Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 26

 


                ఆశలు, ఆకాంక్షలు


      ఈనాడు సమాజంలో కనబడుతున్నారు అహర్నిశలు రెక్కలు ముక్కలు చేసుకొన్నా కపుడు నిండని అభాగ్యులు-
    యంత్రాల మధ్య యంత్రంలా నలుగుతున్నా నాలుగువ్రేళ్ళు నోటికందని శ్రమజీవులు, కష్టజీవులు, హతాశులు, గతాశులు-
    బిడ్డల దీనస్థితి చూచి, అజ్ఞాన మలినంలో మ్రగ్గుతున్న వారిఅంధకార జీవితాలను చూచి కంట తడిబెడుతున్నారు కన్న తల్లులు, అభాగినులు-
    పండించిన పంటకు గిట్టుబాటుధర లభించక బండబారిన గుండెతో గతుకుల బ్రతుకులను భారంగా యీడ్చుకు వస్తున్నారు అన్నదాతలు, రైతన్నలు-
    నిర్ధారణ లేని జీవితంలో శ్రమకు తగిన ఫలం లభించని వెలితిలో వెలవెల బోతున్నారు వ్యవసాయకూలీలు, కార్మికులు-
    ఎందరో, ఇంకెందరో, మరెందరో దరిద్రనారాయణులు, నిర్భాగ్యులు ఈనాటికీ 50 శాతం దరిద్ర రేఖకు దిగువనే వున్నారు పరిష్కారం లభించక-
    ఈనాడు ప్రజాప్రతినిధులంగా, ప్రజలు కోరుకున్న, ఎంచుకున్న ప్రభుత్వంగా మా బాధ్యత వున్నది వారికి సామాజిక న్యాయం అందజేయడానికి-
    ఆశ గుండె నిండుగా వున్నది. కాని కాసులు చేతిలో లేని రీతి కనబడుతున్నది.
    రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత ఆర్ధిక స్తోమత, సంక్షేమ కార్యకలాపాల నిర్వహణకు తగినంత ప్రోత్సాహం-
    ప్రజా సమస్యలను పరిష్కరించగలిగే పరిష్టత, ప్రజా పక్షంగా, ప్రజాస్వామ్య సువిధానంలో ప్రజాభీష్టాలను వ్యక్తపరిచే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను, అభిలాషను మన్నించే పెద్దరికం యీనాడు కేంద్ర ప్రభుత్వాన్నుంచి ఆశిస్తున్నాను. కావాలని అర్ధిస్తున్నాను.
    
    సికిందరాబాద్ లో క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన సందర్భంగా చేసిన హిందీ ప్రసంగానికి తెలుగుసేత

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS