Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 25


    " నువ్వు దుర్మార్గుడివి కాదుబావా!" అంది ఊర్మిళ.

     " కనీసం నువ్వు నన్ను నమ్మనందుకు కొండంత ధైర్యం వచ్చింది ఊర్మిళా!"

    "పోనీలే! ఆ మాత్రం  నీలో ధైర్యం కలిగితే నాకు సంతోషమే!"

    " చీకటి పడుతోంది వెళ్ళు. మామయ్యకి తెలిస్తే అగ్గిరాముడౌతాడు."

    ఊర్మిళ కళ్ళతోనే నవ్వింది.

    "అగ్గిరాముళ్ళకి, బుగ్గిరాముళ్ళకి పరుశురాముడు భయపడుకూడదు  బావా!"

     ఆమె మాటలకు అతను నవ్వడానికి ప్రయత్నం చేశాడు.

     " ఇంటికొచ్చేయ్!" అంది మెల్లగా.

     అతను తల అడ్డంగా ఊపాడు.

     "ఈ ఊళ్ళో నేనున్నాను బావా?"

    అతను బాధగా చూశాడామెకేసి.

     "ఊర్మిళా మాటల్తో చిత్రవధ చేయకు."

     " నిన్ను కాలేజీనుంచి డిస్మిస్ చేశారు. క్రిమినల్ కేసులో ముద్దాయిని. తోటి స్నేహితులే  ఈ సడించుకుంటున్నారు. మామయ్య   కోపానకి  గురయ్యాను."

    "ఏ వూరు వెళతావు?"

    "బ్రతకుదెరువు కోసం ఎవరు రైలెక్కినా హైదరాబాద్ కే!"

    "ఇక్కడ నీకోసం  ఎదురుచూసే ఓ పిచ్చి మరదలు వుందని మర్చిపోవుగా బావా!" ఉద్వేగంగా ఆమె అడుగుతుంటే అతను క్షణం కళ్ళు మూసుకున్నాడు.

    "మంచిగంధం సువాసననీ, మల్లెల సౌరభాన్ని ఎవరూ మరిచిపోరు  ఊర్మిళా!" ఆమె అతని చేతిని  తన చేతిలోకి తీసుకుంది.

     ఆమె చేతి వేలికున్న ఉంగరాన్ని తీసి అతని వేలికి తొడిగింది.

    "ఏమిటి?" ఆశ్చర్యంగదా చూశాడు.

    ఆమెనవ్వింది.

     అది నవ్వుకాదు . నవ్వడానికి చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే!

    "కంగారుపడకు బావా! ఉంగరం తొడిగి పెళ్ళయిపోయిందంటానని. ఇది నీ అవసరానికి కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.

    "నా కోసం నువ్వు రెండు కన్నీటిబొట్లు విడిచావంటే అంతకంటే నాకేం కావాలి బావా!"

    "ఊర్మిళా!"

    ఆమె ఒక్కసారిగా అతన్ని పెనవేసుకుంది.  ఆమె వీపు చుట్టూరా చేతులు వేసి నిమిరాడు పరుశురాం.

     మెల్లగా తలెత్తి అతని కళ్ళలోని కి చూసింది ఊర్మిళ.

     "నీ క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి ఆరాటపడుతూ ప్రతి రోజూ ఎదురు చూస్తుంటాను. ఉత్తరం  వ్రాయి బావా!"

    "ఊ"అన్నాడు.

    జాకెట్లోంచి ఐదు వంద కాగితాలు బయటికి తీసింది ఊర్మిళ.

     "ఈ సారి నీ పుట్టిన రోజుకి నీకు బట్టలు కొనాలని  ఈ డబ్బులు పోగుచేశాను. తీసుకో బావా!ఇవి నీకు మరోలా ఉపయోగపడతాయి."

    అతను ఆమెకేసి చూస్తూ నిలబడిపోయాడు.

     ఆమె ఆ డబ్బుని అతని జేబులో పెట్టి, అతను వూహించనంత వేగంగా అతని చెంపలపైన ముద్దుపెట్టుకుని గిరుక్కున వెనక్కి తిరిగి పరుగుతీసింది.   

     ఆమె చర్యకి నివ్వెరపోయాడు పరుశురాం.

                                        11

     అతను భారంగా అడుగులు వేశాడు భాస్కరపురం సాయిబాబాగుడి ప్రాంతాలకొచ్చాడు పరుశురాం.   

     గుడిలోంచి బయటికొస్తున్న మనిషి పై న అతని దృష్టి పడింది.

     సర్వసతి! అదే... తన బ్రతుకును నవ్వులపాలు చేసింది. ఆరాక్షసే తన జీవితాన్ని సర్వనాశనం చేసింది.

     కోపంతో అతని ఛాతీ వెడల్పయింది. ప్రతీకారం తీర్చుకోవడానికి తగిన సమయంలోనే తారసపడింది. సరస్వతి ఎదురుగా నడిచాడు పరుశురామ్.   

     ఎదురుగా నిలబడిన పరుశురాంని చూసి వణికిపోయింది సరస్వతి.

     ఆమె గబగబ నడవబోయింది.    "ఆగు" ఖంగుమంది అతని గొంతు.
   
     ఆమె ఆగిపోయింది.

     "అటు కాదు. ఇటు నడువు "అన్నాడు.

    "దేనికి?"

    "వచ్చాక నీకే తెలుస్తుంది!"

    "నేను రాను" అంది బింకంగా.

     జేబులోంచి చిన్న కత్తి తీశాడు.

     "పిచ్చి వేషాలేస్తే పొడిచి పారేస్తాను. నడువు" అన్నాడు పరుశురాం కఠినంగా.

     ఆమె మాట్లాడకుండా అతనితోపాటు  నిర్మానుష్యంగా  వున్న సరువు తోటలోకి నడిచింది.
   
     ఆమె పవిట చెరగుగని చేత్తో పట్టుకుని ఒక్కసారిగా దొరువులోకి తోశాడు. ఆమెని కీచుగా అరుస్తూ  దొరువులోకి దొర్లిపోయింది.ఆమె చీర అతని చేతిలోకి వచ్చింది. అతను చీరని చేతికి చుట్టుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ దొరువులోకి దిగుతుంటే రెండు  చేతులనీ గుండెలకి ఒక్కో అడుగు వేస్తూ దొరువులోకి దిగుతుంటే రెండు చేతులనీ గుండెలకి అడ్డం పెట్టుకుంది. సరస్వతి అతను ఆమెని సమీపించి మీదకు ఒంగాడు.

    సరస్వతి వణికిపోతూ కీచుగా అరుస్తూ రెండు చేతులనీ గుండెలకి అడ్డుపెట్టుకుంది. పరుశురాం క్రూరంగా నవ్వాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS