాడలేరని కూడా ఆమెకి తెలుసు. రణధీర్  చూయింగ్. గమ్ నములుతూ అన్నాడు.

    "విన్నావుగా నా ఫ్రెండ్స్ కోరికలు, సాధారణంగా వాళ్ళ కోరికలు తీర్చడం నా హాబీ. నేను 'ఉ' అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే అందరూ 'పని' పూర్తిచేసుకొంటారు. ఏమంటావ్?"

     ఆమె కళ్ళనించి నీరు జలజలమని కారుతోంది.

     "నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. మీ దారికి నేనెప్పుడూ అడ్డురాలేదు. నన్నెందుకిలా అవమానిస్తున్నారు" అంది.

    రణధీర్ నవ్వాడు.

     "అవమానించాలని మాకూలేదు. నువ్వు ఒకపని చేతిని విడిపించుకోవడానికి ప్రయతిస్తూ సరస్వతి.

    అయిపోతున్న సిగరెట్ పీకతో మరో సిగరెట్ వెలిగించి నాలుకతో దాన్ని పెదాలపైన అటూ ఇటూ తిప్పుతూ అసహ్యంగా చూస్తూ-

    " ఆ పరుశురాంగాడ్ని నీ ఇంటికి వచ్చేట్టు చేయాలి."

    "దేనికి?"

     "మీ అమ్మా, నాన్న ఊళ్ళో లేరుగా అందుకని"చెప్పాడు రణధీర్.

    ఆమె అర్థం కానట్టు చూసింది.

     "నువ్వు ఏదో సాకుతో అతన్ని పిలిచి,ఇంటికొచ్చాక అతను నిన్ను రేప్ చేయడానికి ప్రయత్నించాడని కెకలుపెట్టాలి. అల్లరి చేయాలి. పోలీసు రిపోర్టు ఇవ్వాలి."

    "అమ్మో!"గుండెలపైన చేతుల్ని  వేసుకొంది సరస్వతి.

     "అలా చేస్తే నీ మర్యాదా, నా మర్యాదా ఓ . కె . లేకపోతే నావాళ్ళు నిన్ను మందుకొట్టి మంచం ఎక్కించేస్తారు. అప్పుడూ వాంఛకూడా తీరిపోతుంది.నీ నడుము విరిగిపోతుంది. ఆతర్వాత నువ్వు బ్రోతల్ హౌస్ నడుపుకోడానికి తప్ప దేనికి పనికిరావు. ఆలోచించు!"

    బండరాయితో వాడి తల పగలకొట్టి చంపాలనిపించిందామెకి.

     కానీ, నిస్సహాయత!

    అంతటి సామర్థ్యం ఏదీ తనకి!

    ఏడుపొస్తోంది.       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS