Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 26


    " ఒద్దు. నన్నేం చేయకు. నేను అలాంటిదాన్ని కాదు" అంది బొంగురు గొంతుతో.

     'చెళ్' మని చెంప పగిలేలా కొట్టాడు ఆమెని పరుశురాం.

     "చంపేస్తాను. నువ్వెలాంటిదానివో నాకు బాగా తెలుసు." అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా వున్నాయి.

    "పరుశురాం నీకు చేతులెత్తి దండం పెడతాను. నన్ను విడిచి  

    ఆమె కళ్ళల్లో  నీరు గిర్రున తిరుగుతోంది.

    పెట్టు..... నన్ను నాశనం చేయకు." వేడుకొందామె.

     పరుశురాం ఆవేశంతో వణికిపోతూ ఆమె రెండు భుజాలనీ గుచ్చి పట్టుకుని తీవ్రంగా సరస్వతి మొహంలోకి చూస్తూ అన్నాడు.

     "నువ్వు  కళ్ళ నీళ్ళు పెట్టుకుని ప్రాధేయపడితే విడిచిపెట్టడానికి తీసుకురాలేదే! నిన్ను చెత్తచెత్తగా వాడుకొని,అనుభవించి నీ బతుకుని కుక్కలు చింపిన విస్తరి చేస్తాను, ఆ తర్వాత నీపీక పిసికి చంపి ఈ దొరుక్రిందనే పాతి పెడతాను"ఆమె మొహం పైకి ఒంగాడు పరుశురాం.

    మొహాన్ని పక్కకి తిప్పేసుకుంటూ చేత్తో అతన్ని వెనక్కి తోసేయడానికి ప్రయత్నించింది సరస్వతి.

     ఆమె ప్రతిఘటించడానికి ఎప్పుడు ప్రయత్నం మొదలుపెట్టిందో అప్పుడే అతనిలో ఉద్రేకం , కోపం, ఆవేశం ఎక్కువైపోసాగాయి.

    ఓ మహావృక్షం కూలి మీదపడుతున్నట్టు అతను తన మీద పడుతూంటే పక్కకి  తిరగబోయింది సరస్వతి. ఆమె లంగా  మోకాళ్ళ వరకు పైకి జరిగిపోయింది. కాళ్ళు రెండూ బిగించింది సరస్వతి.  రెండు చేతులతో  గుండెల్ని కప్పేసుకుంది. కళ్ళనుంచి కన్నీరు ద్రవిస్తోంది.

     గుండె అదిరిపోతోంది. కంఠం ఒణుకుతోంది. ప్రాణభీతితోపాటు తను కోల్పోబోతున్న తన శీలం గురించి ఆవేదనతో తల్లడిల్లిపోతోంది. సరస్వతి.   

     పరుశురాం చేతిలో చాకు తళుక్కున మెరిసింది.

    "పిచ్చి వేషాలేయకుండా లొంగిపో. లేకపోతే ఈ కత్తితో నీ శరీరాన్ని చీల్చిపారేస్తాను" ఆమె కంఠం మీద కత్తిని గ్రుచ్చుతూ అన్నాడు.

    అతని గొంతులో కఠినత్వం తప్ప జాలి ఏకోశానా లేదు.

     ఆమె పరిస్థితిని అంచనా వేసుకుంది.   

     అతని చేతిలోంచి తప్పించుకోవడం తనకి సాధ్యం కాదని అర్థం అయిపోయింది. ఆమెకి. ప్రాధేయపడితే అతను కరుగుతాడేమో  తప్ప ప్రతి ఘటించి ప్రయోజనం లేదని కూడా ఆమె గ్రహించింది.

     అతనికి ఆమె రెండు చేతులు జోడించింది.   

     "పరుశురాం నా జీవితాన్ని నాశనం చేయొద్దు. నన్ను విడిచి పెట్టు" అర్ధించింది. దీనంగా  చేతులు జోడించిన సరస్వతికేసి చూశాడు.

     ఆమె శరీరం అతని చేతుల్లో  వుంది. ఆమె శరీరంలోని ఎత్తుపల్లాల కేసి చూస్తూ పళ్ళు పటపటమని కొరికాడు.

    " ఏ..... జీవితమంటే అంత తీపానీకు? నన్నూ, నా బతుకుని బజారుపాలు చేశావు. నేను చేయని నేరాన్ని నాపైన మోపి పోలీసులతో కొట్టించావు. కాలేజీనించి డిస్మిస్ చేయించావు. ఆయిన వాళ్ళకీ , కాని   వాళ్ళకు కూడా దూరం అయ్యేలా చేశావు. ఈ సమాజం నన్ను రేపిస్ట్ గా చూసి మొహాన ఊసేట్టు చేశావు.   

     నిన్ను మానభంగం చేయబోయానని న పైన రిపోర్ట్ ఇచ్చావు. దానికి ఫలితంగా పోలీసుల చేతిలో లాఠీదెబ్బలు తిని అనుబవించాను. ఇప్పడు నిజంగా నిన్ను రేప్ చేస్తాను. ఎందుకో తెలుసా?నాకిప్పుడు లాఠీ దెబ్బలంటే  భయంలేదు.అందరి చేత విసిరి  కొట్టబడిన ఆపారమైన అనుభవాన్ని గడించాలన్నది నా ధ్యేయం." ఆమె తొడలపైన చేతులువేసి నొక్కుతూ అన్నాడు పరుశురాం.

     "ఒద్దు. నేను .... నేను కంఠంలో ప్రాణం ఉండగా దానికి ఒప్పుకోను. కావాలంటే చంపేయ్" అరిచింది.

     పరుశురాం నవ్వాడు.

    "చంపమంటావా?సరస్వతీ!నిన్ను నేను చంపబోయానని కేసుపెడితే సంతోషించేవాడిని. కానీ... కామంతో , మదంతో కళ్ళు మూసుకొని పోయిన వాడినన్నట్టు రేప్ కేసు పెట్టావు. ఆ అవమానాన్నిభరించలేక పోతున్నాను."

    ఎవరయిన అమాయకుడు నేరంలో ఇరుక్కుంటే విడిపించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏపాపం తెలీని నన్ను సర్వనాశనం చేసిన నువ్వు రేపు ఇంకెందరి జీవితాలని బలి తీసుకొంటావో ఎవరికి తెలుసు. అందుకే తప్పదు. నేను కామంతో  కళ్ళు తెరిపించడానికి నీ  శీలాన్నినేను దోచుకొంటాను.  దేవుడు నీ నుదుట రాసిన రాతని మార్చి కొత్తరాతని నేను రాస్తాను.

     నువ్వు అరిచినా ఏడ్చినా,మొత్తుకున్నా ప్రతిఘటనకి సిద్దపడినా  'హింస' పెరుగుతుందే   తప్ప ' పని'  జరగకమాత్రం తప్పదు.

    ఆమె మీద పడ్డాడు పరుశురాం.

      ఆమె ఆర్తనాదం చేసింది.

     "నాకే పాపం తెలీదు పరుశురాం.ఇదంతా వాడి పని...... నన్ను బెదిరించి  ఈ నాటకం ఆడించాడు..... నువ్వంటే నాకే విధమైన పగ, ద్వేషం  లేవు పరుశురాం. వాడికి భయపడి నేనింతవరకు నోరు విప్పలేదు" ఆమె బోరుమని ఏడవడం మొదలుపెట్టింది.

     ఆమె భుజాలని నొక్కిపట్టి అడిగాడు.

     "ఎవరు వాడు?"

    "రణధీర్"

    ఆ పేరు న వినగానే ఆమెని విడిచి పెట్టి లేచే కూర్చున్నాడు పరుశురామ్.

     సరస్వతి కేసి చూశాడు. ఆమె అలాగే పడుకొని  వుంది.

     "ఇలాంటప్పుడు ఈ మాత్రం అవకాశం బస్తే లేచి పారిపోవాలి. తీరుబడిగా పడుకుంటే నిజంగానే రేప్ జరుగుతుంది" అన్నాడతను. సరస్వతి లేచి కూర్చుంటూ......


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS