డిపార్ట్ మెంట్ లోని అందరూ తలలు అతని వంక వింతగా చూశారు.
సరే! నీ మైండ్ ఎందుకో సరిగా లేదు. ఈ వేళ నువ్వెందుకు కోపంగా అరుస్తున్నావో.... మళ్ళీ వెంటనే ఎందుకు నవ్వుతున్నావో నాకర్ధంకావడంలేదు. వీలుంటే శలవు పెట్టి యింటికెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో...." అనెఇ టేబుల్ మీద న్యూస్ పేపర్ తీసుకుని తన సీట్లో కూర్చున్నాడు బ్రహ్మజీ.
మధ్యాహ్నం లంచ్ టైంలో అందరి మధ్యా ఆ ప్రకటనకి సంభందించిన విషయమే చర్చికి వచ్చింది.
ఆఖరికి బాస్ సర్వోత్తమరావు కూడా రాంపండు ఏదో ఫైలు తీసుకుని లోపలికెళ్ళాగానే ఆ టాపిక్ గురించే ఎత్తాడు.
"ఈ రోజు పేపర్లో ఆ ప్రకటన చూశావటోయ్? ఎవరో అమ్మాయి తన మొగుడ్ని అమ్మెస్తానంటూ ప్రకటన యిచ్చింది. చాలా వింతగా ఉంది కదూ... పాపం! ఎవరో ఆ దౌర్బాగ్యుడు? ఆ కొనుక్కునే ఆమె వాడితో పప్పు రుబ్బిస్తుందో లేకపోతే కాళ్ళే పట్టించుకుంటుందో?! ఎంటో... అంతా విచిత్ర వ్యవహారం..." అంటూ ఫైలుమీద సంతకం చేసి అతనికి ఇచ్చేశాడు.
క్యాబిన్ లోంచి బయటికొచ్చి తన సిట్లో కూర్చున్నరాంపండుకి మరిన్ని కొత్త ఆలోచనలతో బుర్రకాయ్ హీటెక్కిపోయింది.
సర్వోత్తమరావు అన్నట్టు కొంపదీసి ఆ కొనుక్కున్నది పప్పు రుబ్బించడం, రాజీ ప్రకటన ఇచ్చినంత పనులేమీ చేయించదు కదా?! అయినా నా పిచ్చీగానీ, రాజీ ప్రకటన ఇచ్చినంత మాత్రాన నన్ను కొనుక్కోవడానికి ఎవరోస్తారు? కొనుక్కునే వాళ్ళు పెళ్ళికాని వాళ్ళనే కొనుక్కుంటారుగానీ నాలాంటి సెకండ్ హండ్ మొగుడ్ని ఎవరు కొనుక్కుంటారు? తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ అనుకున్నాడు రాంపండు.
* * * *
రెండు రోజులు గడిచాయ్....
ఆ రోజు ఆదివారం.... ఉదయం పడి గంటలైంది. రాజీ వంటగదిలో వంట చేసుకుంటూ వుంది. రాంపండు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు.
రెండు రోజులనుండీ వాళ్ళిద్దరి మధ్యా పొడి పొడి మతాల సంభాషణే సాగుతుంది.
ఉదాహరణకి రాజీ "భోజనం" అని అందంటే భోజనం వడ్డించేశాను.... తినడానికి రా అని అందని అతను అర్ధం చేసుకోవాలి.
అతను "పక్కా" అని అన్నాడంటే నాకు నిద్రొస్తోంది. పక్కా సరిచెయ్ పడుకుంటాను అని ఆమె అర్ధం చేసుకోవాలి.
అదీ సంగతి....
రాంపండు సీరియస్ గా తెవీ చూస్తున్నా సమయంలో డోర్ బెల్ మోగింది.
అతను లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఓ యాబై ఏళ్ళావిడవుంది. ఆవిడా లావుగా, పొట్టిగా బూరె బుగ్గలతో వుంది. చెవుల దగ్గర కాస్త నెరిసింది. జడ వేసుకుని లావంచు వున్న పట్టు చీర కట్టుకుని వుంది.
డోర్ బెల్ శబ్దం విని రాజీ కూడా బయటకి వచ్చింది.
"ఎవరు కావాలండీ?" అడిగిందిఆమె.
"కాదండీ! ఇక్కడ ఆ పేరు గలవాళ్ళు ఎవరూ లేరు" సమాధానం చెప్పాడు రాంపండు.
"మరి పేపర్లో ఇదే ఆడ్రస్ యిచ్చారు!" ఆలోచనగా అంది ఆమె.
అప్పుడు గుర్తొచ్చింది అతనికి. రాజీ రమ అనే పేరుతో ప్రకటన ఇచ్చిందని.
ఇక్కడే కాదు... ఈ కాలనీ మొత్తానికి రమ అన్నా పేరు గలవాళ్ళు లేరని రాంపండు ఆమెకి చెప్పాలని అనుకున్నాడు గానీ అంతలోనే రాజీ వెనకనుండి ఆమెతో అంది.
"ఈ ఇల్లే... లోపలకి రండి...! రమ అంటే నేనే!"
ఆ లావుపాటావిడ కూర్చుంటూ ఆమెకి ఎదురుగా వున్న సోపావంక చూపించింది రాజీ.
ఆమె సోపాలో కూర్చుంది.
రాంపండుకి ఆమె ఎందుకు వచ్చిందో అర్ధం అయిపోయింది.ఎప్పుడైతే రాజీ గురించి అడిగిందో అప్పుడే తెల్సిపోయింది. ఆమె పేపర్ ప్రకటన చదివి వచ్చిందని.
"కొంపదీసి ఆమె కూతురు గురించి నన్ను కొనుక్కుని పోడానికి వచ్చిందా ఏంటీ?" అనుకున్నాడు రాంపండు. ఆవిడా కొనుక్కుని పోవడానికి వస్తే ఆమె కూడా వెళ్ళిపోవడానికి ఇక్కడ రెడీగా ఎవ్రున్నారానీ? అని మళ్ళీ తనకు అనుకున్నాడు.
రాంపండు విస్సుగా ముఖం పెట్టి లోపలకి వెళ్ళబోయాడు.
"పండూ!" రాజీ పిలిచింది.
రాంపండు ఆగి రాజీ వంక చూశాడు.
"నువ్వు కూడా కూర్చో" అంది రాజీ. రాజీకి కూడా తెలుసు ఆమె అందుకుని వచ్చిందో.
"నేనా? నేనెందుకు!?" అన్నాడు కళ్ళు చిట్లించి.
"కూర్చో ఓ అయిదు నిమిషాలు."
రాజీ ఆమె వంక తిరిగింది "చెప్పండి"
ఆమె చిన్నగా దగ్గింది కాస్త ఫీలవుతూ.
రాంపండు కూడా మెల్లగా దగ్గాడు సోపాలో ఇబ్బందిగా ఫీలవుతూ.
రాజీ కూడా దగ్గింది టెన్స్ న్ గా ఫేలవుతూ.
ఆమె గంతు సవరించుకుంది.
"నా వంక వెంకటలక్ష్మి...!" తన పేరు చెప్పి ఆగి రాంపండు. రాజీల వంక చూసింది చెప్పన్ననట్లు చూసింది రాజీ.
"అసలు... ఊ.... మరీ.... ఊ.... అదే నేను రెండ్రోజుల క్రితం పేపర్లో మీరిచ్చిన ప్రకటన చూశాను.... అది నిజంగా ఇచ్చిన ప్రకతనేనా లేకపోతే సరదాగా ఇచ్చినదా?" అడిగింది వెంకటలక్ష్మి.
"నిజంగా యిచ్చిందే... సర్దాగా అలాంటి ప్రకటన ఎవరైనా ఇస్తారా?" అడిగింది రాజీ.
"నిజంగా కూడా అలాంటి ప్రకటన ఎవ్వరూ యివ్వరు కదా?" వెంకటలక్ష్మి పాయింట్ పీకింది.
"నిజమే! ఒకప్పుడు వితంతు వివాహాలు వుండేవి కాదు. కాఫే ఇప్పుడు జరుగుతున్నాయా లేదా? ఏదైనా మొదట స్టార్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళు వుంటారు. ఇలా భర్తని అమ్మడం నేను స్టార్ట్ చేశానని అనుకోండి."
రాంపండు యిబ్బందిగా కదిలాడు. రెండు రోజులనుండీ జరుగుతున్నది అతనికి కాలో, నిజమో అర్ధంకావడంలేదు.
"పోనీలెండి! ఓ మంచి కార్యాన్ని తలపెట్టారు. మిమ్మల్ని మిగతావాళ్ళు ఆదర్శంగా తీసుకుంటే మ లాంటి వాళ్ళకి వుపయోగకరంగా వుంటుంది." అని రాంపండు వంక పరిశీలనగా చూసింది వెంకటలక్ష్మి "ఇతనేనా?" అని అడిగింది త్రాజేని.
రాజీ అవునన్నట్టు తల వూపింది. వెంకటలక్ష్మి తృప్తిగా తల వూపింది.
"ఇంతకీ ఇఇయాన్ని మీరు ఎందుకు అమ్మేయ్యాలనిఅనుకుంటున్నారు....? మీ ఇద్దరకీ గొడవలూ, దేబ్బలతలూ ఏమైనానా ?"అడిగింది ఆమె.
"అబ్బే... అదేమీ కాదు" తల అడ్డంగా విఇపిఉమ్ది రాజీ.
"చెడు అలవాట్లు ఏమైనా వున్నాయా తాగుడూ, పెకటా,రేసులూ వగైరా వగైరాల్లంటివి?"
